భార్యాభర్తలపై తెలుగు తమ్ముళ్ల దాడి
కారులో కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి..
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్‌రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది.
హైదరాబాద్‌లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్‌రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది.
వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్‌రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.
రాజగోపాల్‌రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment