రిచ్‌ బ్లూ గ్రీన్‌ లెహంగాలో ఎవర్‌ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్‌..! | Nita Ambanis Green And Blue Lehenga Saree | Sakshi
Sakshi News home page

రిచ్‌ బ్లూ గ్రీన్‌ లెహంగాలో ఎవర్‌ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్‌..!

Published Thu, Jul 11 2024 11:02 AM | Last Updated on Thu, Jul 11 2024 1:37 PM

Nita Ambanis Green And Blue Lehenga Saree

ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి కోలాహలంతో సందడిగా ఉంది. రోజుకో ఈవెంట్‌లో కుటుబసభ్యులంతా కళ్లు చెదిరే ష్యాషన్‌ డిజైనర్‌ వేర్‌లతో అలరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతోంది. అందులో భాగంగా అనంత్‌ రాధికల శివశక్తి వేడుక జరిగింది. ఈ వేడుకలో నీతా ధరించిన లెహంగా మిస్మరైజ్‌ చేస్తోంది. చక్కటి రిచ్‌ బ్లూ గ్రీన్‌ లెహంగాలో నీతా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసిపోతోంది. ఆ గ్రాండ్‌ లెహంగాకి తగ్గట్టుగా ఆమె ధరించిన పెద్ద కుందన్‌ నెక్లెస్ సెట్‌ మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె ముఖ వర్చస్సు మరింత అందంగా కనిపిస్తోంది. 

అబు జానీ సందీప్‌ ఖోస్టో డిజైన్‌ చేసిన స్పెషల్‌ లెహంగాలో నీతా చాలా అందంగా కనిపించింది. ఆ లెహంగా..చిలుక ఆకుపచ్చ స్కర్ట్‌, పైన రిచ్‌ బ్లూ దుప్పట దానిపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌, మిర్రర్‌లతో కూడిన జరీ వర్క్‌తో అందంగా తీర్చిదిద్దారు. నీతా ధరించిన లెహంగా మంచి రిచ్‌ లుక్‌లో ఉండగా, ముఖ్యంగా ఆమె నెక్‌కి ధరించిన కుందనపు నగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెవులకు సైతం పెద్ద కుందనాలతో ఉన్న చెవిపోగులనే ధరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా, అనంత్‌ రాధికల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే.

 

(చదవండి: అనంత్‌ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్‌ హెయిర్‌ స్టైల్‌లో ఇషా..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement