operation theatre
-
ఫిఫా వరల్డ్ కప్: ఆఫరేషన్ థియేటర్లో అలా!
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడకు ఉండే క్రేజే వేరు. అత్యంత మంది ఎక్కువగా ఇష్టపడే క్రీడ ఫుట్‌బాల్. అయితే మన దేశంలో మాత్రం క్రికెట్ అంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారు. మన దేశంలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో యూరప్, అమెరికా దేశాల్లో ఫుట్‌బాల్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యే మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రీడలను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు. తమ దేశం ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉంటారు. అలాగే ప్రస్తుతం కొంతమంది వీరాభిమానులు ఫుట్‌బాల్ క్రీడను చూస్తూ తెగ ఆనందిస్తున్నారు. ఇది మామూలు విషయమే. కానీ, వీరు ఈ ఆటను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నది ఇంట్లో కాదు ఆపరేషన్ థియేటర్లో. అవును.. రోగికి ప్రాణాలు పోసే ఈ స్థలంలో వారంతా మ్యాచ్‌ను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. -
టీవీలో ఫుట్‌బాల్ చూస్తూ ఆఫరేషన్..
-
'ఛీ'జీహెచ్
జీజీహెచ్‌లో ఏ వార్డును పలకరించినా గొంతు పెగలని రోగుల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఏ ఆపరేషన్ థియేటర్ వైపు కన్నెత్తి చూసినా అధికారుల నిర్లక్ష్యపు ఛాయలు పేదలపాలిట శాపాలవుతున్నాయి. ఏ ఆఫీసు గది గడప తొక్కినా అభాగ్యుల బతుకులతో ఆటలాడుతున్న రాజకీయ క్రీడలు అందలమెక్కి వెక్కిరిస్తున్నాయి. సెల్‌ఫోన్ లైటింగ్‌తో ఆపరేషన్లు చేసే స్థాయికి ఆస్పత్రి పరువును దిగజార్చిన పాలకులు, అధికారుల రాతి గుండెలను కళ్లకు కడుతున్నాయి. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి, ఎలుకల దాడికి బలైన పసికందు, గైనకాలజీ వైద్యుల అలసత్వానికి తనువు చాలించిన బాలుడి ఆత్మలు.. ఇది ఖర్మాస్పత్రేనంటూ నిత్యం ఘోషిస్తున్నాయి. సాక్షి, గుంటూరు: రోడ్లపై అరటికాయలు అమ్మే తోపుడు బండ్లపై సైతం మంచి టార్చిలైట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో మాత్రం ఆపరేషన్ థియేటర్లలోనే లైట్లు ఉండవు. సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఆపరేషన్ అత్యవసరమైనా రోజుల తరబడి పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ మొట్టికాయలు వేస్తూనే ఉంది. వసతులలేమి, వైద్య పరికరాల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం, కీలక పోస్టుల్లో అర్హత లేనివారిని కూర్చోబెట్టడం వంటి వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఎంసీఐ బృందం తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ డ్రామా సెట్టింగ్‌లు వేస్తూ, అధికారులను మారుస్తూ జీజీహెచ్ వైద్యులు పబ్బం గడుపుతున్నారు. ♦ జీజీహెచ్‌లో మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటానని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. తనకు మాదిరిగానే పేదలకు సేవలందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తీరా ఆపరేషన్ సమయానికి కార్పొరేట్ వైద్యశాలల నుంచి పరికరాలు, వైద్యులను తెప్పించి ఆపరేషన్ చేయించారు. ఈ ఘటనలో తమపై నమ్మకం లేక బయట నుంచి పిలిపించుకొని జీజీహెచ్ పరువును తీశారంటూ ప్రభుత్వ వైద్యులు మండి పడ్డారు. ♦ గతంలో పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై పడుకున్న పసికందును ఎలుకలు కరిచి చంపేస్తున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా ఈ దుర్ఘటన తీవ్ర సంచలనం కలిగించడంతోపాటు జీజీహెచ్ చరిత్రను మసకబార్చింది. అప్పట్లో హడావుడి చేసిన పాలకులు, ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ♦ ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్పట్లో 10 రోజులపాటు వైద్య విద్యార్థులు విధులకు హాజరు కాకుండా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. బతికి ఉన్న శిశువును చనిపోయినట్లుగా నిర్ధారించి ఆసుపత్రి నుంచి పంపివేయడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ఈ ఘటనలో శిశువు బంధువులు జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించే వరకు వెళ్లింది. అయితే శిశువును ఐసీయూలో చేర్పించిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందింది. ♦ తలకు తీవ్రగాయాలైన వెంకమ్మ అనే మహిళకు ఈ నెల 7వ తేదీ ఎస్వోటీలో శస్త్రచికిత్స చేసే సమయంలో లైట్ ఆగిపోవడంతో థియేటర్లో చీకటి అలుముకుంది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేసి ఆ వెలుతురులో ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా ఈ నెల 14వ తేదీ బుధవారం సైతం అదే ఎస్వోటీలో తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు శస్త్రచికిత్స చేస్తుండగా వైద్య పరికరాలు మొరాయించాయి. దీంతో మళ్లీ ఆపరేషన్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక అతన్ని పక్క బ్లాక్‌లో ఉన్న ఆర్ధోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. దీనిపై సాక్షి మెయిన్ పేజీలో గురువారం ప్రచురితమైన ‘ఆపరేషాన్’ అనే కథనంతో జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఈ రెండు సంఘటనలు వరుసగా జరగడంతో జీజీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వైఎస్సార్ సీపీ నేతల ధర్నా ఆస్పత్రిలో అధికారుల తీరుపై స్పందించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా గంటపాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రావి వెంకటరమణతో కలిసి జీజీహెచ్‌లో తిరిగి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జూనియర్ల పాలనతో ఇక్కట్లు చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌లలో పాలనను గాలికొదిలేశారు. సీనియర్లు ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో జూనియర్లను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు అర్హత లేదని సాక్షాత్తు భారత వైద్య మండలి (ఎంసీఐ) తేల్చి చెప్పినప్పటికీ ఆయన్ను మార్చలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చిన ప్రతిసారీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ మోహన్‌రావును సీట్లో కూర్చొబెడుతూ డ్రామాలు ఆడుతున్నారు. మరో వైపు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజునాయుడును నియమించడమే కాకుండా పదవీ విరమణ అనంతరం మరో రెండేళ్లు పెంచి మరీ కొనసాగిస్తున్నారు. సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్లను కీలక పోస్టుల్లో కూర్చోబెట్టడంతో పాలనపై వారు పట్టు సాధించలేకపోతున్నారు. జీజీహెచ్‌లో వరుస ఘటనలకు పరోక్షంగా వీరే కారకులవుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ నాయకుల రాజకీయాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేసేందుకు కూడా వీరు వెనుకాడడం లేదనే దుర్ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. -
ఆపరేషన్ థియేటర్లో త్రాచుపాము
-
కు.ని. కష్టాలు
కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు కోల్‌సిటీ : గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 90 మంది మహిళలు, పురుషులు శస్త్రచికిత్స కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉదయం ఆపరేషన్లు చేస్తామని చెప్పిన అధికారులు సాయంత్రం 4గంటల వరకు కూడా ప్రారంభించలేదు. దీంతో భోజనాలు చేయకుండా వచ్చిన కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సరిపడా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో ఆపరేషన్ థియేటర్లో నేలపై, మెట్లపై కూర్చొని డాక్టర్ల కోసం పడిగాపులు కాశారు. రాత్రి వరకు 65 మంది మహిళలకు డాక్టర్ రజినీప్రియదర్శిని, 22 మంది పురుషులకు డాక్టర్ రవీందర్ ఆపరేషన్లు చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత మహిళలను నేలపై పడుకోబెట్టారు. ఆస్పత్రిలో ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రతిసారీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. కు.ని. ఆపరేషన్లలో క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ భిక్షపతి, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సూర్యశ్రీ, డాక్టర్లు కృపాభాయి, రవళి, రాణి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
పండగ చేస్కొని బుక్కయ్యారు
తిరువంతపురం: కేరళీయులు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఓనం. అయితే కేరళలోని ఓ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన ఓనం ఉత్సవం వివాదానికి దారి తీసింది. అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ఆపరేషన్ థియేటర్లో పండుగ ఉత్సవాలు జరుపుకొని బుక్కయ్యారు ఆసుపత్రి సిబ్బంది. ఓనం పండుగ సందర్భంగా నిర్శహించే 'ఓనసాద్య' విందును అట్టహాసంగా నిర్వహించుకోవడంతో విమర్శలు చెలరేగాయి. తిరువనంతపురం మెడికల్ కాలేజీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి డాక్టర్లు, ఇతర సిబ్బంది ఓనం పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆసుపత్రి ఆవరణను పూలతో అందంగా అలంకరించి, ముగ్గులు పెట్టి ఉత్సవాలు జరుపుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆపరేషన్ థియేటర్ కు అత్యంత సమీపంలో పండుగ చేస్కోవడం పట్ల రోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్యంత హైజీనిక్ గా ఉండాల్సిన ఏరియాలో ఇలా చేయడం వల్ల రోగుల భద్రతను ప్రశ్నార్ధకం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉండే ఆపరేషన్ థియేటర్‌కు అంతమందిని అనుమతించడం సరికాదని ఆరోపించారు. దీని వల్ల బాక్టీరియా వ్యాపించి, ఇన్ఫెక్షన్స్ ముదరవా అంటూ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ అధికారులను మంత్రి వీఎస్ శివకుమార్ ఆదేశించారు. మరోవైపు ఆపరేషన్ జోన్లో ఓనం పండుగ నిర్వహించడంపై నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు, ఉత్సవాలు జరుపుకోవడం తప్పుకాదుకానీ, ఆపరేషన్ జోన్‌ను బాక్టీరియా రహితంగా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బంది ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. థామస్ ఖండిస్తున్నారు. థియేటర్‌కు వందమీటర్ల దూరంలో పూవులతో అలంకరించామంటున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించిన రోగులకు కేటాయించే పాలియేటివ్ కేర్ రూములో విందు ఏర్పాటు చేశామంటూ సమర్ధించుకున్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఓనం జరుపుకుంటున్నామని తెలిపారు. -
ఆ సమయంలో సంగీతం వద్దు!
లండన్: శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం వినిపించేలా చేయడం వల్ల రోగులకు, వైద్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. శస్త్రచికిత్స సమయంలో మ్యూజిక్ ప్లే చేస్తే సీనియర్, జూనియర్ డాక్టర్ల మధ్య సయన్వయ లోపం తలెత్తవచ్చని, ఇది చివరకు వారిలో ఒత్తిడికి దారి తీయవచ్చని పరిశోధకులు అన్నారు. అంతిమంగా రోగిపై ఇది ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50-70 శాతం శస్త్రచికిత్సలకు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన షరాన్ వెల్డన్ బృందం అధ్యయనం జరిపింది. దీనిలో భాగంగా బ్రిటన్‌లో 20 శస్త్రచికిత్సల్ని పరిశీలించారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా పరికరం కావాల్సి వచ్చినప్పుడు సంగీతం వల్ల ఎక్కువ సార్లు అడగాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల రోగి భద్రత విషయంలో సమస్యలు తలెత్తవచ్చని వెల్డన్ వెల్లడించారు. అయితే సంగీతం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నప్పటికీ, ఇబ్బందులే ఎక్కువని ఆయన అన్నారు. -
పురిటిబిడ్డల తారుమారు ..!
భువనగిరి: ఆపరేషన్ థియేటర్ నుంచి తెచ్చిన పురిటిబిడ్డను అప్పగించడంలో జరిగిన పొరపాటు నాలుగు గంటల పాటు పెద్ద వివాదాన్ని సృష్టించింది. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు పురిటి బిడ్డలు తారుమారు కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్, పోలీస్‌ల జోక్యంతో వివాదం తాత్కాలికంగా శాంతించింది. డీఎన్ఏ,రక్తపరీక్షలు నిర్వహిస్తామని నచ్చచెప్పడంతో సుమారు నాలుగుగంటల తర్వాత పసికందులు తల్లిపాలకు నోచుకున్నారు. బంధువులు శాంతించారు. భువగిరి ఏరియా ఆస్పత్రిలో కాన్పుకోసం మండలంలోని వడపర్తికి చెందిన నల్లా దీపిక, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరుకు చెందిన కనకలక్ష్మిలు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వీరికి డాక్టర్ కోట్యానాయక్, డాక్టర్ శ్రీదేవి శస్త్ర చికిత్స చేసి ప్రసవాలు చేశారు. ఇందులో 12-34 గంటలకు దీపికకు మగ బిడ్డ జన్మించగా, 12.21 నిముషాలకు కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ఇద్దరికి తొలికాన్పు కావడంతో వారి బంధువులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిబ్బ ంది ఇస్తారమ్మ కనకలక్ష్మికి మగబిడ్డను అప్పగించింది. దీపికకు ఆడబిడ్డను అప్పగించింది. ఇంతలో డాక్టర్ వచ్చి దీపికకు మగబిడ్డ, కనకలక్ష్మికి ఆడబిడ్డ జన్మించిందని చెప్పాడు. పొరపాటు జరిగిన విషయాన్ని చెప్పడంతో కనకలక్ష్మి కుటుంబ సభ్యులు మాకు మగబిడ్డ జన్మించాడని ఆస్పత్రిలో కావాలని ఇలా చేస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఆడబిడ్డను తీసుకోవడానికి వా రు నిరాకరించారు. దీంతో పరిస్థితి కొంత మేరకు ఉద్రిక్తంగా మారింది. మగబిడ్డను ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. డాక్టర్ కోట్యానాయక్ పట్ల దురుసుగా మాట్లాడడంతో ఆయన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మళ్లి ఆస్పత్రికి వచ్చి ఇరువర్గాల వారితో చర్చలు జరిపారు. ఏ తల్లికి ఎవరు జన్మిం చారో తనకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. అయితే మీరు నమ్మకపోతే డీఎన్ఏ,రక్తం, పాదాలు, చేతి వేళ్లు, సమయం పరిక్షించి నిర్ధారణ చేయడం జరుగుతుందని చెప్పారు సాయంత్రం 4.20 గంటల వరకు మగబిడ్డను పొందిన కనకలక్ష్మి కుటుంబానితో డాక్టర్ చర్చలు జరిపారు. చివరికి పట్టణ ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డి ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించాలని, అప్పటి వర కు రికార్డుల ప్రకారం ఎవరి బిడ్డను వారికి అప్పగించాలని డాక్టర్‌కు సూచించారు. కనకలక్ష్మికి ఆడబిడ్డను, దీపికకు మగబిడ్డను అప్పగించారు. దీంతో నాలుగు గం టల పాటు సాగిన వివాదం నిలిచిపోయింది. సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం ఆపరేషన్ థియేటర్ నుంచి పురిటి బిడ్డలను తెచ్చి ఇవ్వడంలో ఇంతటి వివాదానికి కారణమైన సిబ్బంది ఇస్తారమ్మపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ కోట్యానాయక్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి ఎవరి సంతానాన్ని వారికి అప్పగించడం జరుగుతుందని చెప్పారు. నాలుగు గంటల పాటు పాలు లేక.. పుట్టిన బిడ్డకు వెంటనే పాలు ఇవ్వాల్సి ఉండగా వివాదంతో నాలుగు గంటలపాటు పురిటిబిడ్డలు తల్లిపాలకు నోచకోలేకపోయారు. వివాదం తేలేవరకు వారికి పాలు ఇవ్వకపోవడంతో ఒక దశలో ఏడ్వడం మొదలు పెట్టా రు. తల్లులు సైతం తమ కన్నబిడ్డలకు పాలు ఇవ్వలేక న రకయాతన అనుభవించారు. ఒక సారి పాలు ఇవ్వడం జరిగితే వివా దం మరింత పెద్దదౌతుందని ఆస్పత్రిలో భావిం చారు. వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిన వెంటనే తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చారు. -
ఆపరేషన్లు చేయకపోతే రోగుల పరిస్థితి ఏంటి?
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: మూడేళ్లుగా ఆర్థో ఆపరేషన్ థియేటర్‌ను వినియోగించడం లేదా..? ఇలాగైతే రోగుల పరిస్థితి ఏమిటని ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ జేసీ రెడ్డిని ఎంసీఐ బృందం సభ్యుడు ఫ్రొఫెసర్ డాక్టర్ యతిన్‌దేశాయ్(అహ్మదాబాద్) ప్రశ్నించారు. 18 పీజీ సీట్లకు సంబంధించి శనివారం ఎంసీఐ బృందం రెండోరోజు అనాటమీ, ఫోరెన్సిక్ విభాగాలను తనిఖీ చేసింది. ఈ బృందంలోని ఫ్రొఫెసర్ ఆఫ్ అనాటమీ డాక్టర్ టీకే దాస్(అస్సాం), ఫ్రొఫెసర్ ఆఫ్ ఫోరెన్సిక్ డాక్టర్ కనక్‌దాస్(అస్సాం) ఆయా విభాగాల డాక్టర్ల వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. రూ లక్షలు పోసి ఆర్థో ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేసినా ఎందుకు వినియోగించలేదని ఆర్థో హెచ్ఓడీ, ఆస్పత్రి యాజమాన్యాన్ని వారు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ప్రతి రోజూ ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్సలు చేయాలన్నారు. నిబంధనలను అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు సమాధానమిస్తూ థియేటర్ రిపేరీలో ఉందన్నారు. మరమ్మతులకు సంబంధించి బడ్జెట్ కూడా విడుదలైందని చెప్పడంతో డాక్టర్ యతిన్ దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాన్ని పరిశీలించారు. పరిశోధనలు చేస్తున్నారాల లేదా అని డాక్టర్ కనక్‌దాస్ ఆరా తీశారు. ఆస్పత్రిలోని మార్చురీను తనిఖీ చేశారు. 2010 నుంచి ఎన్ని ఎంఎల్సీ కేసులను చేశారని విచారించారు. ప్రతి ఏటా 600కు పైగా కేసులు చేస్తున్నామని ఫోరెన్సిక్ విభాగంవారు తెలిపారు. అనంతరం బ్లడ్‌బ్యాంకును పరిశీలించారు. ఏఎంసీకి వెళ్లి ఎన్ని మంచాలున్నాయని డ్యూటీ ఇన్చార్జ్ డాక్టర్ భీమసేనాచార్‌ను ప్రశ్నించారు. పాయిజన్ కేసులను పరిశీలించి, వెంటిలేటర్ బాగా పనిచేస్తోందా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాలలోని అనాటమీ విభాగాన్ని నిశితంగా పరిశీలించారు. అనాటమీ విభాగానికి సంబంధించి రికార్డులు పక్కాగా ఉండాలని డాక్టర్ టీకేదాస్ సూచించారు. అనంతరం ఆయా విభాగాల వివరాలను ఎంసీఐ బృందం సేకరించింది. -
‘ప్రాణాలతో చెలగాటం’పై విచారణ
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ప్రయోగశాలగా మార్చిన సూపరింటెండెంట్ వైఖరిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం సంచలం సృష్టించింది. ఉన్నతాధికారుల అనుమతి లే కుండా సూపరింటెండెంట్ హోదాలో అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, ఓ మహిళతో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈనెల 18న ‘ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందిం చారు. విచారణ చేపట్టిన డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజా బుధవారం ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్లోకి అనుమతి లేకుండా ఎవరు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్‌రావును వెంటనే బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇక్కడే గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ సూర్యశ్రీరావుకు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, అనస్థీషియాగా సేవలందించే డాక్టర్ మోహన్‌రావు ఆస్పత్రికి సంబంధం లేని మహిళతో ఏకంగా థియేటర్లో ఆపరేషన్లు చేయించడం, ప్రత్యేకంగా చూపించడంపై విచారణ చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ వివరించారు. అక్రమంగా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చిన సదరు మహిళ, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలోని ఓపీ విభాగంలో, ఔట్సోర్సింగ్ ఉగ్యోగిగా పేషెంట్లకు చిట్టీలు రాస్తూ కొంతకాలం పని చేసినట్లు తెలిసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆస్పత్రి థియేటర్లోకి ఎలా వస్తోంది? తదితర వివరాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.