భువనగిరి : బాణసంచా వ్యాపారి నిర్లక్ష్యానికి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా,మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మంగళవారం రాత్రి భువనగిరిలోని ఆర్‌బీనగర్‌లో జరిగిన ప్రమాదానికి వ్యాపారి బుస్స శ్రీనివాస్ తప్పిదమేనని కారణమని తెలుస్తోంది. సొంత ఇంటి నిర్మాణం చేపట్టిన శ్రీనివాస్ ఎ దిరింట్లో అద్దెకు ఉంటున్నాడు. దీపావళి సందర్భంగా సుమారు రూ.లక్ష బాణసంచాను తెచ్చి ఇంట్లో నిల్వఉంచాడు, పేలుడు పదార్థాలు ఇంట్లో ఉంచుకున్న ఇతను కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు.
తన ఇంట్లోని ముందు గదితో పా టు, వెనక గల మరో గదిలో టపాకాయలను నిల్వ ఉంచాడు.రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీలైట్ చార్జర్‌కు మరమ్మతు చేస్తుండగా మంటలు లేచా యి. దీంతో అక్కడే ఉన్న వ్యాపారి శ్రీని వాస్ కుమారుడు వెంకటేష్ ఆ మంటను పక్కకు తోయడంతో అక్కడేకుప్పగా ఉన్న టపాకాయలపై పడడంతో పెద్దగా పేలుళ్లతో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీనివాస్, అతడి కుమారుడు వెంకటేశ్ వెనక గల ద్వారం గుండా బయటకు పరుగు తీశారు. ఈ లోపు అక్కడే ఉన్న సాయికళ్యాణ్, నాగేశ్వర్‌రావు, పోశెట్టిలు అందులో చిక్కుకుపోగా పోశెట్టి కాలిన గాయాలతో బయటపడ్డాడు.
ఈలోపు వెనక ద్వారం గుండా శ్రీనివాస్ తన కుటుంబంతో సహా వీధిలోకి వచ్చారు. అయితే మం టలు ముందు గదికే పరిమితం కావడం తో వెనకగదిలో ఉన్న బాణసంచాకు నష్టం వాటిళ్ల లేదు. ఒక వేళ వెనక గదిలో గల బాణసంచాకు నిప్పు అంటుకుంటే చుట్టుపక్కల ఇళ్లకు పెద్ద ప్రమాదం సంభవించేది. కాగా విష యం తెలియగానే భువనగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.అనంతరం మృతదేహాలను పోలీస్‌లు గుర్తించారు. జనావాసాల మధ్యన జరి గిన ఈ ఘోర సంఘటనతో చుట్టుపక్కల వారు భయంతో వణికిపోయారు. భువనగిరి ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, సీఐ జవ్వాజి నరేందర్‌గౌడ్, రూరల్ ఎస్‌ఐ భిక్షపతి సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అగ్నిమాకపక శాఖ అధికారి
జిల్లా అగ్ని మాపకశాఖ అధికారి హరినాథ్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఘటన స్థలాన్ని పరిశీలించారు. వ్యాపారి ఇంట్లో ఉన్న టపాసుల స్టాకును వెంటనే అక్కడి నుంచి తొలగించాలని స్థానిక అగ్ని మా కప సిబ్బందిని ఆదేంశించారు.
చీకటిని మిగిల్చిన దీపావళి
సంతోషాన్ని నింపుతుందనుకున్న వెలుగుల పండగ ఆ రెండు కుటుంబాల్లో పెనువిషాదాన్ని మిగిల్చింది...ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడిని..ఇంటి పెద్దదిక్కును బలితీసుకుంది. భువనగిరి పట్టణం ఆర్‌బీనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన బాణసంచా పేలుళ్లలో సాయికళ్యాణ్, నాగేశ్వరరావు మృతిచెందిన విషయం విదితమే. భువనగిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు సాయికళ్యాణ్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ శాఖలో కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు భాను హైదరాబాద్‌లో ఓకళాశాలలో సీఏ చదువు తున్నాడు. ప్రతిరోజు భువనగిరి నుంచి రైళ్లో హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ విధులు నిర్వహించి తిరుగు ప్రయాణం లో గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో భువనగిరికి వచ్చేవాడు.
గురువా రం దీపావళి పండగ కావడంతో కల్యాణ్ హైదరాబాద్‌లో చదువుతున్న తమ్ముడిని తీసుకుని బస్‌లో భువనగిరికి వచ్చాడు. ఈలోపు తండ్రికి ఫోన్ చేసి టపాకాయలు తీసుకుందాం భువనగిరి పెద్ది శ్రీనివాస్ కిరాణం దుకాణం వద్దకు రమ్మని చెప్పడంతో వారు వచ్చారు. అయితే ఇంది రమ్మ కాలనీలో ఇల్లు కట్టుకోక ముందు కల్యాణ్ కుటుం బం ఆర్‌బీనగర్‌లోనే ఉండేది. దాంతో వ్యాపారి శ్రీనివాస్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ.3500 విలువ చేసే టపాకాయలను కల్యాణ్ కొనుగోలు చేసి ప్యాక్ చేయించాడు. ధర విషయం మాట్లాడి డబ్బులు చెల్లించి వస్తానని చెప్పి లోపల ఉన్న శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. ఈలోపు సాయి కల్యాణ్ తండ్రి, తమ్ముడు బయటకు వచ్చారు. ఇంతలోనే ప్రమాదం జరగడం కళ్యాణ్ అందులో చిక్కుకుని సజీవ దహనమయ్యా డు. తమ కళ్లముందు కుమారుడు కాలిపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
ప్రమాద మృతుల్లో ఒకరైన రావుల నాగేశ్వరరావు(60) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అద్దె ఇంట్లోనే నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతను ఎలక్ట్రీషియన్ నాగేశ్వరరావుగానే అందరికీ సుపరిచితుడు. కుమారుడి వివాహం అనంతరం భార్య అనురాధతో కలిసి నివసిస్తున్నాడు. అయితే బుస్సా శ్రీనివాస్ షాపులో ఎమర్జెన్సీ లైట్‌కు మరమ్మతు చేయాలని కోరడంతో నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
చికిత్స పొందుతున్న పోశెట్టి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉపిగాని పోశెట్టిని సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇతడు బాణసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. పోశెట్టి పట్టణంలోని గంజ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
జాగ్రత్తలు తీసుకోవాలి : ఎంపీ
బాణసంచా కాల్చడం, అమ్మడం వంటి విషయాల్లో జాగ్రతలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచిం చారు. పట్టణంలోని ఆర్‌బీనగర్‌లో ప్రమాద ఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో మృతిచెందిన తీరును ఆయన ఆర్డీఓ మధుసూదన్, సీఐ నరేందర్‌గౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే భువనగిరి పట్టణంతో పాటు గ్రామాల్లో అనుమతి లేకుండా టపాకాయలు అమ్మకాలు చేయరాదని, బహిరంగ ప్రదేశాలలో, గృహాలకు దురంగా అమ్మకాలు చేయాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగ కూండా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
అగ్ని ప్రమాదంలో మృతిచెందిన రావుల నాగేశ్వర్ కుమారుడిని పరామర్శించి ఆపద్బంధు పథకం కింద ఆర్థికసాయం అందే విధంగా చూస్తానని చెప్పారు. అలాగే ఏరియా ఆస్పత్రిలో ఉన్న వలబోజు సాయికళ్యాణ్ మృతదేహాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట జడల అమరేందర్, నాగరం ఆంజయ్య, కొల్పుల అమరేందర్, రాముగౌడ్ ఉన్నారు.
నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు
Published Thu, Oct 23 2014 12:10 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
Advertisement
Advertisement