భువనగిరి అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషించనుందన్నారు. రాష్ర్టంలో అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు, కార్మికులు, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ప్రతి మండలం, పట్టణంలో పార్టీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.రయాజ్‌అహ్మద్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాలెంల మధు, పట్టణ అధ్యక్షుడు చల్లగురుగుల రఘుబాబు, యూత్ విభాగం పట్టణ అధ్యక్షుడు బబ్బూరి నరేష్‌గౌడ్, వలిగొండ మండల అధ్యక్షుడు ఇంజమూరి కిషన్, నాయకులు పాక శేఖర్‌యాదవ్, కంసాని రాజేష్, క్రాంతికుమార్ తదితరులు ఉన్నారు.
ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం
యాదగిరిగుట్ట : ప్రజా సమస్యలపై అలుపెరుగని రీతిలో పోరాటాలు ముమ్మరం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్ అన్నారు. సోమవారం గుట్టలో ఏర్పాటు చేసి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని, వాటిని కొనసాగించాల్సిన అవసరం నేటి ప్రభుత్వాలకు ఉందన్నారు. త్వరలో జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నారని తెలిపారు.
అనంతరం పార్టీ గుట్ట, ఆలేరు మండలాల నూతన అధ్యక్షులుగా గుండు భార్గవ్, కొత్తోజు నర్సింహాచారిలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వడ్లోజు వెంకటేశ్, వేముల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అద్యక్షుడు బాలెంల మధు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఫయాజ్ అహ్మద్, పార్టీ జిల్లా కార్యదర్శి బండ్రు ఆంజనేయులు, నాయకులు సతీష్‌రాజ్, బండారు హరిప్రసాద్, మాలోతు శ్రీను నాయక్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలి
Published Mon, Jun 1 2015 11:56 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement