రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం
రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరం
Published Wed, Aug 17 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
వలిగొండ : తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాతాళ్లగూడెంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తే వారి బాధలు సీఎంకు తెలుస్తాయన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పుష్కరాలకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కాల్వలకు రూ.50 కోట్లు కేటాయిస్తే భువనగిరి డివిజన్ సస్యశ్యామలమవుతుందన్నారు. టీఆర్‌ఎస్ చెబుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి దివంగతనేత వైఎస్సార్ హయాంలో జలయజ్ఞం చేరున చేపట్టినవేనని గుర్తు చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పాశం సత్తిరెడ్డి, నూతి రమేష్, పల్సం సతీష్, ఉద్దగిరి భాస్కర్, దేశబోయిన సూర్యనారాయణ, సాయిలు, వెంకటేశం ఉన్నారు.
Advertisement
Advertisement