గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా? | Anant Ambani Vantara Doctors Team Treatment To Sick Elephant In Tripura, Video Goes Viral | Sakshi
Sakshi News home page

గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?

Published Sun, May 12 2024 7:10 PM | Last Updated on Sun, May 12 2024 8:27 PM

Anant Ambani Vantara Doctors Team Treatment To Sick Elephant

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆయనకున్న జంతు ప్రేమను నిరూపించుకున్నారు.

త్రిపురలోని కైలాషహర్‌ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దానికి సహాయం చేయాలని అనంత అంబానీని కోరారు. దీనికి సంబంధించిన వీడియో 'కుంతల సిన్హా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి అనంత్ అంబానీ స్పందించారు.

అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అనంత్ అంబానీ.. వైద్యుల బృందాన్ని అక్కడకు పంపారు. వైద్యుల బృందం సుమారు 3500 కిమీ ప్రయాణించి అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement