ముంబై: పదకొండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి మరణానికి కారణమయ్యారన్న (హిట్ అండ్ రన్) కేసులో పునర్విచారణ జరపాలని ముంబై సెషన్స్ కోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో తాజా విచారణ చేపట్టాలని, సాక్ష్యాలను, ఆధారాలను పునఃసమీక్షించాలని చెప్పింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో తాజాగా విచారణ ప్రారంభంకానుంది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు బాంద్రాలో బేకరి వద్ద ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. కేసు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.