Ramu Naik
-
చీకటి ఒప్పందాల చరిత్ర కాంగ్రెస్‌దే: కర్నె, రాములు
సాక్షి, హైదరాబాద్: అధికారం, పదవులే లక్ష్యంగా చీకటి ఒప్పందాలు చేసుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అర్థమైందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని మోసం చేసిన పార్టీలు అని విమర్శించారు. -
సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు
అధికారపక్షంపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో సింగరేణిపై గురు వారం వాడీవేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి అధికారపక్ష సభ్యులు ప్రయత్నించగా.. ‘టీఆర్ఎస్ సభ్యులు సెల్ఫ్ డబ్బా బాగా కొట్టుకుంటున్నారు’ అని విమర్శించారు. గిరిజనులను బికారీలుగా చూస్తున్నారు రాములు నాయక్ ‘‘రిజర్వేషన్ల కింద ఎస్టీలు ఉద్యోగాలు పొం దడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలుగా మారాలి అని సీఎం కేసీఆర్ ఆలో చిస్తున్నారు. కొందరు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు గిరిజనులను బికారులుగా చూస్తు న్నారు. ఈ పరిస్థితి మారాలి’’ అని టీఆర్ఎస్ సభ్యుడు రాములు నాయక్ అన్నారు. -
‘నిలువురాళ్ల’పై తొలగిన అపోహలు
సాక్షి’ కథనానికి అపూర్వ స్పందన ► పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు ► నేడు సీఎంను కలవనున్న పురావస్తుశాఖ అధికారులు కృష్ణా/మాగనూర్: మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం ముడుమాలలో నిలువురాళ్లపై ఆదివారం ‘ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇన్నాళ్లూ ఈ రాళ్లపై ఉన్న అపోహలు, భయాలను ఈ కథనం తొలగించిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇది దెయ్యాల గడ్డ అని, బంగారు నిక్షేపాలు ఉన్నాయని, దేవతల నివాస ప్రాంతమని చెప్పుకునేవారు. అయితే ఇది వేల ఏళ్ల కిందటే ఏర్పాటైన ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’ అని సాక్షి కథనంలో వివరించింది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సంవత్సరంపాటు ఈ ప్రాంతంపై అధ్యయనం చేసి 2010లోనే ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని చారిత్రక సంపద ముడుమాలలో ఉందని పేర్కొన్నారు. అప్పట్నుంచే ఈ నిలువురాళ్ల విషయంపై బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు. ఈ నిలువురాళ్లు దాదాపు 60 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో పొలం యజమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఈ భూములను తీసుకుంటే మార్కెట్ ధర ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఎంను కలవనున్న అధికారులు ముడుమాలలో నిలువురాళ్లపై రాష్ర్ట పురావస్తు శాఖ అధికారులు సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నివేదికను ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాములు నాయక్ తెలిపారు. ముడుమాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిందిగా సీఎంను కోరతానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. నిలువురాళ్ల చారిత్రక నేపథ్యంతో తమ గ్రామానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ముడుమాల సర్పంచ్ ఆశోక్‌గౌడ్ పేర్కొన్నారు. -
పాడికి ని'బంధనాలు'
ఎస్సీ కార్పొరేషన్ వింత పోకడ → ఆవుల కొనుగోలుకు రుణాలు ఇస్తూనే షరతులు → కర్ణాటకలో మాత్రమే కొనాలని మెలిక → ఆందోళనలో లబ్ధిదారులు తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన గార్లదిన్నె నరసింహులు సంకర జాతి ఆవులు కొనేందుకు (ఐడీ నంబరు 20150585923) గత నెల 8న ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష మంజూరైంది. అయితే ఆవులను కర్ణాటకలో కొనుగోలు చేయాలని, ఆవును అమ్మిన రైతు ఆధార్ పొందుపర్చాలని అధికారులు షరతులు పెట్టారు. తనకు నచ్చిన చోట సంకర జాతి ఆవుల్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా అధికారులు అంగీకరించలేదు. దీంతో నరసింహులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇది నరసింహులు ఒక్కడి పరిస్థితే కాదు. పాడి ఆవుల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులందరిదీ ఇదే పరిస్థితి. అనంతపురం అర్బన్ : ప్రభుత్వం దళితుల అభ్యున్నతే ధ్యేయమని చెప్తూనే ఆవర్గాలకు రుణాల మంజూరులో ని‘బంధనాలు’ విధిస్తోంది. దీంతో పాడిపోషణతో కుటుంబాన్ని పోషించుకునే దళిత వర్గాలకు ఎస్సీకార్పొరేషన్ ద్వారా సంకర జాతి పాడి ఆవుల్ని కొనుగోలు చేసేందుకు రుణం ఇస్తూనే షరతులు విధిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. పాడి ఆవుల్ని కొనేందుకు రూ.లక్ష రుణం మంజూరు చేస్తున్నారు. ఇందులో రూ.60 వేలు సబ్సిడీ, రూ.40 వేలు బ్యాంక్ రుణం. మొత్తం రూ.లక్షతో సంకర జాతి ఆవుల్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలంటూ ఎస్సీ కార్పొరేషన్ మెలిక పెట్టింది. సంకర జాతి ఆవులు లేదా గేదెలు (బర్రె) తప్పనిసరిగా కర్ణాటకలోనే కొనుగోలు చేయాలని షరతు పెడుతోంది. ఆవుల్ని అమ్మిన రైతు ఆధార్ తప్పనిసరిగా పొందపర్చాలనే నిబంధన పెట్టడంతో ఇవి లబ్ధిదారుల పాలిట కంటకంగా మారాయి. మంజూరైన రుణంతో తమకు నచ్చిన చోట సంకర జాతి ఆవుల్ని లేదా ఎనుములను కొనుగోలు చేసుకునే స్వేచ్ఛలేకుండా చేసింది. దూర ప్రాంతాల నుంచి ఆవుల్ని కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చుకునేందుకు రవాణా ఖర్చు తడిసిమోపెడవుతాయని వాపోతున్నారు. ఒక రకంగా లబ్ధిదారుడికి ఇది అదనపు భారమే అవుతోంది. ఇలాంటి షరతులతో రుణం మంజూరైనా యూనిట్లు నెలకొల్పలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. కర్ణాటకలోనే ఆవుల్ని కొనుగోలు చేయాలనే నిబంధనను సడలించి, నచ్చిన చోట కొనుగోలు చేసుకునే సౌలభ్యం కల్పించాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. కర్ణాటకలో కొనుగోలు చేయాలనేది పాలసీ : – రాము నాయక్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణంతో ఆవులు, గేదెలను కర్ణాటకలో కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఇదే విషయంపై ఇటీవల సంస్థ ఎండీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అది ప్రభుత్వ పాలసీ అని ఆయన చెప్పారు. -
పిడుగుపాటుకు రైతు మృతి
పొలానికి వెళ్లిన రైతు పిడుగుపడి చనిపోయాడు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పలుకూరు పంచాయతీ సోమ్లారాజుతండాకు చెందిన భూక్యా రాములు నాయక్(45) ఆదివారం మధ్యాహ్నం తన ఆవును తోలుకుని పెసరతోటకు కాపలాగా వెళ్లాడు. సాయంత్రం వాన మొదలు కావటంతో ఇంటి బాట పట్టాడు. అదేసమయంలో పిడుగుపడటంతో రైతుతోపాటు ఆవు కూడా చనిపోయింది. పిడుగు తీవ్రతకు సమీపంలోనే ఉన్న పీరయ్య కూడా స్వల్పంగా గాయపడ్డాడు.