![FIFA World Cup Matches Enjoying Doctors In Operation Theater Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/23/fifa.jpg.webp?itok=FGT3FaNt)
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడకు ఉండే క్రేజే వేరు. అత్యంత మంది ఎక్కువగా ఇష్టపడే క్రీడ ఫుట్‌బాల్. అయితే మన దేశంలో మాత్రం క్రికెట్ అంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారు. మన దేశంలో క్రికెట్‌కు ఎంత క్రేజ్ ఉందో యూరప్, అమెరికా దేశాల్లో ఫుట్‌బాల్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యే మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ క్రీడలను అభిమానులు ఆసక్తితో తిలకిస్తున్నారు.
తమ దేశం ఆటలో గెలిస్తే ఆనందంతో ఎగిరి గంతులేసే వీరాభిమానులు ఉంటారు. అలాగే ప్రస్తుతం కొంతమంది వీరాభిమానులు ఫుట్‌బాల్ క్రీడను చూస్తూ తెగ ఆనందిస్తున్నారు. ఇది మామూలు విషయమే. కానీ, వీరు ఈ ఆటను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నది ఇంట్లో కాదు ఆపరేషన్ థియేటర్‌లో. అవును.. రోగికి ప్రాణాలు పోసే ఈ స్థలంలో వారంతా మ్యాచ్‌ను చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment