అడ్డొస్తున్నాడనే... | Bruthan murder of Putta Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

అడ్డొస్తున్నాడనే...

Published Wed, Dec 31 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

అడ్డొస్తున్నాడనే...

అడ్డొస్తున్నాడనే...

 వివాహేతర బంధం సాగకుండా ఒకరికి.. రాజకీయంగా మరొకరికి ఆయన అడ్డొస్తున్నాడు.. గ్రామంలో పెద్ద మనిషిగా రోజురోజుకూ గుర్తింపు పొందుతున్నాడు.. ఇది వారు జీర్ణించుకోలేకపోయారు.. అదునుకోసం చూశారు.. వ్యవసాయబావి వద్ద పాలుపితుకుతుండగా.. కళ్లలో కారం చల్లి.. ఆపై వేటకొడవళ్లతో దారుణంగా నరికి ఆ పెద్ద మనిషిని హత్య చేశారు.. ఇవీ మోత్కూర్ మండలం రాగిబావికి చెందిన పుట్ట ప్రభాకర్‌రెడ్డి హత్యోందం వెనుక ఉన్న కారణాలు..
 - భువనగిరిటౌన్
 
 మోత్కూర్ మండలం రాగిబావిలో ఈ నెల 8వ తేదీన జరిగిన పుట్ట ప్రభాకర్‌రెడ్డి(50) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీఎస్పీ మోహన్‌రెడ్డి నిందితుల వివరాలు, కారణాలు, హత్య జరిగిన తీరుతెన్నులను వివరించారు. గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. కాగా అదే  గ్రామానికి చెందిన జక్కుల యాదయ్య భార్య ఆరు సంవత్సరాల క్రితం మృతిచెందింది. దీంతో అతడు అదే గ్రామానికి చెందిన పద్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. దీంతో ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు యాదయ్యను ఈ విషయం హెచ్చరించాడు. తన సంబంధం కొనసాగకుండాప్రభాకర్‌రెడ్డి అడ్డొస్తున్నాడని యాదయ్య అతడిపై కక్ష పెంచుకున్నాడు.
 
 రాజకీయంగా అడ్డు తగులుతున్నాడని..
 అదే గ్రామానికి చెందిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ప్రభాకార్‌రెడ్డికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డి కూడా అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే క్రమంలో యాద య్య పంచాయతీ తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి అతడికి డబ్బు ఎర వేశాడు. ప్రభాకర్‌రెడ్డి హత్య చేస్తే రూ. 20 వేలు ఇస్తానని, కేసు ఖర్చులు భరిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని లో భాగంగా రూ. 15 వేలు ముట్టజెప్పాడు.
 
 కాంట్లో కారం చల్లి..
 అదును కోసం ఎదురుచూస్తున్న యాదయ్య ఈ నెల 8వ తేదీన తెల్లవారుజామున ప్రభాకర్‌రెడ్డి ఒంటరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే పద్మను తీసుకుని అక్కడికి వెళ్లాడు. పాలుపితుకుతున్న ప్రభాకర్‌రెడ్డి వద్దకు తొలుత పద్మ వెళ్లి మాటలు కలిపి కంట్లో కారం చల్లింది. వెంటనే యాదయ్య వెళ్లి వేటకొడవలితో నరికి అక్కడి నుంచి పరారయ్యారు.
 
 అనుమానం రాకుండా..
 ప్రభాకర్‌రెడ్డిని హత్య చేస్తే తనపైనే అనుమా నం వస్తుందని శ్రీనివాస్‌రెడ్డి భావించాడు. దీంతో తన గడ్డివామును యాదయ్యతో తగులబెట్టించాడు. శ్రీనివాస్‌రెడ్డి గ్రామంలో జరుగుతున్న విషయాలను యాదయ్యకు ఎప్పటికప్పుడూ చేరవేస్తున్నాడు.
 
 పోలీసుల విచారణలో..
 ప్రభాకర్‌రెడ్డి హత్య అనంతరం యాదయ్య పరారీలో ఉండడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పద్మను అదుపులోకి తీసుకుని విచారించాడు. దీంతో హత్యోదంతం వెనక ఉన్న కారణాలు అన్నీ వెల్లడైనట్టు డీఎస్పీ వివరించారు. పక్కా సమాచారం మేరకు యాదయ్యను రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో వ్యవసాయం బావి వద్ద, నల్లగొం డలో కుమారుడి ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిదింతులను పట్టుకోవడం కోసం ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం పోలీస్ సిబ్బంది అంజనేయులు, జానికిరాములకు రివార్డు కింద ఒక్కొక్కరికి రూ 5వేలు చొప్పున డీఎస్పీ అందజేశారు. సమావేశంలో భువనగిరి పట్టణ సీఐ సతీష్‌రెడ్డి, రూరల్ సీఐ తిరుపతి, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, యాదగిరిగుట్ట సీఐ శంకర్‌గౌడ్, మోత్కూర్ ఎస్సై పురేందర్‌భట్‌లు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement