Bhuvanangiri
-
మమ్మీ.. నన్ను క్షమించు..
♦ అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య? ♦ భువనగిరిలో విషాదఛాయలు నల్లగొండ : కుటుంబ కలహాలో.. మరో సమస్యో కారణాలైతే తెలియవు కానీ అమెరికాలో స్థిరపడిన ఓ సాఫ్ట్ ఉద్యోగి అమెరికాలో బలవన్మరణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చాడు. దీంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామానికి చెందిన గూడూరు బాల్‌రెడ్డి, సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రతిరోజు భువనగిరి నుంచి సొంత వాహనంపై వెళ్లి వస్తుండేవారు. బాల్రెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు మధుకర్‌రెడ్డి(37) 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. తదనంతరం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు. ఏడేళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుకర్‌రెడ్డి భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8గంటలకు మృతిచెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతికి గల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మృతిచెందిన సమాచారం అందిన వెం టనే తల్లి సుగుణ మొబైల్‌కు మధుకర్రె డ్డి పెట్టిన మమ్మీ నన్ను క్షమించు మే సే జ్ను చూసుకున్నారు. అమెరికా కాలమా నం ప్రకారం పగలు సమయంలో పె ట్టి న మేసేజ్ తల్లికి భారత కాలమాన ప్రకా రం అర్ధరాత్రి సమయంలో వచ్చింది. వారం రోజుల క్రితమే.. మధుకర్‌రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాల్‌రెడ్డి వారంరోజుల క్రితమే తన కుమారుడితో ఫోన్లో మాట్లాడి డబ్బులు కూడా పంపించాడు. తమ కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని రోదిస్తూ తం డ్రి బాల్‌రెడ్డి చెప్పాడు. తల్లి కి రాత్రి మమ్మీ తనను క్షమించమని రెం డుసార్లు మేసేజ్ పెట్టాడని ఆ మేసేజ్‌ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు. కుటుంబ కలహాతోనేనా? భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్న అనంతరం మధుకర్‌రెడ్డి కాలిఫోర్నియాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు ఉన్న భువనగిరి పట్టణంలోని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరును చూసి బంధుమిత్రులు కంటతడిపెట్టారు. కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి మృతదేహం గురువారం భువనగిరికి చేరుకునే అవకాశం ఉంది. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
భువనగిరి అర్బన్ : కొంత కాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ పాలకుర్తి యాదగిరి నిందితుడి వివరాలు వెల్లడించారు. మోత్కూర్ గ్రామంలోని పోతాయిగడ్డకు చెందిన సిరిగిరి సాయిబాబా అలియస్ సాయికుమార్ స్టవర్ రిపేర్ చేస్తానని పట్టణంలో, గ్రామాల్లో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. గత నెల 31న తుర్కపల్లి గ్రామంలోని గుండెబోయిన కవిత ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టాడు. బంగారు పుస్తెలతాడు, జత చెవి కమ్మలు, జత బంగారు మాటీలు, నాలుగు జతల వెండి పట్టాగోలుసులు, రూ.400 నగదు, మొత్తం నాలుగున్నర తులాల బంగారం, 55 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. జనవరి 1న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణంలోని ప్రగతినగర్ కాలనీలో కన్నారపు ప్రసాద్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మన్నా చర్చిలో ప్రార్థనకు వెళ్లారు. ఈ సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను తెరిచి నగల బాక్స్‌లోని నల్లపూసల బంగారు గొలుసు లాకెట్, బంగారు గుండ్ల గొలు సు, లాకెట్ చైను, గ్రీన్ స్టోన్ రింగు, ఒక సెల్‌ఫోన్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులు అనుమానితులను తనిఖీ చేస్తుం డగా పట్టణ శివారులోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద ఒక డేరాలో నివాసముంటున్న సాయిబాబాను విచారించడం తో దొంగతనాలు చేస్తునట్లు ఒప్పుకున్నాడు.సాయిబాబా నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, చెవి కమ్మలు, మాటీలు, వెండి పట్టాగోలుసులు, సమ్‌సంగ్, ఐ సెల్ఫోన్ల, రూ.4వేలు, 3 బైకులను స్వాధీనం చేసుకునట్లు చెప్పారు. సాయిబాబాకు సహకరించిన తండ్రి పరుశారం బంగారు గుండ్ల గొలుసుతో పారిపోయి తప్పించుకుని తిరుగుతున ట్లు తెలిపారు. అతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు చె ప్పారు. నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ సాధు మోహన్‌రెడ్డి, సీఐ ఎం.శంకర్‌గౌడ్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, కానిస్టేబుల్ కిరణ్ ఉన్నారు. ఇతర జిల్లాల్లోనూ చోరీలు.. 2010 నుంచి ఇప్పటి వరకు మోత్కూర్, నల్లగొండ టౌన్, జనగాం, వరంగల్ జిల్లా హుస్నాబాద్, వర్థన్నపేట, వరంగల్ మిల్స్‌కాలనీ, మర్రిపెడ బంగ్లా, మహబూబాబాద్, దుగ్గొండి పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు చెప్పారు. వరంగల్ సెంట్రల్ జైలు, నల్లగొండ జిల్లా జైలు, జనగాం సబ్జైల్లో రి మాండ్ ఉన్నట్లు చెప్పారు. 2016 నవంబర్‌లో వరంగ ల్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి తుర్కపల్లి, భువనగిరిలో 14 దొంగతనాలకు పాల్పడ్డాడు. -
ఆర్థిక లావాదేవీలతోనే..
భువనగిరి అర్బన్ : బాకీ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేస్తున్నాడే కారణంతోనే కాంట్రాక్టర్ హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 18వ తేదీన బొమ్మలరామారం గ్రామ శివారులో వెలుగుచూసిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ పాలకుర్తి యాదగిరి బుధవారం తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన గుండుగ బ్రహ్మాజీరావు(45) రోడ్డు కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2008 సంవత్సరంలో నాగిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తితో బ్రహ్మజీరావుకు పరిచయం ఏర్పడింది. అయితే నాగిరెడ్డి రాంరెడ్డికి ఉన్న టిప్పర్ లారీని బ్రహ్మాజీరావు మధ్యవర్తి సాయంతో రోడ్డు పనులకు ఎంగేజీకు పెట్టి కంకరపోయించారు. ఆ విషయంలో నాగిరెడ్డి రాంరెడ్డికి సుమారు రూ.13లక్షల వరకు కాంట్రాక్టర్ బకాయి ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ డబ్బులను ఇవ్వడం లేదు. ఆ డబ్బులను బ్రహ్మజీరావు ఇచ్చే విధంగా ఒప్పుకుని ప్రామిసరి నోటు, చెక్కులు ఇచ్చినా కూడా డబ్బులు ఇవ్వలేదు. రాంరెడ్డి తన డబ్బులు చెల్లించాలని బ్రహ్మాజీరావును ఎన్నిసార్లు అడిగినా రేపుమాపు అంటూ తిప్పుతున్నాడు. దీంతో రాంరెడ్డి విసుగుపోయి బ్రహ్మజీరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బైటికి వెళ్దామని తీసుకొచ్చి.. రాంరెడ్డి 17వ తేదీన హబ్సిగూడలో ఉన్న బ్రహ్మజీరావు ఇంటికి వెళ్లాడు. పని ఉంది బైటికి వెళ్దామని నమ్మించి బ్రహ్మాజీరావును తన బైక్ ఎక్కించుకుని బయలుదేరా డు. కీసరలో లీటర్ పెట్రోల్ బైక్‌లో పోసుకున్నాడు. బొమ్మలరామారం గ్రామ శివారులోని బెజ్జంకి నర్సిరెడ్డి బీడు భూములోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న సుత్తెతో అతడిపై దాడి చేశాడు. అలాగే కిందపడవేసి గొంతునులిమి చంపేశాడు. ఆపై శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ మృతుడి ఒంటిపై పోసి తగులబెట్టి పరారయ్యాడు. సెల్‌ఫోన్ ఆధారంగా.. మృతదేహం సమీపంలో బ్రహ్మాజీరావు సెల్‌ఫోన్ పోలీసులకు లభించడంతో కేసు ఛేదన సులువైంది. అతడి కుటుంబ సభ్యులను సంప్రదించగా మృతదేహం బ్రహ్మాజీరావుదేనని, 17న ఉదయం రాంరెడ్డి తీసుకెళ్లాడని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడని డీసీపీ యాదగిరి వివరించారు. నిందితుడి వద్ద నుంచి మోటార్ సైకిల్, హెల్మెట్, సుత్తి, సెల్‌ఫోన్, డ్రెస్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఏసీపీ మోహన్‌రెడ్డి, భువనగిరి రూరల్ సీఐ అర్జునయ్య, యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐ వెంకటేష్ ఉన్నారు. -
ఉద్రిక్తత మధ్య అంత్యక్రియలు
* పోలీసు బందోబస్తు మధ్య నయీమ్ మృతదేహం భువనగిరికి తరలింపు * నయీమ్ భార్య, పిల్లల్ని తీసుకొచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమన్న బంధువులు * మత పెద్దలు, కుటుంబ సభ్యులతో పోలీసుల చర్చలు * రాత్రి 10.21 గంటలకు ఖాజీ మహల్లా దర్గాలో ఖననం భువనగిరి: ఎన్కౌంటర్లో మృతి చెందిన నయీమ్ అంత్యక్రియలు తీవ్ర ఉత్కంఠ మధ్య మంగళవారం రాత్రి ముగిశాయి. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రే నయీమ్ మృతదేహానికి షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం ఉదయం నయీమ్ సోదరి, బావ వచ్చి మృతదేహాన్ని తీసుకుని... మధ్యాహ్నం భువనగిరిలోని నయీం ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మృతదేహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు నయీమ్ ఇంటివద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత నయీమ్ తల్లి తాహెరాబేగం, బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే నయీమ్ భార్య ఫర్హానా, పిల్లలు, నయీం సోదరిలను తీసుకువచ్చే వరకు అంత్యక్రియలు జరపబోమని కుటుంబ సభ్యులు తొలుత ప్రకటించారు. నయీమ్‌ను కడసారి చూసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో.. ఏఎస్పీ గంగాధర్, యాదగిరిగుట్ట డీఎస్పీ సాధుమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముస్లిం మత పెద్దలు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. నయీమ్ భార్య పోలీసు కేసులో ఉన్నందున ఆమెను తీసుకురావడం వీలుకాదని వివరించారు. అత్యవసర సమయంలో భార్య లేకున్నా అంత్యక్రియలు చేయవచ్చని మత పెద్దలు సూచించడంతో.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. చివరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరో సమీప బంధువు రావాల్సి ఉన్నందున కొంత సమయం కావాలని కోరారు. రాత్రి 8.45 సమయంలో అంత్యక్రియలను ప్రారంభించారు. స్థానిక ఖాజీ మహెల్లా దర్గా మసీదులో జనాజున్ నమాజ్ నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న శ్మశాన వాటికలో 10.21 గంటలకు ఖననం చేశారు. ముందుగానే సమాధి స్థలం ఎంచుకున్న నయీమ్ నయీం మరణించడానికి ముందే తన సమాధి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. తన తండ్రి ఖాజా నసీరుద్దీన్, సోదరులు అలీమోద్దీన్, సమీ సమాధుల పక్కన తనను సమాధి చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఆ ప్రకారమే కుటుంబ సభ్యులు నయీం మృతదేహాన్ని సమాధి చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా అంత్యక్రియలు పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నయీమ్ అనుచరులు, మాజీ నక్సలైట్లు జనంలో కలసి అంత్యక్రియలకు రావొచ్చనే ఉద్దేశంతో పోలీసులు అనుమానితుల ఫొటోలు, వీడియోలు తీశారు. వారం పాటు గ్రామాల్లోకి వెళ్లొద్దు అధికార పార్టీ నేతలకు పోలీసుల హెచ్చరిక నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులెవరూ నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా భువనగిరి, మునుగోడు, న ల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో నయీమ్ అనుచరుల కదలికలు ఉంటాయనే అనుమానంతో అంతర్గతంగా ఈ హెచ్చరికలు చేసినట్లు సమాచారం. వారం రోజుల పాటు తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికార పార్టీ నేత లు కొందరు హైదరాబాద్‌కు పరిమితమైనట్లు సమాచారం. -
యాదాద్రి నూతన నమూనా
యాదాద్రి దివ్యక్షేత్రం ప్రధాన ఆలయం నూతన నమూనా సిద్ధమైంది. సీఎం కేసీఆర్.. యాదగిరిగుట్టను తిరుమల తరహా దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం సూచనల మేరకు కొండపైన ఆగమ, వాస్తు శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ ప్రణాళికలను తీర్చిదిద్దారు. ముందుగా తయారు చేసిన ప్రణాళికల్లో మార్పులు.. చేర్పులను సీఎం సూచించగా.. అందుకనుగుణంగా వైటీడీఏ అధికారులు తాజా ప్రణాళికలను రూపొందించారు. కొండపైన ప్రధాన ఆలయం, ఆలయ ప్రాంగణం, మాడవీధులు, రాజగోపురాలు, దివ్య విమాన గోపురం, ఎత్తై ఆంజనేయ విగ్రహం ఎక్కడెక్కడ ఉండాలో ప్రణాళిల్లో పొందుపరిచారు. నూతన నిర్మాణాల కోసం ఇప్పటికే కొండపైన నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు దక్షిణ దిశలో రిటైనింగ్ వాల్ నిర్మాణపు పనులు ప్రారంభించారు. మరో వైపు పెద్దగుట్టపై లేఅవుట్ ప్రకారం అభివృద్ధి చేస్తున్నారు. - భువనగిరి -
భువనగిరిలో ఆర్టీఏ కార్యాలయం
భువనగిరి : భువనగిరి కేంద్రంగా ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్ ఇతర శాఖల కార్యాలయాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించి ఎంపిక చేసిన అధికారులు తా జాగా ఆర్టీఏ ఆఫీస్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ స్థానిక అధికారులతో కలిసి మం గళవారం భువనగిరి శివారులో స్థలాన్ని పరి శీలించా రు. యాదాద్రి జిల్లాలో భువనగిరి కేంద్రంగా ఎంవీఐ కార్యాలయం పని చేయనుంది. ప్రస్తుత ప్రతి పాదనల ప్రకారం యాదాద్రిలో వరంగల్ జిల్లా జనగామ కలిస్తే భువనగిరి, అక్కడ ఉన్న ఆర్టీఏ కార్యాలయాలు రెండు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి. తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే.. ప్రస్తుతం జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పర్యవేక్షణలో నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏలు ఉం డగా, భువనగిరిలో ఎంవీఐతో సరిపెట్టారు. తాజాగా 3 జిల్లాల ప్రతిపాదనలు రావడంతో నల్లగొండ, సూర్యాపేటల్లో ఎంవీఐలతోనే కార్యాలయాలు కొనసాగించవ చ్చు. భువనగిరిలో మాత్రం ఎంవీఐ స్థానం లో ఆర్టీఏను నియమిస్తారు. ఇందుకోసం పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయానికి 3నుంచి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం భువనగిరి శివారులో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏ కార్యాలయాల పక్కా భవనాల కోసంప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. భువనగిరిలో కూడా స్థలం ఖరారైతే నిధులు మంజూరు అవుతాయి. అద్దెభవనంలో ఎంవీఐ కార్యాలయం భువనగిరిలోని ఎంవీఐ కార్యాలయం అద్దెభవనంలో నడుస్తోంది. చాలా కాలంగా సొంత భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. పలుమార్లు కార్యాలయూన్ని మార్చారు. ప్రస్తుతం నల్లగొండ రోడ్డులో కొనసాగుతోంది. కార్యాలయం స్థా యి పెరగడంతో సొంత భవనం నిర్మిం చడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. భువనగిరి శివారులో స్థల పరిశీలన.. ఆర్టీఏ కార్యాలయం భవనం స్థలం కోసం వడపరి,్త మోత్కూరు రోడ్డులో రవాణా శాఖ డిటీసీ ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. 3 నుంచి 5 ఎకరాల స్థలం కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెండు చోట్ల ఉన్న స్థలం వివరాలను రెవెన్యూ అధికారులు రవాణా శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు తమకు కావాల్సిన స్థలం వివరాలను తహసీల్తార్‌కు తెలియజేశామని డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. స్థలం ఖరారైతే భవనం నిర్మాణం చేపడతామని చెప్పారు. డీటీసీ వెంట ఎంవీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎంవీఐ నరేష్ ఉన్నారు. -
కట్నం కార్చిచ్చుకు.. తల్లీకూతురు బలి
పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన ఆ యువతికి రెండేళ్లకే కష్టాలు మొదలయ్యాయి. కట్నం కోసం భర్తపెట్టే చిత్రహింసలు తట్టుకోలేక పోయింది.. ఒంటిమీది ఆభరణాలను అమ్ముకున్నా ఓర్చుకుంది.. కడుపున పుట్టిన చిన్నారిని చూసుకుని బాధలను దిగమింగుకుంది.. ఇకనైనా మారతాడేమో అన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.. ఇక తాను లేని లోకంలో కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో అని.. మదనపడింది. చివరకు తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుని.. ఆరునెలల చిన్నారిని నీటిసంపులో వేసి..తాను అగ్నికి ఆహుతైంది. * కూతురిని నీటిసంపులో పడేసి..తాను అగ్నికి ఆహుతై.. * భువనగిరి మండలంలో విషాదం భువనగిరి: కట్నం కార్చిచ్చుకు..తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాదకర ఘటన భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్ర కారం.. భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన నల్లమాస వెంకటయ్య, లింగమ్మల కుమారుడు నల్లమాస భాస్కర్‌కు చౌటుప్పల్ మండలం తంగెడపల్లికి చెందిన చిక్కురి యాదగిరిస్వరూపల కుమార్తె మమత(22) తో 2014 ఏప్రిల్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న రూ.7.70 లక్షల వరకట్నంలో రూ.7.10 లక్షల వరకు నగదు,అభరణాలు, ఇతర వస్తువులను ము ట్టచెప్పారు. అయితే రెండున్నర సంవత్సరా లు అవుతున్నా కట్నం పూర్తిగా ఇవ్వలేదని ఆ డబ్బులు తేవాలని భాస్కర్ మమతను వే ధించసాగాడు. దీంతో పాటు భాస్కర్ కొంతకాలంగా పనిలేకుండా ఉన్నాడు. జేసీబీ ఆపరేటర్ అయిన భాస్కర్ ఏజీఐ గ్లాస్ఫ్యాక్టరీలో పనిచేస్తూ మానేశాడు. కొన్నినెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీం తోపాటు మమతకు చెందిన బంగారు అభరణాలను తాకట్టు పెట్టాడు. అలాగే మమతకు చెందిన బుట్టాలు అమ్మినట్లు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదల య్యాయి. ఈ నేపథ్యంలో బాకి ఉన్న మిగతా కట్నం డబ్బు తీసుకురావాలని మమతను వేధించసాగారు. బంగారం అమ్మిన విషయం మమత తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మాట్లాడడానికి వస్తామన్నారు. ఈ విషయంలోనే శనివారం రాత్రి దంపతులు గొడవ పడ్డారు. అందరూ నిద్రిస్తుండగా.. అందరు నిద్రిస్తున్న సమయంలో మమత తన కూతురు భానును నీళ్లసంపులో వేసింది. దీంతో చిన్నారి ఊపిరాడక చనిపోయింది. వెంటనే మరుగుదొడ్డిలోకి వెళ్లి కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు లేవడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మేలుకుని బయటకు వచ్చారు. అప్పటికే మమత తలభాగం నుంచి మంటలు పెద్దగా లేవడంతో పందిరికూడా అంటుకుంది. చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మంటల్లో కాలి చనిపోయింది. అనంతరం పాప కోసం వెతకగా సంపులో శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ అర్జునయ్య, ఎస్ఐ సాజిదుల్లాలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. మమత తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో భర్త భాస్కర్ ఈ సంఘటన జరిగిన వెంటనే మమత భర్త భాస్కర్ కన్పించకుండాపోయాడు.పోలీస్‌లు గ్రామానికి వచ్చి గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించారు. గ్రామస్తులను విచారించారు. నా కూతురును వేధించి చంపారు కట్నం కోసం తన కూతురుని వేధించడం వల్లే చనిపోయింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇచ్చాను. కొంత ఇవ్వాల్సి ఉంటే త్వరలో ఇస్తానని చెప్పాను. అయినా వినకుండా నా కూతురిని చిత్రహింసలు పెట్టడంతో తన కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. - చిక్కురి యాదగిరి మమత తండ్రి వేధింపుల వల్లే అత్తింటి వేధింపుల వల్లే మమత ఈ ఘాతుకానికి పాల్పడింది. కట్నం డబ్బుల కోసం భర్తభాస్కర్ తరుచు వేధించే వాడని తమ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. వేధింపుల కేసు నమోదు చేశాం. - అర్జునయ్య, భువనగిరి రూరల్‌సీఐ -
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
వడాయిగూడెం(భువనగిరి అర్బన్) : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వడాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను తీసుకోవాలన్నారు. త్వరలోనే వడాయిగూడెం గ్రామానికి బీటీరోడ్డును వేస్తామన్నారు. మండలంలోని సూరేపల్లి గ్రామంలో మిషన్‌కాకతీయ రెండవ విడుత పనులను ప్రారంభించారు. అలాగే బొల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆడ్మిషన్లు పొందే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోట పెద్దస్వామి, అబ్బగాని వెంకట్‌గౌడ్, గోద శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌పవన్, రఘురామయ్య, సింగిల్‌విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు డాక్టర్ జడల అమరేందర్, పట్టణ, మండలశాఖ మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, నోముల పరమేశ్వర్‌రెడ్డి, చిందం మల్లికార్జున్, జనగాం పాండు, మొలుగు లక్ష్మయ్య, పుట్ట వీరేష్, బబ్బూరి శంకర్‌గౌడ్ , తదితరులు ఉన్నారు. సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పగిడిపల్లి గ్రామ సర్పంచ్ కట్కూరి భాగ్యమ్మ నివాసానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బుధవారం వెళ్లారు. ఈ నెల 8న జరిగిన దాడి విషయంపై సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఆమె కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని శృతినగర్లో జరుగుతున్న ప్రముఖ న్యాయవాది నాగారం అంజయ్య తండ్రి అంత్యక్రియలకు హాజరై మృతదేహంపై పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్‌గౌడ్, రావి సురేందర్‌రెడ్డి, మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, మొలుగు లక్ష్మయ్య, అంజనేయులు, నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. -
ఇక ఒక్కరోజే..
భువనగిరి : మహిమాన్విత స్వయంభు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఒక్క రోజే మిగిలింది. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి క్రతువులో భాగంగా ఈ నెల 21 నుంచి స్వయంభువుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. వేల ఏళ్లక్రితం కొండ గుహలో వెలిసిన పంచనారసింహులను ద ర్శించుకోవడానికి అనుమతించరు. నూతనంగా నిర్మించిన బాలాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్ఠింప జేసే కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు మంగళవారం బాలాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవాలయ విస్తరణ పనులు పూర్తయ్యే వరకూ భక్తులు బాలాలయంలోనే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలి. ఈమేరకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను సంతృప్తి పరిచే విధంగా.. ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవతామూర్తుల దర్శనం ఏవిధంగా ఉంటుందో అదేవిధంగా బాలాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గుహాలయం మాదిరిగా బాలాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. తూర్పు దిక్కునుంచి స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం మాదిరిగానే ఆండాల్ అమ్మవారి అల యం నిర్మించారు. రామానుజ కూటమి, స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి బాలాలయంలోనే స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉంటాయని ఇప్పటికే విస్తృతంగా జరిగిన ప్రచారం నేపథ్యంలో ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు ఎగబడ్డారు. బాల ఆలయంలో చినజీయర్ స్వామి ఆధ్వర్వంలో ఉత్సవ మూర్తులకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. -
పున్నమి రోజున పింక్మూన్
21వ తేదీ రాత్రి 10.54 నిమిషాల నుంచి 22న ఉదయం 3.42 నిమిషాల వరకు అద్భుత దృశ్యం కన్పించే అవకాశం భువనగిరి : చంద్రుడు అంతరిక్షంలో పింక్ మూన్‌గా కన్పించే అరుదైన సంఘటన జరగనుందని బహ్రశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చెబుతున్నారు . వివరాలు ఆయన మాటల్లోనే.. భారత దేశం మొత్తంలో ఈనెల 21వతేదీ పున్నమి రోజు రాత్రి 10.54 నిమిషాల నుంచి 22 వ తేదీ ఉదయం 3.42 నిమిషాల వరకు ఈ అద్భుత దృశ్యం కన్పించనుంది. రాత్రి 1.24 గంటల నుంచి 12 నిముషాల పాటు చంద్రుడు పూర్తిగా గులాబీరంగులోకి మారుతాడు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీలలోపు మేష రాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల్లో చిత్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధమైన పింక్ మూన్ వస్తుంది. ఇది ఏఫ్రిల్ మాసంలోనే వస్తుంది. అలాగని ప్రతీ ఏప్రిల్ నెలలో మాత్రం రాదు. రెండు మూడు సంవత్సరాలకోసారి వస్తుంది. విదేశీయులు దీన్ని గ్రహణంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడి కిరణాలు సోకగానే ప్రతి జీవిలో కొత్త చైతన్యం కలుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. సముద్రంలో ఉండే జీవజాలం కూడా ఉత్సాహంగా ఉంటుంది. పింక్ కలర్లో చంద్రుడు రావడం శుభసూచకం. గతంలో 2009, 2014 సంవత్సరాల్లో ఏప్రిల్‌లో వచ్చింది. ఇక 2016 ఏప్రిల్ మాసంలో వస్తుంది. మళ్లీ 2018 లో పింక్ మూన్ వస్తుంది. ఈ శుభ సమయంలో ఏ చిన్న పుణ్య కార్యం సంకల్పించినా వెరుు్యరెట్లు అధికంగా లాభం చేకూరుతుందని బృహత్ సంహితలో చెప్పారు. చంద్రుడు ఆహ్లాదకరమైన మనస్సుకు సంకేతమైన వాడు కాబట్టి పింక్మూన్ దర్శనమిస్తున్నసమయం మేషంలో సూర్యుడు, తులలో చంద్రుడు కన్పిస్తున్నాడు. కాబటి చంద్రుడు నీటికి, వృక్షాలకు, ఔషధాలకు నెలరాజు. అందువల్ల పాలకులు వరుణ యాగాలు చేయడం, సామాన్యులు నీటిని దానం చేయడం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది పూర్తి శుభ సూచకం ఎలాంటి పనులు చేపట్టినా అతిశీఘ్రంగా ఫలిస్తాయి. ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అందరు పింక్ మూన్ ను దర్శించుకోవచ్చని అని సిద్ధాంతి సూచిస్తున్నారు. -
అధికారుల పేరుతో వసూళ్లు
భువనగిరి: ‘మీ వెంచర్ మీద ఫిర్యాదులు వచ్చాయి.. కలెక్టర్ సీరియస్‌గా ఉండు.. నేను రిపోర్టు పంపానో మీ వెంచర్ మూసుకోవాల్సిందే.. వెంటనే వచ్చి కలుస్తావా లేదా నీ ఇష్టం..’ ఓ వెంచర్యజమానికి గ్రామస్థాయి అధికారి ఫోన్లో హెచ్చరిక...‘మీ గ్రామంలో వెంచర్ అయ్యింది.. అతను సర్పంచ్‌నే కలిశాడు.. వార్డు సభ్యులను కలువలేదు.. మీరు వెంటనే అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి.. ఆపై అంతా నేను చూసుకుంటా..’ ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఆ గ్రామ అధికారి ఉద్బోధ... ఇదీ భువనగిరి డివిజన్లో ప్రస్తుతం నెలకొన్న రియల్ దందా తీరు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి,భువనగిరి, ఆలేరు, బీబీనగర్ మండలాల్లో అత్యధికంగా నూతన వెంచర్లు వెలిశాయి. యాదగిరిగుట్ట అభివృద్ధిని బూచిగా చూపి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వెలుస్తున్నా యి. కనీసం గ్రామ పంచాయతీ దరఖాస్తు కూడా చేసుకోకుండా వెంచర్ల యజ మానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్ డీపీఓ వంటి అధికారులు ఎప్పటికప్పుడు అక్రమాలపై వేసిన నిఘా క్షేత్రస్థాయి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమ వెంచర్ల వివరాలను సేకరించాలని చెబితే కొందరు ఉద్యోగులు రియల్టర్లతో బేరసారాలు పెట్టారు.ఫలితంగా ఉన్నతాధికారుల పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం భువనగిరిలో డి విజన్స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్ల వివరాలు సేకరించి వాటిని తొలగించాలని చెబితే తన పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారట ఈ విషయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో చిచ్చు పెడుతున్న వెంచర్లు గ్రామ పంచాయతీ పరిధిలో విచ్చల విడిగా ఏర్పాటవుతున్న వెంచర్లలో అధికారుల పాత్ర క్రియాశీలకంగా మారింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్- వార్డు సభ్యుల మధ్యన వెంచర్ల విషయంలో తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వార్డు సభ్యులకు అక్రమ వెంచర్ల వివరాలను గ్రామ స్థాయి అధికారులు అందించడంతో వివాదాలను మధ్యవర్తులుగా ఉండి సర్దుబాటు చేస్తున్నారు. అక్రమ వెంచర్ల విషయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్యవివాదాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్తున్నాయి. భువనగిరి మండలం రాయిగిరిలో వెలిసిన 400 ఎకరాల వెంచర్‌కు అనుమతి విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్- వార్డు సభ్యుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. నూతన వెంచర్లు వెలిసిన చోటే.. నూతన వెంచర్లు వెలిసినచోటే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుఎన్ని నిబంధనలు జారీ చేసినా టాస్క్‌పోర్స్ అధికారులు అక్రమ వెంచర్లు గుర్తించి నోటీస్‌లు జారీ చేసినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అండదండలతో పేర్లు మార్చి కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. యాదగిరిగుట్ట, రాయగిరి, వడాయిగూడెం, సైదాపురం, వంగపల్లి, పెద్ద కందుకూరు వంటి గ్రామాల్లో రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో పలు వివాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటి వారిని ఊపేక్షించం, ఎన్. మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి రియల్ వ్యాపారుల మోసాలకు ఆసరాగా నిలిచే ఉద్యోగులను ఊపేక్షించం. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారిపై నిఘాపెట్టాం. వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోం. అన్ని అనుమతులు తీసుకునే విషయంలో స్థానికంగా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమతులు లేని వెంచర్లను తొలగించాలి. -
వ్యక్తి దారుణ హత్య
భువనగిరి : పట్టణంలోని బాహార్‌పేటకు చెందిన పొట్టేటి పోశయ్య(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణ శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య పట్టణంలోని ఇసుక ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం ఉదయం నుంచి ఇంటి వద్దే ఉన్న పోషయ్యకు మధ్యాహ్నం సమయంలో పలుమార్లు ఫోన్లు రావడంతో 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన పోశయ్య రాత్రి వరకు రాకపోవడంతో భార్య స్వప్న 7.30 గంటలకు ఫోన్ చేసింది. ఎవరూ మాట్లాడకపోగా వాహనాల చప్పుడు వినపడింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం రావడం తో అనుమానం వచ్చిన స్వప్న తెలిసిన వారితో గాలించింది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం సింగన్నగూడెం కాలనీ సమీపంలోని వ్యవసాయబావి వద్ద పోశయ్య మృతదేహం పడి ఉన్నట్టు కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతితోపాటు ఎస్ఐలు భిక్షపతి, హన్మంత్లాల్లు సంఘటన స్థలంలో పంచనామా నిర్వహిం చారు. సంఘటన జరిగిన తీరు చూస్తే ఎవరో పిలిపించి పోశయ్యపై దాడిచేసి తలపై రాల్లతో మోది కట్టెలతో కొట్టి హత్య చేసినట్లు రూరల్ సీఐ తిరుపతి గుర్తించారు. దాడి చేసిన అనంతరం కట్టెలు, రాళ్లను పక్కనే ఉన్న వరి పొలంలో పడవేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకునేందుకు నల్లగొం డ నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి పరిశీ లన చేశారు. జాగిలాలు బైకు దగ్ధం చేసి న సంఘటనలో తిరుగగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుని తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పట్టణ ఎస్ఐ సతీష్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ తెలిపారు. -
ధరలకు రెక్కలు
రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు భూములకు భలే డిమాండ్ రోడ్డు వెంట రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు చేరిన ఎకరం ధర యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటే కారణం భువనగిరి : జాతీయ రహదారి 163 విస్తరణ భూసేకరణ పనులు వేగవంతం కావడంతో రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు రోడ్డు వెంట గల భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. హెచ్ఎండీఏ, వైటీడీఏ (యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి) పరిధిలో గల భువనగిరి మండలం రాయగిరి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలాలకు అనుసంధానంగా జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల రూ.384 కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణ పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గుట్టకు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రూ.పది లక్షల లోపు ఉన్న భూముల ధరలు అమాంతం ఆయా ప్రాంతాన్ని బట్టి నాలుగింతలు పెరిగాయి. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సీఎం కేసీఆర్ పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఒక్కసారి పరిశ్రమల యజమానులు, రియల్టర్లు రోడ్డు వెంట గల భూములతోపాటు ఆయా ప్రాంతాల్లోని 15 కిలోమీటర్ల వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ రియల్టర్లతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన వ్యాపారం బీబీనగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, జనగాం వరకు ప్రధాన రహదారి వెంట ఎకరం ధర రూ.20 నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ప్రాంతంలో అధికమైనప్పటికీ గతంలో రాజీవ్ రహదారి, బెంగుళూరు రోడ్డు, శ్రీశైలం, ముంబాయి రహదారి వెంట ఎకరం ధర కోట్లలో పలుకుతుండడంతో సహజంగానే కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక కారిడార్లోకి రాష్ట్రరాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక జోన్లోకి చేరింది. నగరంలోని పరిశ్రమలు 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా భువనగిరి డివిజన్లో భూములపై కన్నెయడంతో అమాంతం ధరలు పెరిగాయి. డివిజన్ పరిధిలోకి వచ్చే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరిగాయి. మారుమూల మండలాల్లో రూ.వేలల్లో పలికే ఎకరం భూమి ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరింది. జాతీయ రహదారి పరిధి విస్తరించడం, రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి ప్రాంతం వరకు రాజధాని నుంచి రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉండడం భూముల కొనుగోలు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ - ఖాజీపేట, బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాలు భువనగిరి డివిజన్ మీదుగా వెళ్తుండడం, పలు రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుకావడం అనుకూలాంశం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భువనగిరికి 70 కిలోమీటర్ల లోపు ఉండడం, అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. ఎన్ఆర్ఐల ఆసక్తి విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ గల వారి తల్లిదండ్రులు భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి వాటిలో ఫామ్‌హౌస్‌లు, పండ్ల తోటలు, డెయిరీలను స్థాపిస్తున్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. మరికొందరు అధికారులు, బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి భూముల కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యు ప్రకారం వేలల్లో ఉంటున్న ధర వాస్తవ రేటు లక్షలు పలుకుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది ఎకరాల భూములు కొంటున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ధర ఉండడమే ఇందుకు కారణం. దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్‌మనీ చేతులు మారుతోంది. సామాన్యుల చేజారుతున్న భూములు హైవే వెంట ఎకరం ధర లక్షల్లో పలుకుతుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పేదలు తమ అవసరాల కోసం అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో పేద రైతులు భూములను కోల్పోతున్నారు. తిరిగి కొనుగోలు చేయాలన్నా వారికి భూ ముల ధరలు అందనంతదూరంలోకి వెళ్తున్నాయి. -
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
-
నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
నల్లగొండ జిల్లాలో 4 రోజులపాటు పర్యటన ⇒ ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 కుటుంబాలకు పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు. శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో పరామర్శ యాత్ర చేపట్టేందుకు మంగళవారం ఉద యం 9.30కు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ లోని తమ నివాసం నుంచి బయలుదేరుతారు. బుధవారం నుంచి యాత్ర ఇలా.. బుధవారం ఉదయం ఆలేరు నియోజకవర్గం లోని శారాజీపేటలో ఎదుల్ల శ్రీనివాస్ కుటుం బాన్ని షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గం పల్లెపహాడు, మోత్కూరు మీదుగా పొడిచేడు చేరుకుని దీటి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలుసుకుం టారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మీదుగా సిరిపురం చేరుకుని పున్న వీరయ్య కుటుంబాన్ని, కట్టంగూరు టౌన్లో గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత నకిరేకల్‌లోని మర్రూరుకు చేరుకుని పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకుంటారు. ఇక గురువారం ఉదయం నకిరేకల్ నియోజకవర్గ భీమారంలో నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ నియోజకవర్గం ఇందుగులకు చేరుకుని రాయించు నర్సింహ కుటుంబా న్ని, తిప్పర్తిలో గుంటి వెంకటేశం, చందనపల్లిలో చింతా భిక్షయ్య కుటుంబాన్ని, నల్లగొండ టౌన్లో బాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలుసుకుంటారు. శుక్రవారం ఉదయం కనగల్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూల మాల వేసి యాత్ర కొనసాగిస్తారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లికి చేరుకుని ఆస్తర్బీ, తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాలను, తర్వాత చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిగ్ర వసంతరావు కుటుం బాన్ని పరామర్శిస్తారు. బీబీనగర్ వద్ద ప్రారంభం.. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ టోల్గేట్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి.. పరామర్శ యాత్రను ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యద ర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘బీబీనగర్‌లోని వెంకిర్యాలలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాఘవాపురం, చిన్నరావులపల్లి, ఎర్రంబెల్లి, గౌస్‌నగర్ మీదుగా కంచనపల్లికి చేరుకుని అక్కడ కొలిచెల్మి అంజయ్య కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. భోజన విరామం అనంతరం బండ సోమారం, చాడ ఎక్స్‌రోడ్ మీదుగా ముస్త్యాలపల్లి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు’’ అని వివరించారు. -
నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
బీబీనగర్ మండలం నుంచి ప్రారంభం టోల్గేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న వైఎస్ షర్మిల నాలుగు రోజులపాటు సాగనున్న యాత్ర 18 కుటుంబాలకు ఓదార్పు భువనగిరి : తన తండ్రి మరణం తట్టుకోలేక జిల్లాలో గుండెపగిలి మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోస్థైర్యం కల్పించేందుకు రాజన్న బిడ్డ షర్మిల మలివిడత పరామర్శ యాత్ర మంగళవారంనుంచి ప్రారంభంకానుంది. 6 నియోజకవర్గాల్లో 18 మంది కుటుంబాలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకోనున్నారు. వారికి తమ కుటుం బం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మలి విడత పరామర్శ యాత్ర మంగళవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానుంది. భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 12వ తేదీన మునుగోడు నియోజవర్గం చౌటుప్పల్‌లో ముగుస్తుంది. భువనగిరి, అలేరు. తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజవర్గాల్లో 18 కుటుం బాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణం తట్టుకోలేక జిల్లాలో 49 మంది చనిపోయారు. అందులో 32 కుంటుంబాలను గతంలోనే ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే. షర్మిల పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌నుంచి బయలుదేరుతారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి అక్కడినుంచి పరామర్శయాత్రకు వెళతారు. తొలిరోజు బీబీనగర్ మండలం వెంకిర్యాలలో గల చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడినుంచి వలిగొండ మండలం కంచనపల్లికి వెళ్లి కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని, భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన కల్లెం నర్సయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. ఇక్కడితో మూడు కుటుంబాల పరామర్శ పూర్తవుతుంది. ఇక్కడితో భువనగిరి నియోజకవర్గం యాత్ర పూర్తవుతుంది. ఆనంతరం ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. ఆలేరులో రాత్రి బస చేస్తారు. మలివిడత పరామర్శ యాత్రలో కలిసే కుటుంబాలు.. భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలం వెకిర్యాల గ్రామానికి చెందిన చెర్కు కిష్టయ్యగౌడ్ కుటుంబ ం వలిగొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన కొలిచెల్మి అంజయ్య కుటుంబం భువనగిరి మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన కళ్లెం నర్సయ్య కుటుంబ ం ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఎదుల్ల శ్రీనివాస్ కుటుంబం యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లి గ్రామానికి చెందిన చింతల కృష్ణ కుటుంబ ం యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి గ్రామానికి చెందిన ఎ.చంద్రమ్మ కుటుంబం తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామానికి చెందిన బీతి నర్సమ్మ కుటుంబం నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న వీరయ్య కుటుంబం కట్టంగూరు మండలంలోని కేంద్రం గ్రామానికి చెందిన గాదగోని రాములు కుటుంబం నకిరేకల్ మండలంలోని మర్రూర్ గ్రామానికి చెందిన పుట్ట సైదులు నెమ్మాది శేఖర్ కుటుంబం నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన చింతా భిక్షమయ్య కుటుంబం తిప్పర్తి మండలం కేంద్రానికి చెందిన గుంటి వెంకటేశం కుటుంబం తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన రాయించు నర్సింహ కుటుంబం నల్లగొండ పట్టణంలో దండేకార్ దయానంద్ కుటుంబం మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడెం మండలం తాన్‌దార్‌పల్లి గ్రామానికి చెందిన మునగాల పుల్లమ్మ కుటుంబ ం నాంపల్లి మండలం నాంపల్లికి చెందిన అస్తర్బీ కుటుంబం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బిట్ర వసంతరావు కుటుంబ ం. పరామర్శ యాత్ర తొలిరోజు షెడ్యూల్.. మొదట గూడూరు టోల్గేట్ వద్దగల వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు. బీబీనగర్ మండలం వెంకిర్యాలలో చెర్కు కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. వలిగొండ మండలం కంచనపల్లిలో కొలిచెల్మి అంజయ్య కుటుంబాన్ని కలుసుకుంటారు. భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాలను పరామర్శిస్తారు. -
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలి
భువనగిరి అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషించనుందన్నారు. రాష్ర్టంలో అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు, కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ప్రతి మండలం, పట్టణంలో పార్టీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.రయాజ్అహ్మద్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాలెంల మధు, పట్టణ అధ్యక్షుడు చల్లగురుగుల రఘుబాబు, యూత్ విభాగం పట్టణ అధ్యక్షుడు బబ్బూరి నరేష్‌గౌడ్, వలిగొండ మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, నాయకులు పాక శేఖర్‌యాదవ్, కంసాని రాజేష్, క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు. ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం యాదగిరిగుట్ట : ప్రజా సమస్యలపై అలుపెరుగని రీతిలో పోరాటాలు ముమ్మరం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం గుట్టలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని, వాటిని కొనసాగించాల్సిన అవసరం నేటి ప్రభుత్వాలకు ఉందన్నారు. త్వరలో జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. అనంతరం పార్టీ గుట్ట, ఆలేరు మండలాల నూతన అధ్యక్షులుగా గుండు భార్గవ్, కొత్తోజు నర్సింహాచారిలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వడ్లోజు వెంకటేశ్, వేముల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అద్యక్షుడు బాలెంల మధు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఫయాజ్ అహ్మద్, పార్టీ జిల్లా కార్యదర్శి బండ్రు ఆంజనేయులు, నాయకులు సతీష్‌రాజ్, బండారు హరిప్రసాద్, మాలోతు శ్రీను నాయక్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎంపీ
భువనగిరి : పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఎంఆర్ఆర్, సీఆర్ఆర్, పీఎంజీఎస్‌వై, నాబార్డు రోడ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడాఉతూ ప్రభుత్వం గ్రామీణరోడ్ల అభివృద్ధికి నిధులను కేటాయించిందని వాటిని సకాలంలో ఖర్చు చేసిన నాణ్యతకు లోటు రాకుండా పూర్తి చేయాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఈఈలు వెంకటరమణ, డీఈలు పాల్గొన్నారు. -
యాదాద్రి పాలక మండలికి నోటిఫికేషన్
భువనగిరి : ఆరు సంవత్సరాలుగా అడ్రస్‌లేకుండా పోయిన యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే వలిగొండ మండలంలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి పాలక మండలి సభ్యుల నియామకానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. యాదగిరిగుట్ట ధర్మ కర్తల మండలి పదవీ కాలం 2009 నవంబర్ 18 న ముగిసింది. అయితే గత ప్రభుత్వంలో అడ్రస్‌లేకుండా పోయిన పాలకవర్గ నియామకం కోసం ఫిబ్రవరి 14 న జీఓనంబర్ 221ని జారీ చేశారు. దీని ఆధారంగా శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజులలోపు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం వాటిని పరిశీలించి ధర్మకర్తలను నామినేట్ చేస్తుంది. సేవాగుణం, సచ్చీలత ఆధారంగానే.. నిజాం కాలం నుంచి ధర్మకర్తల నియామకం ప్రారంభమైంది. 1966లో దేవాదాయ చట్టం రూపొందించారు. ఈ ఆలయానికి వంశపారం పర్య ధర్మకర్త పాలకమండలి చైర్మన్‌గా ఉంటారు. అందువల్ల ఈ చట్టం ప్రకారం మరో 8మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం వైటీడీఏ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ తనే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే దేవస్థానం ధర్మకర్తల మండలి ఎంపిక కూడా ఆయనే స్వయంగా చేయనున్నారు. ఈ విషయంలో ఆధ్యాత్మికత, సేవాగుణాలు, సచ్చీలత వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒక ధర్మ కర్త స్థానాన్ని ఎస్సీ,ఎస్టీ, బలహీనవర్గాలకు తప్పనిసరి కేటాయించాలి. వీరి పదవీ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. ధర్మకర్తల ఎంపికలో ఇద్దరు స్థానికులను నియమించే అవకాశం ఉంది. మిగతా ఆరు స్థానాలను మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా నియమించే అవకాశం ఉంది. సీఎం వైటీడీఏ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిపెట్టి నందున ధర్మకర్తల నియామకంపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారనడంలో సందేహం లేదు. పూర్తిగా నామినేటెడ్ పదవులు అయినప్పటికీ ఆ పదవికి మరింత గౌరవాన్ని తెచ్చే వారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ధర్మ కర్తల నియామకంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. పైరవీలు ముమ్మరం ధర్మకర్తల నియామకం కోసం నోటిఫికేషన్ రావడంతో ఔత్సాహికుల్లో ఆసక్తి పెరిగింది. తమకు ధర్మకర్త పదవి ఇప్పించాలని పలువురు పైరవీలు ముమ్మరం చేశారు. మరో 20 రోజులు ఉండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
వివాహిత బలవన్మరణం
పచ్చర్లబోడుతండా(భువనగిరి అర్బన్): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని పచ్చర్లబోడుతండాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పచ్చర్లబోడుతండా గ్రామానికి చెందిన మేగావత్ సర్థార్‌కు 15 సంవత్సరాల క్రితం మీటితండాకు చెందిన బుజ్జమ్మతో వివాహం జరిగింది. మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. సర్థార్‌నాయక్ 12 ఏళ్ల క్రితం బొమ్మలరామారం మండలానికి చెందిన మేగావత్ పద్మ(28)ను వివాహం చేసుకున్నాడు. వీరికి 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇదిలా ఉండగా మేగవత్ సర్థార్ కొన్ని రోజులుగా మొదటి భార్య బుజ్జమ్మతో సఖ్యతగా ఉంటున్నాడు. ఈ విషయం పద్మకు తెలియడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సర్థార్ ఎంత చెప్పినా వినకపోవడంతో పద్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామ సమీపంలోని ఓవ్యవసాయ బావిలో దూకింది. కల్లాపి చల్లడానికి పేడ తీసుకువస్తానని వెళ్లిన పద్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఓ వ్యవసాయ బావి వద్ద ఆమె చెప్పులు, పేడ జబ్బ కనపించింది. వెంటనే బావిలోకి దిగి చూడగా అప్పటికే పద్మ మృతిచెందింది. ఈ మేరకు సంఘటన స్థలం వద్ద రూరల్ పోలీసులు శవ పంచానమా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు రూరల్ ఎస్ఐ నర్సింగ్‌రావు తెలిపారు. -
పురిటిబిడ్డల తారుమారు ..!
భువనగిరి: ఆపరేషన్ థియేటర్ నుంచి తెచ్చిన పురిటిబిడ్డను అప్పగించడంలో జరిగిన పొరపాటు నాలుగు గంటల పాటు పెద్ద వివాదాన్ని సృష్టించింది. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు పురిటి బిడ్డలు తారుమారు కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్, పోలీస్‌ల జోక్యంతో వివాదం తాత్కాలికంగా శాంతించింది. డీఎన్ఏ,రక్తపరీక్షలు నిర్వహిస్తామని నచ్చచెప్పడంతో సుమారు నాలుగుగంటల తర్వాత పసికందులు తల్లిపాలకు నోచుకున్నారు. బంధువులు శాంతించారు. భువగిరి ఏరియా ఆస్పత్రిలో కాన్పుకోసం మండలంలోని వడపర్తికి చెందిన నల్లా దీపిక, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన కనకలక్ష్మిలు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వీరికి డాక్టర్ కోట్యానాయక్, డాక్టర్ శ్రీదేవి శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. ఇందులో 12-34 గంటలకు దీపికకు మగ బిడ్డ జన్మించగా, 12.21 నిముషాలకు కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరికి తొలికాన్పు కావడంతో వారి బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిబ్బ ంది ఇస్తారమ్మ కనకలక్ష్మికి మగబిడ్డను అప్పగించింది. దీపికకు ఆడబిడ్డను అప్పగించింది. ఇంతలో డాక్టర్ వచ్చి దీపికకు మగబిడ్డ, కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించిందని చెప్పాడు. పొరపాటు జరిగిన విషయాన్ని చెప్పడంతో కనకలక్ష్మి కుటుంబ సభ్యులు మాకు మగబిడ్డ జన్మించాడని ఆస్పత్రిలో కావాలని ఇలా చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఆడబిడ్డను తీసుకోవడానికి వా రు నిరాకరించారు. దీంతో పరిస్థితి కొంత మేరకు ఉద్రిక్తంగా మారింది. మగబిడ్డను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. డాక్టర్ కోట్యానాయక్ పట్ల దురుసుగా మాట్లాడడంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మళ్లి ఆస్పత్రికి వచ్చి ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. ఏ తల్లికి ఎవరు జన్మిం చారో తనకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. అయితే మీరు నమ్మకపోతే డీఎన్ఏ,రక్తం, పాదాలు, చేతి వేళ్లు, సమయం పరిక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందని చెప్పారు సాయంత్రం 4.20 గంటల వరకు మగబిడ్డను పొందిన కనకలక్ష్మి కుటుంబానితో డాక్టర్ చర్చలు జరిపారు. చివరికి పట్టణ ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వర కు రికార్డుల ప్రకారం ఎవరి బిడ్డను వారికి అప్పగించాలని డాక్టర్‌కు సూచించారు. కనకలక్ష్మికి ఆడబిడ్డను, దీపికకు మగబిడ్డను అప్పగించారు. దీంతో నాలుగు గం టల పాటు సాగిన వివాదం నిలిచిపోయింది. సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం ఆపరేషన్ థియేటర్ నుంచి పురిటి బిడ్డలను తెచ్చి ఇవ్వడంలో ఇంతటి వివాదానికి కారణమైన సిబ్బంది ఇస్తారమ్మపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ కోట్యానాయక్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఎవరి సంతానాన్ని వారికి అప్పగించడం జరుగుతుందని చెప్పారు. నాలుగు గంటల పాటు పాలు లేక.. పుట్టిన బిడ్డకు వెంటనే పాలు ఇవ్వాల్సి ఉండగా వివాదంతో నాలుగు గంటలపాటు పురిటిబిడ్డలు తల్లిపాలకు నోచకోలేకపోయారు. వివాదం తేలేవరకు వారికి పాలు ఇవ్వకపోవడంతో ఒక దశలో ఏడ్వడం మొదలు పెట్టా రు. తల్లులు సైతం తమ కన్నబిడ్డలకు పాలు ఇవ్వలేక న రకయాతన అనుభవించారు. ఒక సారి పాలు ఇవ్వడం జరిగితే వివా దం మరింత పెద్దదౌతుందని ఆస్పత్రిలో భావిం చారు. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిన వెంటనే తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చారు. -
అడ్డొస్తున్నాడనే...
వివాహేతర బంధం సాగకుండా ఒకరికి.. రాజకీయంగా మరొకరికి ఆయన అడ్డొస్తున్నాడు.. గ్రామంలో పెద్ద మనిషిగా రోజురోజుకూ గుర్తింపు పొందుతున్నాడు.. ఇది వారు జీర్ణించుకోలేకపోయారు.. అదునుకోసం చూశారు.. వ్యవసాయబావి వద్ద పాలుపితుకుతుండగా.. కళ్లలో కారం చల్లి.. ఆపై వేటకొడవళ్లతో దారుణంగా నరికి ఆ పెద్ద మనిషిని హత్య చేశారు.. ఇవీ మోత్కూర్ మండలం రాగిబావికి చెందిన పుట్ట ప్రభాకర్‌రెడ్డి హత్యోందం వెనుక ఉన్న కారణాలు.. - భువనగిరిటౌన్ మోత్కూర్ మండలం రాగిబావిలో ఈ నెల 8వ తేదీన జరిగిన పుట్ట ప్రభాకర్‌రెడ్డి(50) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి నిందితుల వివరాలు, కారణాలు, హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు. గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన జక్కుల యాదయ్య భార్య ఆరు సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో అతడు అదే గ్రామానికి చెందిన పద్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు యాదయ్యను ఈ విషయం హెచ్చరించాడు. తన సంబంధం కొనసాగకుండాప్రభాకర్రెడ్డి అడ్డొస్తున్నాడని యాదయ్య అతడిపై కక్ష పెంచుకున్నాడు. రాజకీయంగా అడ్డు తగులుతున్నాడని.. అదే గ్రామానికి చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభాకార్రెడ్డికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి కూడా అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే క్రమంలో యాద య్య పంచాయతీ తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి అతడికి డబ్బు ఎర వేశాడు. ప్రభాకర్‌రెడ్డి హత్య చేస్తే రూ. 20 వేలు ఇస్తానని, కేసు ఖర్చులు భరిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని లో భాగంగా రూ. 15 వేలు ముట్టజెప్పాడు. కాంట్‌లో కారం చల్లి.. అదును కోసం ఎదురుచూస్తున్న యాదయ్య ఈ నెల 8వ తేదీన తెల్లవారుజామున ప్రభాకర్‌రెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే పద్మను తీసుకుని అక్కడికి వెళ్లాడు. పాలుపితుకుతున్న ప్రభాకర్‌రెడ్డి వద్దకు తొలుత పద్మ వెళ్లి మాటలు కలిపి కంట్లో కారం చల్లింది. వెంటనే యాదయ్య వెళ్లి వేటకొడవలితో నరికి అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానం రాకుండా.. ప్రభాకర్‌రెడ్డిని హత్య చేస్తే తనపైనే అనుమా నం వస్తుందని శ్రీనివాస్‌రెడ్డి భావించాడు. దీంతో తన గడ్డివామును యాదయ్యతో తగులబెట్టించాడు. శ్రీనివాస్‌రెడ్డి గ్రామంలో జరుగుతున్న విషయాలను యాదయ్యకు ఎప్పటికప్పుడూ చేరవేస్తున్నాడు. పోలీసుల విచారణలో.. ప్రభాకర్‌రెడ్డి హత్య అనంతరం యాదయ్య పరారీలో ఉండడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పద్మను అదుపులోకి తీసుకుని విచారించాడు. దీంతో హత్యోదంతం వెనక ఉన్న కారణాలు అన్నీ వెల్లడైనట్టు డీఎస్పీ వివరించారు. పక్కా సమాచారం మేరకు యాదయ్యను రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో వ్యవసాయం బావి వద్ద, నల్లగొం డలో కుమారుడి ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిదింతులను పట్టుకోవడం కోసం ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం పోలీస్ సిబ్బంది అంజనేయులు, జానికిరాములకు రివార్డు కింద ఒక్కొక్కరికి రూ 5వేలు చొప్పున డీఎస్పీ అందజేశారు. సమావేశంలో భువనగిరి పట్టణ సీఐ సతీష్‌రెడ్డి, రూరల్ సీఐ తిరుపతి, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, యాదగిరిగుట్ట సీఐ శంకర్‌గౌడ్, మోత్కూర్ ఎస్సై పురేందర్‌భట్‌లు పాల్గొన్నారు. -
న్యూ ‘ఇయర్’ రూల్స్..!
భువనగిరి/ కోదాడటౌన్ : నవ వసంతానికి స్వాగతం పలికేందుకు యువత ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అయితే ఆనందంగా గడుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నిండాకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ కొన్ని సూచనలు చేసింది. హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇంకెవరైనా సరే.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలంటే ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త నిబంధనలు పాటించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ముం దస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి రూ.3వేల ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా వేడుకలను నిర్ణీత సమయం వరకే నిర్వహించాల్సి ఉంటుంది. అనుమతులు కోసం ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపి వారి ఆమోదం పొందిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై మోటార్‌సైకిళ్లతో విన్యాసాలు చేస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. వేడుకల పేరుతో శ్రుతిమించి వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజున హోటళ్లు, మ ద్యం దుకాణాలను రాతిర11 గంటల వరకు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న వారు కూడా తమతమ ప్రదేశాల్లోనే ప్రశాం తంగా వేడుకలను నిర్వహించాలని, అనుమతి ఉన్న సమయం లోపే వాటిని ముగించాలని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలి : మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, కోదాడ ఈవెంట్ ఆర్గనైజర్లు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించినా, అందులో మద్యం వినయోగించినా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రూ. 3 వేలు చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాటించాల్సిన నిబంధనలు... బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు. డిసెంబర్31 వతేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. {పజలకు ఆటంకం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలి. అనుమతి పొందిన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి. తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తే తగిన పటిష్టత ఉందంటూ,అధికారు ల వద్ద అనుమతి పత్రం పొందాలి. వేడుకల్లో భాగంగా మద్యం ఇచ్చేలా ఉంటే దానికి సంబంధించిన అనుమతిని పొందాలి. హోటళ్లు, ఫాంహౌస్‌లకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ముఖ్యైమైన ప్రాతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోటళ్లు, ఫాంహౌస్ నిర్వహకులు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి హోటళ్లు ఫాంహౌస్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం తాగిన వారు తమ నివాసాలకు భద్రంగా చేరే విధంగా కార్యక్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాలి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీయులకు సంబంధించిన వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్లో సమర్పించాలి. ఈత కొలనుపై తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు కొత్త సంవత్సరానికి వేసే లైటింగ్ విద్యుత్ సంబంధిత అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది. -
కొండకు కృష్ణాజలాలు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలైన మంచినీరు, పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టిపెట్టింది. మొదటినుంచి ఇక్కడ మంచినీటి సమస్య ఉంది. దీంతోపాటు కొండపైనా పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో పారిశుద్ధ్యం, పందుల విహారంపై అసహనం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా క్షేత్రం ప విత్రతను కాపాడడానికి అవసరమైన అన్ని చర్య లూ తీసుకోవాలని సీఎం అధికారులను అదేశిం చారు. ఈ క్రమంలోనే సుమారు రూ.750 కోట్లతో పలు సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేసే బృహత్తర ప్రణాళిక కోసం కసరత్తు జరుగుతోంది. మంచినీటి ఎద్దడి నివారణ.. నిత్యం వచ్చే భక్తుల అవసరాలను తీర్చడానికి యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం యాదగిరికొండపై మంచినీటి ఎద్దడిని నివారించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి నుంచి కృష్ణాజలాలు వస్తున్నప్పటికీ అవి రోజూ రావడం లేదు. వారం రోజులకోసారి వస్తుండడంతో అవి ఏమూలకూ సరిపోవడం లేదు. అయితే కృష్ణాజలాలను నేరుగా ఉదయసముద్రం నుంచి యాదగిరిగుట్టకు తీసుకురావడానికి ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశంతో ఆ శాఖ అధికారులు అంచనాలు కూడా ూపొందించారు. నల్లగొండ శివారులోని పానగల్లు ఉదయసముద్రం నుంచి గుట్టకు తీసుకురావాలంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ ఊపులోనే నిధుల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో గుట్ట అధికారులున్నారు. పారిశుద్ధ్యం ఇలా.. పారిశుద్ధ్య సమస్య దేవస్థానంతోపాటు గుట్టపరిసరాల్లో తీవ్రంగా ఉంది. ప్రధానంగా పందుల స్వైరవిహారం సాగుతోంది. పందులను దూరంగా తరిమివేయడంతోపాటు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించారు. ఇందుకోసం ముందుగా అనుకున్నట్లు గుట్ట చుట్టూ ప్రహరీ నిర్మించడానికి పెద్దఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. ప్రస్తుతం దేవ స్థానం వద్ద అన్ని నిధులు లేనందున కొండచుట్టూ ట్రెంచ్కట్ చేయడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈపని చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేర కు కలెక్టర్ చిరంజీవులు ఉపాధి హామీ పీడీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు కొండపైన పం దులకు ఆహారం దొరకకుండా చేయడానికి పారిశుద్ధ్యం మెరుగుపర్చడం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇం దుకోసం అధికారుల బృందంసర్వేలు ప్రారంభించింది. నివేదికలు రూపొందించాం దేవస్థానంలో మంచి నీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న కృష్ణాజలాలు ఏమూలకూ సరిపోవడం లేదు. శాశ్వత మంచినీటి ఎద్దడి నివార ణకు కృషి చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్యం మెరుగుదల, పందులు రాకుండా అడ్డుకోవడానికి ఉపాధి హామీలో ట్రెంచ్కట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీనిపై ఉపాధి పీడీ గుట్టకు రానున్నారు. - గీతారెడ్డి, ఈఓ, గుట్ట దేవస్థానం -
నేడు గుట్టకు సీఎం కేసీఆర్ రాక