fancy number auction
-
HYD: ఫ్యాన్సీ క్రేజ్.. ఆ నెంబర్‌కు రూ. 21 లక్షలు!
హైదరాబాద్: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఖరీదైన వాహనాలకూ నెలవైన హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అది ఇంకా ఎక్కువే కనిపిస్తుంటుంది కూడా. సెంటిమెంట్, ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో.. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్‌కు రూ. 21.60 లక్షలు పలుకగా, ఫ్యాన్సీ నెంబర్ పోటీలో అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్‌కు రూ. 1.04 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నంబర్లు – రేటు – సంస్థలు టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు – ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు – మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు – ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు – గోయజ్ జ్యువెలరీ టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు – సితారా ఎంటర్టైన్మెంట్స్ టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు – సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్ టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు – ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు – శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ -
ఫ్యాన్సీ నంబర్ కోసం 17 లక్షలు ఖర్చు పెట్టిన యంగ్ టైగర్
Jr NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువే. ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు. కారు కోసం కోట్లు పెట్టిన తారక్ ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు గుమ్మరించాడు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్ దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్ అని అధికారులు చెప్తున్నారు. గతంలోనూ తారక్ పది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా రూ.17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకుని తన రికార్డును తనే బద్ధలు చేసుకోవడం విశేషం. కాగా ఎన్టీఆర్ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్ ఉంటుంది. కొత్తగా ఏ కారు తీసుకున్నా కూడా దానికి కూడా అదే నెంబర్ వచ్చేలా జాగ్రత్తపడతాడు. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ 9999 కారు నంబర్‌గా వాడారని, అందుకే తనకు ఆ నెంబర్ ఇష్టమని, అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు తారక్. కార్లతో పాటు ఆయన ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అనే ఉంటుంది. -
9999.. రూ.11.50 లక్షలు
సాక్షి, హైదరాబాద్: లక్కీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. సోమవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జే 9999’నంబర్ కోసం హెటిరో డ్రగ్స్ సంస్థ ఏకంగా వేలంలో రూ.11,50,050 చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సంస్థ తమ రూ.2.96 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ 4.4 డీజిల్ ఎల్‌డబ్ల్యూబీ కోసం ఈ నంబర్‌ను దక్కించుకుంది. అలాగే ‘టీఎస్ 09 ఎఫ్‌కే 0006’నంబర్ కోసం ఎం.విజయ్‌కృష్ణ అనే వాహనదారుడు రూ.1.53 లక్షలు చెల్లించారు. తమ హ్యూందాయ్ కారు కోసం ఈ నంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు. ‘టీఎస్ 09 ఎఫ్‌కే 0009’నంబర్ కోసం ఇంపార్టా ట్రైనింగ్ అకాడమీ రూ.1.26 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. సోమవారం ఒక్క రోజు నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రూ.23,46,321 లభించినట్లు జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
'9999' నంబర్ కావాలంటే..
రూ.7,39,999 చెల్లించాల్సిందే! ఉయ్యూరు (కృష్ణా జిల్లా): వాహన ప్రియులకు ఫ్యాన్సీ నంబర్లపై మోజు ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో 9999 నంబర్‌కు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఉయ్యూరు మండలం రాజుపేటకు చెందిన సీహెచ్.వెంకటేశ్వర్లు రాజు, డి.సునీత రూ.50 వేల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 9999 నంబరు కోసం పోటీ పడ్డారు. దీంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివకామేశ్వరరావు వేలం నిర్వహించారు. సునీత రూ.6,63,000కు డీడీ ఇవ్వగా, వెంకటేశ్వర్లు రాజు రూ.7,39,999కు డీడీ ఇచ్చారు. దీంతో అత్యధికంగా డీడీ చెల్లించిన వెంకటేశ్వర్లు రాజుకు 9999 నంబర్ కేటాయించినట్లు ఎంవీఐ ప్రకటించారు. రాజు తన ఫార్చ్యూనర్ కారుకు ఈ నంబర్ కోసం ప్రయత్నించారని అధికారులు తెలిపారు.