కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ప్రయోగశాలగా మార్చిన సూపరింటెండెంట్ వైఖరిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం సంచలం సృష్టించింది. ఉన్నతాధికారుల అనుమతి లే కుండా సూపరింటెండెంట్ హోదాలో అనస్తీషియా డాక్టర్ మోహన్‌రావు, ఓ మహిళతో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈనెల 18న ‘ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందిం చారు.
విచారణ చేపట్టిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ భోజా బుధవారం ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్‌లోకి అనుమతి లేకుండా ఎవరు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్‌రావును వెంటనే బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు.
ఇక్కడే గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ సూర్యశ్రీరావుకు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, అనస్థీషియాగా సేవలందించే డాక్టర్ మోహన్‌రావు ఆస్పత్రికి సంబంధం లేని మహిళతో ఏకంగా థియేటర్‌లో ఆపరేషన్లు చేయించడం, ప్రత్యేకంగా చూపించడంపై విచారణ చేపట్టినట్లు డీసీహెచ్‌ఎస్ వివరించారు. అక్రమంగా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోకి వచ్చిన సదరు మహిళ, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలోని ఓపీ విభాగంలో, ఔట్‌సోర్సింగ్ ఉగ్యోగిగా పేషెంట్లకు చిట్టీలు రాస్తూ కొంతకాలం పని చేసినట్లు తెలిసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆస్పత్రి థియేటర్‌లోకి ఎలా వస్తోంది? తదితర వివరాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
‘ప్రాణాలతో చెలగాటం’పై విచారణ
Published Thu, Sep 19 2013 2:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
Advertisement