భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. బుధవారం రాత్రి స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేసిందన్నారు. నూతన రాష్ట్రంలో పరిపాలనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతరపార్టీల నుంచి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం తగదన్నారు. ప్రజల పక్షాన, కార్యకర్తల కోసం ఎప్పుడూ పోరాడుతామన్నారు. ఈ సమావేశంలో పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బర్రె జహంగీర్, పోత్నక్‌ప్రమోద్‌కుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్‌లు ఉన్నారు.
ఎన్నికల హామీలు నెరవే ర్చాలి : రాజగోపాల్‌రెడ్డి
Published Thu, Oct 2 2014 2:52 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement