Rajagopal Reddy
-
చెట్ల అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
-
బీటెక్ రవి దాష్టీకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్‌రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్‌రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది. వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్‌రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.రాజగోపాల్‌రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నీకు నాలెడ్జ్ ఉందా ?.. రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చింది..
-
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకకాలంలో అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్ హుజూర్నగర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. -
మహిళలే ఈసారి కేసీఆర్ ని ఓడించాలి :రాజగోపాల్ రెడ్డి
-
మీ దూకుడూ ...సాటెవ్వరు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... బీఆర్ఎస్ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తాజా జాబితాలో రేఖానాయక్ భర్త శ్యాం నాయక్‌కు టికెట్ కేటాయించింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి యూటర్న్...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్ఎస్ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్ తెచ్చుకున్నారు. ఆల్ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ఆయనకు నాగర్‌కర్నూల్ టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్ఎస్లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరిదీ అదే దారి... ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తనకు టికెట్ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్ అయ్యారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా నామినేట్ అయిన కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్ లభించింది. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకునిగా ఉన్న మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్ లభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లోకి జంప్ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరగానే ఆయనకు టికెట్ కేటాయించిందా పార్టీ. నేరేడుచర్ల మున్సిపల్ వైస్–చైర్పర్సన్ శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్నగర్ టికెట్ దక్కే అవకాశం ఉంది. కొందరికి భవిష్యత్ పై హామీలు... కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్ఎస్లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది. ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
నేడు కాంగ్రెస్ మలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, శుక్రవారం రాత్రికల్లా మలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి. ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసిందని పేర్కొన్నాయి. అసంతృప్తిని చల్లార్చేందుకు..: కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కా గా.. శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకుముందు రాజగోపాల్‌రెడ్డి, మిగతా ఇద్దరు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పెద్దలను కలసి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ చేరాలని వారు భావించారు. కానీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే పార్టీలో చేరితే అభ్యర్ధిత్వాలను పరిశీలించడం సాధ్యమవుతుందని పెద్దలు స్పష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురి చేరికల తతంగాన్ని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ముగ్గురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవనున్నారు. -
కమలం పార్టీలో ‘కొత్త’ రేకల ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో కొత్త నేతలు కుదురుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారని.. దీనికి ఇటీవలి నిష్క్రమణలే సాక్ష్యమని, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తాజా ఉదాహరణ అని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాక.. జాతీయ కార్యవర్గ సభ్యులుగా, ఇతర ప్రాధాన్య పదవులు ఇచ్చి నా, పార్టీలో ఉండలేకపోవడానికి కారణాలేమిటనే దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని నడిపే తీరులో జాతీయ నాయకత్వం తీరు, అంతా ఢిల్లీ నుంచే నడిపించడం, ఇక్కడి రాజకీయ వాతావరణం, పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి అసంతృప్తికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర నాయకత్వం వ్యవహార శైలి, అనుసరించే వ్యూహాలు అర్థంగాకపోవడం, సమన్వయ లేమి వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీలో అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని, వారు ఇక్కడ ఇమడటం కష్టంగానే ఉందని పేర్కొంటున్నారు. రాజీనామాల పర్వంలో.. బీజేపీలో ఇటీవల వరుసగా రాజీనామాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి చంద్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి. కె.స్వామిగౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్ర శేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి ఇప్పటికే పార్టీని వీడగా.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. వీరంతా పార్టీలో ఇమడలేక, జాతీయ, రాష్ట్ర నాయకత్వాల వ్యూహాలు అర్థంకాక నిష్క్రమిస్తున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దీనికి మరిన్ని కారణాలూ ఉన్నాయని.. వీటిపై పార్టీ నాయకత్వం పెద్దగా సమీక్షించిన దాఖలాలు కూడా లేవని అంటున్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ (సంస్థాగత) ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయే వాళ్లు పోతుంటారు..’’ అన్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కొత్త నేతల సమస్య మరోసారి రాష్ట్రపార్టీకి తలనొప్పిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసంతృప్త నేతలుగా ముద్రపడిన వారిలో ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారోనన్న చర్చ జరుగుతోందని అంటున్నాయి. మాజీ ఎంపీలంతా లోక్‌సభ పోటీ వైపే.. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించినా.. మాజీ ఎంపీలు, ఇతర సీనియర్లు లోక్‌సభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తొలుత పోటీకి విముఖంగా ఉన్నట్టు వార్తలు వచ్చి నా.. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. చెన్నూరు సీటుకు జాతీయ కార్యవర్గ సభ్యుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి పేరును ఖరారు చేసినా ఆయన పోటీకి ససేమిరా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. మాజీ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్ తదితరులు కూడా లోక్‌సభకే పోటీ చేస్తా మని చెప్తున్నారు. ఇక మహబూబ్‌నగర్ నుంచి తాను, షాద్‌నగర్ నుంచి కుమారుడికి అసెంబ్లీ టికెట్లు కోరుతున్న జితేందర్‌రెడ్డి.. ఇప్పుడు స్వరం మార్చి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగానే పోటీచేస్తానని తాజాగా ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను పోటీకి నిలిపే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కానీ తాను భువనగిరి నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. అధిష్టానం ఒత్తిడి తెస్తే.. వారు కూడ పార్టీ మారితే పరిస్థితి ఏమిటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
రేవంత్‌ను విమర్శిస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ భిక్షతో రాజ కీయంగా ఎదిగి, డబ్బుల కోసం పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని బ్లాక్‌మెయిలర్ అని కోమటిరెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, నాలుక చీరేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో ఎంపీగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించి, కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూడటం నీచమైన చర్య అని విమర్శించారు. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. -
పక్కా వ్యూహంతో విజయం
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల దృష్ట్యా ఈసారి అన్ని అస్త్రశస్త్రాలతో మునుగోడు బరిలోకి దిగిన గులాబీదళం.. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహం రచించి అమలు చేయడంతోపాటు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని విజయం వరించింది. అయితే బీజేపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం లక్ష్యంగా భారీ మెజారిటీ సాధనకు టీఆర్ఎస్ చెమటోడ్చినా ప్రతిపక్ష బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు రౌండ్లవారీ గణాంకాలు వెల్లడించాయి. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు ముందే అప్రమత్తం.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ముందే పసిగట్టిన టీఆర్ఎస్ అధినేత... ఉపఎన్నిక సన్నాహాలను ముందస్తుగా ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా జూన్ చివరి వారం నుంచే కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టడం ప్రారంభించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవడంతోపాటు అసమ్మతికి చెక్ పెట్టడంపై దృష్టి సారించారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికకు ఒక రోజు ముందే ఆగస్టు 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో కేసీఆర్ కదలిక తెచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముందే ఖరారైనా కేసీఆర్ మాత్రం నామినేషన్ల సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులో మండలాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా స్థానికంగా పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దారు. నిఘా వర్గాలు, సర్వేల నివేదికలను సమీక్షిస్తూ వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ప్రచారంలో కీలక నేతల మోహరింపు.. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహంలోని లోపాలు పునరావృతం కాకుండా మునుగోడులో కేసీఆర్ కొత్త ప్రయత్నం చేశారు. గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించడం, నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వారి సాయంపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతోపాటు స్వయంగా గ్రామ స్థాయిలో బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు, 70కిపైగా మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు సుమారు 3 వేల మంది క్రియాశీల నాయకులను గ్రామ, బూత్ స్థాయిలో మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా సూక్ష్మస్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలయ్యేలా చూశారు. పకడ్బందీగా చేరికలు.. రాజగోపాల్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ యంత్రాంగం గంప గుత్తగా బీజేపీలో చేరకుండా 4 నెలలుగా చేరికల వ్యూహాన్ని టీఆర్ఎస్ నిరంతరాయంగా అమలు చేసింది. పార్టీలో అసమ్మతిని చక్కదిద్దుతూనే కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు 35 మందికిపైగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలను చేర్చుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మర్నాడే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పార్టీని వీడినా శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తోపాటు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, పల్లె రవికుమార్ తదితరులను చేర్చుకొని కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. దక్కని భారీ మెజారిటీ.. పోలింగ్ సరళిని బట్టి 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధిస్తామని టీఆర్ఎస్ అంచనా వేసింది. అయితే ఓట్ల లెక్కింపులో 10వ రౌండ్ వరకు రాజగోపాల్‌రెడ్డి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో కారు గుర్తును పోలిన చిహ్నాలైన రోడ్డు రోలర్, రోటీ మేకర్తోపాటు చెప్పుల గుర్తుతో పోటీ చేసిన మరో అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడం కూడా మెజారిటీపై ప్రభావం చూపినట్లు టీఆర్ఎస్ భావిస్తోంది. -
ఆడియో.. వీడియో.. షోకాజ్..!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుస్తాడంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక ఓవైపు, రాహుల్ గాంధీ పాదయాత్ర మరోవైపు ఉన్న సమయంలో వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి బహిర్గతమైన ఆడియో, వీడియోల ఆధారంగా చర్యలు చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ గడువు ముగిశాక ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా చర్యలు ఉండే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్‌తో విభేదాలతో.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో విభేదాలను బాహాటంగానే వ్యక్తపర్చడం సంచలనంగా మారింది. తన సోదరుడు బీజేపీలో చేరిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారానికి తాను వెళ్లలేనంటూ వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియాని కలిసి చెప్పారు కూడా. తనకున్న రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రచారానికి వెళ్లకపోవడాన్ని పార్టీ అర్థం చేసుకుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇటీవల లీకైన ఆడియో, వీడియోలలోని వ్యాఖ్యలతో వెంకటరెడ్డి కాంగ్రెస్ వాదిగా ఉండలేకపోతున్నారని స్పష్టమైందని పేర్కొంటున్నాయి. నిజానికి ఈ నెల 19న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్లపై కుమ్మక్కు ఆరోపణలు చేస్తూ.. కాంగ్రెస్‌లో తనను ఒంటరిని చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, కొందరిని కోవర్టులుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి త్వరలోనే వాస్తవాలు బయటికొస్తాయన్నారు. మరుసటి రోజే జబ్బార్ భాయ్‌తో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలని, ఉప ఎన్నిక తరువాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. వెంకటరెడ్డి అదే రోజున కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారితో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో తన తమ్ముడే గెలుస్తాడని, తాను మునుగోడు ప్రచారానికి వెళ్లినా కాంగ్రెస్‌కు వచ్చేవి 10వేల ఓట్లేనని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వీడియో లీకై సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఆడియో ఫేక్ అనుకున్నా తర్వాత వీడియో బయటికి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రెటరీ తారిఖ్ అన్వర్ ఈ నోటీస్ జారీ చేశారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నేతతో మాట్లాడినట్టు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వైఖరిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వండి’’అని ఆదేశించారు. వచ్చేనెల 3న మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో.. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని టీపీసీసీ నాయకత్వం పట్టుపడుతోందని అంటున్నాయి. -
సీసాలు, మూటలు వస్తున్నయ్
చౌటుప్పల్ రూరల్: ‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి అయితదని చెప్పి రాజీనామా చేసినవు. సీసాలు వస్తున్నయ్.. మూటలు వస్తున్నయ్.. కానీ అభివృద్ది ఏది?’ అని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలతో కలిసి చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, డి.నాగారం, పీపల్‌పహాడ్, ఎస్.లింగోటం, నేలపట్ల, జైకేసారం గ్రామాల్లో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్, బీజేపీలు నోట్ల మూటలతో మునుగోడును గెలవాలని చూస్తున్నాయ్. మందు సీసలు ఇస్తరట. ఓటుకు రూ.30వేలు ఇస్తరట తీసుకోండి. ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు వేయండి’ అని అభ్యర్థించారు. ‘ఇందిరమ్మ ఇండ్లు అగ్గిపెట్టెలెక్క ఉన్నయంటివి. బిడ్డొస్తే, అల్లుడొస్తే ఏడ పండుకోవాలంటివి. కోడుకు, కోడలు ఏడ ఉండాలంటివి. బర్రె, గొర్రె ఏడ కట్టెయ్యాలంటివి. అధికారం చేపట్టి ఎనిమిదేండ్లాయె, మరి డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవి?’ అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. దళితులకు ఇస్తామన్నా 3ఎకరాల భూమి ఎటుపోయిందని రేవంత్ నిలదీశారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లలో టీఆర్ఎస్ను, దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీని గెలిపించినా ఏ మార్పూ రాలేదన్నారు. మునుగోడులోనూ టీఆర్ఎస్ను గెలిపించినా, బీజేపీని గెలిపించినా వచ్చేదేమీ లేదని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని రేవంత్ స్పష్టం చేశారు. -
కేసీఆర్ ఎన్ని ఎత్తులేసినా మునుగోడులో ఓటమి తప్పదు
మునుగోడు: టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభద్రతాభావం పట్టుకుందని, అందులో భాగంగానే మునుగోడులో బీజేపీ సభకు ఒక రోజు ముందు ‘ప్రజా దీవెన’సభ నిర్వహించడమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్ని సభలు పెట్టుకున్నా ఎనిమిదేళ్లుగా అబద్ధాలతో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌కు పతనం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం బీజేపీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన నియోజకవర్గ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరతానని జాతీయ నాయకులకు చెబితే ఆదివారం మునుగోడులో హోమంత్రి అమిత్‌షాతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దీంతో వణుకు పుట్టిన సీఎం కేసీఆర్ ఎలాంటి అవసరం లేకపోయినా బీజేపీ సభ కంటే ఒక రోజు ముందే సభ ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని ఎత్తులు, కుట్రలు పన్నినా హుజూరాబాద్, దుబ్బాక ఫలితమే మునుగోడులో కూడా పునరావృతం అవుతుందని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తాయో కేసీఆర్ అక్కడే అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు, నూతన పెన్షన్లు ఇస్తున్నారని, గట్టుప్పల మండలం ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. బీజేపీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం బీజేపీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని మును గోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే ఆ పార్టీలో చేరబోతున్నట్లు పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధికి కావాలనే నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నాడని, ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే నిధులు మంజూరు చేస్తున్నందునే తాను పదవీత్యాగం చేశానని వివరించారు. -
మునుగోడులో గోల్ కొట్టేదెవరు..? కాంగ్రెస్,టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో టికెట్ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసూ్తనే ఉన్నారు. ఆ రెండు పార్టీలు సర్వేలు చేయిస్తున్నందున చివరికి టికెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీజేపీ అభ్యర్థి విషయంలో స్పష్టత ఉన్నా మిగతా రెండు ప్రధాన పార్టీల్లో ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఆయా పార్టీల్లో టికెట్ ఆశిస్తున్నవారు బయటికి కలిసి తిరుగుతున్నా అంతర్గతంగా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఉప ఎన్నికల్లో టికెట్ తెచ్చుకోగలిగితే రాజకీయ ఎదుగుదలకు మార్గం మరింత సుగమం అవుతుందనే ఆలోచనతో పలువురు ఆశావహులు ఉన్నారు. ఇప్పుడు టికెట్ సంపాదిస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని, అధిష్టానం దృష్టిలో ఉంటామన్న ఆలోచనతో వేగంగా పావులు కదుపుతున్నారు. అలకలు.. బుజ్జగింపులు టీఆర్ఎస్ అధిష్టానం ప్రాథమికంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే పోటీలో నిలిపే ఆలోచన చేసింది. నియోజకవర్గంలోని పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా తమకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు పంపారు. మరోవైపు.. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బందులపాలు చేశారని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఇటీవల నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖలు రాశారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించుకొని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. అధిష్టానం టికెట్ ఇచ్చిన వారికి సపోర్టు చేయాలని బుజ్జగించారు. అప్పుడు సరేనన్న నేతలు కొంతమంది ఆ తరువాత రెండు రోజులకే మల్కాపూర్‌లో సమావేశమై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. దీంతో టీఆర్ఎస్లో అసమ్మతి పూర్తిగా చల్లారలేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానం చేయిస్తున్న సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ప్రకటించనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేశారు. తమ గాడ్ ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే కర్నాటి విద్యాసాగర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే నారబోయిన రవి, బొల్లా శివకుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సన్నిహితంగా ఉండే డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే! మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. దీంతో ఆయనే బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. పైగా బీజేపీలో ఇంతవరకు తమకు టికెట్ కావాలని ఎవరూ అడిగిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి.. కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పాల్వాయి స్రవంతితోపాటు పున్న కైలాస్నేత, డాక్టర్ చెరుకు సుధాకర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగడంతో.. ముందునుంచి పార్టీలో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
మునుగోడు తీర్పు దేశమంతా వినిపించాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, ఆ తీర్పు దేశం నలుదిక్కులా పిక్కటిల్లేలా వినిపించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సొంత వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను దగా చేసిన దుర్మార్గుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కరోనాతో ఇబ్బంది పడినా వదలకుండా ఈడీ అధికారులు చుట్టుముట్టిన తరుణంలో అండగా ఉండాల్సిందిపోయి రాజగోపాల్‌రెడ్డి అమిత్ షా పక్కన చేరడం విశ్వాస ఘాతుకమేనని మండిపడ్డారు. అలాంటి దుర్మార్గుడిని మునుగోడు గడ్డపై పాతి పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. అధికారం లేకున్నా వారు పనులు చేయలేదా? మునుగోడులో ధర్మభిక్షం మొదలుకొని మల్లు స్వరాజ్యం, చకిలం శ్రీనివాస్‌రావు, బీఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరు ట్ల రామచంద్రారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి వారెంద రో అధికారం కోసం కాకుండా ప్రజాసమస్యల కోసం పోరాడారన్నారు. జానారెడ్డి, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. 2018 లో మునుగోడులో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఇంటింటికీ తిరిగి గెలిపించారని, వారి త్యాగాలు రాజగోపాల్‌రెడ్డికి గుర్తుకురావా అని రేవంత్ ప్రశ్నించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వందల ఎకరాలు తరిగిపోయినా కాంగ్రెస్ జెండానే మోశారు తప్ప పార్టీ మారలేదని గుర్తుచేశారు. తెలంగాణ తల్లికి అందరూ అండగా నిలవాలి.. రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ కష్టకాలంలో ఉంటే ప్రతి తెలంగాణ బిడ్డ అండగా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమెను ఒంటరిని చేసి శత్రువులు అవమానిస్తున్నారని చెప్పారు. ‘మన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామా.. బిడ్డలుగా మనకు బాధ్యత లేదా? మన సత్తా ఎమిటో చూపిస్తామా లేదా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. మునుగోడు గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేల కోట్ల కాంట్రాక్టు కోసం ప్రజల ఆత్మగౌరవం తాకట్టు.. రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమిత్ షా వద్ద తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పిలిచారని లేదంటే ఆయన కార్యాలయంలో బంట్రోతు కూడా రాజగోపాల్‌రెడ్డిని పట్టించుకోరన్నారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందుకే తనపై 120 కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నారన్నారు. నిజంగా మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారితే అమిత్ షా వద్ద ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల, ఇతర ప్రాజెకుల కోసం రూ. 5 వేల కోట్లు తేవాలని లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లాలో సీట్లన్నీ గెలుస్తాం: ఉత్తమ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పార్టీకి పట్టుందని, రానున్న రోజుల్లో ప్రతి అసెంబ్లీ స్థానం గెలుచుకుంటామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్న రాజగోపాల్‌రెడ్డి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టమేమీ లేదని మాజీ మంత్రి కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి అత్యధిక ఓటు బ్యాంక్గల మునుగోడులో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోనియాను కేంద్రం ఇబ్బందిపెడుతుంటే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం సరికాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. -
టార్గెట్ కాంగ్రెస్! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్?
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా దక్షిణాదిలో బలంగా కనిపిస్తోన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి, తన విజయావకాశాలు మెరుగు పరుచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోందని సీనియర్ నేతలు అంటున్నారు. మరోపక్క ఈ వలస వ్యవహారం జోరందుకుంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నేతలు లేరని, ఇది పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది. కొండాతో షురూ.. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచి 2019లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా వేసుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా పెట్టేందుకు ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ లేకపోవడం ఆందోళనకరమని అధిష్టానానికి నివేదిక వెళ్లినట్టు తెలిసింది. 2019లో కాంగ్రెస్ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన విశ్వేశ్వర్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. రాజగోపాల్‌రెడ్డికి రెడ్‌కార్పెట్! ఇక మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో తిరుగుతున్నారు. కోమటిరెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన పార్టీని వీడితే రెండు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి తన పరిచయాలతో నల్లగొండతో పాటు ఖమ్మంలోనూ ప్రభావం చూపిస్తారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆయనతో మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండల్లో పాదయాత్ర చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది తొలుత కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపిస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా సునీల్ కనుగోలు వద్దని వారించినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్, ఖమ్మంపైనా దృష్టి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న కొంతమంది నేతల పైనా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికతో పాటు, ఈటల రాజేందర్‌కు బీజేపీలో లభిస్తున్న ప్రాధాన్యత, రాజగోపాల్‌రెడ్డి అదే పార్టీలో చేరబోతున్నారనే వార్తలతో ఆయన సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితోనూ గతంలో ఈటల ఒకసారి సమావేశమైనట్టు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నూతన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రత్యామ్నాయం లేకపోతే ప్రమాదం కాంగ్రెస్‌లో సీనియర్/ప్రముఖ నేతలున్న చోట ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టేలా ఉంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నికలు వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నేతలు లేరనే దానిపై సునీల్ కనుగోలు టీం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో బలమైన నేతలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఇలా నల్లగొండలోని నకిరేకల్, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాల్లో నేతల కొరత కనిపిస్తున్నట్టు తెలిసింది. ఇక మహబూబ్‌నగర్‌లోని మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు జడ్చర్ల, గద్వాల, మక్తల్, దేవరకద్ర, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకుండానే నెట్టుకొస్తున్నట్టు సునీల్ టీం నివేదించినట్టు తెలిసింది. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఉన్న నేతలపై ఫోకస్ చేసి పార్టీ కిందిస్థాయి దాకా వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సునీల్ సూచించినట్టు తెలిసింది. -
తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ..
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని.. మంత్రి తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్లపై మాట్లాడాతారని అన్నారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. పేకాటాడిన వాళ్లు మంత్రులు కావొచ్చని అన్నారు. కాంట్రాక్లర్లు ఎమ్మెల్యేలు కావొద్దా అని ప్రశ్నించారు. దీంతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ లోపల ఎమ్మెల్యేలు.. సభ బయట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీనే అవినీతి పార్టీ అని.. టీఆర్ఎస్ పార్టీ కాదని అన్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాలని అన్నారు. -
భూ కుంభకోణం కేసులో మరొకరి అరెస్ట్
చిల్లకూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం భూ కుంభకోణం కేసులో మరో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చిల్లకూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినపట్నం సమీపంలో ఉన్న పోర్టు భూములను వెబ్‌ల్యాండ్‌లో మార్పులుచేసి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. దీనిపై గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇప్పటికే నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో పొదలకూరు రెవెన్యూ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సాసం నరసయ్యను మంగళవారం చిల్లకూరు బైపాస్ వద్ద సీఐ శ్రీనివాసులరెడ్డి అరెస్ట్ చేశారని తెలిపారు. రాపూరు మండలం సైదాసుపల్లి గ్రామానికి చెందిన సాసం నరసయ్య నెల్లూరులో ఉంటున్నారని, ఆయనే చిల్లకూరు రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌ను నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి సర్వే నంబర్ 94–3లో ఉన్న 271.80 ఎకరాల్లో 209 ఎకరాలను 327 సర్వే నంబర్‌కు మార్చి 327–3ఏ2–హెచ్1–హెచ్11 సబ్ డివిజన్ చేసి ఆన్లైన్లో 11 మంది పేర్లతో నమోదు చేశారని వివరించారు. ఈ కేసులో తహసీల్దార్ గీతావాణి, నరసయ్య, శేఖరరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అజయ్‌కుమార్ ఉన్నారు. -
ఒకే వేదికపై జగదీష్ రెడ్డి,రాజగోపాల్ రెడ్డి .. రసాభాసగా కార్యక్రమం
-
సైగలతో సస్పెండ్ చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాంతి భద్రతలు అసలే లేవు. వేలిసైగలు, కంటిచూపుతో సభ నుంచి ప్రతిపక్షాన్ని బయటకు పంపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉరకలు పెడుతోందని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉరకలు పెడుతోందో అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెబుదామనుకుంటే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు’అని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ నుంచి సస్పెం డైన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్యతో కలసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నామినేషన్ వేసేందుకు వెళ్లిన కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దౌర్జన్యం చేశారని భట్టి ఆరోపించారు. 150 మంది గూండాలను పెట్టుకుని శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఐడీ కార్డులు లాక్కుని, అసభ్య పదజాలంతో దూషించి, బట్టలు చించి, పిడిగుద్దులు గుద్ది నామినేషన్ వేయకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సభలో చెప్పాలని ప్రయత్నిస్తే మైక్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారన్నారు. సభా నాయకుడు సైగలు చేస్తే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారని, ఒక్క సభ్యుడి పేరుతో తీర్మానం ప్రవేశపెట్టి అందరినీ సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. నిజాలు బయటపడతాయనే భయంతోనే.. ప్రతిపక్షం చెప్పే నిజాలు బయటకు వెళ్తే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మున్సిపల్ మంత్రిగా, రెగ్యులటరీ అథారిటీ అధిపతిగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. జీవో 111కి విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందల, వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం.. ఏ ప్రాంతానికి?: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరి గింది. ఒకదశలో సహనం కోల్పోయిన ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సవాలు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ద పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై లేదని, ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రా లేదా ఓ ప్రాంతానికా అనేది అర్థం కావడం లేదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత అసహనానికి లోనైన రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎదురుదాడికి దిగారు. సీఎం కేసీఆర్ దర్శన భాగ్యం దొరకడం లేదని, మంత్రులు ఎవరెక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీంతో ఎర్రబెల్లి.. ఇలాగే మాట్లాడితే పరుగెత్తించి కొడతారంటూ రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. గడచిన 13 నెలల నుంచి సీఎం దర్శనం దొరకడంలేదని రాజగోపాల్‌రెడ్డివిమర్శించారు. వందమంది కౌరవులకు ఐదుగురు చాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ– ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాసనసభలో వందమంది ఉన్నారని టీఆర్ఎస్ విర్రవీగుతోంది. వందమంది కౌరవులను ఐదుగురు పాండవులు ఏం చేశారో గుర్తుంచుకోవాలి. డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆస్పత్రులకు దాసోహమవుతూ.. ప్రభుత్వాస్పత్రులను నిర్వీర్యం చేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎర్రవెల్లి, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో నిర్మిస్తే సరిపోతుందా?. ఇంటింటికీ నల్లానీరు రాకపోతే ఓట్లడగనని ఎన్నికల్లో హామీనిచ్చారు. ఆరేళ్లయినా నల్లా నీళ్లు రాలేదు. నా నియోజకవర్గంలో 14 నెలలైనా క్యాంపు ఆఫీసు నిర్మించలేదు. ఏ పనికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు దోచిపెట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోంది’అని ధ్వజమెత్తారు. -
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
జిల్లా పరిషత్‌పై తొలిసారి గులాబీ జెండా ఎగురవేయాలన్నది అధికార టీఆర్ఎస్ ప్రయత్నం.. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగించి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న వ్యూహం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ది.. వెరసి నల్లగొండ జెడ్పీ ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది. 1959 నుంచి 2014 వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రెండు టర్మ్‌లు మినహా అన్ని సార్లూ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే జెడ్పీ ఉంది. పాతికేళ్లకు పైగా పోటీ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీల మధ్యే సాగేది. కానీ, ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల పునర్విభజన అనంతరం అత్యధిక మండలాలు (31) ఉన్న పెద్ద జిల్లాగా నల్లగొండకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కింది. నల్లగొండ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 16 జెడ్పీటీసీ స్థానాలు సొంతం కావాలి. ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఈ మెజారిటీ కోసమే పోరాడుతున్నాయి. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, తుది దశ ఎన్నికలకు (నల్లగొండ రెవిన్యూ డివిజన్) సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా ముగిసింది. దీంతో ఈసారి జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ఆయా పార్టీల్లో ఎవరు పోటీపడుతున్నారో, ఆపార్టీ చైర్మన్ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. విచిత్రంగా ఇద్దరూ ఒకే జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిచి జెడ్పీ పీఠం ఎక్కాలని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధికారికంగా తమ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డిని ప్రకటించింది. కాగా, టీఆర్ఎస్ బండా నరేందర్ రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించినా.. అధినాయకత్వం అధికారికంగా బహిరంగంగా ప్రకటించలేదు. పార్టీలో సంస్థాగతంగా జిల్లా ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చింది. ఇప్పుడు చూస్తే.. ఇరు పార్టీల చైర్మన్ అభ్యర్థులు ఒకే జెడ్పీటీసీ స్థానానికి పోటీ పడుతున్నారు. అంటే తొలి దశలోనే ఒక అభ్యర్థి ఫిల్టర్ అయిపోతున్నారు. దీంతో ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా.. ఒకవేళ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి జెడ్పీటీసీ సభ్యుడిగా ఓడిపోతే రెండో అభ్యర్థిని వెదుక్కోవాల్సిందే. ఈ కారణంగానే టీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా.. ప్రత్యామ్నాయంగా మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని మిర్యాలగూడ జెడ్పీటీసీ స్థానంనుంచి బరిలోకి దింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక స్థానంగా ... నార్కట్‌పల్లి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలనుంచి జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు బండా నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయడంతో ఆ స్థానం కీలకంగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ముందునుంచి ఎలాంటి సస్పెన్స్ లేకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో మాత్రం కొంత డ్రామా నడిచింది. పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని పెద్దవూర జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయించి, జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ.. అనూహ్యంగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోదరుడైన మోహన్‌రెడ్డి గెలుపు బాధ్యతను సోదరులు ఇద్దరూ భుజానికి ఎత్తుకున్నారు. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన పదహారు మంది సభ్యులను గెలిపించుకోవడం, వారిని కాపాడుకోవడం వంటి ప్రధాన బాధ్యతలను మోసేందుకు కోమటిరెడ్డి సోదరులు ముదుకు రావడంతో మోహన్‌రెడ్డి పేరును టీ పీసీసీ నాయకత్వం ప్రకటించిందని చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్లో పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బండా నరేందర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను ఇటు నల్లగొండ, అటు నకిరేకల్ ఎమ్మెల్యేలకు అప్పజెప్పిన నాయకత్వం సీరియస్‌గానే పనిచేస్తోంది. దీంతో నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు ఇరు పార్టీలకు కీలకంగా మారింది. గులాబీ జెండా ఎగరేయాలని..! తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ, ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ జెడ్పీని నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు జెడ్పీటీసీ సభ్యులు గోడదూకారు. మరికొన్నాళ్లకు జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ సహా కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో సాంకేతికంగా నల్లగొండ జెడ్పీ టీఆర్ఎస్ ఖాతాలో చేరింది. కానీ, మొన్నటి శాసనసభ ముందస్తు ఎన్నికల ముందు బాలూనాయక్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సారి మాత్రం నేరుగా తామే ఎక్కువ స్థానాలు గెలుచుకుని నల్లగొండ జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ శ్రమిస్తోంది. -
ఇంకెన్నాళ్లు నాన్చుతారు?
సాక్షి, కర్నూలు: గడచిన మూడేళ్ళుగా తమకు ఏవిధమైన న్యాయం జరగలేదని కేశవరెడ్డి బాధితులు వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, మలికి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సీఐడీ ఏఎస్పీని కలిశారు. తమకు డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేశవరెడ్డి ఆస్తులు సీఐడీ స్వాధీనంలో ఉన్నాయని న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం, అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ఆదాయం సుమారు రూ. 100కోట్లు పైనే అని, ఆ మొత్తం ఎటు వెళ్లిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం తమకు చెల్లించినా కొంత ఊరట కలిగేదన్నారు. వందల కోట్ల రూపాయల మోసం చేసిన కేశవరెడ్డి కుమారునికి స్కూల్ నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ కేశవరెడ్డి, ఆయన వియ్యంకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగాగే బాధితులకు డబ్బు కట్టకుండా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, జగోపాల్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. బాధితులను బెదిరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. -
’అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?’
-
’అనాడు ఏం మాట్లాడావు అఖిలప్రియ..?’
నంద్యాల: మూడేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ ఎస్పీవౌ రెడ్డిని, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి వరకు నంద్యాల గురించి పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు ఎన్నికలు అని చెప్పాక నంద్యాల అభివృద్ధి అని జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే వైఎస్ జగన్ సీఎం కావాలన్న అఖిలప్రియ ఏడాది తిరక్కుండానే మారారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌పార్టీలో గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియ ఏ మొహంతో ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు కోరుతున్నారని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్ సీఎం కావాలంటే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి గెలిపించాలని అన్నారు. అందరం సైనికుల్లా పనిచేసి శిల్పాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
మంత్రి అవతారమెత్తిన సోమిరెడ్డి తనయుడు
- నిబంధనలకు మంగళం - మంత్రి హోదాలో ఎత్తిపోతల పథకానికి పూజలు పొదలకూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నేతలు చెలరేగిపోతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనయుడు రాజగోపాల్‌రెడ్డి ఏకంగా మంత్రి అవతారమెత్తారు. నిబంధనలను పట్టించుకోకుండా, అధికారిక హోదా ఏమీ లేకపోయినా శనివారం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొదలకూరులో కండలేరు ఎడమ గట్టు కాలువపై రూ.60 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవల రెండుసార్లు తెలుగుగంగ ఇంజనీరింగ్ అధికారులు ట్రయిల్ రన్ వేశారు. పైపుల మధ్య నీరు లీకవడంతో మరమ్మతులు పూర్తి చేయించారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తుది ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించి ఎత్తిపోతల పథకానికి సాగునీటిని అధికారికంగా విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. అయితే మంత్రికి బదులుగా ఆయన కుమారుడు రాజగో పాల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కాలువ తూము వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని కూడా విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా తన కుమారుడే ఉంటారని ఇటీవల ప్రకటించిన మంత్రి సోమిరెడ్డి శనివారం పార్టీ శ్రేణులను రాజగోపాల్‌రెడ్డి వెంట పంపించి నీటి విడుదల కార్యక్రమం జరిపించారు. ప్రోటోకాల్ వివాదం రాజుకుంటుందని భావించిన ఇంజనీర్లు, అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. పార్టీ శ్రేణులే అన్నీ తామై మంత్రి కుమారుడితో ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేయించడంతో ఇది పార్టీ కార్యక్రమమో, ప్రభుత్వ కార్యక్రమమో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు. -
జగన్ మాటకు కట్టుబడి పనిచేస్తాం
- శిల్పా విజయానికి కృషి - వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి నంద్యాల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి ఉంటామని, ఆయన ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పని చేస్తామని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ(సీఈసీ) సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడిగా నియమితులైన ఆయనను పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు ఆశించకుండా నిర్వార్థంగా పార్టీకి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతాయుతంగా పని చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డికి పూర్తిగా సహకరించి ఆయన విజయానికి కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి ఇప్పుడే గుర్తొచ్చిందా? టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా గుర్తుకురాని అభివృద్ధి ఆ పార్టీ నేతలకు ఇప్పుడే గుర్తొచ్చిందని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికే లేనిపోని హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మాధవరెడ్డి, ఖాద్రి, అల్లాబకాష్, సంజీవరెడ్డి, ప్రసాదరెడ్డి, వివేకానందరెడ్డి, వేణు, యూసుఫ్, రవూఫ్, యశ్వంతరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు
అధికారపక్షంపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సింగరేణిపై గురు వారం వాడీవేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి అధికారపక్ష సభ్యులు ప్రయత్నించగా.. ‘టీఆర్ఎస్ సభ్యులు సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నారు’ అని విమర్శించారు. గిరిజనులను బికారీలుగా చూస్తున్నారు రాములు నాయక్ ‘‘రిజర్వేషన్ల కింద ఎస్టీలు ఉద్యోగాలు పొం దడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలుగా మారాలి అని సీఎం కేసీఆర్ ఆలో చిస్తున్నారు. కొందరు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు గిరిజనులను బికారులుగా చూస్తు న్నారు. ఈ పరిస్థితి మారాలి’’ అని టీఆర్ఎస్ సభ్యుడు రాములు నాయక్ అన్నారు. -
రాజగోపాల్‌రెడ్డిపై ఆరోపణలు తగవు
నకిరేకల్ : ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేనిపోని ఆరోపణలు చేయడం తగదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్‌లోని తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. నయీంతో కూడా జిల్లాకు చెందిన కొందురు టీఆర్ఎస్ వారితో సంబంధాలున్నాయన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, మారం చెన్నకృ ష్ణారెడ్డి, నకిరేకంటి ఏసుపాదం, యాస కర్ణాకర్‌రెడ్డి, గుర్రం గణేష్, మాద నగేష్, నవీన్‌రావు, పల్లె విజయ్ ఉన్నారు. -
నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం
వలిగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాతాళ్లగూడెంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తే వారి బాధలు సీఎంకు తెలుస్తాయన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పుష్కరాలకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కాల్వలకు రూ.50 కోట్లు కేటాయిస్తే భువనగిరి డివిజన్ సస్యశ్యామలమవుతుందన్నారు. టీఆర్ఎస్ చెబుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం చేరున చేపట్టినవేనని గుర్తు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, పల్సం సతీష్, ఉద్దగిరి భాస్కర్, దేశబోయిన సూర్యనారాయణ, సాయిలు, వెంకటేశం ఉన్నారు. -
ఎంసెట్ కుంభకోణం జరిగింది ఇలా...
తీగ లాగితే ఏకంగా డొంకే కదిలింది. ఎంసెట్-2 ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులకు ఎంసెట్-1 ప్రశ్నపత్రం కూడా లీకైందన్న విషయం తెలిసింది. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక పెద్ద ముఠా హస్తమే ఉందని తేలింది. ప్రశ్నపత్రాలను ముద్రణ కేంద్రం నుంచి చాకచక్యంగా తీసుకురావటం మొదలు వాటిని అత్యంత పకడ్బందీగా విద్యార్థులకు చేర్చటం, వారి నుంచి డబ్బు వసూలు చేయటం వరకు జరిగిన ఈ కుంభకోణంలో రాజగోపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ నిర్ధారించింది. కేసు నమోదుచేసిన మూడు రోజుల్లోనే సీఐడీ మొత్తం కుట్రను ఛేదించింది. 2014లో సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్న రాజగోపాల్‌రెడ్డే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీలోనూ చక్రం తిప్పాడు. ముద్రణసంస్థ నుంచి చాకచక్యంగా ప్రశ్నపత్రాలను తప్పించి, ఒప్పందం కుదుర్చుకున్న విద్యార్థులను బెంగళూరు, ముంబై నగరాలకు తరలించి పరీక్షకు సిద్ధం చేశాడు. తొలుత కోచింగ్ కేంద్రాలు, వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పించే దళారులను రాజగోపాల్ ఆకట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా తనకు నెట్వర్క్ ఉందని, ప్రశ్నపత్రం తెప్పిస్తానని, విద్యార్థులను చూస్తే మంచి కమీషన్ ఇస్తానని ఆశపెట్టాడు. వీరు విద్యార్థులను సంప్రదించి రూ.40 - 70 లక్షలు చెల్లిస్తే సీటు గ్యారంటీగా వస్తుందని, పరీక్షకు ముందు రూ.10 లక్షలు చెల్లిస్తేచాలని, ర్యాంకు వచ్చిన తర్వాత మిగతా డబ్బు చెల్లించాలని నమ్మించారు. తమకు బాగా నమ్మకమైన, డబ్బు ఇవ్వగలిగిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచి కమీషన్ ముడుతుందన్న ఆశతో దళారులు మొత్తం 72 మంది విద్యార్థులను ఒప్పించగలిగారు. వారి నుంచి అడ్వాన్సుగా దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశారు. మొత్తంగా రూ. 50 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదిరిన విద్యార్థులను రాజగోపాల్ ముఠా తొలుత హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో ఉంచి కొద్ది రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రాంతాల వారీగా బ్యాచ్‌లుగా విభజించారు. పరీక్షకు రెండురోజుల ముందు విమానాల్లో బెంగళూరు, ముంబై, గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. కొందరిని హైదరాబాద్‌లోని వివిధ రిసార్టుల్లో ఉంచారు. అయితే ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని నిబంధన పెట్టారు. ప్రశ్నపత్రాలు తీసుకొచ్చిన మరో ముఠా అక్కడకు చేరుకుని విద్యార్థులకు వాటిని చూపించింది తప్ప వారి చేతికి ఇవ్వలేదు. మొత్తం రెండు సెట్ల ప్రశ్నలకూ విద్యార్థులకు జవాబులు చెప్పి సిద్ధం చేయించారు. ఎంసెట్-2కు ముందు రోజు వారి వారి పరీక్ష కేంద్రాల వద్దకు చేర్చారు. తర్వాత అంతా అనుకున్నట్లే అయ్యింది. -
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
-
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషాద్ లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ. 50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థులు కోరుతున్నారు. -
అధిష్టానాన్ని ధిక్కరించడమే
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సోదరుడు రాజగోపాల్‌రెడ్డి భువనగిరి/భూదాన్‌పోచంపల్లి: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని నల్లగొండ ఎమ్మెల్సీ, సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి, భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడిలో వేర్వేరుగా విలేకరులతో ఆయన మాట్లాడారు. అధిష్టానం నియమించిన పీసీసీ అధ్యక్షుడిని విమర్శిస్తే, పరోక్షంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని విమర్శించినట్లే అవుతుందని చెప్పారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నియామకాలు, విధానాలపై ఏదైనా అసంతృప్తి ఉంటే.. నేరుగా అధిష్టానానికి చెప్పి ఉంటే బాగుండేదని హితవు పలికారు. కానీ. ఇలా బహిరంగంగా విమర్శించడం పార్టీకి నష్టమే తప్ప, లాభం ఉండదని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే 2019లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తారని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. అయితే, ఇలాంటి తరుణంలో క్రమశిక్షణరాహిత్య వ్యాఖ్యలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
రాజగోపాల్‌రెడ్డికి ఈసీ నోటీసు
-
ఎన్నికల హామీలు నెరవే ర్చాలి : రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. బుధవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేసిందన్నారు. నూతన రాష్ట్రంలో పరిపాలనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతరపార్టీల నుంచి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం తగదన్నారు. ప్రజల పక్షాన, కార్యకర్తల కోసం ఎప్పుడూ పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, పోత్నక్ప్రమోద్కుమార్, పచ్చిమట్ల శివరాజ్గౌడ్లు ఉన్నారు. -
పీజీ మెట్ రీ ఎగ్జామ్‌తో లాభించాం!
సాక్షి, విజయవాడ: పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎంట్రన్స్-2014(పీజీ మెట్) పరీక్షను తిరిగి నిర్వహించడం వల్ల తామెంతో లాభించామని పీజీమెట్ రీఎగ్జామ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు అమితానందం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ఈ పీజీమెట్ ప్రశ్న పత్రాలు.. పరీక్షకు ముందుగానే బయటకు పొక్కడంపై రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. తిరిగి అనేక తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్ 27న ఈ పరీక్షను ఎన్టీఆర్ ఆరోగ్య విశ ్వవిద్యాలయం మరోసారి నిర్వహించింది. ఈ క్రమంలో పరీక్ష ఫలితాలను ర్యాంకుల వారీగా ఆదివారం వర్సిటీ నోటీస్ బోర్డులో పేర్కొన్నారు. దీంతో ఈ రీఎగ్జామ్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో పేపర్ లీక్ కావడం వల్ల తాము మంచి ర్యాంకులు పోగొట్టుకున్నామని, ప్రస్తుతం తమ కష్టానికి ఫలితం లభించిందని ఆయా విద్యార్థులు ‘సాక్షి’కి చెప్పారు. వివరాలు.. ర్యాంకుల్లో వ్యత్యాసం: కర్నూలుకు చెందిన గాంధీ కళాశాల విద్యార్థి బి. శ్రీరామిరెడ్డి తొలుత 176 ర్యాంకు సాధించగా, రీఎగ్జామ్‌లో మొదటి ర్యాంకు సాధించా రు. హైదరాబాద్‌కు చెందిన ఉస్మానియా విద్యార్థి కిరీట్ గతంలో 56వ ర్యాంకు సాధించగా, ఇప్పుడు రెండో ర్యాంక్ పొందారు. ఏలూరుకు చెందిన ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థి గురుప్రసాద్ గతంలో 302 ర్యాంకు సాధించగా, ఇప్పుడు 3వ ర్యాంకు, వరంగల్ జిల్లాకు చెందిన కాకతీయ వైద్య కళాశాల విద్యార్థి రఘుపతి తొలి పరీక్షలో 44వ ర్యాంకు సాధించగా, రీఎగ్జామ్‌లో 4వ ర్యాంకు, అనంతపురానికి చెందిన కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థిని బి.దివ్య 76వ ర్యాంకు రాగా, ఇప్పుడు 5వ ర్యాంకు సాధించారు. రీఎ గ్జామ్ వల్ల తమకు ర్యాంకులు పెరిగాయని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి పరీక్ష లో పేపర్ లీక్ అవడం వల్ల తాము ఆశించిన ర్యాంకు లు రాలేదన్నారు. కాగా, తొలి పరీక్షలో టాప్ ర్యాంకు లు సాధించిన విద్యార్థుల్లో కొందరు రీఎగ్జామ్ రాయలేదు. తొలి ఎగ్జామ్‌లో ఫస్ట్ ర్యాంకు వచ్చిన ఆకుల శ్రీకాంత్‌కు ఈసారి 1,300 ర్యాంకు వచ్చినట్టు తెలిసింది. పూర్తి జాబితా నేడు: విద్యార్థుల పేర్లుతో సహా ఫలితాలను వర్సిటీ అధికారులు సోమవారం వర్సిటీ వెబ్సైట్లో ప్రకటించనున్నారు. వర్సిటీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ప్రకటించిన తరువాతే గతంలో జరిగిన గోల్‌మాల్‌పై మరింత స్పష్టత వస్తుందని జూనియర్ డాక్టర్ అసోసియేషన్(జూడా) ప్రతినిధి క్రాంతికుమార్ తెలిపారు. -
‘పీజీ మెట్’ పాత్రధారి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో 2007-2013 మధ్య నాలుగు లీకేజీ కుంభకోణాలకు పాల్పడిన అనంతపురం వాసి రాజగోపాల్‌రెడ్డికి... తాజాగా ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజీలోనూ పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆయనతో పాటు దళారి మాధవరావు, పీజీమెట్‌లో 40వ ర్యాంక్ వచ్చిన చందూమోహన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్కామ్‌లో 20 మంది సూత్రధారులు, దళారులతో పాటు 24 మంది ర్యాంకర్లతో కలిపి 44 మందిని అరెస్టు చేసినట్లయిందని సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఈ స్కామ్‌లో మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల పాత్రపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
కర్ణాటకలో సూత్రధారి.. రాష్ట్రంలో పాత్రధారి
* పీజీ మెట్ స్కామ్‌లో రాజగోపాల్‌రెడ్డి ప్రమేయం * బెంగళూరులో నాలుగు కేసుల్లో నిందితుడు * రాజగోపాల్‌రెడ్డి ఆచూకీ కనిపెట్టిన రాష్ట్ర సీఐడీ ప్రత్యేక బృందాలు * అదుపులో ఏడుగురు ర్యాంకర్లు, ముగ్గురు దళారులు సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో 2007 నుంచి నాలుగు ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి స్కామ్‌లలో సూత్రధారి అయిన రాజగోపాల్‌రెడ్డికి తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజ్లోనూ పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రి ఆచూకీ కనిపెట్టినట్లు తెలిసింది. మరోపక్క ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న ఏడుగురు ర్యాంకర్లు, ముగ్గురు దళారుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పీజీ మెట్ లీకేజి వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న కర్ణాటకలోని దావణగెరెకు చెందిన అమీర్ అహ్మద్‌ను ఈ నెల 16న సీఐడీ అరెస్టు చేసిన విషయం విదితమే. అతన్ని విచారించిన సందర్భంగా తన మాజీ గురువైన రాజగోపాల్‌రెడ్డి పాత్రను బయటపెట్టాడు. అనంతపురం జిల్లాకు చెందిన రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్థిరపడ్డాడు. విజయా బ్యాంక్‌లో పని చేసి, 2005లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. విద్యా రంగంలో అనేక మందితో పరిచయాలు పెంచుకొని, 2007 - 2013 మధ్య నాలుగు ‘లీకేజ్’లకు పాల్పడి అరెస్టయ్యాడు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్జీయూహెచ్ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్, కన్సార్షియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2011) బోగస్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులతో సహా బెంగళూరు సీబీఐ, సెంట్రల్, హెచ్ఎస్ఆర్ లేఔట్, జయనగర్ పోలీసుస్టేషన్లలో ఇతడిపై కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పీజీ మెట్ స్కామ్‌కు వ్యూహ రచన చేసిన అమీర్ అహ్మద్ అప్పట్లో రాజగోపాల్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. మణిపాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రెస్ నుంచి ప్రశ్నల తస్కరణ నుంచి బ్రోకర్ల ద్వారా వైద్య విద్యార్థుల గుర్తింపు, ప్రత్యేక క్లాసుల నిర్వహణ వరకు రాజగోపాల్‌రెడ్డి తెరవెనుక ఉండి కథ నడిపినట్లు సీఐడీ గుర్తించింది. ఇందు కు ఆధారాలు కూడా సేకరించింది. దీంతో అతడి కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోపక్క స్కామ్ వెలుగులోకి వచ్చిన తరవాత ప్రాథమికంగా 100 లోపు ర్యాంకర్లను మాత్రమే విచారించిన సీఐడీ అధికారులు ఇప్పుడు 200 ర్యాంకుల వరకు అనేక మందిని అనుమానితుల జాబితాలో చేర్చారు. వారికి గతంలో జరిగిన పరీక్షలు, మెడిసిన్ ఎంట్రన్స్ టెస్టులు, సెమిస్టర్లలో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా నిందితులకు సహకరించిన ముగ్గురు దళారుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఉద్రిక్తం..
భువనగిరిటౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు గంటకుపైగా ధర్నా నిర్వహించారు. కేసునమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేశారని ఎంపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డిపై కేసునమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే తమను కులం పేరుతో దూషించారని దామోదర్‌రెడ్డి వర్గీయులు ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, సతీష్‌లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇకసాగవు భువనగిరి, న్యూస్‌లైన్: జిల్లాలో సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇక సాగబోవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలో 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై స్వయంగా దాడి చేసిన దామోదర్‌రెడ్డి.. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను జిల్లాలో నడుపుతున్నారని ఆరోపించారు. తమసోదరుల జోలికి వచ్చిన ఆర్డీఆర్‌ను సొంత జిల్లా అయిన ఖమ్మంకు పంపించడం ఖాయమన్నారు. ‘‘నీ హత్యా రాజకీ యాలకు ఇక్కడ ఎవరూ బయపడరని.. జిల్లా ప్రజలకు నీవు ఏం చేశావని నీకొడుకును ఎంపీ చేయాలని అనుకుంటున్నావు’’ అని దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నప్పటికీ ఆర్డీఆర్ తన కొడుకును పోటీలో దింపడానికి టికెట్ కోరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల మంచి పేరున్న నూతన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఓడిపోయిన చింతల వెంక టేశ్వర్‌రెడ్డికి మరో మారు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీ దూతను కోరినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కోమటిరెడ్డి సోదరులను ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసిన ఆర్డీఆర్.. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవికోసం సీఎం పంచన చేరారని ఆరోపించారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, బర్రె జహంగీర్, భాస్కర్, చంద్రకళ ఉన్నారు. ఆర్డీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలి నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు దళిత యువకులపై దాడులకు పాల్పడిన సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఆర్పై అట్రాసిటీ కేసునమోదు చేసి అరెస్టు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. దామోదర్‌రెడ్డి స్వయంగా రౌడీలతో వెళ్లి రాజగోపాల్‌రెడ్డిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆర్డీఆర్‌ను జిల్లా ప్రజలు ఆదరించిన విషయాన్ని మరచి హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. కిరాయి హత్యలు చేయించే స్వభావం ఉన్న ఆర్డీఆర్.. రాజగోపాల్‌రెడ్డిపై కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతోనే ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయించామన్నారు. తాము తలుచుకుంటే నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేటకు కూడా వెళ్లలేవని సవాల్ చేశారు. దామోదర్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డి చర్యలకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రోత్సాహం ఉందని, వెంటనే మంత్రి తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజకీయ దిగ్గజం ఆర్ఆర్
రాయచోటి/లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌లైన్ : అధ్యాపకుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన రెడ్డెప్పగారి రాజగోపాల్‌రెడ్డి(ఆర్ఆర్) ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తరువాత మంత్రి పదవులనూ అధిష్టించారు. తన చతురతతో రాజకీయ దిగ్గజంగా పేరు పొందారు. ఎమ్మెల్యే, మంత్రి పదవుల్లో ఉండగా అనేక సమస్యలను పరిష్కరించారు. ఆర్ఆర్గా అందరూ ముద్దుగా పిలుచుకునే ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆర్ఆర్ ప్రస్థానం లక్కిరెడ్డిపల్లె మండలం రెడ్డివారిపల్లెలో రెడ్డెప్పగారి ఓబులమ్మ, గురివిరెడ్డి దంపతులకు 1933 అక్టోబరు 20న జన్మించిన ఆర్ఆర్ ప్రాథమిక విద్యను 1938 నుంచి 1943 వరకు లక్కిరెడ్డిపల్లె ఎలిమెంటరీ స్కూలులో అభ్యసించారు. 6 నుంచి 9 వరకు రాయచోటి ఉన్నత పాఠశాలలో, ఎస్ఎస్ఎల్సీ చిత్తూరు జిల్లా మదనపల్లె ఉన్నత పాఠశాలలో చదివారు. 1954లో అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసించారు. 1954-56 వరకు కర్నూలు నీటి పారుదల శాఖలో ఇంజినీర్‌గా పని చేశారు.1956-57లో కృష్ణా జిల్లా ఉయ్యూరు ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. సోదరుడి కోరిక మేరకు రాజకీయాల్లోకి... తన సోదరుడు, జెడ్పీ మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి అభీష్టం మేరకు ఆయన 1959లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1962లో తొలిసారిగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 1967లో తిరిగి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1972లో రెండో శాసనసభకు ఎన్నికై 1973లో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో కొద్దిరోజులు నీటిపారుదలశాఖ మంత్రిగా పని చేశారు. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983-85 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో ఆయన రాష్ట్ర రోడ్డు రవాణా, వ్యవసాయ శాఖమంత్రిగా కూడా పని చేశారు. 1989లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఐదో పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవడంతో అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో... ఆర్ఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, కుషాతి, బుగ్గవంక, కాలేటివాగు, గంగనేరు, చిన్నపోతులవారిపల్లె రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఆర్ఆర్ ఎంతో కృషిచేశారు. తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల రూపకల్పనలోనూ తనవంతు కృషి చేశారు. ఆర్ఆర్ రైతు కుటుంబం నుంచి పెకైదగడంతో అధికంగా వ్యవసాయం, సాగునీటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. రాజకీయాలలో మృదుస్వభావి అంటే ఆర్ఆర్ను మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. దీర్ఘకాలంగా రాజకీయాలలో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారాయన. వేంపల్లె నాగిరెడ్డి అల్లుడుగా రాజగోపాల్‌రెడ్డి జిల్లా వాసులకు సుపరిచితుడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు రమేష్‌కుమార్‌రెడ్డి ఒక పర్యాయం లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా కొనసాగారు. మరో కుమారుడు శ్రీనివాసులురెడ్డి క్లాస్-1 కాంట్రాక్టరుగా, కుమార్తె రాధ భర్త చెన్నైలో ఐజీగా పని చేస్తున్నారు. భార్య హేమలతమ్మతో కలసి జీవిస్తున్న ఆయన ఊహించని రీతిలో గుండెపోటుకు గురయ్యారు. వైఎస్ పని తీరును మెచ్చుకున్న ఆర్ఆర్ జిల్లా రాజకీయాలల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవతిరేక గ్రూపులో మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి ఒకరు. అయినా పలు పర్యాయాలు వైఎస్‌ను ఆయన మెచ్చుకున్నారు. సీఎంగా వైఎస్ రాయలసీమకు ప్రాణప్రదమైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ పనులు చేపట్టారు. అప్పట్లో కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు, టీడీపీకి చెందిన కోస్తా, తెలంగాణ ప్రాంత నేతలు వ్యవతిరేకతను వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఆర్ఆర్ మాత్రం వైఎస్ చొరవను ప్రశంసించారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు ఆవశ్యకతను వివరిస్తూ పలుమార్లు పత్రిక ప్రకటనలు ఇచ్చారు. వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని ఆయన సమర్థించారు. రాజశేఖరరెడ్డి కాబట్టే సాహసోపేతమైన పనులు చేపట్టారని అభివర్ణించారు. వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి వసతి కల్పిస్తేనే అభివృద్ధిలోకి వెళ్తాతాయని ఆర్ఆర్ అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. పార్టీలు వేరైనా ప్రాంతం కోసం పాటుపడిన వైఎస్‌ను అనేక మార్లు భేష్ అంటూ ఆర్ఆర్ మెచ్చుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. అసలు సిసలైన సమైక్యవాది జిల్లా రాజకీయ అగ్రగణ్యుడైన ఆర్ఆర్ అసలు సిసలైన సమైక్యవాదని పలువురు చెబుతుంటారు. రాష్ట్రంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం తరువాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం ఊపుందుకుంది. కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమం వైపు మొగ్గు చూపారు. ఆ రెండు ఉద్యమాల సందర్భంగా నిర్మోహమాటంగా సమైక్యాంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఆర్ఆర్ తన అభిప్రాయాలను చెప్పినట్లు పలువురు గుర్తు చేశారు. 2009లో కేంద్రమంత్రి చిదంబరం రాష్ర్ట విభజన నిర్ణయం ప్రకటన చేపట్టగానే ఆర్ఆర్ కేంద్ర ప్రభుత్వంపైనా, చిదంబరంపైనా ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తే తమిళుల ప్రాధాన్యం పెరుగుతుందన్న కుట్రతోనే ఈ ప్రకటన చేశారని కూడా ఆయన విమర్శలు చేశారు. విభజనతో సీమతో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతాయని అనేక సందర్భల్లో ఆర్ఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతో ప్రయోజనం లేదని నమ్మిన వ్యక్తి. -
మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి మృతి
తిరుపతి: మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజగోపాల్ రెడ్డి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.