యాదాద్రి నూతన నమూనా
యాదాద్రి దివ్యక్షేత్రం ప్రధాన ఆలయం నూతన నమూనా సిద్ధమైంది. సీఎం కేసీఆర్.. యాదగిరిగుట్టను తిరుమల తరహా దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు కొండపైన ఆగమ, వాస్తు శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ ప్రణాళికలను తీర్చిదిద్దారు. ముందుగా తయారు చేసిన ప్రణాళికల్లో మార్పులు.. చేర్పులను సీఎం సూచించగా.. అందుకనుగుణంగా వైటీడీఏ అధికారులు తాజా ప్రణాళికలను రూపొందించారు. కొండపైన ప్రధాన ఆలయం, ఆలయ ప్రాంగణం, మాడవీధులు, రాజగోపురాలు, దివ్య విమాన గోపురం, ఎత్తై ఆంజనేయ విగ్రహం ఎక్కడెక్కడ ఉండాలో ప్రణాళిల్లో పొందుపరిచారు.
నూతన నిర్మాణాల కోసం ఇప్పటికే కొండపైన నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు దక్షిణ దిశలో రిటైనింగ్ వాల్ నిర్మాణపు పనులు ప్రారంభించారు. మరో వైపు పెద్దగుట్టపై లేఅవుట్ ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. - భువనగిరి