వాళ్లు సైతం నిర్లక్ష్యం చేస్తారు...
కొంతమంది పేషెంట్లే కాదు... సాక్షాత్తూ డాక్టర్లు సైతం తాము తీసుకోవాల్సిన చికిత్సను నిర్లక్ష్యం చేస్తారంటున్నారు పరిశోధకులు. దాదాపు రెండు వేలకు పైగా డాక్టర్లను పరిశీలించాక నిపుణులు వెల్లడించిన అంశమిది. తమకు మానసిక సమస్య ఉందన్న విషయం బయటకు వెల్లడవుతుందేమోనని ఆందోళన చెంది కొందరు డాక్టర్లు తమ మానసిక సమస్యలను బయటపెట్టరని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ క్యాథరిన్ గోల్డ్.
యాన్ ఆర్బర్ నగరంలోని ఆ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. డిప్రెషన్‌కు లోనైన డాక్టర్లు కూడా మామూలు పేషెంట్లలాగే తాము తీసుకోవాల్సిన మందులను సరిగా వాడరని పేర్కొంటున్నారు డాక్టర్ గోల్డ్. ఇలా జబ్బును నిర్లక్ష్యం చేసే విషయంలో మగ డాక్టర్లు, ఆడ డాక్టర్లు అనే తేడా లేకుండా అందరూ ఒకేలా వ్యవహరిస్తారంటున్నారామె.