జంధ్యాల రఘుబాబు దంపతులను సన్మానిస్తున్న దశ్యం
అమ్మ భాషకు ఆదరణ కరువు
Published Sun, Sep 18 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
– ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు ఆదరణ తగ్గుతోందని ప్రముఖ కవి జంధ్యాల రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషపై మోజుతో తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకే పంపుతూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నార న్నారు. శ్రీపింగలి సూరన తెలుగుతోటలో ఆదివారం కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘కథ–కవితా వస్తువులు ప్రపంచీకరణ ప్రభావము’ అన్న అంశంపై సాహితీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘుబాబు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మ, ఆర్.రామారావు, జే.శివకష్ణ, అర్జున్, సుధీర్, పార్వతీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement