మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
తిరుపతి: మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజగోపాల్ రెడ్డి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.