
రైతులకు 7గంటల విద్యుత్ ఇవ్వాలి
రైతాంగ సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్ అందించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే
భువనగిరి : రైతాంగ సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్ అందించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాదవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మరో మూడేళ్ల వరకు విద్యుత్ సమస్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొనడం దారుణమన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందించాలని కోరారు. బీబీనగర్‌లోని నిమ్స్‌ను పూర్తి చేయాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుందారపు కృష్ణాచారి, మండల ప్రధాన కార్యద ర్శి నాయిని జయరాములు, నాయకులు ఎక్భాల్ చౌదరి, పోశెట్టి బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.