సీసాలు, మూటలు వస్తున్నయ్‌ | TPCC Chief Revanth Reddy Questioned Rajagopal Reddy | Sakshi
Sakshi News home page

సీసాలు, మూటలు వస్తున్నయ్‌

Published Mon, Oct 10 2022 2:46 AM | Last Updated on Mon, Oct 10 2022 2:46 AM

TPCC Chief Revanth Reddy Questioned Rajagopal Reddy - Sakshi

రోడ్‌ షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో పాల్వాయి స్రవంతి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి 

చౌటుప్పల్‌ రూరల్‌: ‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడు నియోజక­వర్గం అభివృద్ధి అయితదని చెప్పి రాజీ­నామా చేసినవు. సీసాలు వస్తున్నయ్‌.. మూ­టలు వస్తున్నయ్‌.. కానీ అభివృద్ది ఏది?’ అని పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. మును­గోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలతో కలిసి చౌటుప్పల్‌ మండలంలోని కొయ్యలగూడెం, డి.నాగారం, పీపల్‌ప­హాడ్, ఎస్‌.లింగోటం, నేలపట్ల, జైకేసారం గ్రామాల్లో ఆదివారం రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్బంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్, బీజేపీలు నోట్ల మూట­లతో మునుగోడును గెలవాలని చూస్తు­న్నాయ్‌. మందు సీసలు ఇస్తర­ట. ఓటుకు రూ.30­వేలు ఇస్తరట తీసుకోండి. ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు వేయండి’ అని అభ్యర్థించారు. ‘ఇందిరమ్మ ఇండ్లు అగ్గిపెట్టెలెక్క ఉన్నయంటివి. బిడ్డొస్తే, అల్లుడొస్తే ఏడ పండుకోవాలంటివి. కోడు­కు, కోడలు ఏడ ఉండాలంటివి.

బర్రె, గొర్రె ఏడ కట్టెయ్యాలంటివి. అధికారం చేప­­ట్టి ఎనిమిదేండ్లాయె, మరి డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఏవి?’ అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. దళితులకు ఇస్తా­మన్నా 3ఎకరాల భూమి ఎటుపో­యిందని రేవంత్‌ నిలదీశారు. హుజూ­ర్‌నగర్, నా­గార్జున­సాగర్‌లలో టీఆర్‌­ఎస్‌ను, దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీని గెలిపించినా ఏ మార్పూ రాలేదన్నారు. మునుగో­డులోనూ టీఆర్‌­ఎస్‌ను గెలిపించినా, బీజేపీని గెలిపించినా వచ్చేదేమీ లేదని, కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని రేవంత్‌  స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement