Neglect
-
సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు
-
అమ్మా.. నాన్నా అంత భారమయ్యానా..
తల్లిదండ్రుల నిర్లక్ష్యం అభంశుభం తెలియని బాలుడికి శాపంగా మారింది. అమ్మానాన్నల సంరక్షణలో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఎవరూ లేని అనాథలా వెక్కిరించింది. కనిపెంచిన పేగుబంధమే.. వదిలించుకోవాలని చూసింది.. అన్నీతానై వ్యవహరించాల్సిన తండ్రి తనకేం సంబంధం లేదు.. అన్నట్లుగా వ్యవహరించాడు. ఫలితంగా మూడేళ్ల పాటు ట్రస్టులో ఆశ్రయం పొంది, రెండు రోజుల క్రితమే సొంతూరు చేరుకున్న ఓ బాలుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దోమ: మండల కేంద్రానికి చెందిన బొక్క బాబు, యాదమ్మ దంపతులకు భరత్ అనే కు ఏడేళ్ల కుమారుడున్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని కలహాలు చెలరేగాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న యాదమ్మ కొడుకును నీవద్దే పెంచుకో.. అని భర్తకు సూచించింది. ఇందుకు బాబు అంగీకరించలేదు. చేసేదేమి లేక ఎనిమిదేళ్ల భరత్‌ను తీసుకుని బతుకుదెరువు కోసం బయలుదేరింది. హైదరాబాద్ చేరుకుని రెండేళ్ల పాటు కూలీనాలీ పనులు చేసుకుంటూ కొడుకును సాకింది. ఆతర్వాత విజయవాడకు చేరుకుంది. ఈ సమయంలో ఆ తల్లి హృదయం పాశానంగా మారింది. నాకే దిక్కు లేదు.. వీడిని ఎలా చూసుకోవాలి అనుకుందో ఏమో.. పదేళ్ల పసి బాలుడిని వదిలించుకోవాలని డిసైడైంది. విజయవాడ రైల్వే స్టేషన్లో కొడుకును వదిలేసి, తన దారిన తాను వెళ్లిపోయింది. అమ్మ జాడ తెలియక వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బాలుడు భయంభయంగా రైల్వే స్టేషన్‌లోని ఓ మూలన కూర్చుండిపోయాడు. ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.. అమ్మకు ఏమైందో..? ఎటు వెళ్లిపోయిందో తెలియని పరిస్థితి. ఏవైపు నుంచి వస్తుందోనని ఆత్రుతగా చూడటమే తప్ప.. అమ్మ రాలేదు.. ఏడుపు ఆగలేదు. ఇది గమనించిన ప్రయాణికులు స్టేషన్లో ఓ బాలుడు ఒంటరిగా ఏడుస్తున్నాడని విజయవాడ చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి.. మీది ఏ ఊరు, మీ అమ్మానాన్నల పేర్లు ఏంటి అని ప్రశ్నించినా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చిన్నారిని తీసుకెళ్లిన చైల్డ్‌లైన్ సిబ్బంది విజయవాడలోని ఎస్కేవీ ట్రస్ట్‌లో చేర్పించారు. ఇది జరిగి మూడేళ్లు గడిచింది. ఈ మధ్యకాలంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్నిసార్లు అడిగినా భరత్ మాత్రం తన ఊరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. వారం రోజుల క్రితం భరత్‌తో మాట్లాడిన ట్రస్టు సభ్యులకు.. వికారాబాద్ దగ్గర దోమ గ్రామమని చెప్పాడు. దీంతో పూర్తి వివరాలు తెలుసుకున్న ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం బాలుడిని తీసుకుని దోమకు చేరుకున్నారు. కన్నకొడుకు తిరిగొచ్చినా.. ప్రస్తుతం భరత్ వయసు పదమూడేళ్లు.. ఐదేళ్ల తర్వాత కన్నకొడుకును చూసిన ఆ తండ్రిలో ఏమాత్రం చలనం కనిపించలేదు. భార్య, కొడుకు ఇంటినుంచి వెళ్లిపోయిన రోజునుంచి ఒక్కసారి కూడా వారిని వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం వారు బతికే ఉన్నారా..? లేదా..? అనే సమాచారం కూడా తెలియదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లోనూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టినా.. నా కొడుకు తిరిగొచ్చాడు.. అని బాలుడిని చేరదీయలేదు.. ముద్దాడలేదు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు బాబుకు సర్దిచెప్పి.. భరత్‌ను అప్పగించారు. దీంతో తప్పదు అన్నట్లు కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. తన దారిన వెళ్లిపోయిన తల్లి కుటుంబ కలహాలతో భర్తకు దూరమై, కొడుకును వదిలేసిన యాదమ్మ తనదారి తాను చూసుకుంది. ఆమె ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నట్లు తెలిసింది.ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్ అటు తల్లి దూరమై.. ఇటు తండ్రి ఆలనాపాలనా కరువైన భరత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక నాయకులు, ఎస్కేవీ ట్రస్ట్ ప్రతినిధుల సహకారంతో బాలుడిని వికారాబాద్‌లోని గురుకుల పాఠశాలలో చేర్పించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి భరత్ బాధ్యతలు తీసుకోవాలని, లేదా ప్రభుత్వం తరఫున చేయూత అందేలా చూడాలని సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామస్తులు కోరారు. బాగా చదువుకుంటానా చిన్నప్పుడు అమ్మానాన్నా నన్ను బాగా చూసుకునేవారు. ఇప్పుడు వారికి నాపై ఎలాంటి ప్రేమ లేదు. ఇద్దరూ నన్ను దూరం పెట్టేందుకే ప్రయతి్నస్తున్నారు. అమ్మ నన్ను వదిలి వెళ్లిన రోజు గుర్తొస్తేనే భయమేస్తోంది. చైల్డ్‌లైన్ వారు వచ్చి వివరాలు అడిగినా భయంతో ఏమీ చెప్పలేకపోయా. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి నా వివరాలు తెలియజేశా. దీంతో నన్ను నాన్న దగ్గరకు తీసుకువచ్చారు. కానీ ఆయనేమో నన్ను ఆదరించడం లేదు. అందరూ వచ్చి వికారాబాద్‌లోని రెషిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఇకనుంచి బాగా చదువుకునేందుకు ప్రయతి్నస్తా. – భరత్‌కుమార్ -
సర్కార్ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యకి ఎసరు
-
వైఎస్ జగన్ భద్రత గాలికి.. అడుగడుగునా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్‌కి జెడ్‌ప్లస్ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.చాపిరేవుల టోల్ గేట్ దగ్గర ఏకంగా వైఎస్ జగన్ కారుపైకెక్కి పడుకున్నాడు ఓ యువకుడు. మరో ఘటనలో అయిలూరు మెట్ట చందమామ ఫంక్షన్ హాలు దగ్గర వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుపైకి ఎక్కాడు మరో యువకుడు. సీతారామపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో కూడా తోపులాట జరిగింది.వైఎస్ జగన్‌కు తగిన భదత్ర కల్పించాలని హైకోర్టు పేరొన్న సంగతి తెలిసిందే. కాగా, వైఎస్ జగన్‌కి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది.ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్‌లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలతో పాటు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ట్వీట్లో వెంకీ రాస్తూ..' కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. దీంతో టైముకి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం) దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి.'అని రాసుకొచ్చారు. కాగా.. వెంకీ ప్రస్తుతం నితిన్‌తో ఇటీవల సినిమాను ప్రకటించారు. భీష్మ’ తర్వాత నితిన్ - రష్మిక కాంబోలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) #NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L — Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023 -
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్‌నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్‌కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
Viral Video: అమ్మా! ఏమరపాటు వద్దు.. థ్యాంక్ గాడ్..!
-
India vs England: అద్భుతంనుంచి అగాధానికి...
లార్డ్స్ టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతో అరుదైన విజయాన్ని అందుకున్న భారత జట్టు అంతలోనే అయ్యో అనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు నిప్పులు చెరుగుతుండగా, ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే మన జట్టు ఆట ముగిసిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్ తొలి రోజును ఘనంగా ముగించింది. లీడ్స్: తొలి రోజు భారత్ బ్యాటింగ్‌ను చూస్తే... లార్డ్స్‌లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 40.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (105 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్ స్కోరర్ కాగా, అండర్సన్ (8–5–6– 3) నిప్పులు చెరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లతోనే భారత ఇన్నింగ్స్ స్కోరును అధిగమించేసింది. ఆట నిలిచే సమయానికి 42 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. బర్న్స్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), హమీద్ (60 బ్యాటింగ్; 11 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో బంతి నుంచి ఆలౌట్ దాకా... సిరీస్‌లో ఆధిక్యం... జట్టులో ఆత్మవిశ్వాసం... ఇంకేం మూడో టెస్టులోనూ పైచేయి సాధించేయొచ్చులే అన్న ధీమా ఐదో బంతికే డీలా పడింది. తొలి ఓవర్ వేసిన అండర్సన్ ఐదో బంతికే రాహుల్ (0)ను డకౌట్ చేశాడు. మళ్లీ తనే ఐదో ఓవర్లో చతేశ్వర్ పుజారా (1), కొంత విరామం తర్వాత 11వ ఓవర్లో కెప్టెన్ కోహ్లి (7)ని పెవిలియన్ చేర్చాడు. లంచ్ విరామానికి ముందు రాబిన్సన్ బౌలింగ్‌లో రహానే కూడా బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 56/4 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లింది. 67/5.... 67/9 జరిగిందేదో జరిగింది! రెండో సెషన్లో భారత్ చక్కబడదా! పైగా హిట్‌మ్యాన్ రోహిత్ ఉండనే ఉన్నాడు. అని సరిపెట్టుకున్న స్థైర్యం చెల్లాచెదురయ్యేందుకు... భారత్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. లంచ్ అయిన వెంటనే రిషభ్ పంత్ (2) అవుటయ్యాడు. 36 ఓవర్లలో భారత్ స్కోరు 67/5. ఇంగ్లీష్ పేస్ తుఫాను ఇంకా ముగిసిపోలేదు. ఓవర్టన్ (37వ ఓవర్), స్యామ్ కరన్ (38వ ఓవర్) ఇద్దరు ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లను పడేశారు. దెబ్బకు 67/9...‘సున్నా’ పరుగుల వ్యవధిలో 12 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయింది. మిగిలిపోయిన ఆఖరి వికెట్ లాంఛనాన్ని ఓవర్టనే సిరాజ్‌ను అవుట్ చేయడం ద్వారా పూర్తి చేశాడు. లంచ్ తర్వాత 14.5 ఓవర్లు ఆడిన భారత్ 22 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లను సమర్పించుకుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) రాబిన్సన్ (బి) ఓవర్టన్ 19; రాహుల్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; పుజార (సి) బట్లర్ (బి) అండర్సన్ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) అండర్సన్ 7; రహానే (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 18; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 2; జడేజా (ఎల్బీ) (బి) కరన్ 4; షమీ (సి) బర్న్స్ (బి) ఓవర్టన్ 0; ఇషాంత్ నాటౌట్ 8; బుమ్రా (ఎల్బీ) (బి) కరన్ 0; సిరాజ్ (సి) రూట్ (బి) ఓవర్టన్ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (40.4 ఓవర్లలో ఆలౌట్) 78. వికెట్ల పతనం: 1–1, 2–4, 3–21, 4–56, 5–58, 6–67, 7–67, 8–67, 9–67, 10–78. బౌలింగ్: అండర్సన్ 8–5–6–3, రాబిన్సన్ 10–3–16–2, స్యామ్ కరన్ 10–2–27–2, మొయిన్ అలీ 2–0–4–0, ఓవర్టన్ 10.4–5–14–3. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ బ్యాటింగ్ 52; హమీద్ బ్యాటింగ్ 60; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా) 120. బౌలింగ్: ఇషాంత్ 7–0–26–0, బుమ్రా 12–5–19–0, షమీ 11–2–39–0, సిరాజ్ 7–1–26–0, జడేజా 5–3–6–0. -
జర జాగ్రత్త.. లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో కరోనాను లైట్ తీసుకోవద్దని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ అదుపులోకి మాత్రమే వచ్చిందని పూర్తిగా అంతమవ్వలేదని చెప్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, గతంలో మాదిరిగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని అంటున్నారు. ఆంక్షలు ఎత్తివేశారని అలక్ష్యం ప్రదర్శిస్తే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత కర్తవ్యమని హితవు పలుకుతున్నారు. మరోవైపు కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. చదవండి: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత రసవత్తరంగా టీపీసీసీ పీఠం: ఐదుగురిలో ఎవరో..? -
పాజిటివ్ వచ్చింది బాబూ; పకోడీలు వేసి వస్తా!
కాశీబుగ్గ: కరోనా తీవ్రతను కొందరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. మొదటి దశలో జిల్లా అంతా ఇబ్బంది పడింది. రెండో దశ విజృంభిస్తోంది. అయినా ఈ మహమ్మారిపై అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో మెడికల్ సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు. అటు నుంచి ఆయన ‘పకోడి రుబ్బు ఉందమ్మా ఇప్పుడే రుబ్బేసున్నాము అది అయ్యాక వస్తానమ్మా’ అని సమాధానం చెప్పారు. బాధితుడి మాటలు విన్న మెడికల్ సిబ్బందికి ఓ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తేరుకుని ఆయనకు చీవాట్లు పెట్టి బలవంతంగా 108లోకి ఎక్కించారు. చదవండి: అయ్యో బిడ్డా: దూసుకొచ్చిన మృత్యువు అంతకంతకూ కోవిడ్ విజృంభణ, అసలేం జరుగుతోంది? -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్‌గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్‌ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్‌ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
ఇది పరీక్షాసమయం !
దేశం నలుమూలలా వేగంగా విస్తరించజూస్తున్న మృత్యు వైరస్‌ను అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపే స్ఫూర్తిగా సమస్త భారతావని ఆదివారం నాడు సమరభేరి మోగించింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా... చిన్నా పెద్దా, ఆడా మగా, ధనిక బీద తారతమ్యం పాటించకుండా అందరికందరూ ఆసేతు హిమాచలం జనతా కర్ఫ్యూను జయప్రదం చేశారు. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక అత్యవసర సేవల్లో నిమగ్నులైన వారందరికీ ఇళ్ల ముందు, బాల్కనీల్లో నిలబడి కోట్లాదిమంది తమ కృతజ్ఞతాపూర్వక చప్పట్లతో జేజేలు పలికారు. జనసమ్మర్ధంతో నిరంతరం కిటకిటలాడే ప్రదేశాలు సైతం ఒక్కరంటే ఒక్కరు కనబడక బోసిపోయాయి. ఇప్పటికే కోవిద్–19 కొన్ని దేశాల్లో వేస్తున్న వీరంగం గమనిస్తే ఇప్పుడున్న బాధితుల సంఖ్య అచిరకాలంలోనే ఇంతింతై పెరుగుతుందన్న సూచనలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వాలు అమల్లోకి తెస్తున్న చర్యలు గమనిస్తుంటే ఈ రాకాసి వైరస్‌తో మరింతకాలం పోరాడక తప్పదన్న సంకేతాలు కనబడుతున్నాయి. దేశంలోని 17 రాష్ట్రాలూ, అయిదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 80 జిల్లాల్లో, పలు నగరాల్లో ‘లాక్డౌన్’ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలు, నగరాలు కూడా ఉన్నాయి. దురదృష్టమేమంటే ఇంకా చాలామంది ప్రభుత్వాలు చేస్తున్న సూచనల్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తమకేం కాదులే అన్న ధీమాతో ఇష్టానుసారం సంచరిస్తున్నారు. తోటివారి ప్రాణాలను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారు. దేశంలో సోమవారం కొత్తగా 37 కేసులు కనబడటం గమనిస్తే ఈ మహమ్మారి అంతకంతకూ ఎలా తీవ్ర రూపం దాలుస్తున్నదో తెలుస్తుంది. వీటితో కలుపుకుంటే ఇంతవరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 433కి చేరుకుంది. 130 కోట్లమంది జనాభాలో వీటి శాతం ఎంత అని తేలిగ్గా తీసిపారేయకూడదన్నది వైద్య నిపుణులు చెబుతున్న మాట. మూడోవారానికల్లా ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని, ఆ తర్వాత నియంత్రణకు సైతం లొంగదని అంటున్నారు. అన్నిటికన్నా ఆందోళనకరమైన విషయం– విదేశాలకు వెళ్లడంగానీ, అలా వెళ్లినవారికి సన్నిహితంగా మెలిగిన చరిత్రగానీ లేని వారికి సైతం ఈ మహమ్మారి అంటుకోవడం. తెలంగాణలో ఇలాంటి ఒక కేసు బయటపడగా, కోల్‌కతాలో ఇదే తరహా వ్యక్తి కరోనా బారినపడి కన్నుమూశాడు. అంటే వేరే దేశాలకు పోయి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా జనం మధ్యన కొందరు సంచరిస్తున్నారని అనుకోవాలి. అలాంటి ఒకరిద్దరు పట్టుబడ్డారు కూడా. అందువల్లే లాక్డౌన్ ప్రకటనను తీవ్రంగా తీసుకుని అమలు చేయని వారికి గట్టి హెచ్చరికలు చేయడం మొదలైంది. ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం నరేంద్ర మోదీయే స్వయంగా హెచ్చరించారు. కేంద్రం ప్రకటించిన జిల్లాలు, నగరాలు మాత్రమే కాదు... మిగిలిన ప్రాంతాలను సైతం ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పరిధిలోకి తెస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ ఇదే పని చేస్తున్నాయి. ఎక్కడినుంచైనా పనిచేసే వెసులుబాటు అందరికీ ఉండదు. సాధారణ కాలంలోనే అర్ధాకలితో బతుకులు వెళ్లదీయక తప్పని స్థితిలోవుండే బడుగు జీవుల్ని అసలు గడప దాటొద్దంటే సమస్యే. కనుకనే ఆ వర్గాలవారికి రేషన్ సరుకులు అందించడం, ఇతర ఖర్చుల కోసం నగదు అందించడం వంటి చర్యలకు ప్రభుత్వాలు ఉపక్రమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికలు గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ఈ కష్టకాలంలో అద్భుతంగా పని చేస్తూ ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి చేయూతనీయడం ఊరటనిస్తుంది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కరోనా గురించి సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేయడం, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వారికి తగిన సూచనలీయడం, ఈ సమాచారాన్నంతటినీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఆరోగ్యశాఖకు అందించడం ఏపీ ప్రజలకు భరోసానిస్తోంది. సామాజిక దూరం పాటించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమని వైద్య నిపుణులు చేస్తున్న సూచనల్ని పాటిస్తూ చాలా రాష్ట్రాలు సరిహద్దులు మూసేశాయి. ప్రజా రవాణా వ్యవస్థల్ని ఆపేశాయి. తప్పనిసరి కాని దుకాణాలు సైతం తెరవొద్దని తాఖీదులిచ్చాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి గట్టెక్కిన చైనాగానీ, ఇప్పటికీ సంక్షోభంలోనే వుంటూ బయటపడే మార్గం తోచక కొట్టుమిట్టాడుతున్న ఇటలీగానీ చెబుతున్న అనుభవాలు మనం పరిగణనలోకి తీసుకోనట్టయితే మున్ముందు పెను ముప్పు తప్పదు. సంక్షోభ కాలాన్ని చూసి మనం నిరాశానిస్పృహల్లోకి కూరుకుపోనవసరం లేదు. ‘ఏ పారడైజ్ బిల్ట్ ఇన్ హెల్’ అనే గ్రంథంలో రచయిత్రి రెబెకా సోల్నిట్ చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, తెలియని భూతమేదో మనల్ని మింగేస్తున్న భావన కలిగినప్పుడు మనుషుల్లోని మానవీయత మేల్కొంటుందని, వారిలోని ధైర్యసాహసాలు, చొరవ, తాము బతుకుతూ అందరినీ బతికించాలన్న తపన హృదయపు లోలోతుల్లోంచి పెల్లుబికి వస్తాయని ఆమె అంటారు. అందుకామె అమెరికా అంతర్యుద్ధం మొదలుకొని ఆ దేశాన్ని ఊపేసిన ఎన్నో ఉత్పాతాలను ఉదహరించారు. అయితే అందరినీ ఇబ్బందులపాలు చేసే ఆపదల్ని తమకనుకూలంగా మలుచుకోవాలని దిగజారేవారూ, లాభార్జన తప్ప మరేదీ పట్టనివారూ అక్కడక్కడ ఉంటారు. కానీ సకాలంలో అటువంటి చీడపురుగుల్ని గుర్తించి ఏకాకుల్ని చేయడమే అసలైన మందు. అది సమాజంలోని అందరి కర్తవ్యం కావాలి. ఆదివారం జనపదాలన్నిటా మార్మోగిన సమైక్యత నిరంతరమై ప్రవహించాలి. ఈ మహమ్మారిని దుంపనాశనం చేయడంలో నేను సైతం ఉన్నానన్న సంతృప్తి ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి. -
బడిలో ఉన్నా.. లేనట్టే !
బడిలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది. అవి అందాలంటే పిల్లల పూర్తి వివరాలు కచ్చితంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా ప్రైవేటు యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. చిన్నపాటి లొసుగుల కారణంగా నమోదు విషయంలో వారు మొండికేస్తున్నారు. అయినా విద్యాశాఖాధికారులు మాత్రం దీనిపై ఎందుకో ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. విజయనగరం అర్బన్: విద్యార్థుల ఆధార్ అనుసంధాన ఆన్లైన్ వివరాల నమోదు (చైల్డ్ ఇన్ఫో) ప్రక్రియపై విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ నమోదు జరగకపోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటికీ ఇంకా సుమారు 30 వేల మంది విద్యార్థుల వివరాల నమోదు పూర్తి కాలే దు. ఫలితంగా చిన్నారులకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌తో కూడిన వివరాలను చైల్డ్ ఇన్ఫోలో క్రోడీకరిస్తున్నారు. కానీ ప్రైవేటు సంస్థలే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లోనే ఇబ్బందులు.. జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరానికి 3,09,139 మంది విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల్లో చేరాలన్నది లక్ష్యం. తాజా నివేదికల ప్రకారం 2,96,342 మంది నమోదయ్యారు. వీటిలో ఈ ఏడాది నూతనంగా ఒకటో తరగతిలో చేరినవారు 31,500 మంది ఉన్నారు. వీరిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 6 వేల మంది వరకు ఉండగా మిగిలిన తరగతుల్లో 10వేల వరకు చేరారు. ఇందులో 8,479 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్లినవారు మాత్రం కేవలం 734 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను అధార్ నంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలను అనుసంధానంగా చైల్డ్ ఇన్ఫోలో కలపాలి. ఈ ప్రక్రియను విద్యార్థి ప్రవేశించిన తొలి రోజునే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నమోదు నిబంధనలు శతశాతం పాటిస్తున్నారు. కానీ ప్రైవేటు, కార్మొరేట్ విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ, సైనిక్ స్కూల్ యాజమాన్యాలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. విద్యాశాకాధికారులు పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. నమోదుపై అశ్రద్ధ అందుకే... ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆ యా యాజమాన్యాలు టీసీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వస్తున్న విద్యార్థులను టీసీ లేకపోయినా చేర్చుకుంటున్నారు. దీనివల్ల చైల్జ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు చేర్పడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. జిల్లాలో 586 ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో గతేడాది చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్య 98,268 మంది మాత్రమే. కానీ నిజానికి ఆ స్కూళ్ల నుంచి గతేడాది నుంచి నమోదు కావాల్సిన సంఖ్య 25 వేల వరకూ ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో 90 పాఠశాలల వరకు ఉన్నాయి. ఇందులో ఐదు పాఠశాలల్లో 2 నుంచి 10 మందిలోపు విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. వీటిలో 80 శాతం పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి వివరాలైనా నమోదు చేయలేదు. నమోదు లేదంటే విద్యార్థులు పాఠశాలలో లేనట్టే. పథకాలకు దూరమయ్యే ప్రమాదం చైల్డ్ ఇన్ఫోలో వివరాలు లేకుంటే విద్యార్థుల పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని పాఠశాలలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి వివరాలు ఉంటేనే పథకం అందుతుంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. మరోవైపు స్కూల్ యూనిఫాం దుస్తులకు సంబంధించి కుట్టుకూలి సైతం తల్లుల ఖాతాల్లోకే వేయమన్నారు. ఇలా ప్రతి పథకానికి విద్యార్థుల వివరాలే ప్రామాణికం. చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఏ తరగతిలో చేర్చుకున్నా విధిగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందే. విద్యార్థి నుంచి టీసీ తీసుకున్న తొలి రోజునే విద్యార్థి ఆధార్, తల్లి బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలతో చైల్డ్ ఇన్ఫోలో పెట్టాలి. ఈ బాధ్య త సంబంధిత పాఠశాల నిర్వాహకులదే. వీటి నమోదు ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం పూర్తయింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా 2.5 శాతం చేయాల్సి ఉంది. – జి.నాగమణి, డీఈఓ, విజయనగరం -
వారణాసిని పట్టించుకోరు
అయోధ్య: ప్రధానిపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ విదేశాలు నిర్విరామంగా తిరుగుతున్న మోదీ సొంత నియోజకవర్గం వారణాసిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీంతో వారణాసిలో ఆమె బరిలోకి దిగుతారని వినిపిస్తున్న ఊహాగాలను మరింత బలం చేకూరినట్లయింది. శుక్రవారం అయోధ్యలో ఓ వీధిలో ప్రజలతో ముచ్చటిస్తూ ప్రియాంక.. బీజేపీ ప్రభుత్వం ధనికులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతులు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన అభివృద్ధి గురించి అడిగితే విమానాశ్రయం నుంచి పట్టణానికి నిర్మించిన రోడ్డు గురించి చెప్పారని అన్నారు. గత యూపీయే ప్రభుత్వం మంజూరు చేసిన 150 కి.మీలో కేవలం 15 కి.మీ రోడ్డు వేశారని, విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగే ఆ దారి నిండా గుంతలున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో మోదీ తన నియోజకవర్గంలోని గ్రామంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని గుర్తుచేశారు. యూపీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
మున్సిపల్ స్థలంపై కన్ను!
సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. మున్సిపాలిటీగా అపగ్రేడ్ తర్వాత మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ అయినా ఇంతవరకు ఒక వెంచర్లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వివిధ సర్వే నంబర్లలో.. సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్ అసోషియేషన్‌కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్ మిల్లర్స్ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోషియేషన్‌కు కేటాయించారు. అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్‌రావ్ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్‌లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. స్థలాలు కేటాయించేది ఎవరు? పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి. ప్రజా అవసరాలు అక్కరల్లేదా? పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. -
శుభ్రతపై నిర్లక్ష్యమేల?
ధన్వాడ: వ్యక్తిగత పరిశుభ్రతను పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత కల్పించడానికి ప్రభుత్వ పాఠశాలలో వాస్ (వాటర్ శానిటేషన్ హైజిన్) పథకాన్ని ప్రవేశ పెట్టినా అది చాలా పాఠశాలలో అమలు కావడం లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి వాటిని దూరం చేయడానికి విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని భావించిన ప్రభుత్వం పాఠశాలలో వాస్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే నిబంధనలున్నాయి. ఇందుకు అవసరమైన సబ్బులను ఆయా పాఠశాలల నిధుల నుంచి కొనుగోలు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని ఆదేశాలు జారీ చేసినా చాలా పాఠశాలలో అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షకులు సైతం ఉదాసీనత చూపుతుండడంతో ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయుల బాధ్యత.. ఉపాధ్యాయులకు ప్రతీ నెల నిర్వహిస్తున్న సముదాయ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చి వాస్ పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలను అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు దీనిపై పూర్తి అవగహన కల్పించి వారు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వారికి అందుబాటులో సబ్బులు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం చేసే ముందు చేతులు పేట్టలను సబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించాలి. భోజనం సమయంలో పరిశుభ్రతకు సబ్బులను ఏర్పాటు చేయడానికి ఇతర ఖర్చులకు రాజీవ్ విద్యా మిషన్ నుంచి ప్రాథమిక పాఠశాలలకు ఏడాదికి రూ. 10వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.15వేలు సమకూరుస్తుంది. నిరాశే మిగిలింది.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాస్ పథకం కొంతవరకైనా మార్పు తెస్తోందని ఆశించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగిలింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిందే మొదలు మధ్యాహ్న భోజనం చేసే వరకు మట్టితో సంబంధాలు ఉన్నా వాటినే వాడుతుంటారు. చాలా పాఠశాలలో బెంచీలు లేక నేలపైనే కూర్చుని విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులు మల, మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. చాలా పాఠశాలల్లో నీటి కొరత కారణంగా వీటికి దూరమవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో హడావుడిగా చేతుల పరిశుభ్రతను పెద్దగా పట్టించుకోవడంలేదు. ధన్వాడ మండలంలో మొత్తం 48 పాఠశాలలు ఉండగా ఇందులో 6500 విద్యార్థులు చదువుకుంటున్నారు. అమలుపై దృష్టి సారిస్తాం ప్రభుత్వ పాఠశాలలో ‘వాస్’ పథకం అమలవుతుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాం. ప్రతి సమావేశంలో ఉపాధ్యాయులకు వాస్‌పై సూచనలు అందిస్తున్నాం – సంగీత, ఎంఈఓ, ధన్వాడ -
ప్రయోజకుడిని చేస్తే పట్టించుకోవడం లేదు
గన్నవరం: నవమాసాలు మోసి కని, పెంచి ప్రయోజకుడిని చేసిన ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్లి పట్టించుకోవడం లేదు...నమ్మిన బంధువులు ఆస్తులు కాజేసి నట్టేట ముంచారు..భర్తను కొల్పోయిన తాను నిలువనీడ లేక వృద్ధాప్యంలో రోడ్డున పడ్డానని ఓ వృద్ధురాలు బోరున విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. జన్మనిచ్చిన తల్లి అనాథగా మరణించకుండా కనీసం వృద్ధాశ్రమంలోనైన చేర్పించే విధంగా తన కుమారుడితో మాట్లాడి న్యాయం చేయాలని ఆమె పోలీసులను శుక్రవారం వేడుకుంది. బాధిత వృద్ధురాలు తెలిపిన వివరాలు.. స్థానిక సొసైటీపేటకు చెందిన మరిమెళ్ల సత్యనాగకుమారి భర్త సుమారు 17 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆయన మరణంతో వచ్చిన ప్రమాద బీమా నగదు రూ.6 లక్షలతో కొడుకుని లండన్‌లో ఎంఎస్ చదివించింది. చదువు అనంతరం అతను ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. అదే సమయంలో ఆమె సోదరుడైన ఫణింద్రకు వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దివాల తీశాడు. అతను చేసిన అప్పులకు తను హామీగా చెక్కులు ఇచ్చింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అంతే కాకుండా పుట్టింటివారు ఇచ్చిన ఇంటిని జప్తు చేసేందుకు ప్రయత్నించడంతో వియ్యంకుడు ఒత్తిడి మేరకు తన కోడలు దీప్తి పేరున ఆస్తి రాసింది. కుమారుడు పట్టించుకోకపోవడంతో బంధువుల ఇంటి వద్ద తలదచుకుంటుంది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని, తన కుమారుడితో మాట్లాడి వృద్ధాశ్రమంలోనైన చేర్పించాలని సీఐ రవికుమార్ ఎదుట తన గోడు విన్నవించుకుంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన సీఐ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
సంక్షేమంలోను మైనార్టీలే..
జిల్లాలోని మైనారిటీలు సంక్షేమంలోనూ ‘మైనారిటీ’లమే అన్న రీతిలో వెనుకబడి ఉన్నారు. ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదు. వారి విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జనాభా పరంగా జిల్లాలో 14 శాతం మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ 15 పాయింట్ ఫార్ములా, ఉస్తాద్ లాంటి పథకాల అమల్లో విఫలమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని దుల్హన్, రోష్ని, ఉపకార వేతనాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరులోనే పథకాలున్నా అవి లబ్ధిదారులకు అందుతున్నది శూన్యం. బద్వేలు: ఉర్దూ విద్యపై నిర్లక్ష్యం కారణంగా ఐదారేళ్లలో దాదాపు 100కుపైగా ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. దేశంలో ద్వితీయ అధికార భాషగా ఉన్నా ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యంతో పూర్తిగా నిర్వీర్యమవుతోంది. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. చాలావరకు ఏకోపాధ్యాయ పాఠశాలలుగానే ఉన్నాయి. దీంతో ఇంటర్ ఉర్దూ మీడియంలో చదవాలంటే రాజంపేటకు వెళ్లాల్సిందే. చాలా ప్రాంతాలకు రాజంపేట దూరంగా కావడంతో తమ పిల్లలను తల్లిదండ్రులు పంపడం లేదు. డీఎస్సీలో అరకొర పోస్టులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కు పైగా ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు గతేడాది 29 ఉర్దూ పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రతి పాఠశాలలకు రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టు, ఒక ఉర్దూ పండిట్ పోస్టు మంజూరు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి 87 పోస్టులు మంజూరు కాలేదు. అప్గ్రేడ్పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ కింద నియమితులైన ఉర్దూ వలంటీర్లే దిక్కుగా మారారు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీలో కేవలం 29 పోస్టుల మాత్రమే మంజూరు చేయడంతో ఉర్దూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడం లేదు. ఇప్పటికే ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో 30కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దుల్హన్ పథకం అమలులో విఫలం ముస్లింలోని పేద యువతుల పెళ్లిళ్లకు అర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందులో పొందుపరిచిన నిబంధనలు కఠినతరంగా ఉండటంతో చాలా మంది అనర్హులుగా మారుతున్నారు. పేదలను ఆదుకోని ఈ పథకం ప్రవేశపెట్టడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రోష్ని... జోష్ నహి: ముస్లింల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా పాఠశాలలను స్థాపించి వారిని విద్యావంతులుగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది.కానీ ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఒక పాఠశాల కూడా స్థాపించబడలేదు. ముస్లింలు అధికశాతంలో నివసిస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా వరకు ఉర్ధూ పాఠశాలలు మూత పడుతుండగా ఉన్న వాటిలో ఉపాధ్యాయలు కొరత వేధిస్తోంది. మకాన్ దుకాన్ కహా...: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ముస్లింలకు సొంతింటితో పా టు ఆదుంలోనే చిరు వ్యాపారం చేసుకునేందుకు చిన్నస్థాయి ఆంగడి మంజూరు చేసి వారిని ఆర్థికంగా పుష్టివంతులను చేయడమే మకాన్దుకాన్ పథకం ఉద్దేశం. జిల్లాలో ఎక్కడా ఈ పథకం అమలుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు..: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీల సంక్షేమం నానాటికి తీసికట్టు అన్నట్లుగా అయింది. దేశంలోనే మైనారిటీ మంత్రి లేకుండా మంత్రివర్గం ఉండటం రాష్ట్రంలోనే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వారి స్థితిగతులు బాగు పడ్డాయి. ఆయన మరణాంతరం తిరిగి పరిస్థితి మొదటికే వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పదవి కేటాయించారంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగని వక్ఫ్ భూముల కబ్జా జిల్లాలో వక్ఫ్ బోర్డు కింద పలు దర్గాలు, పీర్లచావిడి, మసీదులకు సంబంధించి 1945 ఎకరాల విలువైన భూమి ఉంది. పలు ప్రాంతాల్లో వక్ఫ్ భూములను ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే 244 ఎకరాలు అన్యాక్రాంతం కాగా మరో 70 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉంది. వక్ఫ్ చట్టం 52–ఏ ప్రకారం ఆక్రమణదారులపై కఠిన చర్యలు తప్పవంటున్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు లేవు. -
కూతుర్ని నిర్లక్ష్యం చేశారు.. జైలుకెళ్లారు
వాషింగ్టన్ : తమ ఆరు నెలల చిన్నారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారనే నేపంతో అరెస్టయిన భారతీయ దంపతులకు అమెరికా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివారాలు.. తమిళనాడుకు చెందిన ప్రకాశ్ సెట్టు, మాలా పన్నీర్‌సెల్వం కొన్ని ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తమ 6 నెలల చిన్నారి హిమిషాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఫ్లోరిడాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు హిమిషాకు చేయాల్సిన చెకప్‌ల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాటి ఖరీదు ఎక్కువ ఉండటంతో హిమిషా తల్లిదండ్రులు సదరు టెస్ట్‌లు చేపించకుండానే తమ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు. దాంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం హిమిషా తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన దేశంలో అయితే కన్నవారిని, కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను పట్టించుకోకపోవడం పెద్ద వింత కాదు.. నేరం అంతకంటే కాదు. కానీ అమెరికాలాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి పనులు చేస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హిమిషాకు వైద్య పరీక్షలు చేయడానికి నిరాకరించిన ఆమె తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయడమే కాక వారిని అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది. నేడు హిమిషా తల్లిదండ్రులకు కోర్టు 30 వేల డాలర్ల పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. ఈ సొమ్ము చెల్లించేంత వరకూ వారు తమ పిల్లలను చూడటానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హిమిషా, ఆమె కవల సోదరుడు ఇద్దరూ చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు సంరక్షణలో ఉన్నారు. ఈ విషయం గురించి హిమిషా అమ్మమ్మ తల్లిబిడ్డలను వేరు చేయడం మహా పాపం అంటూ విమర్శించారు. వైద్య పరీక్షలకు ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి రావడం.. అంత మొత్తానికి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం వల్లే నా కూతురు, అల్లుడు హిమిషాను ఆస్పత్రి నుంచి తీసుకోచ్చారు. ఇప్పుడు బెయిల్ లభించినా కూడా దాదాపు 22 లక్షల రూపాయలు కట్టాలని ఆదేశించారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. అందుకే విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. -
బాల్యం వారికిద్దాం బరువు మనం మోద్దాం
పెద్దవాళ్లు ట్రిమ్ చేస్తుంటే తీర్చిదిద్దినట్లు క్రోటన్ మొక్కల్లా పెరుగుతున్న పిల్లలు సహజమైన వికాస పరిమళాలను మాత్రం వెదజల్లలేకపోతున్నారు. ఇప్పుడొస్తున్న వాణిజ్య ప్రకటనలు ఈ పరిస్థితిని మార్చి పిల్లల్ని అర్థం చేసుకునేలా పెద్దల్నే తీర్చిదిద్దుతుండడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం. నెస్లే.. మ్యాగీ నూడుల్స్‌ను ఇండియాలో మార్కెట్ చేయడానికి ఇక్కడి టీమ్ చాలానే కసరత్తు చేసిందట. అప్పటి దాకా మన దగ్గర నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ ఏవీ లేవు. నూడుల్స్ వంటి చైనీస్ ఫుడ్ మనింట్లో ఘుమఘుమలాడించిన దాఖలా అంతకన్నా లేదు. అలాంటి సంప్రదాయంలో మ్యాగీని ఎలా ఇమడ్చాలి? ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా తయారు చేయాలి? ‘‘పిల్లలు... యెస్ వాళ్లను టార్గెట్ చేస్తే..?’’ అనుకున్నారు నెస్లే ఇండియా అప్పటి మార్కెటింగ్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ సంగీతా తల్వార్. పిల్లలకు ఏదైనా ఆటే. తినడం కూడా! స్పూన్‌తో తీసుకుంటూ ఉంటే నూడుల్స్ జారిపోతూ ఉండడం.. మళ్లీ వాటిని ఫోర్క్‌కు చుట్టుకోవడం నోట్లో పెట్టుకుని చివరి నూడుల్‌ను లోపలికి పీల్చుకోవడం.. పిల్లలు ఎంజాయ్ చేస్తారని అనిపించింది. పైగా అప్పుడు పిల్లల్ని ఏ యాడ్ ఏజెన్సీలూ పెద్దగా పట్టించుకోవడంలేదు.. పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వాళ్లను పెట్టుకుని రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీని మార్కెట్ చేసి ఇప్పుడు పెద్దవాళ్లకూ ఫేవరేట్ అయ్యేంత ప్రాచుర్యంలోకి తెచ్చింది. మింగేస్తున్నాం పిల్లలు నిన్నమొన్నటిదాకా నెగ్లెక్టెడ్ కేటగిరీయే. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాఇష్టాలు, వాళ్లవే అయిన ఆటలుపాటలు, వాళ్ల పరిశీలనలు, ఆసక్తులు, అభిరుచులను పట్టించుకుంటున్న పెద్దలు నేటికీ తక్కువే. వాళ్లు ఆడినా.. పాడినా.. అబ్బురపడేలా చేసినా.. వెనక పెద్దవాళ్ల బలవంతమే. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల బాల్యాన్ని స్కెచ్ చేస్తున్నది పేరెంట్సే. క్లచెస్లో పెద్దవాళ్లకు నచ్చిన ఆకృతిలో పెరుగుతున్న క్రోటాన్ మొక్కలు. ఎప్పటికప్పుడు కొమ్మలు, రెమ్మలు కోతకు గురవుతూ చక్కటి తీరులో బాల్యం పెరుగుతోంది.. సహజ పరిమళాలను కోల్పోతూ! ఇక మన పెద్దవాళ్లం.. పిల్లలను ఊరించే మ్యాగీ పెద్దవాళ్లకూ ఆహారమైనట్టు పిల్లల కోసం ఏమీ మిగల్చకుండా వాళ్ల హక్కులను హరించేస్తున్నాం. మన అభిరుచులను వాళ్ల మీద రుద్దుతూ.. వారి బాల్యాన్నీ లాక్కుంటున్నాం. భావితరాల కోసం కించిత్తయినా చింతిస్తున్నామా? చింతన చేస్తున్నామా? ఇవి కావాలి ప్రకటనలకు చాలా ప్రభావం ఉంటుంది! మనమెలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా మసులుకోవాలో కూడా మార్కెటే నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే యాడ్స్. ఇప్పుడు అవి మానవసంబంధాలనూ వాడుకుంటున్నాయి. తప్పులేదు.. కమాడిటీతోపాటు ఓ విలువనూ సేల్ చేసే కమర్షియల్స్ ఇప్పుడు అవసరమే. క్యాడ్బరీ చాక్లెట్ యాడ్‌లా! అన్న హోంవర్క్ చేసుకుంటుంటాడు.. దగ్గర్లోనే తమ్ముడు.. టీపాయ్ మీద అయిపోయిన చాక్లెట్ రాపర్ పెట్టి కళ్లుమూసుకుని దేవుడికి దండంపెట్టుకుంటుంటాడు.. ‘‘దేవుడా.. ఇది తీసుకొని కొత్త చాక్లెట్ ఇవ్వూ’’ అని. కళ్లు తెరిచి చూస్తే ఖాళీ రాపరే కనిపిస్తుంది వెక్కిరిస్తున్నట్టుగా. ఏడుపు మొహం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుని వేడుకుంటాడు దేవుడిని. కళ్లు తెరుస్తాడు. చాక్లెట్. తమ్ముడి కళ్లు మెరుస్తాయి. అన్న దగ్గరకు పరిగెత్తుకెళ్లి.. దేవుడు చాక్లెట్ ఇచ్చాడు అని చెప్తాడు. ‘‘ఒక్కటేనా? నా కోసం కూడా ఎందుకడగలేదురా?’’ అంటాడు అన్న. ‘‘అయ్యో.. నెక్స్›్ట టైమ్’’ అని తుర్రుమంటాడు తమ్ముడు. అన్న మొహంలో నవ్వు. అప్పుడు వాళ్లమ్మ వచ్చి అడుగుతుంది.. ఆ ఖాళీ రాపర్ నన్ను పడేయమంటావా? నువ్వు పడేస్తావా?’’ అని. అన్న అమ్మను చూస్తాడు. తమ్ముడి కోసం అన్న చేసిన త్యాగం. అమ్మానాన్న నేర్పిన ప్రేమ. ఒకరికోసం ఒకరనే భావన! ముందు ఇంట్లో సిబ్లింగ్ రైవల్రీ లేకపోతే భారతీయులంతా సోదరసోదరీమణులే.. ద్వేషమంటే తెలియకుండా పెరుగుతారు కాబట్టి. ఈ విషయాన్ని పెద్దవాళ్లకూ చెప్పాలి. పేరెంటింగ్ నేర్పాలి. క్యాడ్బరీ యాడ్ అదే చేసింది. ఫస్ట్ కాదు బెస్ట్ ఇది క్లాస్మేట్ కంపాస్బాక్స్ యాడ్. లెక్కల్లో తక్కువ మార్కులు వస్తాయి పాపకు. ఫస్ట్ మార్క్స్ వస్తే చాక్లెట్ కేక్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది అమ్మ. అందుకే కేక్ చేయొద్దులే మార్కులు రాలేదు అంటుంది కూతురు స్కూల్నుంచి వస్తూనే నిస్సత్తువగా. అమ్మ రాత్రి అమ్మాయి అసైన్మెంట్ బుక్ చూస్తుంది. ప్రతిసారీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతూంటాయి. తెల్లవారి పాప బడికెళ్లే టైమ్‌కల్లా చాక్లెట్ కేక్ డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటుంది. బిడ్డ కళ్లు విప్పారుతాయి సంతోషంగా. అంతలోకే మొహం ముడుచుకుపోతుంది. ఫస్ట్ రాలేదు కదా కేక్ ఎందుకూ? అని అడుగుతుంది. బెస్ట్‌గా ఉన్నందుకు అంటుంది అమ్మ. లైఫ్‌లో ఫస్ట్ కాదు బెస్ట్‌గా ఉండాలన్న సందేశం ఆ యాడ్దే. అదీ అమ్మానాన్నల నోటి నుంచి రావాలి. మార్కులు, ర్యాంకుల్లో కాదు మానవత్వంలో ముందుండాలి. బెస్ట్ హ్యూమన్ బీయింగ్‌గా బతికేలా పిల్లలకు నేర్పాలనే స్పిరిట్‌ను చాటే యాడ్ అది. పిల్లలు భవిష్యత్ తరాల బాగును ఆలోచించే రేపటి పౌరులుగా తయారు కావాలి. ఆ బాధ్యత పెద్దలుగా మనం ఇప్పుడు నిర్వర్తించాలి. బాల్యాన్ని వాళ్లకిద్దాం. బరువును మనం మోద్దాం. సమాజంలో పిల్లలు నెగ్లెక్ట్ అవకూడదు. వాళ్ల స్పేస్‌ను పెద్దలు ఆక్రమించకూడదు! ఈ విషయాన్నే ఇప్పుడొస్తున్న యాడ్స్ చక్కగా, మనసుకు హత్తుకునేలా చెబుతున్నాయి. – సరస్వతి రమ -
ఈ–ఆఫీసు మారదు బాసూ!
అనంతపురం అర్బన్: ఈ–ఆఫీసు నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు అవుతున్నాయి. నెల రోజులు గడిచినా పురోగతి లేకపోవడం చూస్తే ప్రభుత్వ శాఖల్లో అధికారుల తీరు అర్థమవుతోంది. జిల్లాలో మొత్తం 116 ప్రభుత్వ శాఖలు ఈ–ఆఫీసు నిర్వహిస్తుండగా.. గత నెలలో అన్ని శాఖలు కలిపి 6,196 ఫైళ్లను మాత్రమే ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 1,146 ఫైళ్లు.. మునిసిపల్ కార్పొరేషన్ 227, ఎస్ఈ హెచ్ఎల్సీ 429, ఇరిగేషన్ సర్కిల్ 417, జిల్లా పోలీసు కార్యాలయం 425 ఫైళ్లు ఈ–ఆఫీసులో నిర్వహించాయి. ఇక మిగతా శాఖలు రెండంకెలు కూడా దాటకపోవడం గమనార్హం. రోజూ ప్రతి శాఖలో కనీసం పది ఫైళ్లు సిద్ధం అవుతుంటాయి. ఈ లెక్కన రోజుకు కనీసంగా వెయ్యి ఫైళ్లు, నెలలో 30వేల ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహించాల్సి ఉండగా పురోగతి లోపించింది. గత వారం రోజుల ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో ఈ నెల 7న డీఆర్ఓ డీఆర్వో ఎస్.రఘునాథ్సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని శాఖలు వారంలో ఒక్కఫైలు కూడా ఈ ఆఫీసు ద్వారా పంపలేదనే విషయం వెల్లడైంది. ఆయా శాఖల అధికారులను ప్రశ్నించగా మౌనమే సమాధానమైనట్లు తెలిసింది. పురోగతి సున్నా గత వారం ఈ–ఆఫీసు ద్వారా కొన్ని శాఖలు ఒక్క ఫైలును కూడా పంపలేకపోయాయి. ఇందులో ప్రధానంగా కార్మిక శాఖ, జిల్లా వృత్తి విద్యాశాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, మెప్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుప్రతి, మైనారిటీ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, గనుల శాఖ, వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి, ఇంటర్మీడియేట్ విద్యా శాఖ, ఎన్టీఆర్ వైద్యసేవ, ఆడిట్ శాఖ, ఇలా దాదాపు 44 శాఖలు వారం వ్యవధిలో ఒక్క ఫైలూ నిర్వహించలేదని డీఆర్వోలో పరిశీలనలో వెలుగుచూసింది. పలు ధఫాలు శిక్షణ ఇచ్చినా.. కోర్టు కేసులకు సంబంధించిన ఫైళ్లు మినహా జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు. ఒక్కసారి కాదు.. పలు దఫాల శిక్షణ పూర్తయింది. ఆ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి వచ్చిన సందేహాలనూ నివృత్తి చేశారు. ఈ–ఆఫీసు నిర్వహణలో దొర్లుతున్న పొరపాట్లను స్వయంగా కలెక్టర్ జి.వీరపాండియన్ పలుమార్లు ‘మీ కోసం’ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమీక్షలో అధికారులకు వివరించారు. నోట్‌ఫైల్ ఎలా ఉంచాలి, పాత ఫైళ్లను స్కానింగ్ చేయడం తదితరాల్లో తప్పులను తెలియజేస్తూ ఎలా సరిద్దుకోవాలనే విషయాన్ని కూడా తెలిపారు. నిర్వహణలో ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతుంటే ఎన్నిసార్లయినా శిక్షణనిస్తామని కూడా చెప్పారు. అయినప్పటికీ పలు శాఖలు ఈ–ఆఫీసు విషయంలో నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి. ‘మాన్యువల్’ మతలబు ఈ–ఆఫీసు నిర్వహణ తీరు చూస్తే కొన్ని శాఖలు ముఖ్యమైన ఫైళ్లను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నాయనేది స్పష్టమవుతోంది. ఇలా నిర్వహించడం వెనుక ‘మతలబు’ వ్యవహారం ఉన్నట్లు విమర్శులు వినవస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలకు తావిచ్చే ఫైళ్లను కొందరు అధికారులు మాన్యువల్‌గా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఫైళ్లు ఈ–ఆఫీసు ద్వారా నిర్వహిస్తే ‘లాభం’ లేకుండా పోతుందనే ఉద్దేశంతో కొందరు మాన్యువల్‌గా ఫైళ్లను కొనసాగిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. తీవ్రంగా పరిగణిస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వశాఖలన్నీ ప్రతి ఫైలును ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. ఈ–ఆఫీసును విస్మరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి అధికారుల పనితీరును ప్రభుత్వానికి నివేదిస్తాం. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటాం.-ఎస్.రఘునాథ్, జిల్లా రెవెన్యూ అధికారి -
చుక్కల భూమిలో అమలుకాని హక్కులు
చుక్కల భూములపై యాజమాన్య హక్కులు రైతులకు దక్కేలా కనిపించడం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ భూములపై అన్నదాతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం వచ్చి పదినెలలవుతున్నా దీనిపై రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పరిమిత సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించేందుకు తహసీల్దార్లు సుముఖత చూపకపోవడంతో హక్కుల కోసం రైతన్నలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె: జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లోనున్న చుక్కల భూముల హక్కులపై రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారు. ఈ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2017 జూన్ 14న చట్టం అమల్లోకి తెచ్చింది. జూలై 17న మార్గదర్శకాలను విడుదల చేసింది. భూములపై హక్కులు కల్పించాలని రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 56,378 మంది రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 23 మండలాల్లోని భూములకు 985 దరఖాస్తులు అందాయి. ఇందులో చాలా దరఖాస్తులు పరిశీలనకు రాకపోవడం గమనార్హం. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 18 మండలాల్లో 135 దరఖాస్తులను క్రమబద్ధీకరణ కోసం కలెక్టర్ వద్దకు పంపితే 85 పరిష్కారమయ్యాయి. అందులో 54మందికి హక్కు కల్పించి, 31మందిని వివిధ కారణాల చేత తిరస్కరించారు. జిల్లాలోని పీలేరు, వాల్మీకిపురం, కలికిరి, తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో ఎక్కువ సంఖ్యలో చుక్కల భూములు ఉన్నాయి. చట్టం ఏం చెబుతోందంటే... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1954లో భూముల రీసర్వే జరిగింది. రికార్డుల్లో సర్వే నంబర్ల వారీగా ఖాతాదారుల పేర్లు లేని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు(డాట్స్) పెట్టారు. చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించేందుకు ఆ భూములను ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ (పీవోబీ) నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ చట్టాన్ని 2017 జూన్ 11న చేశారు. జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్న భూములకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. చట్టం చేసిన నాటికి 12 ఏళ్లు భూమి స్వాధీనానుభవంలో ఉండాలి. రైతులు ఫారం–3లో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను బట్టి అధికారులు గ్రామసభ నిర్వహించి ఈ భూముల రైతులను నిర్ధారించుకోవాలి. నివేదికలు ఆర్డీవోలకు, అక్కడి నుంచి జిల్లాస్థాయి కమిటీకి వెళతాయి. కమిటీ ఆరునెలల్లోగా అర్జీలను పరిశీలించి ఈ భూములకు ఆమోదం తెలిపిన తర్వాత రీసెటిల్మెంట్ రిజిస్టర్ కాలం(16) కింద చుక్కల స్థానంలో పట్టాదారుల పేర్లు చేర్చుతుంది. తహసీల్దార్ల నిర్లక్ష్యం తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్న అర్జీల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఆయా సాగుదారులు ఈ భూముల్లో సాగుచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని స్వయంగా విచారించాలి. వారితో స్టాంప్ పేపర్లపై అఫిడవిట్లు తయారు చేయించి నోటరీ ద్వారా నిర్థారణ చేసుకోవాలి. కాని తహసీల్దార్లు కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదికలనే జిల్లాస్థాయి కమిటీలకు పంపుతున్నారు. మరోవైపు దరఖాస్తుదారులకు దస్త్రాల పేరుతో కొర్రీలు పెడుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చుక్కల భూములు మిగులు చూసుకుని వాటిలో తమకు అనుకూల వ్యక్తుల పేర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
డబ్బుంటే సుబ్బారావు.. లేకుంటే సుబ్బిగాడు!
ఒంగోలు అర్బన్: నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర పరిధిలో భవనాలు, ఖాళీ స్థలాలకు పన్నులు విధిచండం.. పన్నుల్లో మార్పులు, అనధికారిక భవనాలకు విధించే పన్నులు.. తదితర పనుల్లో రెవెన్యూ విభాగం ఆర్ఐలు, రెవెన్యూ విభాగం బాధ్యతలు చూస్తున్న అసిస్టెంట్ కమిషనర్, ఇతర సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. పైసలివ్వందే ఫైలు కదిలే పరిస్థితి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఆదాయాలే లక్ష్యంగా రెవెన్యూ విభాగం సిబ్బంది నగరపాలక ఖజానాకు గండి కొడుతున్నారు. గజిట్ ప్రకారం కేటాయించిన జోన్ల్లో ఇష్టానుసారంగా బహుళ అంతస్థులకు కొలతల్లో అవకతవకలు చేసి భారీగా తగ్గించి పన్నులు విధిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కుళాయి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్ల కోసం క్రయ విక్రయాలు జరిపిన డీకే పట్టాలకు ఎటువంటి ఆస్తి హక్కు కల్పించకుండా మౌలిక వసతుల కోసం విధించాల్సిన సూపర్స్ట్రెక్చర్ (ఎస్ఎస్) ట్యాక్సుల సైతం నిలిచిపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ చాంబర్లో వందల కొద్ది దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ పనితీరుపై కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. భవన అనుమతులు పొందిన భనాలకు సంబంధించి నిర్మించిన ఎక్స్ట్రా ఫ్లోర్లకు సైతం పన్నులు విధించకుండా పక్కన పెడుతున్నారు. ప్లాన్ లేకుండా నిర్మించిన భవనాలైనా, అనుమతులు మీరి నిర్మించిన భవనాలకైనా నూరుశాతం పన్ను అదనంగా విధించాలి. అయితే మామూళ్లకు అలవాటుపడిన రెవెన్యూ విభాగం పన్నుల విధింపులో తమ చేతివాటం చూపుతూ నగరపాలక ఖజానాకు నష్టం తెస్తున్నారు. రెవెన్యూ విభాగం సిబ్బంది అధికార పార్టీ వారికి, డబ్బు ఉన్న వాళ్లకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఎన్నో బహుళ అంతస్థుల భవనాలు, వ్యాపార సముదాయాలకు రూ.లక్షల్లో మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద పెద్ద భవనాలకు పన్ను విధించేటప్పుడు పరిశీలించాల్సిన ఓఎంసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖజానాకు గండిపడుతున్నా ఓఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారులు కఠిన చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. ఆర్ఐలు విధించిన పన్నులపై పూర్తి పరిశీలన చేస్తే అక్రమ పన్నులు బట్టబయలు అవుతాయని నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ నేతల అండదండలతోనే.. అధికార పార్టీ నాయకులు నగరంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, అవినీతి పన్నులు, అక్రమార్కులకు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అక్రమాలకు అండగా ఉంటూ అధికారులతో సంప్రదింపులు చేస్తూ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికారిక కట్టడాలు, అక్రమ పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, సివిల్ పనుల టెండర్లు ఇలా ప్రతి పనిలో అధికార పార్టీ చోటామోటా నాయకుల హవా కొనసాగడం గమనార్హం. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు ఒక న్యాయం, డబ్బు, హోదా, అండదండలు ఉన్న పర్గాలకు మరో న్యాయం పాటించకుండా సమన్యాయం పాటించి నగరపాలక సంస్థకు నష్టం జరగకుండా సకాలంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పన్నుల విధింపులు, వసూలు సక్రమంగా జరిగితే వచ్చే ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘హైపవర్’ వేతనాలేవి?
సాక్షి, కొత్తగూడెం: సింగరేణిలో హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కోలిండియాలో కనీస వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ విస్మరించడంపై కార్మికులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో 2012లో జరిగిన ‘హైపవర్’ ఒప్పందానికి నేటికీ సింగరేణిలో మోక్షం కలగని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు అనే మాటే ఉండదని అందరినీ రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో కూడా క్రమబద్ధీకరణపై హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక ఏళ్లుగా కనీస వేతనాలు సైతం లేకుండా వెట్టిచాకిరి చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. క్రమబద్ధీకరణ విషయం పక్కనబెడితే.. కనీస వేతనాల అమలులో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కోలిండియాలో హైపవర్ కమిటీ వేతనాల చెల్లింపు అమలు అవుతున్నప్పటికీ సింగరేణిలో మాత్రం ఆ ఊసే లేదు. హైపవర్ వేతనాలు చెల్లించేందుకు 2012 సెప్టెంబరు 9న ఒప్పందం జరిగింది. ప్రకృతి విరుద్ధంగా గనుల్లో కాలుష్య వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులకు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని హైపవర్ వేతన కమిటీ సూచించింది. ఈ మేరకు వేతనాలను చెల్లించకపోవడం దారుణమని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25,367 మందికాంట్రాక్ ్ట కార్మికులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి పురోగతిలో ఉందంటే అందులో కాంట్రాక్ట్ కార్మికులదే కీలక పాత్ర. సింగరేణి వ్యాప్తంగా 24,747 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఏరియాలో 905 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,379, మణుగూరులో 1,604, ఇల్లెందులో 740, భూపాలపల్లిలో 1,109, రామగుండం–1లో 1,583, రామగుండం–2లో 1,875, రామగుండం–3లో 1,759, శ్రీరాంపూర్‌లో 1,486, మందమర్రిలో 1,126, బెల్లంపల్లిలో 2,151, అడ్రియాల లాంగ్వాల్ వద్ద 560, జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2,470 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కోల్ ట్రాన్స్పోర్ట్, లోడింగ్, అన్లోడింగ్, సులభ్ కాంప్లెక్స్ లలో మరో 5,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. నర్సరీల్లో 270 మంది, కన్వేయన్స్ డ్రైవర్లు 350 మంది ఉన్నారు. సింగరేణిలో ప్రకృతి విరుద్ధ వాతావరణంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ కార్మికులతో పాటు సమానంగా కష్టపడుతున్నప్పటికీ వారిని రెండోతరగతి పౌరులుగా గుర్తిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. అలాగే రక్షణకు సంబంధించిన పరికరాలు సైతం వీరికి ఇవ్వని దుస్థితి నెలకొంది. ఎండాకాలంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేసే తమకు కనీసం మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం లేదని కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోతున్న కార్మికులు 2012లో జరిగిన 9వ వేతన సమావేశంలో కుదిరిన ఒప్పందం మేరకు కోలిండియా పరిధిలోని కోల్కారిడార్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమలు ఆ మేరకు చెల్లిస్తున్నాయి. కానీ సింగరేణిలో మాత్రం చెల్లించటం లేదు. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సింగరేణి యాజామాన్యం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలి. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు అన్నెబోయిన వెంకన్నపీఎఫ్ వర్తింపజేయాలి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సింగరేణిలో కొన్ని విభాగాల్లో అమలు చేయడం లేదు. ప్రధానంగా నర్సరీ, సులభ్‌కాంప్లెక్స్, కన్వేయన్స్, కోల్ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగాల్లో కనీస వేతనం అమలు చేయడం లేదు. ఉదయం నుంచి రాత్రివరకు వచ్చే లారీలను ఎక్కి వాటిలో ఉన్న బొగ్గు హెచ్చుతగ్గులను సరిచేస్తూ సంస్థకు ఆర్థికంగా ఉపయోగపడే కార్మికులకు కనీసం పీఎఫ్ వర్తింపజేయకపోవడం దారుణం.– సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (ఇఫ్టూ)రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమెళ్ల సంజీవ్ -
ఎవరికివారే.... రికవరీ ఎలా...!
చీపురుపల్లి: ఆర్ఈసీఎస్ నిర్లక్ష్యం పుణ్యమాని రూ.1.79 కోట్లు డబ్బు పక్కదోవ పట్టింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదంతా జరిగి ఐదారు రోజులు గడుస్తోంది. కాని పక్కదోవ పట్టిన రూ.1.79 కోట్లు నిధులు రికవరీకు సంబంధించిన ఎలాంటి ముందడుగు చర్యలు ఇంతవరకు ప్రారంభమైనట్టు కనిపించడం లేదు. ఆంధ్రా బ్యాంకు వైపు నుంచి ప్రాథమిక నివేదిక ఉన్నత అధికారులకు సమర్పించామని చెబుతుంటే ఆర్ఈసీఎస్ వైపు నుంచేమో వోచర్లు మా దగ్గర ఉన్నాయి...డబ్బు మొత్తానికి బ్యాంకుదే బాధ్యత అంటూ స్పష్టం చేస్తున్నారు. ఇలా ఆంధ్రా బ్యాంకు, ఆర్ఈసీఎస్ ఎవరికి వారే మాటలే చెబుతున్నారు తప్ప డబ్బు రికవరికీ సంబంధించిన ఎలాంటి విచారణలు ఇంతవరకు ప్రారంభమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇందులో తమదేమీ తప్పులేదన్నట్టు ఆర్ఈసీఎస్లో ఇప్పటికే ముగ్గురు అధికారులకు ఈ నెల 3న షోకాజ్ నోటీసులు ఇవ్వగా, తాజాగా మరో నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 3న షోకాజ్ నోటీసులు ఇచ్చిన వారిని సస్పెండ్ చేసేందుకు కూడా ఎండీ సిద్ధమైనట్టు సమాచారం. ఈ చర్యలతో ఆర్ఈసీఎస్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. అంతేకాకుండా శాఖల వారీగా వారిలో అంతర్యుద్ధం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తమకు సంబంధం లేకపోయినా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటూ ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నట్టు తెలిసింది. దీంతో రూ.1.79 కోట్లు పక్కదోవ పట్టడంలో నిర్లక్ష్యం వహించిన ప్రతీ ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి ఎండీ రమేష్ వచ్చినట్టు సమాచారం. ఉద్యోగులపై చర్యలు సరే...డబ్బు సంగతి ఏంటంటే మళ్లీ పాత పాటే పాడుతున్నారు. డిపాజిట్లు వెనక్కి తీసుకునే యోచనలో... ఇదిలా ఉండగా ఆంధ్రా బ్యాంకులో ఆర్ఈసీఎస్కు చెందిన రూ.8 కోట్లు వరకు డిపాజిట్లు ఉన్నాయి. తాజాగా రూ.1.79 కోట్లు ఆర్ఈసీఎస్ డబ్బు పక్కదోవ పట్టడంలో ఆంధ్రాబ్యాంకుదే ప్రధాన పాత్ర అంటూ ఐదారు రోజులుగా ఆర్ఈసీఎస్ ఎండీ, పాలకవర్గం స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రా బ్యాంకు నుంచి స్పష్టమైన ప్రకటనలు లేవు. దీంతో ఆ బ్యాంకులో ఉన్న రూ.8 కోట్లు డిపాజిట్లు వెనక్కి తీసుకుని వేరే బ్యాంకులో డిపాజిట్ చేయాలని అధికారులు, పాలకవర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు లిఖిత పూర్వకంగా బ్యాంకును ఒకటి, రెండు రోజుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది. రికవరీ చర్యలు శూన్యం... ఇదిలా ఉండగా రూ.1.79 కోట్లు ఆర్ఈసీఎస్ డబ్బు రికవరీలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సరిగ్గా ఈ నెల 1న నిధులు గల్లంతు విషయం బయిటపడింది. అప్పటికే మూడు రోజులు ముందు నుంచి అధికారులు ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ ఏప్రిల్ 1న నియోజకవర్గంలో బాహాటంగా చర్చకు వచ్చింది. దీంతో ఈ నెల 2న పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇంతవరకు డబ్బు రికవరీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి విచారణ ప్రారంభమైనట్టు కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు, ఆర్ఈసీఎస్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తప్ప డబ్బు రికవరీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఆర్ఈసీఎస్లో రూ.కోట్ల కుంభకోణం విషయంలో ఇటు ఆర్ఈసీఎస్ అధికారులు, అటు ఆంధ్రాబ్యాంకు అధికారులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. తమ తప్పిదం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుండడంతో అసలు కుంభకోణం విషయం సంగతేంటన్నది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. -
పర్యాటక కేంద్రం కలేనా?
దేవరకద్ర రూరల్ : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని పర్యాటకులు కోరుతున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని అంటున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఎండకు ఇబ్బందిపడుతున్నామని అభిప్రాయపడుతున్నారు. నిత్యం వందల మంది పర్యాటకులు ఇక్కడి వస్తున్నారు. కుటుంబంతో ప్రశాంతంగా గడిపేందుకు అనువుగా లేకపోవడంతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. పక్కనే ఉన్న గెస్ట్‌హౌజ్ కూడా శిథిలావస్థకు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వమైనా సమస్యలపై దృష్టి పెట్టాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 1947లో నిర్మాణం.. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1947నుంచి 1955 మధ్యకాలంలో నిర్మించారు. 12వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కేవలం వర్షంపైనే ఆధారపడి ఉంది. రెండు గుట్టల మధ్య, ధన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 1955లో అప్పటి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎం.ఖర్జు ప్రాజెక్టు నీటిని మొట్టమొదటిసారి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు విడుదల చేశారు. నెరవేరని మంత్రి హామీ. గత ఏడాది కోయిల్‌సాగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. కోయిల్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ హామీగానే ఉండిపోయింది. ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించాలని పర్యాటకులు, ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితి బాధాకరం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించాలి. గత కొన్నేళ్లుగా అక్కడ పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. జిల్లాలో పేరెన్నిక గన్న ప్రాజెక్టు వద్ద ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరం. – అయ్యపురెడ్డి, దేవరకద్ర పాలకులు స్పందించాలి ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చే విషయంలో పాలకులు వెంటనే స్పందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ప్రతి ఏటా పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెబుతున్నారు కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండరాదు. – ప్రభాకర్, దేవరకద్ర -
ఏదీ ముందుచూపు!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నా..ఎప్పటికప్పుడు నిర్వహణ లోపం, ముందుచూపులేని వ్యవహారం బయటపడుతూనే ఉంది. ఒక్క అభివృద్ధి విషయంలోనే కాకుండా పనుల విషయంలో కూడా లోటుపాట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. శుక్రవారం కల్యాణోత్సవ సందర్భంగా రెండు గంటలపాటు కురిసిన వర్షం, వడగండ్ల వాన, గాలులుకు షెడ్లు కూలిపోయిన తీరు చూస్తే పనులు అంతంతమాత్రంగా చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మూడేళ్లుగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కల్యాణం జరిపిస్తున్నా.. ఒక్క కల్యాణమండపం తప్ప పక్కన సువిశాల మైదానంలో హాలులాగా శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టి ఉండవచ్చు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు కూడా పడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ పట్టించుకోకపోవడంతో ప్రతిసారి అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత వదిలేస్తున్నారు. ప్రతిసారి కల్యాణం కోసమే రూ.3కోట్ల మేర ఖర్చుచేస్తున్నా శాశ్వత నిర్మాణ విషయంలో ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. అంతంతమాత్రంగానే పనులు: టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా ఇప్పటికీ ముందుచూపు లేదనే విషయం శుక్రవారం మరోమారు స్పష్టమైంది. డెకరేషన్ లైటింగ్ సిస్టమ్‌తోసహా చలువ పందిళ్లు, ఫోకస్ లైట్ల స్తంభాలు కూలిపోవడం చూస్తే చేసిన పనులను కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు. చలువ పందిళ్లంటే రేకుల షెడ్లా? సాధారణంగా పూర్వకాలం నుంచి కూడా చలువ పందిళ్లంటే తడికెలతో పందిళ్లు వేసి, పైన షామియానా వేసినా సమస్య ఉండదు. అలాకాకుండా ఆలయం చుట్టుపక్కలతోపాటు కల్యాణ వేదిక వద్ద కూడా రేకులతోనే చలువ పందిళ్లు వేశారు. వడగండ్ల వాన, గాలుల ధాటికి రేకులు ఎగిరిపడుతూ వస్తున్న వైనం భక్తులను బెంబేలెత్తించింది. ఒకపక్క వడగండ్ల వాన రేకులపై పడుతున్నప్పుడు వస్తున్న శబ్దాలు, మరోపక్క జనాలు హాహాకారాలు, బయట కరెంటు లేక అందరూ కల్యాణవేదిక లోపలికి తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. లైట్లు కిందపడిపోయిన నేపథ్యంలో పలుచోట్ల షార్ట్ సర్క్యూట్‌తో పలువురు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ప్రకృతి దెబ్బతో కకావికలమైన ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం 6.30ప్రాంతంలో ప్రారంభమైన బీభత్సం కొన్ని గంటల్లోనే టీటీడీ చేసిన ఏర్పాట్లను కకావికలం చేసింది. ఆలయ ఆవరణలోనే టెంట్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపోయాయి. వెలుగులు లేక ఆలయం మెరుపులు మెరిసిన సమయంలో వెలుగులో మాత్రమే భక్తులకు కనిపించే పరిస్థితి శుక్రవారం రాత్రి ఆవిష్కృతమైంది. వాతావరణశాఖ హెచ్చరించినా... శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా అధికారులు మేల్కొకోకపోవడం కూడా ఘటనకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కనీసం ముందుజాగ్రత్తలు తీసుకుని ఉంటే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలను జాగ్రత్తగా మండపంలో కూర్చోబెట్టి ఎలాగోలా ఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుని ఉండవచ్చు. కానీ హెచ్చరికలు చేసినా ఎవరు కూడా వాటిని పట్టించుకోకపోవడం, మెరుపువేగంతో ప్రకృతి బీభత్సం అందరినీ భయపెట్టింది. రచనిపోయిన ఒకరిద్దరిని ఒంటిమిట్ట ఆస్పత్రి ఆవరణంలో దిక్కులేని వారిగా పడేసిన తీరు చూసి పలువురు కంటతడిపెట్టారు. -
కార్డు పని చేయదు..వైద్యం అందదు
ఉద్యోగులకు నగదురహిత వైద్యంప్రకటనలకే పరిమితమైంది.వారికిచ్చిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి.నెలనెలా ప్రీమియం వసూలుచేస్తున్నా వైద్యం అందించే విషయంలోసర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహితవైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి.దీంతో తప్పని పరిస్థితిలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కడప ఎడ్యుకేషన్: నగదు రహిత వైద్యం అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, òపెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత వి«ధానంలో వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్డులను కూడా జారీచేశారు. ఇవన్నీ ఇచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ హెల్త్‌కార్డుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గరిష్టంగా రూ.2లక్షల వరకూ పొందేవారు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందించడానికి హెల్త్‌కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నెలనెలా ప్రీమియం వసూలు 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెల రూ.90 రూ.120లను వారి వేతన శ్రేణిని బట్టి ప్రీమియం రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన మొత్తం ద్వారా దాదాపు రూ.350 కోట్లు ప్రభుత్వానికి జమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయబట్టి మూడేళ్లైనా కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొన్ని చిన్న వ్యాధులకు మాత్రమే వైద్యం అందుతుంది. దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేస్తున్నారు తప్ప పెద్దవ్యాధులకు వైద్యం చేయడం లేదు. క్యాన్సర్, గుండె, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ ఉద్యోగులకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ముందుగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై అప్పులపాలవుతున్నారు. జిల్లాలో ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లుఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లావ్యాప్తంగా 35వేలమంది దాకా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ.90, 120 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా గత మూడేళ్ల నుంచి తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా నగదు రహిత వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నా.. ప్రస్తుతం హెల్త్‌కార్డులు అమలుకాకపోవడంతో చాలామంది డబ్బులు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మెడికల్ రీయింబర్స్ విధానం ద్వారా బిల్లులను సమర్పిస్తే ఒక్కో బిల్లుకు గరిష్టంగా రూ.2లక్షలను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు కూడా ఏ ఆరునెలలకో ఏడాదికో మంజూరవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ రీయింబర్స్మెంట్ గడువును కూడా రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తూ ఉంది. ఆ గడువు కూడా మార్చి 31కి ముగియనుంది. -
బాబు బొమ్మ ఉంటే.. రైట్ రైట్..!
తాళ్లూరు: పేదల చెంతకే వైద్య సేవలు అనే ఉన్నత లక్ష్యంతో నడుస్తున్న చంద్రన్న సంచార చికిత్స వాహనాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. ఆయా వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్న పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఆయా సేవలు అందకపోగా, డొక్కు వాహనాలు ప్రమాదాలను తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా వాహనాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు భయపడుతున్నారు. చేసేది లేక ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేందుకు 2008లో ‘104’ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో విజయవంతంగా కొనసాగిన ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధిపొందుతూ వచ్చారు. అనంతరం 2010లో డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ (ఆర్ఓఆర్) జీఓ నంబర్ 3 ప్రకారం 104 వాహనాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు చెల్లించారు. 2014 వరకూ ఈ పథకం సక్రమంగానే సాగింది. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలకు పేర్ల మార్పులో భాగంగా 104 పథకానికి కూడా చంద్రన్న సంచార చికిత్స వాహనంగా పేరు మార్చారు. వీటి నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలోకి మార్చి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించారు. అమలుకాని ఉత్తర్వులు... పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో 277 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉండగా, మన జిల్లాలో 20 వాహనాల ద్వారా సేవలు ప్రారంభించారు. వాటిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న మినిట్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ప్రకారం ప్రభుత్వ కార్మిక చట్టాలు, అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చే ఆర్థికశాఖ ఉత్తర్వులు అమలు చేయాలి. కానీ, అవేమీ అమలు చేయడం లేదు. నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వాహనాలు... చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఇతర అన్ని వాహనాల మాదిరిగానే ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, మరమ్మతులు చేయించాలి. కానీ, రాష్ట్రంలోని 277 వాహనాలకు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, ట్యాక్సులు, మరమ్మతులు లేవు. కనీసం జనరల్ చెకప్, మైనర్ మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా వాహనాలలో సీలింగ్ ఊడిపోయింది. లైట్లు పనిచేయక రోగులను పరీక్షించే సమయంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బ్రేకులు కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి నెలకొనడంతో వాటిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాలు పొంచి ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల డ్రైవర్లకు జరిమానా... వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వాహన డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ జరిమానా విధిస్తోంది. ఏళ్ల తరబడి కనిపెట్టుకుని ఉన్న డ్రైవర్లపై జరిమానాలు విధిస్తుండటం సిబ్బందిని కలవరపెడుతోంది. జరిమానాలు విధించడంతో పాటు వాహనాలకు మరమ్మతులు చేయించకుండా ప్రమాదాలకు గురిచేయడంపై సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నేటికీ ఉమ్మడి రిజిస్ట్రేషనే... రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా చంద్రన్న సంచార చికిత్స వాహనాలు నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఫిట్నెస్ పరీక్షలు లేకపోవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌పై తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు మరమ్మతులతో పాటు ఫిట్నెస్ పరీక్షలు చేయించి బీమా సౌకర్యం కల్పించాలని, తద్వారా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే ఇక్కట్లే... 104 వాహనాలలో ఉద్యోగ భద్రత ఉంటుందన్న ఆశతో 11 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,662 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వారిలో జిల్లాలో 120 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే, వాహనాలకు మరమ్మతులు చేయకపోవడంతో పాటు ఎంవీఐల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ గడువు పూర్తయి సామర్థ్య పరీక్షకు సమయానికి రాని వాహనాలకు రవాణాశాఖ రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తుంది. కానీ, ఈ వాహనాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బొమ్మతో పాటు పేరు కూడా రాసుకుని తిరుగుతున్న వాహనాలు కావడంతో డొక్కు వాహనాలైనాగానీ రవాణా శాఖ అధికారులు ఆపే ధైర్యం చేయడం లేదు. -
‘గాంధీ’లో గద్దలు
గాంధీఆస్పత్రి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు ఉచితంగా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం (పార్ధివదేహాల తరలింపు) అధికారుల అలసత్వం, నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. మృతదేహాల తరలింపు అనివార్యం కావడంతో ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు ‘రింగ్’గా ఏర్పడి నిరుపేదలను దోచుకుంటున్నారు. తెలంగాణ వైద్యప్రదాయినిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కేటాయించిన పది పార్థివ వాహనాల్లో ఆరు వాహనాలు రెండునెలల క్రితమే మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. మిగిలిన నాలుగు వాహనాలు కండీషన్ సరిగా లేక ఏ క్షణమైనా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మృతదేహాలను తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా నుంచి పేదలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 నవంబర్ 18న ‘హెర్సే’ పేరిట మార్చురీ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినవారి పార్థివదేహాలను ఆయా వాహనాల్లో ఉచితంగా స్వస్థలాలకు చేరవేస్తారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి పది ‘హెర్సే’ వాహనాలను కేటాయించింది. గత కొన్ని నెలలుగా ఆరు వాహనాలు మూలనపడ్డాయి. మిగిలిన నాలుగు కూడా తరచూ బ్రేక్‌డౌన్ కావడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియలో గందరగోళంగా మారింది. దీనికితోడు వాహనాల్లోని ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వెలువడుతోంది. వివిధ కారణాలతో గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 15 మంది మృతి చెందుతుంటారు. ఆయా మృతదేహాలను తరలించేందుకు తగినన్ని వాహనాలు అందుబాటులో లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు అంబులెన్స్ యాజమాన్యాలు కుమ్మక్కై అధిక ధరలు వసూలు చేస్తున్నారు. పాత వాహనాలతోనే.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో హెర్సే వాహనాలను డిప్యూటీ సీఎం మెహమూద్‌ఆలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులతో కలిసి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మూలనపడ్డ పాత వాహనాలకు కొద్దిపాటి మరమ్మతులు చేసి పెయింటింగ్ వేసి అందుబాటులోకి తెచ్చినట్లు అప్పట్లో మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అయితే మృతదేహాల తరలింపునకు ఈ మాత్రం కండీషన్ సరిపోతుందని వైద్యశాఖమంత్రి వెనకేసుకొచ్చారు. వాహనాల నిర్వహణ సంస్థ పనితీరుపై కూడా ఆస్పత్రివర్గాల్లో అసంతృప్తి నెలకొందని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు. తక్షణమే వైద్యశాఖ మంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి హెర్సే వాహనాలను అందుబాటులోకి తేవాలని నిరుపేదలు కోరుతున్నారు. ప్రభుత్వానికి లేఖలు రాశాం పార్థివ దేహాలను తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన హెర్సే వాహనాలు తగినన్ని అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఆస్పత్రికి పది వాహనాలు కేటాయించగా, వాటిలో ఆరు వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి, మిగిలిన నాలుగు వాహనాల కండీషన్ సరిగాలేదు. వాహనాల నిర్వహణ సంస్థతో నేరుగా చర్చించే అవకాశం లేకపోవడంతో ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాశాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం. – శ్రవణ్‌కుమార్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కేటాయింపులేవీ?
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. 2018–19 బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరే ఇందుకు నిదర్శనం. మూడేళ్ల క్రితం ఎంపిక చేసిన 20 ప్రాధాన్య ప్రాజెక్టులను 2018 జూన్‌లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2019 నాటికి మరో 20 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ ఏడాదే నాగార్జునసాగర్ కుడి కాలువకు గోదావరి జలాలను తరలించి గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశను పూర్తి చేస్తామని గొప్పలు పోయారు. కానీ, గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే సర్కారు మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది. ఇలాగైతే పూర్తయ్యేదెలా? బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,978.22 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,620.76 కోట్లను మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులకు, రూ.905.05 కోట్లను ఏపీఎస్ఐడీసీకి(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ), రూ.452.41 కోట్లను చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించారు. గత బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,770 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో 33 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ, ఇందులో పోలవరంతోపాటు పీఎంకేఎస్‌వై కింద ఏడు ప్రాజెక్టులకు కేంద్రం రూ.9,000 కోట్లకుపైగా ఇస్తుందని బడ్జెట్లో చూపారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రూ.7,978.22 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా అధిక శాతం ఏపీడబ్ల్యూఆర్డీసీ(ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా రుణంగా సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం రూ.9,000 కోట్లు ఇస్తుందని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, కేంద్రం ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అలాగే ఏపీడబ్ల్యూఆర్డీసీ సేకరించే రుణం కూడా రూ.3,000 కోట్లకు మించదు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎలా ముందుకు సాగుతాయో ప్రభుత్వానికే తెలియాలి. మాటల్లోనే ఆర్భాటం.. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తి కావాలం టే రూ.350 కోట్లు అవసరం. కానీ, బడ్జెట్లో రూ. 250 కోట్లే కేటాయించారు. మహేంద్ర తనయ రిజ ర్వాయర్కు రూ.400 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో 80 కోట్లే విదిల్చారు. ఈ రెండు ప్రాజెక్టులను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల కేటయింపులను పరిశీలిస్తే పూర్తయ్యే అవకా శాలు కనిపించడం లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, పెంచిన అంచనా వ్యయం మేరకు కనీసం రూ.2,000 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 334.05 కోట్లే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ నిధులు కాంట్రాక్టర్లకు బకాయిలకే సరిపోవు. హంద్రీ–నీవా రెండో దశను ఈ ఏడాదే పూర్తి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. నిధుల కేటాయింపులో మాత్రం ఆ ఆర్భాటం చూపలేదు. ఈ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు అవసరం కాగా, రూ.663.75 కోట్లే కేటాయించారు. అత్తెసరు నిధులేనా? పీఎంకేఎస్‌వై కింద కేంద్రం నిధులు విడుదల చేస్తేనే పుష్కర, గుండ్లకమ్మ, తోటపల్లి, ముసురుమిల్లి, తాటిపూడి, ఎర్రకాల్వ ప్రాజెక్టు పూర్తవుతాయి. వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపకుండా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తే పైసా కూడా వచ్చే అవకాశం ఉండదు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే మరో రూ.1,100 కోట్లు అవసరం. బడ్జెట్లో కేవలం రూ.400 కోట్లు కేటాయించారు. మహాసంగమం ప్రస్తావనేదీ? గోదావరి–పెన్నా మహాసంగమం తొలి దశను రూ.4617 కోట్లతో ఈ ఏడాదే పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బడ్జెట్లో ఆ పథకానికి పైసా కూడా ఇవ్వలేదు. రాజధానిలో తాగునీటి అవసరాల కోసం 1998 కోట్లతో వైకుంఠపురం బ్యారేజీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అనంతపురం జిల్లాలో భైరవాని తిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, ఎగువ పెన్నా(అప్పర్ పెన్నార్) ఎత్తిపోతల పథకాలకు రూపాయి కూడా కేటాయించలేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాదే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కే నాగార్జునసాగర్ ఆధునికీకరణ కోసం నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు రూ.800 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బడ్జెట్లో రూ.60.87 కోట్లే విదిల్చింది. ఈ లెక్కన ప్రపంచ బ్యాంక్ నిధులు వెనక్కి వెళ్లడం ఖాయమే. కర్ణాటక పరిధిలో తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ఆధునికీకరణకు రూ.500 కోట్లు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.233.94 కోట్లను మాత్రమే కేటాయించింది. కృష్ణా, గోదావరి డెల్టా ఆధునికీకరణ, ఏలేరు ఆధునికీకరణలకు అరకొరగానే నిధులు కేటాయించింది. -
సౌర వెలుగులపై నిర్లక్ష్యపు నీడ..!
విజయనగరం, పార్వతీపురం: సౌర విద్యుత్ వెలుగులకు మున్సిపాలిటీలు దూరమవుతున్నాయి. పాలకులు, అధికారుల అలక్ష్యంతో బిల్లుల భారాన్ని మోస్తున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సోలార్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సైతం పంపించారు. అయితే... యూనిట్లు కేవలం విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీల్లోనే ఏర్పాటుచేశారు. మిగిలిన నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల్లో యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులను దూరం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పరిస్థితి... విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. యూనిట్ల ఏర్పాటుకు 60 శాతం నిధులను సమకూర్చుతామని, మిగిలిన 40 శాతం నిధులను మున్సిపాలిటీలు భరించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా విజయనగరం, బొబ్బిలి పురపాలక సంఘాలు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకుని ప్రస్తుతం విద్యుత్ బిల్లుల భారాన్ని 30 శాతం మేర తగ్గించుకున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో పాలకులుగాని, అధికారుల గాని చొరవచూపడం లేదు. వాస్తవంగా 25 సంవత్సరాల పాటు లీజు ప్రాతిపధికన సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలనేది ప్రతిపాదన. 25 సంవత్సరాల తరువాత ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను మున్సిపాలిటీలకు అప్పగించాలన్నది నిబం ధన. పార్వతీపురం మున్సిపాలిటీలో రూ.5 కోట్లతో 25 సంవత్సరాల లీజు ప్రాతిపదికన నెడ్ క్యాప్ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు వెంకపేట గోరీల వద్ద స్థల పరిశీలన చేశారు. అయితే, ఆ స్థలం చెరువుగా గుర్తించి కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం తెలపలేదు. తర్వాత తోటపల్లి పంపుహౌస్‌వద్దకు మార్చారు. అక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక ఎలక్ట్రికల్ ఫీడర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు చెప్పడం, దీనికోసం రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. ఇంత ఖర్చు ఇప్పట్లో భరించలేమంటూ మున్సిపల్‌పాలకులు, అధికారులు చేతులెత్తేశారు. సాలూరులో సోలార్ యూనిట్ ఏర్పాటుచేస్తే వీధిలైట్ల బిల్లు నెలకు రూ.1.06 లక్షలు, ము న్సిపల్ కార్యాలయానికి వెయ్యి, పంపు హౌస్ నుంచి రూ.2.20 లక్షలు, పైలెట్ పథకాలకు రూ.45వేల విద్యుత్ బిల్లులు ఆదా అయ్యే అవకాశం ఉన్నా అడుగు ముందుకు పడడం లేదు. నెల్లిమర్లలో.... నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎకరన్నర స్థలంలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక్కడ కూడా అడుగు ముందుకు పడలేదు. ప్రసత్తుం అన్ని కేటగిరీల్లో రూ.3.20 లక్షల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటైతే ఈ బిల్లులో 30 శాతం ఆదా అయ్యేదని విద్యుత్ శాఖ అధికారులే చెబుతున్నారు. -
కౌలు రైతుకు చేయూత ఏది?
బజార్హత్నూర్(బోథ్) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరి కోసం చట్టాలున్నా అమలుకాని పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల ‘పెట్టు బడి’ సాయం కూడా పట్టాదారుడికే ఇస్తామని ప్రకటించింది. కనీసం రుణ అర్హత కార్డులు సైతం లేక కౌలు రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే పరిహారం సైతం భూయజమానికే వస్తుండడంతో కౌలు రైతు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం మొండి చేయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సొంతంగా సాగుభూమి లేకపోవడంతో పట్టదారుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు వీరంతా. 2011లో కౌలు రైతుల కోసం రూపొందించిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలు రైతుకు భూయజమాని పత్రం ఇవ్వాల్సి ఉంది. కానీ హామీ పత్రం ఇస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పట్టాదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి. మూడేళ్ల కింద పత్తి సాగు కోసం ఎకరం చేను రూ.8వేల లోపు ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తాంసీ, తలమడుగు, జైనథ్, బేల మండలాల్లో ఈ మొత్తం రూ.15వేలు దాటింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర రాక ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. దరఖాస్తులు బుట్టదాఖలు... కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులును ఇవ్వాలని మూడేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 60వేల మంది గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. అప్పులు తెచ్చి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయడం తప్ప సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి రుణ అర్హత కార్డులు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం రూ.4వేలు సాగు చేస్తున్న కౌలు రైతులకే అందివ్వాలని కోరుతున్నారు. అప్పుల పాలవుతున్నాం.. బలన్‌పూర్ శివారులో ఇద్దరి పొత్తులో రూ.80వేలకు ఏడెకరాల చేను కౌలుకు తీసుకున్నాం. నాలుగెకరాల్లో పత్తి , మూడెకరాల్లో సోయ పంట వేశాం. కౌలు కాక రూ.1లక్ష 95వేల పెట్టుబడి అయింది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సోయా దిగుబడి 18 క్వింటాళ్లు వచ్చింది. పత్తికి రూ.4,700 చొప్పున రూ.1,17,500, సోయకు రూ.2,800 చొప్పున రూ.50,400 రెండు కలిపి రూ.1,67,900 ఆదాయం వచ్చింది. 2,75,000 ఖర్చుచేస్తే 1,07,100 నష్టం వాటిల్లింది. తాండ్ర శ్రీనివాస్, కౌలురైతు, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేలను కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరిత్యాల వల్ల కౌలు రైతు నష్టపోతే పరిహారం పట్టా రైతులకు ఇస్తున్నారు. కౌలు డబ్బులు తీసుకునే పట్టాదారు సాగుకు దూరంగా ఉంటాడు. పరిహారం కౌలు రైతుకే ఇవ్వాలి. ప్రభుత్వం త్వరగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలి. సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు -
దేవుళ్లకు తప్పని కష్టాలు
కెరమెరి : అధికారుల నిర్లక్ష్యంతో పునరావాస కాలనీల ప్రజలకు దైవ దర్శనం కరువైంది. పునరావస కాలనీలు నిర్మాణమే తమ వంతు అనుకున్న అధికారులు అక్కడ దేవాలయాలను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ప్రజలు విరాళాలు సేకరించి గుడిసెలు నిర్మించి పూజలు చేసుకుంటున్నారు. ఐదారేళ్ల క్రితం మండలంలోని నిషా ని, రింగన్‌ఘాట్ పునరావాస కాలనీల్లో దేవాలయాలు లేక పూజలు చేసేదెక్కడని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా పునరావాసం కాలనీలు ఉన్న చోట పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు, కోరుకున్న దే వాలయాలను నిర్మించాలని నిబంధనల్లో ఉంది. కాని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
డీలర్ల డిలే..!
ప్రతి వ్యాపారి తాము జరిపే లావాదేవీల వివరాలను(రిటన్స్) నిర్దేశిత గడువులోపు సమర్పించాల్సి ఉంటుంది. అయితే డివిజన్లో చాలా మంది వ్యాపారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో వ్యాపారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదనే ఉద్దేశంతో ప్రభుత్వపరంగా కొంత చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చి ఆరునెలలు గడిచిపోతుండటం, ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచి వెంటపడకపోతే మార్చి నెలాఖరు నాటికి బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉందనే ఆలోచన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో మొదలైంది. దీంతో సక్రమంగా రిటర్నులు సమర్పించని వారి లిస్టు తయారీ చేసి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్: జీఎస్టీ నిబంధనల ప్రకారం ఒక కోటి లోపు వార్షిక వ్యాపారం (టర్నోవర్) ఉన్నవారు కాంపోజిషన్ పథకం కిందికి వస్తారు. ఇతర రాష్ట్రాలకు సరుకులు రవాణా చేసేవారు, ఈ–కామర్స్ లావాదేవీలు నిర్వహించేవారు, రూ.2.5 లక్షల పనిచేసే కాం ట్రాక్టర్లు తదితరుల విషయంలో వార్షిక టర్నోవర్ ఎంతున్నా రెగ్యులర్ డీలర్‌గానే పరిగణనలోకి తీసుకుంటారు. రిటర్నుల దాఖలులో మీనమేషాలు.. కాంపోజిషన్ పథకం కిందకు వచ్చే వ్యాపారులు మూడు నెలలకు బకసారి చొప్పున జీఎస్టీ–4 పేరుతో రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంది. రెగ్యులర్ డీలర్లు అయితే ప్రతినెలా జరిగిన వ్యాపార లావాదేవీలను పేర్కొంటూ మరుసటి నెల 21వ తేదీలోగా 3బీ పేరుతో రిటర్నులు నమోదు చేయాల్సి ఉంది. రెండు విభాగాల వ్యాపారులూ రిటర్నులను ఆన్లైన్లో సమర్పించాలి. అయితే రెండు కేటగిరీలకు చెందిన వ్యాపారుల్లో అత్యధిక శాతం మంది నిర్దేశించిన గడువులోగా రిటర్నులు దాఖలు చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. నవంబరు నెల వరకు జరిపిన లావాదేవీలను డిసెంబర్ 15లోగా సమర్పించాల్సి ఉన్నా, ఇంకా 25 శాతం వ్యాపారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాలో మొత్తం 23,561 మంది డీలర్లు ఉన్నారు. ఇందులో జీఎస్టీ పరిధిలో 17,223 మంది, కాంపోజిషన్ పరిధిలో 6,388 మంది వస్తారు. కొత్త చట్టం వచ్చి ఆరునెలలు గడిచినా వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, సరిదిద్దాలని పన్నులశాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. తొలిదశలో రెగ్యులర్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలని తర్వాత కాంపోజిషన్ డీలర్ల విషయంలో ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంపోజిషన్ డీలర్ల పరంగా 6,388 మంది ఉండగా, అందులో ఎంత మంది ఐటీసీ తీసుకుంటున్నారనే విషయం అధికారుల వద్ద అందుబాటులో లేదు. జీఎస్టీ చట్టం ప్రకారం నిర్దేశించిన గడువులోగా రిటర్నులు సమర్పించని వ్యాపారులపై రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఒకేసారి జరిమానాలకు వెళ్లకుండా తొలుత నోటీసులు జారీచేసి, కొంత గడువు ఇచ్చిన తర్వాత జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నారు. 1 నుంచి ఈ వేబిల్లు అమలు.. ఫిబ్రవరి 1 నుంచి ఈ–వేబిల్లు అమలు అవుతుంది. ప్రసుత్తం ట్రయిల్ రన్లో ఉంది. సకాలంలో రిట్నర్నులు ఫైల్ చేయని డీలర్లకు నోటీసులు అందిస్తున్నాం. గడువు దాటిన తర్వాత ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా జరిమానా పడుతుంది. రిట్నర్నులు ఫైల్ చేయకపోతే జరిమానా విధిస్తాం.– ఓంకార్‌రెడ్డి, జేసీ, వాణిజ్యపన్నుల శాఖ. -
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దారుణం
-
రైతుల పట్ల ఇంత చిన్నచూపా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు తడి సి, రంగు మారి సరైన మద్దతుధర లభించక రైతులు విలవిల్లాడుతున్నా, బోనస్ ప్రకటించ డంలో, రుణాలను ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తాయి. రుణమాఫీ చేశామ ని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా, వాటిపై వడ్డీ భారం తొలగించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ దృష్ట్యా వారికి మద్దతుధర కల్పించాలని, బోన స్ ప్రకటించాలని, తడిసిన పంటను కొను గోలు చేసే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశా యి. రుణమాఫీ, మద్దతుధర తదితర అంశా లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. బోనస్ ప్రకటించాలి: జీవన్‌రెడ్డి అనావృష్టితో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని, ఉన్న పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు వరి, పత్తి, మొక్కజొన్న పంట లను దెబ్బతీశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపా ల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పత్తికి మద్ధతుధర రూ.4,320 ఉన్నా.. 2 వేలకు మించి దక్కడం లేదన్నారు. వరి, మొక్కజొన్నపై రూ.500, పత్తిపై రూ.వె య్యి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాని కి చేరిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుం టుంటే వచ్చే ఏడాది పెట్టుబడి సాయం చేస్తా మంటున్నారని, సబబేనా అని ప్రశ్నించారు. బీమా అమల్లో నిర్లక్ష్యం: కిషన్‌రెడ్డి కేంద్రం వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, కానీ రాష్ట్రంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపిం చారు. 55 లక్షల మంది రైతులుంటే 6 లక్షల మందే బీమా చేయించుకున్నారని, పథ కం అమలును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విత్తన భాండాగారం చేస్తామ న్న రాష్ట్రంలోనే నకిలీ విత్తనాల బెడద ఎక్కువైం దని, డీలర్లపై కేసులు పెడితే లాభం లేదని, విత్తన కంపెనీలపైనే పీడీ కేసులు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాం డ్ చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిం చేందుకు అధికారులు లేరని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. కాల్చి చంపిందెవరు: గాదరి కిశోర్ రూ.2 లక్షలు మాఫీ చేస్తామని కొన్ని పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు అవే పార్టీలు రైతులను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని మాట్లాడుతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు గాదరి కిశోర్ మండిపడ్డారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన ఘనత ఆ పార్టీలదేనని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు ఎక్కడ?.. మీ సీఎం ఎక్కడ? వ్యవసాయంపై ప్రధాన పార్టీలన్నీ మాట్లాడటం పూర్తయిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క సభ్యుడు కూడా సభలో లేకపోవడంపై శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కీలకాంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత జానారెడ్డి సహా ఎవరూ లేరంటే.. వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదే సమయంలో సభలోకి వచ్చిన జానారెడ్డి.. ఇంత ముఖ్యమైన సమయంలో మీ సీఎం ఎక్కడికి పోయారని ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సభలో లేరు. -
మరీ ఇంత నిర్లక్ష్యమా?
♦ ఎన్ని సార్లు చెప్పినా మీ వైఖరి ఇంతేనా? ♦ గడువు ముగిసినా జియోట్యాగింగ్ చేయరా! ♦ 50 శాతం కంటే తక్కువ చేసిన కార్యదర్శులకు నోటీసులు ♦ చెత్త సంపద కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై చర్యలు ♦ పంచాయతీ అధికారులపై డీపీవో కోటేశ్వరరావు ఆగ్రహం అరసవల్లి : ‘మీకు ఎన్ని సార్లు మీటింగులు పెట్టి చెప్తున్నా వైఖరిలో మార్పు రావడం లేదు. జియోట్యాగింగ్ ఎంతో కీలకమైందని చెప్పాం. గడువు పూర్తవుతున్నా ఇంకా పూర్తి చేయలేదు.. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే జిల్లాలో 50 శాతం కంటే తక్కువ ట్యాగింగ్ చేసిన పంచాయతీల కార్యదర్శులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నా..’’ అని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లాలో మూడు డివిజన్లలోని పంచాయతీ అధికారులతో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సగం కూడా పూర్తికాలేదు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జియోట్యాగింగ్, చెత్త నుంచి సంపద కేంద్రాల ఏర్పాటు తదితర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్‌కు ఫైలు పంపిస్తున్నామని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జియోట్యాగింగ్‌ను తొలుత ఆగస్టు 15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా ఇప్పటికీ సగం కూడా పూర్తికాకపోవడం దారుణమమన్నారు. పైలట్ ప్రాజెక్టుగా భావించిన సోంపేటలో మాత్రమే 100 శాతం పూర్తి అయ్యిందన్నారు. పాలకొండ, భామిని, బూర్జ, రేగిడి ఆమదాలవలస, ఇచ్ఛాపురం, సంతకవిటి, కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో పనితీరు చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పంచాయతీలు ప్రిస్లో లాగిన్ కాలేదని వీరిపైనా చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు. అన్ని పంచాయతీల్లో సంపద కేంద్రాలు డీపీఆర్సీ జిల్లా కో–ఆర్డినేటర్ హేమసుందరరావు మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణాలను అన్ని పంచాయతీల్లో చేపట్టాలని, స్థల వివాదాలుంటే తహసీల్దార్లను సంప్రదించాలన్నారు. జిల్లాలో పొగిరి, వీరఘట్టం, అవలింగి, పోలాకి తదితర చోట్ల ఆదర్శంగా ఉండే చెత్త సంపద కేంద్రాలను తయారుచేశామని, వీటిని నమూనాగా చేసుకుని ప్రతి పంచాయతీ కేంద్రంలోనూ వీటిని ఓ పార్కుల్లా నిర్మించుకోవాలని కోరారు. పెర్ఫార్మెన్స్ గ్రాంట్లను ఎలా వినియోగించాలో తెలియని కార్యదర్శులు న్నారని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వాటిని ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల 2వతేదీ నాటికి ప్రతి పంచాయతీని శుభ్రంగా తయారుచేసేలా అందరూ కృషిచేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, పాలకొండ డీఎల్పీవోలు రమాప్రసాద్, సత్యనారాయణ, డీపీఆర్సీ సభ్యుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
- మద్యం మత్తులో ఎల్సీ తీసుకోకుండా పనులు చేయించిన లైన్‌మేన్ - విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - గాజులపల్లెలో ఘటన గాజులపల్లె(మహానంది): ఓ లైన్‌మేన్ నిర్లక్ష్యం కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఫూటుగా మద్యం సేవించి కనీసం ఎల్సీ కూడా తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్ వద్ద పనులు చేయించాడు. ఫలితంగా విద్యుదాఘాతం సంభవించి పనులు చేస్తున్న వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాహెర్ హుసేన్(37) చిన్న చిన్న విద్యుత్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లైన్‌మేన్ గోపాల్ గాజులపల్లె ఫీడర్‌లోని గుండంపాడు రస్తాలో పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులకు పిలుచుకెళ్లాడు. అప్పటికే ఫూటుగా మద్యం తాగిన లైన్‌మేన్ ఎల్సీ తీసుకోకున్నా తీసుకున్నట్లు చెప్పి పనులు చేయాలని సూచించాడు. తాహెర్‌హుసేన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తర్వాత విచారించగా ఎల్సీ తీసుకోలేదని ఆపరేటర్ విశ్వరూపాచారి ఆలియాస్ విశ్వం తేల్చిచెప్పాడు. హుశేన్ మృతదేహంపై పడి భార్య మల్లికాబీ, పిల్లలు, కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన.. తాహేర్‌హుశేన్ మృతితో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు వందలాదిగా గాజులపల్లె సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు, గ్రామస్తులు మధుసూదన్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఏఈ శ్రీనివాసులుతో ఫోన్లో మాట్లాడారు. బాధితుడికి న్యాయం చేయాలని, లైన్మెన్ గోపాల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఒక ఉద్యోగం కల్పించాలని మతపెద్ద, ఖాజీ అబ్దుల్‌మన్నన్‌తో పాటు ముస్లీం పెద్దలు కోరారు. కేసు నమోదు.. తాహెర్‌హుసేన్ మృతికి కారకుడైన లైన్‌మేన్ గోపాల్‌పై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతానికి గోపాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. -
మైనార్టీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారు..
నెల్లూరు: మైనార్టీల ద్రోహిలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హంజాహుస్సేన్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అవమానించే విధంగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. మైనార్టీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన బాబు ప్రస్తుతం మోసం చేయడం తగదని హితవు పలికారు. చంద్రబాబు అక్రమ ఆస్తులకు బినావీులుగా ఉన్న వారికి మంత్రి పదవులిచ్చారని ఆరోపించారు. గతంలో బీజేపీపై నిందలు వేసి ఇప్పుడు ఆ పార్టీతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీలో ఉన్న మైనార్టీలు పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మైనార్టీలందరూ ఏకమై చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిచ్చారు. నాయకులు ఇంతియాజ్, అబూబాకర్, ఫయాజ్ అహ్మద్, రఫీ, హాజీ, మగ్దూమ్ మొమద్దీన్ పాల్గొన్నారు. -
ఇన్విజిలేషన్‌లో నిర్లక్ష్యం వహిస్తే జైలుకే!
పదో తరగతి పరీక్షల్లో అమలుచేస్తూ ప్రభుత్వ ఆదేశాలు నిర్లక్ష్యంగా ఉండే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు.. రూ.5 వేల నుంచి లక్ష జరిమానా 1997 నాటి ఉత్తర్వులు.. ఇప్పుడు కచ్చితంగా అమలుకు నిర్ణయం పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేసేందుకు సదుపాయాలు కరువు ఇలాగైతే ఇన్విజిలేషన్ విధులు చేయబోమంటున్న ఉపాధ్యాయులు సాక్షి, హైదరాబాద్: పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక జైలుశిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు జరి మానా కూడా విధించనుంది. ఈ మేరకు 1997 నాటి యాక్ట్ 25, సెక్షన్ 10లోని నిబంధనలను పదో తరగతి వార్షిక పరీక్షల్లో కచ్చితంగా అమలు చేయాలంటూ సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా విద్యాధికారుల (డీఈవోల)ను ఆదేశించింది. దాని ప్రకారం నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లకు 6 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉండే డిప్యూటీ ఈవో, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు తెలపడంతోపాటు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ఇన్విజిలేషన్ చేసేందుకు 31 వేల మంది మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 11,478 పాఠశాలలకు చెందిన దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,600 వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభా గం చర్యలు చేపట్టింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో 10 మంది చొప్పున 26 వేల మంది ఇన్విజిలేటర్లు, 5 వేలకు పైగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు అవసరం. మొత్తంగా పరీక్ష కేంద్రాల్లో 31 వేల మంది టీచర్లు పనిచేస్తారు. అయితే తాజాగా జారీ అయిన ఆదేశాలతో టీచర్లలో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేషన్ విధులకు హాజరైతే రోజుకు కేవలం రూ.22 ఇచ్చే విద్యాశాఖ... చాలా వరకు తమ తప్పు ఉండని వ్యవహారంలో కూడా కఠిన శిక్ష విధించాలని నిర్ణయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నా రు. కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేయడం, పరీక్ష విధుల నుంచి తొలగించడం, ఇంక్రిమెంట్లలో కోత వేయడం వంటి చర్యలు చేపడుతున్నారని, అది తప్పుకాదని... కానీ టీచర్లపై క్రిమినల్ కేసుల నమోదు, జైలుశిక్ష, జరిమానాల వంటివి ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్విజిలేషన్ విధులే తమకు అవసరం లేదని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. ఎన్నెన్నో సమస్యలు.. పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పాఠశాలల్లో విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు సరైన సదుపాయాలు లేవు. ప్రత్యేక గదుల్లో బాలబాలికలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా అక్కడక్కడా బాలికలను ప్రత్యేక గదుల్లో మహిళా టీచర్లతో చెక్ చేయిస్తున్నా... బాలురను మాత్రం గేట్ వద్దే పైపైన తనిఖీ చేసి లోనికి పంపుతున్నారు. అక్కడ దొరకని విద్యార్థులు.. పరీక్ష హాల్లోకి స్క్వాడ్ వచ్చినపుడు చిట్టీలతో దొరికిపోయినా, పక్కవారి పేపర్లో చూసి రాస్తున్నా ఇన్విజిలేటర్లకు తంటాలు తప్పవు. ఇదే టీచర్లను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా అవసరమైతే పరీక్షహాల్లో విద్యార్థులను ఇన్విజిలేటర్ తనిఖీ చేయాలనుకున్నా సమస్యలున్నాయి. మహిళా టీచర్ ఇన్విజిలేటర్‌గా ఉంటే బాలురను, పురుష టీచర్ ఉంటే బాలికలను పూర్తిస్థాయిలో చెక్ చేయడం సాధ్యం కాదు. టీచర్లేమైనా హంతకులా? ‘‘ప్రభుత్వ నిర్ణయం టీచర్లలో మానసిక ఆందోళనకు దారితీస్తుంది. పరీక్ష సమయంలో విద్యార్థి అనుకోకుండా పక్కకు చూసినా సదరు ఇన్విజిలేటర్లు విద్యార్థులను భయాం దోళనలకు గురి చేసే ప్రమాదం ఉంటుంది. ఇది విద్యార్థికి కూడా నష్టదాయకం. ఈ విషయంలో శాఖాపరమైన చర్యలు చేపడితే తప్పులేదు. టీచర్లేమీ హంతకులు కాదు. జైలు శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన యాక్ట్ 25లోని సెక్షన్ 10లో ఉన్న నిబంధనలు తొలగించాలి..’’ – ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జునశర్మ -
నీటి రుసుము వసూళ్లలో నిర్లక్ష్యం
–రూ.30.92 కోట్లకుగాను వసూలు చేసింది రూ.13.05 కోట్లే –పెద్ద నోట్ల రద్దును సద్వినియోగం చేసుకోని వైనం – బకాయి: రూ.17.87 కోట్లు అనంతపురం అర్బన్ : మునిసిపాలిటీలకు ఆస్తి పన్ను, నీటి రుసుము ప్రధాన ఆదాయ వనరులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి చార్జీ కోట్ల రూపాయల్లో నిలిచిపోయింది. నీటి చార్జీ వసూలుకు రద్దయిన పాత నోట్లను తీసుకోవచ్చునని ప్రభుత్వం ఆదేశిస్తూ అందుకు కొంత గడువు కూడా ఇచ్చింది. మునిసిపల్ అధికారులు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వసూలు డిమాండ్ రూ.30.92 కోట్లు అనంతపురం కార్పొరేష¯ŒSతో పాటు, జిల్లాలోని 11 మునిసిపాలిటీల పరిధిలో 1,17,280 నీటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి పాత బకాయితో కలుపుకుని ప్రస్తుత ఏడాది వసూలు చేయాల్సిన నీటి చార్జీ రూ.30.92 కోట్లు ఉంది. ఇందులో రూ.13.05 కోట్లను (42.13శాతం) మాత్రమే మునిసిపాలిటీలు వసూలు చేశాయి. ప్రస్తుతం రావాల్సిన బకాయి రూ.17.87 కోట్లు . -
విద్యార్థులతో చెలగాటం
మరోమారు ఎస్వీయూలో నిర్లక్ష్యం సిలబస్ లేని పాఠాల నుంచి ప్రశ్నలు కేవలం 15 మార్కులకే {పస్తుత పాఠ్యాంశాల ప్రశ్నలు డిగ్రీ ఫస్టియర్ విద్యార్థుల ఆందోళన మదనపల్లె అర్బన్: ఎస్వీ యూనివర్శిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏమాత్రం అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నారుు. మూడురోజుల క్రితం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలలో ఇంగ్లీషు ప్రశ్నపత్రం సిలబస్‌కు విరుద్ధంగా వచ్చిందని విద్యార్థులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో జరిగిన తప్పులపై రిజిస్ట్రార్ దేవరాజులు విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రకటించిన 24 గంటలలోపే మరో తప్పిదం జరిగింది. శుక్రవారం మొదటి సంవత్సరం తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం ప్రస్తుత సిలబస్ పాఠం కాకుండా గత పుస్తకం నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు బిక్కముఖం వేశారు. తెలియని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి మొదటి సెమిస్టర్‌కు సంబంధించి గంగాశంతనుల కథ, మూషిక మార్జాల వృత్తాంతం, దేశచరిత్రలు, మా కొద్దీ తెల్లదొరతనం, బిడ్డలు, ఆకలి అనే పాఠాలు ఉన్నా రుు. వీటిలో నుంచి కేవలం 15 మార్కులకు గంగాశంతనుల కథ, దేశచరిత్రలు, వ్యాకరణంపై ప్రశ్నలు అడిగారు. మిగిలిన 60 మార్కులకు పాఠ్యపుస్తకంలో లేని ద్రౌపదీ పరిదేవనం, కన్యక, చింతలతోపు, సావుకూడు పాఠాల నుంచి ప్రశ్న లు వచ్చారుు. ప్రశ్నపత్రంలోని సెక్షన్-ఎలో 5 మార్కులకు ఇచ్చిన 2,3,4,5,6 ప్రశ్నలు, సెక్షన్-బిలో 10 మార్కులకు ఇచ్చిన 1లో ఆ), 2,3,లోని ఛారుుస్ ప్రశ్నలు, 4వ ప్రశ్నపై విద్యార్థులకు ఏ మాత్రం అవగాహన లేకపోవడం, అధ్యాపకులు బోధించకపోవడంతో పరీక్ష రాయలేకపోయారు. డిగ్రీ స్థారుులో ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంలో మొదటి సంవత్సరం పుస్తకాలు కాదని, రెండో సంవత్సరంలో వేరే పుస్తకాలు పెట్టడం వల్లే ఇలాంటి గందరగోళం చోటు చేసుకుందని తెలిసింది. విద్యార్థులకు న్యాయం చేస్తాం ప్రశ్నపత్రంలోని ప్రశ్నల గందర గోళంపై పరీక్షల నియంత్రణాధికారి చంద్రయ్య వివరణ ఇస్తూ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ నుంచి నివేదిక కోరుతామని తెలిపారు. సిలబస్‌లోని ప్రశ్నలు ఇచ్చినట్టు గుర్తిస్తే విద్యార్థులకు మార్కులు ఇచ్చి న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
జనాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
గుంటూరు వెస్ట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నవర్గాలకు సేవకులుగా మారిపోయి, సామాన్యవర్గాల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పూర్తిగా అమలుచేయాలని, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయిస్తున్న ఒక్క రూపాయిలో 99 పైసలు 15 శాతంగా ఉన్న ప్రజలకు చేరుతోందని, కేవలం ఒక్క పైసా మాత్రమే 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరుతోందని, ఇది దారుణమైన పరిస్థితి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా ఒక్కో పర్యాయం మెయిన్ ప్లాన్‌లోకి కలుపుతున్నారని విమర్శించారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లకు పోరాటాలు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అందరూ ఐక్యంగా పోరాటాలు చేయాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ను పూర్తిగా అమలుచేయడానికి, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల సాధనకు అన్ని సామాజిక శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరారు. -
'సివిల్ సప్లైస్..' వెరీ మైనస్
* గాడితప్పిన పౌర సరఫరాల శాఖ * నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న సీఎస్డీటీలు * కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉద్యోగి * సిబ్బంది తీరుపై నిప్పులు చెరిగిన ఇన్చార్జి జేసీ * నేడు అధికారులతో పునః సమీక్ష జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన చెరుకూరు శ్రీధర్.. సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించడంతో ఈ శాఖపై దృష్టి సారించలేకపోయారు. ప్రస్తుతం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న ముంగా వెంకటేశ్వరరావు సైతం పుష్కరాలు, సీఎం పర్యటనలు, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు విచ్చలవిడిగా తరలిపోతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో : పౌర సరఫరాల శాఖపై అజమాయిషీ కొరవడడంతో సిబ్బంది మొక్కుబడిగా పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బంది పెట్టే కేసులు తప్ప.. పౌర సరఫరాల సిబ్బంది నమోదు చేసేవి పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఇన్చార్జి జేసీ శనివారం వరిధాన్యం సేకరణపై మిల్లర్లు, పౌర సరఫరాల సిబ్బంది, వ్యవసాయ, సహకార శాఖ సిబ్బంది, వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులు, సీఎస్డీటీలతో ప్రత్యేకంగా సమీక్షించారు. కిరోసిన్ హాకర్స్‌ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. 6ఏ కేసులపై ఆర్డీవోలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఎస్వో చిట్టిబాబు మాట్లాడుతూ.. కొంతమంది సీఎస్డీటీలు తన మాట వినడం లేదని, సరిగా రెస్పాండ్ కావడం లేదంటూ ఇన్చార్జి జేసీకి విన్నవించారు. దీంతో ఆయన సిబ్బంది పనితీరుపై నిప్పులు చెరిగారు. ‘ మీరెవరూ పనిచేయడం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. డీటైల్ రివ్యూ చేస్తా.. మీరు ఇన్స్పెక్షన్ రిపోర్టులు తీసుకురండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్చార్జి జేసీ వెంకటేశ్వరరావు సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత డీఎస్వో చిట్టిబాబు సమావేశాన్ని కొనసాగించారు. కైజాల యాప్ వాడుకలో జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు తెలిసింది. డీఎస్వో తప్ప మిగతావారు దీనిని సక్రమంగా వినియోగించడం లేదని సమాచారం. నీరుగారుతున్న కేసులు.. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరుకు డీలర్‌కు చేర్చడం, పంపిణీ సక్రమంగా జరుగుతుందా.. టైంటేబుల్ ప్రకారం రేషన్ షాపు తెరుస్తున్నారా.. తూకాల్లో ఏదైనా తేడా ఉందా.. వంటి విషయాలు సీఎస్డీటీలు చూడాలి. దీంతోపాటు ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్‌లు, ఈ– పాస్ మిషన్లు పనిచేస్తున్నాయా.. లేదా అనేది పర్యవేక్షించాలి. ఇందులో భాగంగా ప్రతి నెల సీఎస్డీవోలు 10, ఏఎస్‌వోలు 5 షాపులను విధిగా తనిఖీ చేసి తేడాలుంటే కేసులు నమోదుచేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో సక్రమంగా జరగలేదన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ నమోదుచేసిన కేసుల్ని సైతం జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కనుసన్నల్లో నీరుగార్చుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవకతవకలను కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా ఈ సీటులోనే తిష్ట వేసినట్లు శాఖ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీరంగ.. రంగా..!
* జీర్ణావస్థలో తిమ్మాయపాలెం రంగనాయకస్వామి ఆలయం * కనీసం పాలకవర్గమైనా లేదు.. వినుకొండ రూరల్: పురాతన చరిత్ర కలిగిన దేవాలయం... ఆలయ నిర్వహణకు 60 ఎకరాల భూములు ఉన్నాయి. ఏటా దాదాపు రూ.2 లక్షల కౌలు వస్తుంది. ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నా... ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ పాలకవర్గం ఏర్పాటు కూడా చేయలేదు. కనీస వసతి సౌకర్యాలు కల్పిస్తే భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగనాయకస్వామి దేవాలయం ఆస్తులు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. రంగనాయకస్వామి దేవస్థానం ఆవరణలో కృష్ణదేవరాయల కోనేరు, దేవస్థానానికి ఎదురు కొండపై నరసింహస్వామి గుడి ఉంది. రంగనాయకస్వామి పాదాలు, వెంకటరాయుని దేవస్థానం, లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నమస్కరిస్తున్న ఆంజనేయస్వామి చేతులపై సీతాసమేత రాముల వారి విగ్రహాలు ఇచ్చట కొలువుదీరి ఉన్నాయి. తిమ్మాయపాలెం గ్రామ సమీప ప్రాంతంలో రంగనాయకస్వామికి 61.07 ఎకరాల భూమి ఉంది. ఏటా రైతులు రూ.1.75 లక్షల కౌలు చెల్లిస్తారు. అయినా దేవస్థాన అధికారులు మాత్రం ఈ దేవస్థానం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసతులు కల్పించాలి.. దేవాలయానికి వెళ్లే భక్తులకు కనీసం కాళ్లు కడుక్కునేందుకు నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో దేవాలయానికి వెళ్లాలంటే భక్తులు సంకోచిస్తున్నారు. దేవాలయానికి ప్రహరీతో పాటు వాచ్మెన్ సౌకర్యం కల్పిస్తే దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. పురాతన దేవాలయాలకు ట్రస్ట్‌లు లేవు.. నియోజకవర్గంలోని అనేక పురాతనమైన దేవాలయాలకు ఆస్తులు ఉన్నా, వాటి నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ట్రస్ట్‌లు మాత్రం కరువయ్యాయి. గ్రామస్తులు చొరవ చూపకపోవడమే ఇందుకు కారణమని దేవాదాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లోని ప్రజలు రాజకీయ వైషమ్యాలను వదలి ట్రస్ట్‌గా ఏర్పడి చరిత్రకు మారుపేరుగా నిలిచిన దేవాలయాలను పునఃప్రతిష్టించాల్సిన బాధ్యత భక్తులపై ఉందని సూచిస్తున్నారు. -
వాళ్లు సైతం నిర్లక్ష్యం చేస్తారు...
కొంతమంది పేషెంట్లే కాదు... సాక్షాత్తూ డాక్టర్లు సైతం తాము తీసుకోవాల్సిన చికిత్సను నిర్లక్ష్యం చేస్తారంటున్నారు పరిశోధకులు. దాదాపు రెండు వేలకు పైగా డాక్టర్లను పరిశీలించాక నిపుణులు వెల్లడించిన అంశమిది. తమకు మానసిక సమస్య ఉందన్న విషయం బయటకు వెల్లడవుతుందేమోనని ఆందోళన చెంది కొందరు డాక్టర్లు తమ మానసిక సమస్యలను బయటపెట్టరని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ క్యాథరిన్ గోల్డ్. యాన్ ఆర్బర్ నగరంలోని ఆ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. డిప్రెషన్‌కు లోనైన డాక్టర్లు కూడా మామూలు పేషెంట్లలాగే తాము తీసుకోవాల్సిన మందులను సరిగా వాడరని పేర్కొంటున్నారు డాక్టర్ గోల్డ్. ఇలా జబ్బును నిర్లక్ష్యం చేసే విషయంలో మగ డాక్టర్లు, ఆడ డాక్టర్లు అనే తేడా లేకుండా అందరూ ఒకేలా వ్యవహరిస్తారంటున్నారామె. -
విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
నారాయణపేట రూరల్ : అవగాహన రాహిత్యం, అయిష్టతతో ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూయిస్తు విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు టి.సాయిరెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట ఎమ్మార్సీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి నిర్వహించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ సంఘం నాయకుడిని బరిలో ఉంచుతామని సాయిరెడ్డి తెలిపారు. మొదటి నుంచి సంఘంలో పనిచేసిన వ్యక్తులనే ఎంపికచేస్తామని, వలసలకు స్థానం ఉండబోదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు హన్మంత్‌రావు, వెంకట్‌రెడ్డి, గుంపుబాలరాజు, రాంచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, మండల నాయకులు శేర్‌కృష్ణారెడ్డి, కిషోర్, లక్ష్మారెడ్డి, కుర్మయ్య, గోవింద్‌రెడ్డి, సీతారాములు పాల్గొన్నారు. -
రూ. 16 లక్షల పరిహారం చెల్లించాలి
అమృత నర్సింగ్ హోంకు వినియోగదారుల ఫోరం ఆదేశం వరంగల్ లీగల్ : వైద్యం కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాలికకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాలిక కుడి చెయ్యి మనికట్టు వరకు తొలగించడానికి కారణమైన అమృత పిల్లల నర్సింగ్‌హోం డాక్టర్ రమేష్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స కం పెనీ వారు రూ.16 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి ప్రెసిడెంట్ పటేల్ ప్రవీణ్‌కుమార్, మెంబర్ ఎస్బీ భార్గవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల రమేష్‌బాబు తన కూతురు సౌమ్య(4) జలుబు, జ్వరంతో బాధపడుతుండగా 2003 జనవరి 31న హన్మకొండ కిషన్పురలోగల అమృత పిల్లల నర్సింగ్‌హోంకు తీసుకవెళ్లారు. వైద్యు డు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ చేశా రు. ఇంజక్షన్ఇతర ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి బాలిక కుడిచేతికి ఐవి క్యాన్పెట్టారు. మరుసటి రోజు పాప చెయ్యి వాపు రావడంతో నొప్పిగా ఉందని డాక్టర్‌కు తెలిపారు. అది మామూలేనని, కంగారు పడాల్సింది లేదని చెప్పారు. ఆరు రోజుల తర్వాత డిశ్చార్జి చేశా రు. ఆ సమయంలో చేతికి ఉన్న ఐవి క్యాన్ తీసివేయలేదు. ఇంకా కొన్ని ఇంజక్షన్లు ఉన్నాయని, అందుకోసం ఐవి క్యాన్ ఉంచాలని చెప్పారు. ఇంటికి వెళ్లిన తెల్లవారి పాప చెయ్యి వాపు వచ్చి చర్మం రంగు మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్ లేడు. అలా రెండు రోజులు తిరిగిన తర్వాత ఫిబ్రవరి 8న కలిసిన డాక్టర్ ఐవి క్యాన్తొలగించి, పిల్లల వైద్యుడైన డాక్టర్ గోపాల్‌ను సంప్రదించాలని సూచించా రు. బాలిక చెయ్యి ఇన్ఫెక్షన్అయిందని. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్ గోపాల్ చెప్పడంతో ఆర్థిక స్థోమత లేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఐదు రోజుల తర్వాత ఉస్మానియా వైద్యశాలకు, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలిం చారు. ఇన్ఫెక్షన్ అయినందున చెయ్యి తొలగించాలని నిమ్స్ వైద్యులు చెప్పగా, తిరిగి ఎంజీఎంకు తీసుకొచ్చారు. చివరకు 2003 మార్చి 10న సౌమ్య కుడి చెయ్యి మడమ వరకు తొలగించారు. అమృత నర్సింగ్‌హోం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సౌమ్య జీవితం నాశమైందని, నష్టపరిహారం గా రూ.16 లక్షలు, వైద్యం కోసం అయిన రూ.51,800 మొత్తం డబ్బులు డాక్టర్ రమేష్ చెల్లించాలని కోరు తూ దోమల రమేష్‌బాబు 2003 ఏప్రిల్‌లో జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన విని యోగదారుల ఫోరం ఇన్చార్జి ప్రెసిడెంట్ ప్ర వీణ్‌కుమార్, మెంబర్ భార్గవి బాధితురాలికి నష్టపరిహారంగా రూ.16 లక్షలు నెల రోజులలోపు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కూలేదాక చూస్తూ ఉంటారా ?
* శిథిలావస్థకు చేరిన విద్యుత్ కేంద్ర భవనం * లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత గాలికి * వర్షం వస్తే ప్లాస్టిక్ పట్టాలే గతి * భయంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాడేపల్లి (తాడేపల్లి రూరల్): గుంటూరు జిల్లాకు రైల్వేకు తలమానికమైన తాడేపల్లి పట్టణ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న 132/133 కేవీ విద్యుత్ ఉపకేంద్రం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినప్పుడు సిమెంటు ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాకుగాను ఈ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డకు, కడప, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ విద్యుత్ ఉప కేంద్రంలో విద్యుత్ శాఖలో ఉన్నత పదవులను అలంకరించిన వారెందరో ఇక్కడ పనిచేసిన వారే. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉపకేంద్రం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన ఈ భవనం కుప్పకూలిపోతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత ఏదీ ? సిమెంటు ఫ్యాక్టరీ విద్యుత్ ఉపకేంద్రంలో 132 కేవీ ఫీడర్లు ఆరు, 33 కేవీ ఫీడర్లు ఏడు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3 ఉన్నాయి. విజయవాడ గుణదల దగ్గర నుంచి ఇక్కడకు వచ్చే విద్యుత్‌ను స్టెప్ డౌన్ చేసి, కంట్రోల్ ప్యానల్స్ ద్వారా గుంటూరు–1, గుంటూరు–2, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తుళ్లూరు, అమరావతిలో సగ భాగం, తెనాలి తదితర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాలకు సరఫరా చేస్తారు. కృష్ణాకెనాల్ రైల్వే జంక్షన్‌కు ఇక్కడి నుంచే పవర్ అందుతుంది. ఏలూరు, చినఅవుట్‌పల్లి దగ్గర నుంచి తెనాలి, గుంటూరు వరకు రైల్వే లైనుకు విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే శిథిలావస్థకు చేరిన ఈ విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వర్తించాలంటే సిబ్బంది భయపడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే కంట్రోల్ ప్యానల్స్ ఎక్కడ తడిచి పాడై పోతాయేమోనని సిబ్బంది పట్టాలు, పరదాలు కప్పి ఉంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏఈ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి కాగా, మిగిలిన 14 మంది కాంట్రాక్టు సిబ్బంది కావడం గమనార్హం. -
అన్నదాతలను ఆదుకోకపోతే చరిత్ర క్షమించదు
–ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు – విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ కోదాడ: అందరికి అన్నం పెట్టే అన్నదాతలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చెయకపోతే చరిత్ర క్షమించదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడవని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ నిధులను ఒకే సారి చెల్లించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ బస్టాండ్ వద్ద చేపట్టిన ఒక రోజు రైతుభరోసా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని దీక్ష విరమింపజేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హమీ ఇచ్చిన ప్రభ్వుత్వం ఎన్నికల అనంతరం విడతల వారి విధానాన్ని తీసుకొచ్చి అవి కూడ సకాలంలో చెల్లించక పోవడం వల్ల రైతులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వడ్డీతో సహ లక్ష రూపాయల రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నూటికి 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు, నాశిరకం పురుగుమందులు, మార్కెట్ దళారులు ఇలా ప్రతి దశలో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలను ఎగగొడుతున్న వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని, కానీ అన్నం పెట్టే రైతును బ్యాంకు గడపతొక్కనియ్యడం లేదన్నారు. అంతే కాకుండా పాత అప్పుతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలను ఇప్పించే బాధ్యతను కూడ ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మార్కెట్ల ప్రక్షాళన చేసి దళారులను లేకుండా చెయాలని కోరారు. ఉదయం కొల్లు వెంకటేశ్వరరావు చేపట్టిన దీక్షను రైతుసంఘం నాయకుడు దొడ్డ నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడుగు హుస్సేన్, గంధం బంగారు, రావెళ్ల రవికుమార్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, కత్రం నాగేందర్‌రెడ్డి, కనగాల జనార్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపారు. -
అన్నదాతలను ఆదుకోకపోతే చరిత్ర క్షమించదు
–ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు – విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ కోదాడ: అందరికి అన్నం పెట్టే అన్నదాతలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చెయకపోతే చరిత్ర క్షమించదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడవని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ నిధులను ఒకే సారి చెల్లించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ బస్టాండ్ వద్ద చేపట్టిన ఒక రోజు రైతుభరోసా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని దీక్ష విరమింపజేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హమీ ఇచ్చిన ప్రభ్వుత్వం ఎన్నికల అనంతరం విడతల వారి విధానాన్ని తీసుకొచ్చి అవి కూడ సకాలంలో చెల్లించక పోవడం వల్ల రైతులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వడ్డీతో సహ లక్ష రూపాయల రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నూటికి 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు, నాశిరకం పురుగుమందులు, మార్కెట్ దళారులు ఇలా ప్రతి దశలో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలను ఎగగొడుతున్న వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని, కానీ అన్నం పెట్టే రైతును బ్యాంకు గడపతొక్కనియ్యడం లేదన్నారు. అంతే కాకుండా పాత అప్పుతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలను ఇప్పించే బాధ్యతను కూడ ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మార్కెట్ల ప్రక్షాళన చేసి దళారులను లేకుండా చెయాలని కోరారు. ఉదయం కొల్లు వెంకటేశ్వరరావు చేపట్టిన దీక్షను రైతుసంఘం నాయకుడు దొడ్డ నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడుగు హుస్సేన్, గంధం బంగారు, రావెళ్ల రవికుమార్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, కత్రం నాగేందర్‌రెడ్డి, కనగాల జనార్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపారు. -
అమ్మ భాషకు ఆదరణ కరువు
– ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు ఆదరణ తగ్గుతోందని ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషపై మోజుతో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకే పంపుతూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నార న్నారు. శ్రీపింగలి సూరన తెలుగుతోటలో ఆదివారం కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘కథ–కవితా వస్తువులు ప్రపంచీకరణ ప్రభావము’ అన్న అంశంపై సాహితీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ కల్కూర, జేఎస్ఆర్కే శర్మ, ఆర్.రామారావు, జే.శివకష్ణ, అర్జున్, సుధీర్, పార్వతీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు
* నిధులు ఫుల్.. పరికరాలు నిల్ * శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆసక్తి చూపని వైద్యులు * అవస్థలు పడుతున్న పేదలు తెనాలి జిల్లా వైద్యశాలను నిర్లక్ష్యపు జబ్బు పట్టిపీడిస్తోంది. సమృద్ధిగా నిధులున్నా.. వాటిని ఉపయోగించే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వైద్యులు, సిబ్బంది, రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెనాలి అర్బన్: తెనాలి జిల్లా వైద్యశాల 200 పడకల వైద్యశాలగా 2001లో అప్‌గ్రేడ్ అయ్యింది. అనంతరం దానిలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్ఎన్సీయూ, డయాలసీస్ వార్డులను ఏర్పాటు చేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని తెనాలి పట్టణం, తెనాలి, కొల్లిపర మండలాలు, వేమూరు నియోజక వర్గ పరిధిలోని వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె నియోజకవర్గ పరిధిలో రేపల్లె, నిజాంపట్నం, నగరం, మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల, కృష్ణాజిల్లా పరిధిలోని అవనిగడ్డ, అడవులదీవీ తదితర ప్రాంతాల నుంచి పేదలు చికిత్స నిమిత్తం జిల్లా వైద్యశాలకు వస్తుంటా రు. రోజుకు ఓపీ కింద 1000 నుంచి 1200 మంది చికిత్స పొందుతున్నారు. వీరు కాకుం డా 200 మంది సాధారణ రోగులు, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎస్ఎన్సీయూ తదితర వార్డులలో మరో 50 మంది వరకు వైద్య సేవలు పొందుతూ ఉంటారు. జిల్లాలో గుంటూరు తర్వాత అతి పెద్ద వైద్యశాలగా పేరుంది. ఎస్‌ఎన్‌సీయూలో నిలిచిన రక్త పరీక్షలు ఎస్ఎన్సీయూ వార్డులో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. అప్పుడే పుట్టిన చిన్నారులను ఇక్కడ ఉంచి చికిత్స అందిస్తారు. వారికి రక్తపరీక్షలు చేసేందుకు ప్రత్యేక పరికరం అవసరం. వాటిని అధికారులు అందుబాటులో ఉంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది, ఎస్ఎన్సీయూకు ప్రత్యేక నిధులున్నా వాటిని వినియోగించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. సాధారణంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ఆస్పత్రి స్థాయిని బట్టి కొంత నిధులను ప్రభుత్వం అందిస్తుంటుంది. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చిన నిధులను మందుల కొనుగోలుకు, ఆపరేషన్ థియేటర్లో వస్తువుల కొనుగోలుకు, ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు వాటిని వినియోగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శ విన్పిస్తోంది. గతంలోని ఆస్పత్రి అధికారులు నెలకు సుమారు రూ.2లక్షలు వెచ్చించి మందులు, ఇతర పరికరాలు కొనుగోలు చేసేవారనేది సిబ్బంది మాట. ప్రస్తుతం నెలకు రూ.10వేలు కూడా లోకల్ పర్చేజ్‌కు వినియోగించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. హెచ్‌డీఎస్ కింద సుమారు రూ.20 లక్షలకు పైగా నిధులు ఉన్నాయనేది సమాచారం. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జిల్లా వైద్యశాలలో నెలకొన్న సమస్యలు అతి త్వరగా పరిష్కరించకపోతే అపరేషన్లు కూడా నిలిచిపోయే అవకాశం ఉందనేది వైద్యుల మాట. ఆస్పత్రిలో లభించని బ్లేడ్, ఇతర పరికరాలు.. జిల్లా వైద్యశాలలో గైనిక్, ఆరో్థపెడిక్, ఈఎన్టీ, ఆప్తమాలజీ, డెంటల్, సాధారణ సర్జరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. నెలకు సుమారు 500కు పైగా సర్జరీలు చేస్తుంటారు. అయితే సర్జరీ చేయాలంటే రకరకాల బ్లేడ్లు అవసరం అవుతుంటాయి. బ్లేడ్లతో పాటు క్యాట్గట్స్, ప్రాలిన్, వైక్రిల్, ఎథిలాన్ వంటి వస్తువులు అవసరం. వీటిని తెప్పించాలని పలువురు వైద్యులు కోరుతున్నా వైద్యశాల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ విన్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి పరికరాలు గుంటూరులోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో లభించకపోతే లోకల్‌గా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కానీ లోకల్‌గా కొనటానికి అధికారులు ఆసక్తి కనపర్చడం లేదనే విమర్శ విన్పిస్తోంది. అలాగే పేద రోగులకు పంపిణీ చేసేందుకు అవసరమైన మందుల కొరత ఇక్కడ ఏర్పడింది. వాటిని లోకల్‌గా కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా అందించే వెసులుబాటు ఉన్నా అలా చేయడం లేదు. దీంతో వైద్యులు ఉన్న మందులనే రాస్తున్నట్లు సమాచారం. పరికరాల కొనుగోలుకు అనుమతిస్తున్నాం.. ఆస్పత్రిలో అవసరమైన మందులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. మిగిలిన వాటిని త్వరలో కొనుగోలు చేయిస్తాం. డాక్టర్ సులోచన, సూపరింటెండెంట్ -
వైద్యం అందక తల్లీబిడ్డ మృతి
స్పందించని 108, ఏఎన్ఎం – పీహెచ్సీ ఉన్నా నిరుపయోగం – 25 కిలోమీటర్ల దూరంలోని బళ్లారి ఆసుపత్రికి పరుగులు – అర్ధరాత్రి వేళ అగచాట్లు – ప్రసవంలోనే తల్లీబిడ్డ మృతి హాలహర్వి: 108 అంబులెన్స్ సేవలు అందక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తల్లీబిడ్డ ప్రాణం తీసింది. ఆసుపత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలనే ప్రచారం.. ఈ ఘటనతో అపహాస్యమైంది. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాబుసాహెబ్కు నందవరానికి చెందిన ఆషాబీ(24)తో గత ఏడాది వివాహమైంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. గురువారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రాగా.. కాన్పు నిమిత్తం భర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా.. డ్రై వర్ లేడని, రెండు గంటల తర్వాత ఫోన్ చేయాలనే సమాధానం వచ్చింది. ఆ వెంటనే ఆయన స్థానిక ఏఎన్ఎం సుధాకర్‌కు ఫోన్ చేయగా.. ఈ సమయంలోనే తాను రాలేనని చెప్పడంతో బాబుసాహెబ్ కంగారు పడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరోసారి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా డ్రై వర్ లేడని ఒకసారి, డీజిల్ కూడా లేదని మరోసారి సమాధానం వచ్చింది. అర్ధరాత్రి ఆగచాట్లు భార్యకు పురిటినొప్పులు అధికం కావడంతో బాబాసాహెబ్ గ్రామంలోని టాటా ఏస్ వాహనాన్ని మాట్లాడుకొని 25 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా కేంద్రంలోని ఓపీడీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆషాబీని పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని చెప్పడంతో బంధువులను సంప్రదించగా ఫలితం లేకపోయింది. విషయాన్ని వైద్యులకు చెప్పగా అతి కష్టం మీద ప్రసవం జరిగి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సందర్భంగా అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మరణించారు. ఆదుకోని పీహెచ్సీ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా.. సమీపంలోని హాలహర్వి మండల కేంద్రంలో పీహెచ్సీ ఉన్నా సాయంత్రం 5 గంటలు దాటితే ఎవ్వరూ అందుబాటులో ఉండని పరిస్థితి. చుట్టుపక్క ప్రాంతాలకు ఈ విషయం అవగతం కావడంతో వీరంతా బళ్లారి ఓపీడీ ఆసుపత్రిని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఆలూరు నియోజకవర్గం జిల్లా శివారు ప్రాంతం కావడం వల్ల కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 108 సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం కూడా గర్భిణి మృతి కారణమైంది. ఇదిలాఉంటే కాంట్రాక్టు గడువు ముగియడం వల్లే 108 సిబ్బంది అర్ధరాత్రి స్పందించలేదనే చర్చ జరుగుతోంది. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భర్త బాబుసాహెబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం
* వసూలు కాని బకాయిలు రూ.2.56 కోట్లు * నెలవారీ మామూళ్లే కారణం? * బినామీల చేతుల్లో భవనాలు * కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి నెహ్రూనగర్: నగరపాలకసంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లలోని దుకాణాల అద్దె వసూళ్లలో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కార్పొరేషన్ ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండిపడుతున్నది. నగరపాలక సంస్థకు ఆదాయం తెచ్చే పెట్టే వాటిలో రెవెన్యూ శాఖ కీలకమైనది. ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతో నగరంలో పలు అభివద్ధి పనులు చేపడుతుంటారు. అయితే అధికారులు మామూళ్ల మత్తులో భవనాల అద్దె వసూళ్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నగరంలో 1165 దుకాణాలు.. నగరంలోని ప్రధాన కూడళ్లలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నగరపాలకసంస్థకు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిలో మొత్తం 1165 దుకాణాలు ఉన్నాయి. 25 సంవత్సరాల లీజు పూర్తయి గడువు తీరిన షాపుల్లో తిరిగి రెన్యూవల్ చేసుకున్నవి 720, ఇంకా రెన్యూవల్ కానివి 399 ఉన్నాయి. గడువు పూర్తయిన షాపులకు తిరిగి వేలం నిర్వహించి కేటాయించాల్సి ఉంది. గడువు తీరిన షాపులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. కొంతమంది లీజుదారులు కోర్టుకు వెళ్లి అద్దె చెల్లించకుండా చలామణి అవుతున్నారు. కార్పొరేషన్ సమీపంలో నిర్వహిస్తున్న ఓ హోటల్ యజమాని ఇలా లక్షల్లో అద్దె ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇటువంటి సంఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. అద్దె చెల్లింపు విషయంలో జీవో నెం.56 ప్రకారం స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా అద్దె నిర్ణయించి వసూలు చేయడం, లేదా ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత అర్ధ సంవత్సరం పాత బకాయిలు రూ.3.95 కోట్ల దాకా ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 1.38 కోట్లు వసూలు కాగా, రూ.2.56 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. అధిక మొత్తంలో లీజులకు.. షాపులను వేలం ద్వారా లీజుకు దక్కించుకున్నవారిలో కొందరు వాటిని తర్వాత అధిక మొత్తంలో అద్దె వచ్చే విధంగా సబ్ లీజుకు ఇస్తున్నారు. దీంతో అధికారుల బకాయిలు వసూలు చేయడానికి షాపులకు వెళితే లీజుదారులు అందుబాటులో లేకపోవడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుంటున్న కొందరూ రెవెన్యూ సిబ్బంది సబ్లీజుదారులతో కుమ్మకై అద్దెలు వసూలు చేయకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారని ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. కొందరు సబ్ లీజుదారులు లీజుదారులకు కాకుండా తమకే షాపును కేటాయించాలని కోరుతున్నారు. నోటీసులు ఇచ్చినా.. బకాయిదారులకు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బకాయిదారులు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అద్దె చెల్లించకుండా స్వంత షాపుల్లా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కాసులకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.80లక్షలకు పైగా బకాయిలు ఉన్న లీజుదారులు కొందరు షాపులు ఖాళీ చేసి, ఎగనామం పెట్టి వెళ్లిపోయిన ఘటనలూ ఉన్నాయి. గడువు తీరిపోయిన షాపులలో కొన్ని లక్షల రూపాయల్లో బకాయిలు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కార్పొరేషన్ ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకొవాల్సి ఉంది. -
రోగుల ప్రాణాలతో చెలగాటం!
మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో మహిళా వైద్యుల నిర్లక్ష్యం రోగులను పట్టించుకోని వైనం ప్రైవేట్ ప్రాక్టీస్లకే ప్రాధాన్యం తాజాగా గర్భిణికి వైద్యం చేయని వైద్యురాలు పైగా రాజీనామా లేఖ ఇచ్చి వెళ్లిన ఉదంతం నిరుపేద రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ తమ బాధ్యత మరిచి సమయపాలన పాటించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేమని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. అందుకు కారణం అక్కడ పనిచేసే ఇద్దరు మహిళా వైద్యులు అధికార పార్టీ నేతల కోడళ్లు కావడమే. ఇది మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న తంతు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నా, ఉన్నతాధికారులు వారి జోలికి వెళ్లాలంటే వెనుకంజ వేస్తున్నారు. సాక్షి, గుంటూరు: వైద్యో నారాయణో హరి.. అంటూ వైద్యుడిని భగవంతుడితో సమానంగా కీర్తించటం తెలిసిందే. సమాజంలో వైద్యుడికి ఇచ్చే గౌరవమది. కానీ కొందరు వైద్యులు తమ వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరిస్తుండటం శోచనీయం. నిరుపేద రోగులకు వైద్యం అందించే క్రమంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించటమే గాక.. వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. మాచర్ల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కాన్పు కోసం వచ్చిన గర్భిణికి వైద్యం అందించకుండా అక్కడి వైద్యురాలు రాజీనామా చేసి వెళ్లిపోయింది. ఈ ఉదంతంలో అదృష్టవశాత్తూ బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. పురిటి నొప్పులతో కాన్పు కోసం వస్తే... దుర్గి మండలం పోలగట్ల గ్రామానికి చెందిన చాట్ల సాగరమ్మ అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మాచర్ల ప్రభుత్వాస్పత్రికి ఆమెను తీసుకొచ్చారు. వైద్యులు ఎవరూ లేకపోవడంతో నాలుగు గంటల పాటు నొప్పులతో బాధపడుతూనే గర్భిణి ఎదురుచూసింది. ఉదయం 8.30 తర్వాత వచ్చిన వైద్యురాలిని ఆలస్యంగా రావటంపై గర్భిణి బంధువులు ప్రశ్నించడంతో.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తాను రాజీనామా చేస్తున్నానని చెప్పి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్య సేవలు అందించకుండానే వెళ్లిపోవటం గమనార్హం. అక్కడే ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష కూడా తాను పిల్లల డాక్టర్‌నంటూ వైద్యం చేసేందుకు నిరాకరించటంతో విధిలేక బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్ వైద్యులు పెద్ద మనసు చేసుకుని చికిత్స అందించటంతో బాధితురాలు, ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రశ్నించేవారు ఉండరనే... మాచర్ల నియోజకవర్గంలో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలే. మాచర్ల రూరల్, వెల్దుర్తి, దుర్గి, విజయపురిసౌత్ మండలాల్లో ఏ గ్రామంలో ఎలాంటి రోగం వచ్చినా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు పరుగులు తీయాల్సిందే. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకునే స్థోమత లేక నిరుపేద రోగులంతా ఇక్కడికి వస్తుంటారు. 30 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో గతంలో ఎనిమిది మంది వైద్యులు వైద్య సేవలు అందించేవారు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉండగా, వారిలో ఇద్దరు అధికార పార్టీ నేతల కోడళ్లు. తమను ప్రశ్నించేవారు ఉండరనే ధైర్యంతో వారు ఇష్టం వచ్చినప్పుడు ఆస్పత్రికి రావడం కొద్దిసేపు ఉండి తిరిగి సొంత ప్రాక్టీస్‌కు వెళ్లిపోవడం జరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆస్పత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేయటంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారం అండతో... మాచర్ల ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్టు వైద్యురాలు డాక్టర్ కొమ్మారెడ్డి రోహిణి టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి కోడలు కాగా, సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ నెల్లూరి మంగమ్మ కోడలు. దీంతో వీరిద్దరినీ ప్రశ్నించే ధైర్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఉన్నతాధికారులు సైతం చేయడం లేదు. మామూలుగా ఉద్యోగం నుంచి మానుకోవాలన్నా, సెలవు పెట్టాలన్నా ముందస్తుగా ఉన్నతాధికారులకు సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ శుక్రవారం గర్భిణికి వైద్య సేవలు అందించకుండా అక్కడి నుంచి డాక్టర్ రోహిణి వెళ్లిపోవడంపై జిల్లాలోని వైద్య నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష సైతం బాధిత గర్భిణిని గుంటూరుకు తరలించి చేతులు దులుపుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే తమ పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో వైద్యుల తప్పునకు ఓ గర్భిణి మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
వినుకొండ టౌన్/ ఈపూరు: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు... ఈపూరు మండలం ఉప్పరపాలెంకు చెందిన నిండు గర్భిణి వెంకాయమ్మ (21)కు జ్వరం రావడంతో ఈ నెల 22వ తేదీన పట్టణంలోని నిమ్స్ 24 ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేర్పించారు. డెలివరీ కూడా తమ ఆస్పత్రిలోనే చేస్తామని చెప్పడంతో వెంకాయమ్మ భర్త, తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. ఈ నెల 26వ తేదీన ఆపరేషన్ నిర్వహించి కాన్పు చేశారు. కానీ ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడంతో వెంకాయమ్మకు తీవ్ర రక్తస్రావమైంది. కంగారుపడిన వైద్యులు బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించాలని సూచించారు. అంబులెన్స్‌లో గుంటూరు తరలిస్తుండగా మార్గమద్యంలోనే వెంకాయమ్మ పరిస్థితి ఆందోళనకరస్థితికి చేరుకోవటంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది. బంధువుల ఆగ్రహం.. బంధువులు వినుకొండలోని ఆస్పత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వినుకొండ నిమ్స్ 24 వైద్యశాల వైద్యురాలు కాసుల పార్వతిని వివరణ కోరగా వెంకాయమ్మకు శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత ఆయాసం అధికమైందన్నారు. గుంటూరు తీసుకెళ్లాలని చెప్పామని, ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదన్నారు. గుంటూరుకు తరలించారు. అటుపైన ఎం జరిగిందో తమకు తెలియదని తెలిపారు. పుట్టిన బిడ్డకు తల్లిలేని లోటు పూడ్చలేనిదని స్థానికులు కళ్లనీరుకుక్కుకుంటున్నారు. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మృతురాలి ఇంటికి చేరుకుని పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని గుండెలకు హత్తుకుని విలపిస్తున్న తీరు చూపరులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఒక వైపు బాలింత మృతితో బంధువుల రోదనలు, మరోవైపు ఆకలితో చిన్నారి ఆక్రందనలు చూపరులను కంటతడి పెట్టించింది. -
కార్మిక చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ అనుబంధ యూనియాన్ మున్సిపల్ వర్కర్స్ యూనియాన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని యూనియాన్ భవనంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతం రూ.18 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులే లేకుండా చేస్తానని ఎన్నికల ముందు హామీమి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాలు గడిచిన ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడమే కాకుండా యూనియాన్ సమావేశాలకు హాజరైతే పని నుంచి తొలగిస్తామని బెదిరింపులు పల్పడుతున్నారని పేర్నొన్నారు. కార్మికులు సంఘటితంగా ఉంటనే సమస్యల పరిష్కమవుతాయన్నారు. 15 డిమాండ్లును నేరవెర్చాలని సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని యూనియాన్ల పాటు కార్మికులు పాల్గొటారని పేర్కొన్నారు. ఈ నెల 30న జిల్లాలో అన్ని మున్సిపల్ కార్మికులు బైక్‌ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, మున్సిపల్ కార్మిక అధ్యక్షుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కాంతారావు, బాపురావు, సంతోష్, పోషెట్టి పాల్గొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు డాక్టర్ల తప్పు లేదంటున్న సూపరింటెండెంట్ తెనాలి (మారీసుపేట): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. జ్వరంతో బాధపడుతూ చికిత్సకు వచ్చిన ఆమెకు సరైన వైద్యం అందించటంలో నెలకొన్న జాప్యం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం చేయాలంటూ కొద్దిసేపు ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కాకుమాను మండలం పాండ్రుపాడుకు చెందిన కట్టా దేవమణి (48) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో తెనాలి జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు డెంగీ వ్యాధి సోకిందని, ప్రాథమిక దశలోనే ఉందని చెప్పి వైద్యశాలలో చేర్పించారు. మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క వైద్యుడు కూడా వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయలేదు. ఈ క్రమంలో దేవమణిలో చలనం లేకపోవటం, శరీరం మొత్తం చెమటలు పట్టటం గమనించిన కుటుంబ సభ్యులు విషయాన్ని అక్కడ ఉన్న నర్సులకు చెపారు. వారు మేం ఏం చేయలేమని, డాక్టర్ వచ్చి పరీక్షలు చేయాలని సమాధానమిచ్చారు. దీంతో బుధవారం ఉదయం దేవమణి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించి మరణించినట్లు చెప్పారన్నారు. సకాలంలో వైద్యులు పరీక్షించి ఉంటే దేవమణి ప్రాణాలు నిలిచేవని వారు విలపిస్తూ చెప్పారు. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేవమణి భర్త వీరయ్య ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ఇద్దరు కుమారులలో ఒకరు పాలిటెక్నిక్ చదువుతున్నాడని, మరొకరు టాపీ పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ దేవమణి కుమారుడిని చదివిస్తోందన్నారు. విషయం తెలుసుకున్న త్రీ టౌన్ సీఐ అశోక్ కుమార్ జిల్లా వైద్యశాలకు వచ్చి వివరాలు సేకరించారు. దీనిపై జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సులోచనను వివరణ కోరగా దేవమణి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందలేదన్నారు. వైద్యులు నిత్యం ఆమె ఆరోగ్య పరిస్ధితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారని, బంధువుల ఆరోపణలో వాస్తవం లేదని తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రిలో అదే నిర్లక్ష్యం
-
గోరక్షక్ గుండాలపై అట్రాసిటీ కేసులు పెట్టాలి
బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు బాపట్ల (మూలపాలెం): దళితుల పట్ల అధికార తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు విమర్శించారు. గోరక్షక్ గుండాల చేతులో దాడికి గురై అమలాపురంలో చికిత్సపొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ దళితులపై దాడి జరిగి 10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ముఖ్యమంత్రికానీ, దళిత ఎంపీలు, ఎమ్మెల్యే ఇంతవరకు బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. అమలాపురంలో గుజరాత్ తరహా దాడులు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణం అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు బహుజనులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. బాధితులను పరామర్శించిన వారిలో బహుజన రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ జి. శ్రీనివాస్, డాక్టర్ కాకాని సుధాకర్, డాక్టర్ జి.ఎం. సాంబయ్య, గల్లా ప్రకాష్‌రాజ్, మూర్తిలు ఉన్నారు. -
వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
► సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ► ‘భారత రాజ్యాంగం-పనితీరు’ సమావేశంలో ప్రసంగం సాక్షి, హైదరాబాద్: ‘‘ఎరువులు, పురుగు మందులకు స్థిరమైన ధర ఉంటోంది. కానీ రైతు పండించే పంటకు స్థిరమైన ధర ఉండటం లేదు. ఇది సరి కాదు. రైతులను ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగితే దేశం కుప్పకూలుతుంది. రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.. రైతుకు 4 గంటల విద్యుత్‌ను అందించలేకపోతున్నాయి. కానీ పరిశ్రమలకు18 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత న్యాయవాదుల యూని యన్ (ఐలూ) మాజీ అధ్యక్షుడు దివంగత అనంతారెడ్డి గౌరవార్థం ఐలూ, ఇక్ఫాయ్ సంయుక్తంగా ‘భారత రాజ్యాంగం-పనితీరు’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జస్టిస్ గోపాలగౌడ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రైతు అభివృద్ధికి భూమి ఎంతో దోహదపడుతుందన్నారు. తన తండ్రి రైతు కావడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. ఆస్తి హక్కు మానవ హక్కు... ‘‘భూమి కలిగి ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆస్తి హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థపై ఎంతైనా ఉంది’’ అని జస్టిస్ గోపాలగౌడ స్పష్టం చేశారు. ‘‘1991 తర్వాత వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, 1894 భూసేకరణ చట్టం వల్ల వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. అయినా దీని రక్షణకు రాజ్యాంగం పూర్తిస్థాయిలో దోహదపడలేదు’’ అని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు. సమావేశానికి ఐలూ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు జి. విద్యాసాగర్ అధ్యక్షత వహించగా కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎన్. బుసి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతారెడ్డి భార్య సుశీలాదేవి, కుమార్తె విజయారెడ్డి, ఐలూ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, హైకోర్టు ఏపీ, తెలంగాణ బార్ అసోసియేషన్స్ అధ్యక్షులు సి.నాగేశ్వర్రావు, గండ్ర మోహన్‌రావు పాల్గొన్నారు. -
దేవతలారా మన్నించండి..!
స్నాన ఘాట్ల వద్ద పడేసిన దేవతల విగ్రహాలు అమరావతి (గుంటూరు రూరల్): నిత్యం పూజలందుకునే దేవతల విగ్రహాలు ఎండకు ఎండి భక్తులు స్నానాలు చేసిన నీటితో తడిసి పోతున్నాయి. దేవాలయంలో ఉంటే నిత్యం పూజలు చేసే భక్తులు స్నానాల ఘాట్ వద్ద పడివున్న విగ్రహాలను మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు. అమరావతిలోని అమరేశ్వర ఘాట్ వీఐపీ ఘాట్ వద్ద కృష్ణమ్మతల్లి, కనకదుర్గ, వినాయకుడు తదితర దేవతల విగ్రహాలు ఎర్రని ఎండలో ఎండుతున్నా అటు అధికారులు, సేవకులు, భక్తులు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో భక్తులు పుణ్య స్నానాలను అచరించి వాటి వద్దే వస్త్రాలను సైతం ఆరవేశారు. -
యాక్సిడెంట్ కేసులో డ్రైవర్‌కు ఆరు నెలల జైలుశిక్ష
వరంగల్ లీగల్ : అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం కాజీపేట భవానీనగర్‌కు చెందిన కొంగరి రాందాసు (రైల్వే రిటైర్డ్ ఉద్యోగి) 2013 సెప్టెంబర్ 26న పని నిమిత్తం వరంగల్‌కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి వెళ్లేందుకు పాలిటెక్నిక్ ప్రధాన గేటు దాటుతున్నాడు. ఈ క్రమంలో హన్మకొండ వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న టాటా ఏసీ ట్రాలీ వాహనం అతివేగంగా వచ్చి రాందాసును ఢీకొంది. దీంతో అక్కడికక్కడే రాందాసు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన మట్టెవాడ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేయగా ట్రాలీ డ్రైవర్ బూర చిరంజీవి పర్వతగిరి మండలం సోమారం గ్రామస్తుడని నిర్ధారణ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఆరో మున్సిపాల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆర్.రఘునాథ్‌రెడ్డి తీర్పు చెప్పారు. ఆరునెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. సాక్షులను కానిస్టేబుల్ సంతోష్ కోర్టులో ప్రవేశ పెట్టగా, ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ ఆర్.శ్రీనివాస్ వాదిం చారు. -
విధుల్లో అలసత్వం వద్దు
జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి గుంటూరు వెస్ట్: పుష్కర విధుల్లో అలసత్వం పనికి రాదని, తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి సిబ్బందికి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీలు, వైద్యసిబ్బందికి సంయుక్తంగా మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో ముఖ్యంగా వైద్య ఆరోగ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పుష్కర ఘాట్లు, నగర్లలో ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. ఫాగింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవసరమైన సేవలను అందించాలన్నారు. వైద్యాధికారి సుధీర్ క్లోరినేషన్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా విభాగం అధికారి రవీంద్రబాబు, డీఎల్పీఓ సత్యనారాయణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద కేసులో ముగ్గురికి రిమాండ్
ఓర్వకల్లు: కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై ఈనెల 30వ తేదీన రాత్రి హుశేనాపురం–కాల్వబుగ్గ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాద కేసులో ముగ్గురిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ చంద్రబాబునాయుడు తెలిపారు. జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.కొంతలపాడు గ్రామానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ దేవానందం ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మతి చెందిన విషయం విధితమే. రహదారి విస్తరణ పనులలో కెఎంసీ కంపెనీకి చెందిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు కర్నూలు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ చంద్రబాబు నాయుడు కేఎంసీ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజశేఖర్, ఇంజనీరింగ్ అధికారులు సూలం సుధాకర్, మనోహర్‌రెడ్డి, డిప్యూటి ప్రాజెక్టు మేనేజర్ సుప్రసాద్‌దాసులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరిలో సుప్రసాద్ దాసు మినహా పైముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి వీరికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. - డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
కొండంత నిర్లక్ష్యం
– రెండు నెలల క్రిందటే స్వయంగా లేఖ రాసిన ఎస్పీ – పట్టించుకోని ఉన్నతాధికారులు – సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ – రెండు రోజులుగా శ్రీశైలంలోనే మకాం – మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు నివేదన సాక్షి ప్రతినిధి, కర్నూలు : శ్రీశైలంలో కొండచరియ విరిగిపడిన ప్రమాదంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కొండ చరియ విరిగిపడే ప్రమాదం పొంచివుందని రెండు నెలల కిందట స్వయంగా ఎస్పీ లేఖ రాసినప్పటికీ జిల్లా అధికారులు స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పాతాళగంగ ఘాట్ వద్దకు వెళ్లే ్రప్రాంతంలో కొండను తొలుస్తూ చేపట్టిన రోడ్ల వల్ల పైనుంచి కొండ చరియలు విరిగిపడి భక్తులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని మే నెలలోనే జిల్లా ఉన్నతాధికారులకు ఎస్పీ ఆకే రవికష్ణ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో చరియలు విరిగిపడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. ఇందుకోసం... 1. ఇనుప కంచెతోటి భద్రత వలయాలను ఏర్పాటు చేయాలి. 2. సివిల్ ఇంజనీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలతో రోడ్డు మార్గపు పనులను అధ్యయనం చేయించాలి. 3. ఆగస్టు నెలలో పుష్కరాలు జరగనున్నాయి. ఇదే నెలలోనే వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశం ఉంది. తద్వారా కొండ చరియలు మరింత విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా పుష్కర భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అని ఆయన రాసిన లేఖలోఓ పేర్కొన్నారు. ఈ మొత్తం పరిణామాలు శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కల్పించే అవకాశం ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే లేఖ రాసి రెండు నెలలు గడిచినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులెవరూ కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఫలితంగా రెండు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు కాని, పనిచేసేవారు కాని లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ఇదే ఘటన పుష్కరాల సమయంలో జరిగి ఉంటే అన్న ప్రశ్న అధికారులను ఇప్పుడు వేధిస్తోంది. జిల్లా ఎస్పీ సీరియస్... కొండచరియలు కూలిన ఘటనపై జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ తీవ్రంగా స్పందించారు. స్వయంగా తాను లేఖ రాయడంతో పాటు పుçష్కరాల సమీక్ష సమావేశంలో ఐదారు సార్లు ఈ సమస్య లేవనెత్తినప్పటికీ అధికారులెవరూ స్పందించకపోవడంపై ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఇదే నేపథ్యంలో శ్రీశైలంలోనే రెండు రోజులుగా మకాం వేశారు. అదే విధంగా మంగళవారం కూడా అందుబాటులో ఉన్న అధికారులందరితో శ్రీశైలంలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల దష్టికి... శ్రీశైలంలో కొండ చరియలు విరిగిన ఘటనను ఉన్నతాధికారులకు ఎస్పీ రవికష్ణ నివేదించారు. ఇందులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన నివేదించినట్లు తెలిసింది. అదే విధంగా కష్ణా పుష్కరాలకు తీసుకోవలసిన భద్రత విషయంలోనూ అధికారులు మిన్నకుండిపోతున్న విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు సవివరంగా నివేదించినట్లు తెలిసింది. మొత్తం మీద శ్రీశైలంలో కొండ చరియ విరిగిపడిన ఘటన కాస్తా కష్ణా పుష్కరాలకు జిల్లాలో భక్తుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపైనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. -
ఉప్మాలో పిన్నీస్
జీజీహెచ్‌లో చోటు చేసుకున్న సంఘటన గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆదివారం రోగులకు అల్పాహారంగా ఉప్మా పెట్టారు. అందులో ఓరోగికి పెట్టిన ఉప్మా ప్లేటులో పిన్నీస్ ప్రత్యక్షమైంది. ఉప్మాను నోటిలో పెట్టుకున్న సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఒక్కసారిగా కంగారు పడిన రోగి ఉప్మాను బయటకు తీయడంతో పిన్నీస్ కనిపించింది. దీంతో ఆసుపత్రి అధికారులకు రోగి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మాచర్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన రాగం లక్ష్మీనారాయణ రక్తహీనతతో బాధపడుతూ చికిత్స కోసం ఈనెల 21న జీజీహెచ్‌లోని 102 నంబర్ వార్డులో చేరాడు. ఆసుపత్రి ఇన్‌పేషెంట్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా కాంట్రాక్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందజేస్తుంది. ఆదివారం లక్ష్మీనారాయణకు అల్పాహారం తీసుకొచ్చేందుకు తల్లి సామ్రాజ్యం అల్పాహారం పెట్టే బండి వద్దకు వెళ్ళి తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చింది. రెండుముద్దలు తిన్న పిదప మూడో ముద్ద తినే సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఉప్మాను బయటకు ఊయడంతో పిన్నీస్ బయటపడింది. ఉప్మాను వడ్డించిన వారికి, నర్సింగ్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసి తదుపరి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్‌కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి డైటీషియన్ రవికుమార్, కాంట్రాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, తమ వద్ద వండిన పదార్థాల్లో అలాంటివి ఉండవని పేర్కొన్నారు. కావాలనే కొందరు తమ పై బురదజల్లేందుకు ఈవిధంగాచేసి ఉండవచ్చని వెల్లడించారు. -
పల్స్ సర్వేపై అలసత్వం వద్దు
►జెడ్పీ సీఈఓ నగేష్ శ్రీకాకుళం టౌన్: జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ సర్వేపై అలసత్వం విడనాడాలని జెడ్పీ సీఈఓ బి.నగేష్ పంచాయతీ రాజ్ ఉద్యోగులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులతో, ఎంపీడీఓలతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ట్యాబ్‌ల పనితీరుపై ఆరా తీశారు. ప్రతి కుటుంబంలో సర్వేకు అవసరమైన డేటాతోపాటు జియో ట్యాగింగ్ చేసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని, పంచాయతీ పరిధిలో సమగ్ర డేలా కార్యదర్శుల చేతిలో ఉంటుందని తెలిపారు. కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఈఓ ఎస్.రవీంద్ర, పరిపాలనాధికారి కిరణ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. -
నత్తనడకన హవేళి ఘణాపూర్ రోడ్డు మరమ్మతులు
రోడ్డుపై నుండి విద్యుత్ స్థంభాలు తొలగించని వైనం అవస్థల్లో ప్రయాణికులు మెదక్‌రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అత్యవసరం. దీన్ని గుర్తించి ప్రభుత్వం కొన్ని మేజర్ గ్రామాలకు కొత్తరోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేసింది. కాని అధికారుల అలసత్వం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణీకులు, వాహనదారులు దుమ్ము,ధూళితో నరక యాతన అనుభవిస్తున్నారు. మెదక్ మండల పరిధిలోని రామాయంపేట ఆర్అండ్బి రోడ్డు నుండి హవేళి ఘణాపూర్ వరకు సుమారు 3కిలోమీటర్ల సింగిల్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించేందుకు గత 8 నెలల క్రితం రూ.3.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు చురుకుగా సాగడం లేదు. పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో రోడ్డుపైన వేసిన కంకరతో వాహనదారులు, ప్రజలు ప్రయాణించలేక నానా పాట్లు పడుతున్నారు. కాగా ఈ రహదారిలోనే జిల్లాలోని ఏకైక డైట్ కళాశాల ఉంది. అలాగే మండలంలోని లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలతోపాటు వైపీఆర్ ఇంజనీర్ కళాశాలకు ఇదే దారి కావడంతో విద్యార్థులతోపాటు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఈముఖ్యంగా రామాయంపేట నుండి వయా హవేళిఘణాపూర్ మీదుగా నాగాపూర్ సబ్‌స్టేషన్‌కు 33కేవి హైటెన్షన్ విద్యుత్‌లైన్ వేశారు. ఈ స్థంభాలు తొలగిస్తే తప్ప రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగవు. వాటిని తొలగించడంలో ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బి, ట్రాన్స్‌కో శాఖల మధ్య సమన్వయంలేక రోడ్డు నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామస్తులు భావిస్తున్నారు. పనులు ప్రారంభమై 8నెలలు గడుస్తున్నా వీటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందిఈ విషయంపై ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్థంభాలను తొలగించడంతో రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
నిధులున్నా ఖర్చు పెట్టరా?
♦ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కన్పించడం లేదు ♦ జిల్లాలో ఎక్కడా సరైన వైద్య సేవలు అందట్లేదు ♦ ఇకపై నిర్లిప్తతను ఎంతమాత్రం సహించేది లేదు ♦ నిఘా, పర్యవేక్షణ సమావేశంలో ఎమ్మెల్యేల మండిపాటు సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్య, ఆరోగ్య విభాగంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందని నిఘా, పర్యవేక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నిధులున్నా సౌకర్యాల కల్పనకు ఎందుకు వాడుకోవడం లేదని నిలదీసింది. వైద్యుల పనితీరుపైనా మండి పడింది. వైద్యులు లేనిచోట ఆస్పత్రులెందుకంటూ వైద్య శాఖను నిలదీసింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని టీఎస్ ఐపార్డ్‌లో వైద్య, ఆరోగ్య శాఖ నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్ రఘునందన్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాఖ పనితీరును సమీక్షిస్తూ ఎమ్మెల్యేలు పైవిధంగా స్పందించారు. వారంతా ఎక్కడికెళ్తారు? జిల్లాలో చాలాచోట్ల డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదంటూ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, కాలె యాదయ్య సమావేశంలో ప్రస్తావించారు. మేడ్చల్ ఆస్పత్రిలో డాక్టర్లెప్పుడూ కనిపించరని, అలాంటప్పుడు అక్కడ ఆస్పత్రి ఎందుకంటూ సుధీర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్ ఆస్పత్రుల్లో సైతం ఇదే సమస్య ఉందంటూ ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. విధులకు రాకుండా డాక్టర్లు ఎక్కడికెళ్తున్నారంటూ డీఎంహెచ్ఓను నిలదీయడంతో ఆయన పెదవి విప్పలేదు. పర్యవేక్షణ గాలికొదిలేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సభ్యులు అన్నారు. వికారాబాద్ ఆస్పత్రిలో వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకపోవడంతో తప్పుపట్టిపోతున్నాయంటూ ఎమ్మెల్యే సంజీవరావు సభకు వివరించారు. రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆస్పత్రి నిర్మించినప్పటికీ వినియోగించుకోకపోవడంపై ఆయన అభ్యంతరం చెప్పారు. లక్షలు ఖర్చుచేసి భవనాలు నిర్మించినా.. వాటిని ఉపయోగించుకోకుండా ప్రజాధనాన్ని దుబారా చేయడం తగద న్నారు. చేవెళ్ల ఆస్పత్రుల్లో డాక్టర్లు అధికంగా డుమ్మాలు కొడతారన్నారు. రెండేళ్ల తర్వాత గుర్తొచ్చిందా..! వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి నిఘా, పర్యవేక్షణ సమావేశాన్ని రెండేళ్లుగా ఎందుకు నిర్వహించలేదంటూ ఎమ్మెల్యేలు డీఎంహెచ్‌ఓపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలు క్రమం తప్పకుండా జరిగితే పనులు సక్రమంగా సాగుతాయన్నారు. రెండేళ్ల తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో సర్దుకుపోతున్నామని.. ఇకపై నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేదిలేదని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు మెరుగయ్యేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేద్దామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్తంగా సదరం క్యాంపులు నిర్వహిస్తామన్నారు. కమిటీ సమావేశాలు రెగ్యులర్‌గా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డీపీఓ అరుణ, డీఐఓ గణేష్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నిన్న బాలుడు.. బలి! నేడు డ్రైవర్.. బలి!
అరకు ప్రమాద ఘటనలో పోలీసుల పన్నాగం పోలీసు అధికారిని కాపాడేందుకు చిరుద్యోగిపైకి నేరం నెట్టివేత బాలుడి దుర్మరణం కేసులో పోలీసు డ్రైవర్‌పై కేసు, అరెస్టు రెండు రోజులుగా పత్తాలేని సదరు అధికారి ఘటనపై విచారణ చేస్తున్నామన్న జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంతో వాహనం నడిపి ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నారు.. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రాణాలకు వెల కట్టి సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ వ్యవహారం కాస్త ‘సాక్షి’ ద్వారా బట్టబయలు కావడంతో మరొకరిని బలి చేసేందుకు కుట్ర పన్నారు. ప్రమాద సమయంలో వాహనం నడుపుతున్నాడంటూ తీరిగ్గా.. రెండు రోజుల తర్వాత అమాయక డ్రైవర్‌పై కేసు బనాయించి.. అరెస్టు చేశారు. ప్రమాద సమయంలో వాహనంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేరంటున్నారు. అలాంటప్పుడు కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిన సదరు అధికారి అప్పటినుంచి ఎందుకు పత్తాలేకుండా పోయారన్నదానికి సమాధానం లేదు. అదొక్కటే కాదు.. ఈ కేసులో సమాధానం దొరకని ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. విశాఖపట్నం: రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి నిండు ప్రాణాలు బలిగొన్నా.. కనీసం పట్టించుకోకుండా పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన దారుణ ఘటనను తారుమారు చేసే కుట్రకు పోలీసు ఉన్నతాధికారులు తెరలేపారు. అరకులోయ మండలం కొత్తభల్లుగుడ గ్రామంలో శనివారం ఉదయం పోలీసు వాహనం ఢీకొని గిరిజన బాలుడు వంతాల సూర్య(7) అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. వాహనం బాలుడిని ఢీకొట్టిన తర్వాతైనా.. వాహనం దిగి ఏమైందో చూద్దామన్న కనీస మానవత్వం లేకుండా వాహనం నడిపిన పోలీసు అధికారి నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లిపోవడం.. ఆనక ఊరి పెద్దలకు తెలిసి పంచాయితీ పెడితే డబ్బులు పారేసి సెటిల్ చేసుకున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రమాద విషయం ఆరోజే పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ వాస్తవాన్ని బట్టబయలు చేస్తూ ‘ఖాకీ బండి.. కేసు ఉండదండి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రచురించిన కలకలం రేపింది. దీంతో ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ వాస్తవ ఘటనను తారుమారు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసు వాహనం బొలేరోను నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎం.హెచ్.ఎస్.ఎస్. రాఘవేంద్రరావుపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు కట్టి అరెస్టు చేసినట్టు అరకులోయ ఎస్సై పి.సింహాచలం తెలిపారు. అయితే వాస్తవానికి ప్రమాద ఘటన స్థలంలో డ్రైవర్ రాఘవేంద్రరావు లేరని తెలుస్తోంది. ఆ వాహనం నడిపింది కూడా ఆయన కాదని.. ఓ పోలీసు అధికారే స్వయంగా దాన్ని నడిపినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పోలీసులను సూటిగా అడిగితే ‘ఏమో.. మమ్మల్నేమీ అడగొద్దు’ అంటూ తప్పించుకుంటున్నారు. ఆ అధికారి లేరట.. నన్నేమీ అడగొద్దు -ఎస్ఐ సింహాచలం అరకు ప్రమాద ఘటనకు ఓ పోలీసు అధికారి బాధ్యుడని అందరూ అంటున్నారు.. కానీ డ్రైవర్‌పై కేసు నమోదు చేయడమేంటని ‘సాక్షి ప్రతినిధి’ ఎస్ఐ సింహాచలాన్ని సూటిగా ప్రశ్నించగా ఆయన బదులిస్తూ.. ‘ఏమోనండి.. ఆయన లేరంటున్నారు మరి’.. అని నసిగారు. మరి ఘటనలో లేనప్పుడు కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాల్సిన ఆ అధికారి గత రెండు రోజులుగా ఎందుకు పత్తా లేకుండా పోయారని ప్రశ్నిస్తే... ‘ఏమోనండీ.. ఈ విషయంలో నన్ను ఇంతకంటే ఏమీ అడగొద్దు.. నేనేమీ చెప్పలేను’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజు ప్రమాదానికి కారకుడైన పోలీసు అధికారి ఎస్ఐ సింహాచలమే అని భావించిన గిరిజన నేతలు ఆయనపై దాడి చేశారు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోని ఎస్ఐ ఆ కేసు గురించి ఎవరు ఏం మాట్లాడినా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. ఎస్‌హెచ్‌వో ఉన్నట్టు తేలితే చర్యలు:జిల్లా ఎస్పీ అరకులో జరిగిన ప్రమాద ఘటనలో ప్రస్తుతానికి డ్రైవర్‌ను అరెస్టు చేశామని, పోలీసు అధికారి ఉన్నట్టు తేలితే కచ్చితంగా అతన్ని కూడా అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని, వాస్తవాలు తేలిన తర్వాత దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. -
మూన్నేళ్ల సంది పింఛన్ వస్తలే..
♦ ఓ వితంతువు ఆవేదన .. ♦ అర్థాకలితో పిల్లలు అలమటిస్తున్నారు ♦ అధికారుల నిర్లక్ష్యమే కారణం మెదక్: చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఓ వితంతువుకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలలుగా పింఛన్ రావడంలేదు. దీంతో ముగ్గురు పిల్లలతో పాటు తాను అర్థాకలితో అలమటిస్తున్నామని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. మెదక్ మండలం హవేళిఘణాపూర్ గిరిజన తండాకు చెందిన లంబాడీ బూలి భర్త నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆమెకు 2014 ఆగస్టు నుంచి పింఛన్ మంజూరైంది. అయితే వస్తున్న పింఛన్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో అధికారులు గత మూడునెలలుగా ఇవ్వడం లేదు. బాధితురాలికి పదేళ్లలోపు ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులులేని బూలి పిల్లలతో ఓ చిన్నపాటి పూరిపాకలో నివాసముంటోంది. దొరికిన నాడు కూలిపని చేస్తూ పిల్లలకు బువ్వ పెడతానని లేనినాడు ఉపవాసముంటున్నామని విలపిస్తూ తెలిపింది. పింఛన్ బంద్ కావడంతో మూడు నెలలుగా నిత్యం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని బాధితురాలు అధికారులను వేడుకుంటోంది. -
పాపం.. ఆ అవ్వ చనిపోయింది
ఉసురుతీసిన ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యం అఫ్జల్‌గంజ్: పాపం... ఆ అవ్వ చనిపోయింది. ఏ దిక్కూలేని ఆమెకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమయానికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడంతో చివరికి కన్ను మూసింది. వైద్యో నారాయణో హరి అంటారు. అయితే, ఇక్కడి వైద్యులు ఆ మాటకు అర్థాన్ని మార్చేశారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అపస్మారకస్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు, సిబ్బంది ఆమె వెంట సహాయకులు లేరనే కారణంతో ఈ నెల 13వ తేదీ అర్దరాత్రి ఆసుపత్రి నుంచి గెంటివేశారు. మరుసటి రోజు ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డికి ఈ విషయం తెలిసి వైద్యులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రిలో చేర్చుకొని రెండు రోజుల పాటు వైద్యం అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి నుంచి బయటికి గెంటివేయకుండా వైద్యం అందించి ఉంటే ఆమె మరికొన్ని రోజులు ఈ లోకంలో ఉండేదేమో.. సరైన వైద్యం అందకపోవడంతో గురువారం రాత్రి కన్నుమూసింది. ఎవ్వరూ లేని అనాధగా మిగిలిపోవడం ఆ అవ్వ చేసిన పాపమా.. లేక సరైన సమయంలో వైద్యం అందించని ఉస్మానియా వైద్యులదా? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో మృతదేహం: వృద్ధురాలి సంబంధీకులు ఎవ్వరూ లేకపోవ డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అనాధ శవంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం చేయించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులుంటే అఫ్జల్‌గంజ్ ఠాణాలో సంప్రదించాలని కోరారు. -
నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు !
♦ బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలి ♦ ‘విజిలెన్స్ మానిటరింగ్’లో ఎంపీ కవిత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని విజి లెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్పర్సన్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏళ్ల తరబడిగా వెనుకబడిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ పంచాయతీరాజ్‌కు సంబంధించి పనుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నారని అన్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి పెనాల్టీ వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ, ఇతర కాలనీల్లో పనులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యేల నిధులతో కలిపి ప్రభుత్వం నిధులు వినియోగించుకునేలా ప్రయత్నం చేద్దామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే విధంగా చూడాలని ఎంపీ కవిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవా సదుపాయాలు కల్పిస్తున్నామని, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు మరొకసారి అవగాహన కల్పించి వైద్యశాఖను మరింత బలోపేతం చేయవల్సి అవసరం ఉందని ఆమె సూచించారు. -
నిలువ నీడ ఏదీ?
బస్ షెల్టర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు ఏటా అదేతీరు... మండిపడుతున్న నగర ప్రయాణికులు 630 చోట్ల షెల్టర్లు అవసరం సిటీబ్యూరో: నగరంలో బస్షెల్టర్ల నిర్మాణంపై ఏళ్లకేళ్లుగా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రతి ఏటా ప్రభుత్వం ప్రతిపాదనలతోనే సరిపెట్టేస్తోంది. దీంతో నిలువ నీడలేని దుస్థితిలో ప్రయాణికులు మండుటెండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ నెల మొదటి వారంతోనే ఎండ నిప్పులు చెరుగుతోంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రతను ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి షెల్టర్లు లేని బస్టాపుల్లోనే ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తుంది. విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. నగరంలోని సుమారు 2000 చోట్ల బస్టాప్‌లు ఉన్నాయి. కోఠీ, సనత్‌నగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ రెతిఫైల్ వంటి కొన్ని ప్రాంతాల్లో బస్స్టేషన్లు, ఇందిరాపార్కు, లక్డీకాపూల్, కేపీహెచ్‌బీ, తార్నాక, ఎల్బీనగర్ వంటి ప్రధాన రహదారులపై ఉన్న బస్టాపులు, బస్‌బేల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. చాలా చోట్ల ప్రయాణికులు మండుటెండల్లోనే నించొని బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. 630 చోట్ల షెల్టర్లు అవసరం... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క రెతిఫైల్ బస్‌స్టేషన్ మినహా మరెక్కడా సరైన షెల్టర్లు లేవు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాపులో కొన్ని రూట్లకు మాత్రమే షెల్టర్ సదుపాయం ఉంది. అల్వాల్, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్, ఆఫ్జల్‌గంజ్, కోఠీ, చార్మినార్ వైపు వెళ్లే ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే బస్టాపులోనూ ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని షెల్టర్లు లేవు. రోడ్డుపైనే నిలుచుంటున్నారు. రామంతాపూర్, అంబర్పేట్, తదితర చోట్ల షెల్టర్లు లేకపోవ డంతో ప్రయాణికులు ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ నిల్చుంటున్నారు. అమీర్‌పేట్ మైత్రీవనమ్, సారథి స్టూడియో, ఎర్రగడ్డ చౌరస్తా, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, జెక్కాలనీ, ఎర్రగడ్డ చౌరస్తా, బల్కంపేట్లలో షెల్టర్లు లేవు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2000 బస్టాపుల్లో ప్రస్తుతం 1370 చోట్ల బస్షెల్టర్లు ఉన్నాయని, మరో 630 చోట్ల లేవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వీటి నిర్మాణం చేపట్టవలసి ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ నగరంలోని చాలా చోట్ల మెట్రో నిర్మాణ పనుల దష్ట్యా షెల్టర్లను తొలగించారు. మరోవైపు బస్టాపులు లేని చోట కేవలం వ్యాపార ప్రకటనల కోసం షెల్టర్లును ఏర్పాటు చేశారు. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ వంటి జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో బస్టాపులతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన షెల్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల చిరువ్యాపారులు, ఇతరులు ఆక్రమించుకొని వాటి ఉనికినే మార్చివేశారు. ఆర్టీసీ గుర్తించిన 630 షెల్టర్ల కోసం గత సంవత్సరమే జీహెచ్ఎంసీకి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫలితంగా లక్షలాది మంది మండుటెండల్లో మలమల మాడుతూ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. క్యూ రెయిలింగ్దీ అంతే సంగతులు... ముంబయి తరహాలో క్యూ రెయిలింగ్ కోసం రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పట్లో మం త్రులు, ఉన్నతాధికారులు ముంబయికి వెళ్లి క్యూ పద్ధతిని అధ్యయనం చేసి వచ్చారు. అబిడ్స్ మార్గంలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ రద్దీ, ఇతర కారణాల దష్ట్యా ఆచరణ సాధ్యం కాదని విరమించారు. ఆ తరువాత నగరంలోని 152 ప్రాంతాల్లో బస్‌బేలను ఏర్పాటు చేసి క్యూ రెయిలింగ్ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్డీకాఫూల్, నాగోల్, ఎల్బీనగర్, సుచిత్ర, కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్ వంటి పలు ప్రాంతాల్లో రెయిలింగ్‌కు అవకాశం ఉన్న చోట బస్‌బేలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.