
రింగన్‌ఘాట ఆలయంలోని ఆంజనేయ ప్రతిమలు
కెరమెరి : అధికారుల నిర్లక్ష్యంతో పునరావాస కాలనీల ప్రజలకు దైవ దర్శనం కరువైంది. పునరావస కాలనీలు నిర్మాణమే తమ వంతు అనుకున్న అధికారులు అక్కడ దేవాలయాలను నిర్మించడం మరిచిపోయారు. దీంతో ప్రజలు విరాళాలు సేకరించి గుడిసెలు నిర్మించి పూజలు చేసుకుంటున్నారు. ఐదారేళ్ల క్రితం మండలంలోని నిషా ని, రింగన్‌ఘాట్ పునరావాస కాలనీల్లో దేవాలయాలు లేక పూజలు చేసేదెక్కడని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా పునరావాసం కాలనీలు ఉన్న చోట పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, కోరుకున్న దే వాలయాలను నిర్మించాలని నిబంధనల్లో ఉంది. కాని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment