ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్‌వేర్ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్‌లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్‌కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్ కుర్తా.
దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్‌లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్‌ని సెట్ చేసింది నీతా.
అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్ వేర్‌కి మ్యాచింగ్‌గా ధరించిన బ్రాస్‌లెట్, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్ స్ట్రాపీ హీల్స్‌తో తన రాణి మాదిరి లుక్‌ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్ మేకప్‌ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం.
(చదవండి: అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్‌ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!)
Comments
Please login to add a commentAdd a comment