భువనగిరి : పట్టణంలోని బాహార్‌పేటకు చెందిన పొట్టేటి పోశయ్య(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణ శివారులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య పట్టణంలోని ఇసుక ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం ఉదయం నుంచి ఇంటి వద్దే ఉన్న పోషయ్యకు మధ్యాహ్నం సమయంలో పలుమార్లు ఫోన్లు రావడంతో 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్లిన పోశయ్య రాత్రి వరకు రాకపోవడంతో భార్య స్వప్న 7.30 గంటలకు ఫోన్ చేసింది.
ఎవరూ మాట్లాడకపోగా వాహనాల చప్పుడు వినపడింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం రావడం తో అనుమానం వచ్చిన స్వప్న తెలిసిన వారితో గాలించింది. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం సింగన్నగూడెం కాలనీ సమీపంలోని వ్యవసాయబావి వద్ద పోశయ్య మృతదేహం పడి ఉన్నట్టు కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తిరుపతితోపాటు ఎస్‌ఐలు భిక్షపతి, హన్మంత్‌లాల్‌లు సంఘటన స్థలంలో పంచనామా నిర్వహిం చారు. సంఘటన జరిగిన తీరు చూస్తే ఎవరో పిలిపించి పోశయ్యపై దాడిచేసి తలపై రాల్లతో మోది కట్టెలతో కొట్టి హత్య చేసినట్లు రూరల్ సీఐ తిరుపతి గుర్తించారు.
దాడి చేసిన అనంతరం కట్టెలు, రాళ్లను పక్కనే ఉన్న వరి పొలంలో పడవేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పట్టుకునేందుకు నల్లగొం డ నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి పరిశీ లన చేశారు. జాగిలాలు బైకు దగ్ధం చేసి న సంఘటనలో తిరుగగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుని తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పట్టణ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
వ్యక్తి దారుణ హత్య
Published Fri, Jul 31 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement