కార్మిక చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
Published Fri, Aug 26 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక హక్కుల చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ అనుబంధ యూనియాన్ మున్సిపల్ వర్కర్స్ యూనియాన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని యూనియాన్ భవనంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతం రూ.18 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు కార్మికులే లేకుండా చేస్తానని ఎన్నికల ముందు హామీమి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాలు గడిచిన ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడమే కాకుండా యూనియాన్ సమావేశాలకు హాజరైతే పని నుంచి తొలగిస్తామని బెదిరింపులు పల్పడుతున్నారని పేర్నొన్నారు. కార్మికులు సంఘటితంగా ఉంటనే సమస్యల పరిష్కమవుతాయన్నారు. 15 డిమాండ్లును నేరవెర్చాలని సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని యూనియాన్ల పాటు కార్మికులు పాల్గొటారని పేర్కొన్నారు. ఈ నెల 30న జిల్లాలో అన్ని మున్సిపల్ కార్మికులు బైక్‌ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, మున్సిపల్ కార్మిక అధ్యక్షుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కాంతారావు, బాపురావు, సంతోష్, పోషెట్టి పాల్గొన్నారు.
Advertisement
Advertisement