
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్‌లు, కార్లు అన్ని హైలెట్‌గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ముఖేశ్‌తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..
ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్‌లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట.
ఈ పతకం జామ్‌నగర్‌లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్‌కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు.
(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?)
Comments
Please login to add a commentAdd a comment