సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు
అధికారపక్షంపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సింగరేణిపై గురు వారం వాడీవేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి అధికారపక్ష సభ్యులు ప్రయత్నించగా.. ‘టీఆర్‌ఎస్ సభ్యులు సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నారు’ అని విమర్శించారు.
గిరిజనులను బికారీలుగా చూస్తున్నారు రాములు నాయక్
‘‘రిజర్వేషన్ల కింద ఎస్టీలు ఉద్యోగాలు పొం దడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలుగా మారాలి అని సీఎం కేసీఆర్ ఆలో చిస్తున్నారు. కొందరు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు గిరిజనులను బికారులుగా చూస్తు న్నారు. ఈ పరిస్థితి మారాలి’’ అని టీఆర్‌ఎస్ సభ్యుడు రాములు నాయక్ అన్నారు.