RTA Khairatabad Mops Up Rs 50 Lakh On Single Day From Fancy Number Auction - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌.. ఆ నెంబర్‌కు రూ. 21 లక్షలు!

Published Tue, Aug 8 2023 8:18 PM | Last Updated on Tue, Aug 8 2023 8:33 PM

RTA Khairatabad mops up 50 lakh from fancy number auction - Sakshi

హైదరాబాద్‌: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఖరీదైన వాహనాలకూ నెలవైన హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో అది ఇంకా ఎక్కువే కనిపిస్తుంటుంది కూడా. సెంటిమెంట్‌, ఇష్ట‌మైన నంబ‌ర్‌ను ద‌క్కించుకునేందుకు వాహ‌నాల య‌జ‌మానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో..  ఇవాళ ఒక్కరోజే ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది.  

ఫ్యాన్సీ నంబ‌ర్ల‌తో ఒక్క రోజే రూ. 53.34 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబ‌ర్‌కు రూ. 21.60 ల‌క్ష‌లు పలుక‌గా, ఫ్యాన్సీ నెంబర్‌ పోటీలో అతి త‌క్కువ‌గా టీఎస్ 09 జీడీ 0027 నంబ‌ర్‌కు రూ. 1.04 ల‌క్షలు ప‌లికింది.

ఫ్యాన్సీ నంబ‌ర్లు      –        రేటు                  –           సంస్థలు

టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 ల‌క్ష‌లు  – ప్రైమ్ సోర్స్ గ్లోబ‌ల్ ప్రైవేట్ లిమిటెడ్
టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 ల‌క్ష‌లు  – మెఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్స్‌
టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 ల‌క్ష‌లు         – ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్
టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 ల‌క్ష‌లు     – గోయ‌జ్ జ్యువెల‌రీ
టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు     – సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు     – సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్‌
టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు    –  ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజ‌రీ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు     – శ్రీనివాస్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement