పురిటిబిడ్డల తారుమారు ..!
భువనగిరి: ఆపరేషన్ థియేటర్ నుంచి తెచ్చిన పురిటిబిడ్డను అప్పగించడంలో జరిగిన పొరపాటు నాలుగు గంటల పాటు పెద్ద వివాదాన్ని సృష్టించింది. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు పురిటి బిడ్డలు తారుమారు కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్, పోలీస్‌ల జోక్యంతో వివాదం తాత్కాలికంగా శాంతించింది. డీఎన్‌ఏ,రక్తపరీక్షలు నిర్వహిస్తామని నచ్చచెప్పడంతో సుమారు నాలుగుగంటల తర్వాత పసికందులు తల్లిపాలకు నోచుకున్నారు. బంధువులు శాంతించారు.
భువగిరి ఏరియా ఆస్పత్రిలో కాన్పుకోసం మండలంలోని వడపర్తికి చెందిన నల్లా దీపిక, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన కనకలక్ష్మిలు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వీరికి డాక్టర్ కోట్యానాయక్, డాక్టర్ శ్రీదేవి శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. ఇందులో 12-34 గంటలకు దీపికకు మగ బిడ్డ జన్మించగా, 12.21 నిముషాలకు కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరికి తొలికాన్పు కావడంతో వారి బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిబ్బ ంది ఇస్తారమ్మ కనకలక్ష్మికి మగబిడ్డను అప్పగించింది. దీపికకు ఆడబిడ్డను అప్పగించింది. ఇంతలో డాక్టర్ వచ్చి దీపికకు మగబిడ్డ, కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించిందని చెప్పాడు. పొరపాటు జరిగిన విషయాన్ని చెప్పడంతో కనకలక్ష్మి కుటుంబ సభ్యులు మాకు మగబిడ్డ జన్మించాడని ఆస్పత్రిలో కావాలని ఇలా చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు.
ఆడబిడ్డను తీసుకోవడానికి వా రు నిరాకరించారు. దీంతో పరిస్థితి కొంత మేరకు ఉద్రిక్తంగా మారింది. మగబిడ్డను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. డాక్టర్ కోట్యానాయక్ పట్ల దురుసుగా మాట్లాడడంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మళ్లి ఆస్పత్రికి వచ్చి ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. ఏ తల్లికి ఎవరు జన్మిం చారో తనకు స్పష్టంగా తెలుసునని చెప్పారు.
అయితే మీరు నమ్మకపోతే డీఎన్‌ఏ,రక్తం, పాదాలు, చేతి వేళ్లు, సమయం పరిక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందని చెప్పారు సాయంత్రం 4.20 గంటల వరకు మగబిడ్డను పొందిన కనకలక్ష్మి కుటుంబానితో డాక్టర్ చర్చలు జరిపారు. చివరికి పట్టణ ఇన్‌స్పెక్టర్ సతీష్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వర కు రికార్డుల ప్రకారం ఎవరి బిడ్డను వారికి అప్పగించాలని డాక్టర్‌కు సూచించారు. కనకలక్ష్మికి ఆడబిడ్డను, దీపికకు మగబిడ్డను అప్పగించారు. దీంతో నాలుగు గం టల పాటు సాగిన వివాదం నిలిచిపోయింది.
సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం
ఆపరేషన్ థియేటర్ నుంచి పురిటి బిడ్డలను తెచ్చి ఇవ్వడంలో ఇంతటి వివాదానికి కారణమైన సిబ్బంది ఇస్తారమ్మపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ కోట్యానాయక్ చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఎవరి సంతానాన్ని వారికి అప్పగించడం జరుగుతుందని చెప్పారు.
నాలుగు గంటల పాటు పాలు లేక..
పుట్టిన బిడ్డకు వెంటనే పాలు ఇవ్వాల్సి ఉండగా వివాదంతో నాలుగు గంటలపాటు పురిటిబిడ్డలు తల్లిపాలకు నోచకోలేకపోయారు. వివాదం తేలేవరకు వారికి పాలు ఇవ్వకపోవడంతో ఒక దశలో ఏడ్వడం మొదలు పెట్టా రు. తల్లులు సైతం తమ కన్నబిడ్డలకు పాలు ఇవ్వలేక న రకయాతన అనుభవించారు. ఒక సారి పాలు ఇవ్వడం జరిగితే వివా దం మరింత పెద్దదౌతుందని ఆస్పత్రిలో భావిం చారు. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిన వెంటనే తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చారు.