రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి మం డలం గచ్చుబావి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.
రాయగిరి(భువనగిరి అర్బన్) :రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి మం డలం గచ్చుబావి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బాసాని రాజశేఖర్(25), గొలుసు విజయ్(21), బట్టు రాజశేఖర్, రఘు టాటా ఇండికా కారులో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఇదే సమయంలో భువనగిరికి చెందిన ఉదరి గణేశ్ తన ట్రాక్టర్‌తో భువనగిరి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గచ్చుబావి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న గణేశ్ ట్రాక్టర్‌ను, ఇండికా కారు ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ముందుకూర్చున్న బాసాని రాజశేఖర్, గొలుసు విజయ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న బట్టు రాజశేఖర్, రఘుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బసాని రాజశేఖర్, రఘు ఇద్దరు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తునట్లు బట్టు రాజశేఖర్ తెలిపారు. భువనగిరి రూరల్ పోలీ సులు సంఘటన స్థలానికి చెరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.