భువనగిరి : భువనగిరి కేంద్రంగా ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్ ఇతర శాఖల కార్యాలయాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించి ఎంపిక చేసిన అధికారులు తా జాగా ఆర్టీఏ ఆఫీస్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ స్థానిక అధికారులతో కలిసి మం గళవారం భువనగిరి శివారులో స్థలాన్ని పరి శీలించా రు. యాదాద్రి జిల్లాలో భువనగిరి కేంద్రంగా ఎంవీఐ కార్యాలయం పని చేయనుంది. ప్రస్తుత ప్రతి పాదనల ప్రకారం యాదాద్రిలో వరంగల్ జిల్లా జనగామ కలిస్తే భువనగిరి, అక్కడ ఉన్న ఆర్టీఏ కార్యాలయాలు రెండు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి.
తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే..
ప్రస్తుతం జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పర్యవేక్షణలో నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏలు ఉం డగా, భువనగిరిలో ఎంవీఐతో సరిపెట్టారు. తాజాగా 3 జిల్లాల ప్రతిపాదనలు రావడంతో నల్లగొండ, సూర్యాపేటల్లో ఎంవీఐలతోనే కార్యాలయాలు కొనసాగించవ చ్చు. భువనగిరిలో మాత్రం ఎంవీఐ స్థానం లో ఆర్టీఏను నియమిస్తారు. ఇందుకోసం పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయానికి 3నుంచి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం భువనగిరి శివారులో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏ కార్యాలయాల పక్కా భవనాల కోసంప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. భువనగిరిలో కూడా స్థలం ఖరారైతే నిధులు మంజూరు అవుతాయి.
అద్దెభవనంలో ఎంవీఐ కార్యాలయం
భువనగిరిలోని ఎంవీఐ కార్యాలయం అద్దెభవనంలో నడుస్తోంది. చాలా కాలంగా సొంత భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. పలుమార్లు కార్యాలయూన్ని మార్చారు. ప్రస్తుతం నల్లగొండ రోడ్డులో కొనసాగుతోంది. కార్యాలయం స్థా యి పెరగడంతో సొంత భవనం నిర్మిం చడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.
భువనగిరి శివారులో స్థల పరిశీలన..
ఆర్టీఏ కార్యాలయం భవనం స్థలం కోసం వడపరి,్త మోత్కూరు రోడ్డులో రవాణా శాఖ డిటీసీ ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. 3 నుంచి 5 ఎకరాల స్థలం కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెండు చోట్ల ఉన్న స్థలం వివరాలను రెవెన్యూ అధికారులు రవాణా శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు తమకు కావాల్సిన స్థలం వివరాలను తహసీల్తార్‌కు తెలియజేశామని డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. స్థలం ఖరారైతే భవనం నిర్మాణం చేపడతామని చెప్పారు. డీటీసీ వెంట ఎంవీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఎంవీఐ నరేష్ ఉన్నారు.
భువనగిరిలో ఆర్టీఏ కార్యాలయం
Published Wed, Jun 22 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement