
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు తడి సి, రంగు మారి సరైన మద్దతుధర లభించక రైతులు విలవిల్లాడుతున్నా, బోనస్ ప్రకటించ డంలో, రుణాలను ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తాయి. రుణమాఫీ చేశామ ని ప్రభుత్వం ఘనంగా చెబుతున్నా, వాటిపై వడ్డీ భారం తొలగించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ దృష్ట్యా వారికి మద్దతుధర కల్పించాలని, బోన స్ ప్రకటించాలని, తడిసిన పంటను కొను గోలు చేసే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశా యి. రుణమాఫీ, మద్దతుధర తదితర అంశా లపై జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయి.
బోనస్ ప్రకటించాలి: జీవన్‌రెడ్డి
అనావృష్టితో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం తగ్గిందని, ఉన్న పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు వరి, పత్తి, మొక్కజొన్న పంట లను దెబ్బతీశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపా ల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. పత్తికి మద్ధతుధర రూ.4,320 ఉన్నా.. 2 వేలకు మించి దక్కడం లేదన్నారు. వరి, మొక్కజొన్నపై రూ.500, పత్తిపై రూ.వె య్యి బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానాని కి చేరిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుం టుంటే వచ్చే ఏడాది పెట్టుబడి సాయం చేస్తా మంటున్నారని, సబబేనా అని ప్రశ్నించారు.
బీమా అమల్లో నిర్లక్ష్యం: కిషన్‌రెడ్డి
కేంద్రం వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, కానీ రాష్ట్రంలో ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపిం చారు. 55 లక్షల మంది రైతులుంటే 6 లక్షల మందే బీమా చేయించుకున్నారని, పథ కం అమలును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. విత్తన భాండాగారం చేస్తామ న్న రాష్ట్రంలోనే నకిలీ విత్తనాల బెడద ఎక్కువైం దని, డీలర్లపై కేసులు పెడితే లాభం లేదని, విత్తన కంపెనీలపైనే పీడీ కేసులు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాం డ్ చేశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిం చేందుకు అధికారులు లేరని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు.
కాల్చి చంపిందెవరు: గాదరి కిశోర్
రూ.2 లక్షలు మాఫీ చేస్తామని కొన్ని పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని, ఇప్పుడు అవే పార్టీలు రైతులను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని మాట్లాడుతున్నాయని టీఆర్‌ఎస్ సభ్యుడు గాదరి కిశోర్ మండిపడ్డారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన ఘనత ఆ పార్టీలదేనని ఆరోపించారు.
కాంగ్రెస్ సభ్యులు ఎక్కడ?.. మీ సీఎం ఎక్కడ?
వ్యవసాయంపై ప్రధాన పార్టీలన్నీ మాట్లాడటం పూర్తయిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క సభ్యుడు కూడా సభలో లేకపోవడంపై శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కీలకాంశంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత జానారెడ్డి సహా ఎవరూ లేరంటే.. వారికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదే సమయంలో సభలోకి వచ్చిన జానారెడ్డి.. ఇంత ముఖ్యమైన సమయంలో మీ సీఎం ఎక్కడికి పోయారని ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సభలో లేరు.
Comments
Please login to add a commentAdd a comment