
సాక్షి, హైదరాబాద్: అధికారం, పదవులే లక్ష్యంగా చీకటి ఒప్పందాలు చేసుకునే నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్ విమర్శించారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అర్థమైందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని మోసం చేసిన పార్టీలు అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment