హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు ఊరట | Mumbai Court orders fresh trial against Salman Khan in hit-and-run case | Sakshi
Sakshi News home page

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు ఊరట

Published Thu, Dec 5 2013 2:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు ఊరట - Sakshi

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు ఊరట

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు ముంబై సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. 11 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు యాక్సిడెంట్ కేసు (హిట్ అండ్ రన్)ను మళ్లీ కొత్తగా విచారించాలన్న సల్మాన్ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. సెషన్స్ కోర్టు జడ్జి డీ డబ్ల్యూ దేశ్పాండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో సాక్షులందరినీ మళ్లీ విచారించాలని ఆదేశించారు.

2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు ఆరోపణలు వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ముంబై పోలీసులు సల్మాన్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మెజిస్టీరియల్ కోర్టులో విచారించారు. అతనికి వ్యతిరేకంగా సాక్షాలున్నాయని, నేరం రుజువైతే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును మళ్లీ విచారించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement