Hit-and-run case
-
సల్మాన్‌ఖాన్ నిర్దోషి: హైకోర్టు తీర్పు
హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు తీర్పు ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్(49)ను గురువారం బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మితిమీరి మద్యం సేవించిన ప్రభావంతో వేగంగా కారును నడిపి, పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మరణానికి, మరో నలుగురు గాయాలపాలు కావడానికి కారణమయ్యాడన్న ఆరోపణలతో నమోదైన కేసులో.. ఆ ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. ప్రమాదం సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లుగానీ, డ్రైవింగ్ తానే చేస్తున్నట్లుగానీ ప్రాసిక్యూషన్ నిర్దిష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. సల్మాన్ బాడీగార్డ్ అయిన ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ సాక్ష్యంలో లోపాలున్నాయని, ఆయన సాక్ష్యాన్ని విశ్వసించలేమని స్పష్టం చేస్తూ సల్మాన్‌ను విముక్తుడిని చేసింది. హైకోర్టు తీర్పుతో 13 ఏళ్ల నాటి కేసు నుంచి సల్మాన్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడగానే తీవ్ర భావోద్వేగానికి గురైన సల్మాన్ కన్నీటి పర్యంతమయ్యారు. హైకోర్టు తీర్పుపై అపీల్‌కు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ కేసులో దోషిగా పేర్కొంటూ, స్థానిక ట్రయల్ కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, ఆ తీర్పును సవాలు చేస్తూ ఖాన్ హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. 13 ఏళ్ల ప్రస్థానం..: 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్లో మద్యం సేవించి, వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రమాద సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న ఆయన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్.. పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఆ సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లు రవీంద్ర పాటిల్ చెప్పలేదు. కానీ తన సలహాను కాదని, వేగంగా కారు నడిపారని పోలీసులకు చెప్పారు. ఆ తరువాత ఇచ్చిన సాక్ష్యాల్లో మాత్రం ప్రమాద సమయంలో సల్మాన్ మద్యం ప్రభావంలో ఉన్నారని చెప్పారు. 2007లో టీబీతో ఆయన మరణించారు. హ్యాప్పీ హీరో: తీర్పు సమయంలో కచ్చితంగా హాజరు కావాలన్న జడ్జి ఆదేశాలపై బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చెల్లి అల్వీరా, బావమరిది ఆయుష్, బాడీగార్డ్ షేరాతో కలిసి సల్మాన్ కోర్టుకు వచ్చారు. ఖాన్ తీర్పు తర్వాత పెద్ద భారం దిగినట్లుగా కనిపించారు. తీర్పు సమయంలో సల్మాన్ అభిమానులు, లాయర్లు, హైకోర్టు సిబ్బందితో కోర్టు హాలు నిండిపోయింది. ‘ఈ తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఈ విషయంలో నాకు తోడుగా నిలిచి, నా కోసం ప్రార్ధించిన నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని సల్మాన్ ట్వీట్ చేశారు. ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని బాలీవుడ్ స్వాగతించింది. తీర్పుపై పరిశ్రమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు చాలా సంతోషాన్ని కలిగించిందని బాలీవుడ్ ప్రముఖులు అనీస్ బాజ్మీ, మాధుర్ భండార్కర్, మాధురి దీక్షిత్, సుభాష్ ఘాయ్ పేర్కొన్నారు. తీర్పు ముఖ్యాంశాలు ‘సల్మాన్ అపీల్‌ను అనుమతిస్తున్నాం. విచారణ కోర్టు తీర్పును కొట్టేస్తున్నాం. ఆయన్ను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ జోషి తీర్పు ప్రకటించారు. ‘సల్మాన్‌పై ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిర్దిష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిరూపించలేకపోయిందని కోర్టు నమ్ముతోంది. ప్రమాదం జరిగాక టైర్ పేలిందా? టైర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే విషయంపై కూడా స్పష్టతనివ్వలేకపోయింది. సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. కీలక సాక్షుల స్టేట్మెంట్స్ను ప్రాసిక్యూషన్ సేకరించలేదు. గాయాల పాలైనవారి సాక్ష్యాలు కూడా నిర్దిష్టంగా లేవు. సల్మాన్ ఖాన్ రక్త నమూనాను సేకరించడంలో, దాన్ని భద్రపరచిన విధానంలో, ఆ రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఉందా? అనే విషయాన్ని నిర్ధారించే పరీక్షను జరపడంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న ఆయన మిత్రుడు, గాయకుడు కమాల్ ఖాన్‌ను కూడా ప్రాసిక్యూషన్ విచారించలేదు. సల్మాన్ మద్యం సేవించాడనేందుకు రుజువుగా ప్రాసిక్యూషన్ సమర్పించిన రెయిన్ బార్ బిల్లులు సరైనవి కాదు. అవి ప్రమాదం జరిగిన రోజు డేట్‌తో కాకుండా ముందు రోజువి.ఆ బిల్లులను సాక్ష్యంగా స్వీకరించి ట్రయల్ కోర్టు తప్పు చేసింది’ అని పేర్కొన్నారు. దర్యాప్తులో లోపాలున్నాయి. ఇది నిందితుడికి అనుకూలంగా పరిణమిస్తుంది. సెక్షన్ 304ఏ, సెక్షన్ 304 పార్ట్ 2.. వేరువేరు ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 304ఏ(నిర్లక్షపూరిత డ్రైవింగ్‌తో ఎదుటివారి మృతికి కారణమవడం), 304 పార్ట్ 2(ఉద్దేశపూర్వకం కానీ నేరపూరిత హత్య)ల మధ్య చాలా తేడా ఉంది. 304ఏలో గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా.. 304 పార్ట్ 2లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇది 304ఏ కింద, ఆ తరువాత సెషన్స్ కోర్టులో 304 పార్ట్ 2 కింద ఈ కేసును విచారించారు. పై రెండు సెక్షన్ల కిందకు వచ్చే నేరాల స్వభావం వేరువేరు. వాటిని ఒకే గాటన కట్టలేం’ అని జస్టిస్ జోషి వివరించారు. ‘ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ మరణించాడు. ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయన సాక్ష్యాన్ని అంగీకరించలేం’ అన్నారు. 13 ఏళ్ల తరువాత వచ్చి ప్రమాద సమయంలో తానే డ్రైవింగ్ చేస్తున్నానన్న సల్మాన్ డ్రైవర్ అశోక్‌సింగ్ సాక్ష్యమివ్వడాన్ని తప్పుడు సాక్ష్యంగా ట్రయల్ కోర్టు నిర్ధారించడం తప్పని జస్టిస్ జోషి తేల్చిచెప్పారు. ప్రమాదం జరగగానే అశోక్‌సింగ్ కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్టేట్మెంట్ కూడా తీసుకోవాలని కోరాడని, అయితే, ఆ అభ్యర్థనను పోలీసులు పట్టించుకోలేదని ఢిఫెన్స్ లాయర్ చేసిన వాదనను జస్టిస్ జోషి ఆమోదించారు. ప్రజాభిప్రాయం, చట్టం.. వేరువేరు ‘అనుమానం బలంగా ఉన్నంతమాత్రాన ఒకరిని దోషిగా నిర్ధారించలేం. ప్రజాభిప్రాయం ఎలా ఉందో మాకు తెలుసు. అది సమాజంలో స్థిరపడిన అభిప్రాయం. కోర్టులు చట్టప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. నిందితుల వృత్తి, స్థాయిల ప్రభావం కోర్టులపై ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. సల్మాన్‌ఖాన్ పాస్‌పోర్టును తిరిగిచ్చేయాలని బాంద్రా పోలీసులను, రూ. 25 వేల పూచికత్తు సమర్పించాలని సల్మాన్‌ఖాన్‌ను ఆయన ఆదేశించారు. ఇంతకీ ఆనాడు కారు నడిపిందెవరు? ప్రాసిక్యూషన్ వాదన: ‘ప్రమాద సమయంలో ఆ కారును సల్మాన్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన మద్యం ప్రభావంలో ఉండి, అత్యంత వేగంగా కారును నడిపాడు. అదుపుతప్పిన కారు పేవ్మెంట్ పైకి దూసుకువెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న నూరుల్లా అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు తీవ్రం గా గాయపడ్డారు. ఆ సమయంలో కారులో సల్మాన్‌తో పాటు సింగర్ కమాల్ ఖాన్, బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మాత్రమే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన రవీంద్ర పాటిల్ సాక్ష్యం కూడా ఉంది’ ఢిఫెన్స్ వాదన: ‘ప్రమాద సమయంలో కారు ను డ్రైవ్ చేస్తోంది సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్. ఆ విషయాన్ని అశోక్ ఒప్పుకున్నాడు. అప్పు డు సల్మాన్ మద్యం సేవించి లేడు. తప్పుడు హోటల్ బిల్లులను రుజువులుగా ప్రాసిక్యూషన్ చూపుతోంది. కారు తనపైకి దూసుకెళ్లడం వల్ల నూరుల్లా చనిపోలేదు. ప్రమాదం అనంతరం పోలీసులు వచ్చి కారును క్రేన్‌తో పైకి లేపుతుండగా, అది ప్రమాదవశాత్తూ జారి, నూరుల్లాపై పడటంతో చనిపోయాడు.’ మాకేం న్యాయం జరిగింది! ముంబై/గోండా: కేసు నుంచి సల్మాన్ బయటపడటంతో బాధితులు కోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్నారు. ‘ఇన్నేళ్లు ఎదురు చూసింది ఈ తీర్పుకోసమేనా? ’అని ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న అబ్దుల్లా అన్నారు. కాలు పోయి, ఏ పనీ చేయలేకపోతున్నానన్నారు. ‘నాకు చిన్న పిల్లలున్నారు. మాకు పరిహారం విషయంలో కోర్టు ఆలోచించి ఉంటే బాగుండేది. ’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు పొగొట్టుకున్న యూపీకి చెందిన అబ్దుల్ షేక్ కూడా కోర్టు తీర్పుతో తమకేం న్యాయం జరగలేదన్నారు. కుటుంబ పోషణకు కష్టమవుతున్నందున.. సల్మాన్ తమకు రూ. 10-15లక్షలు పరిహారంగా ఇస్తే సంతోషిస్తామని షేక్ భార్య రేష్మా కోరారు. వీరి కోసం సల్మాన్ కోర్టులో రూ.19 లక్షలను జమచేశారు. అక్టోబర్ 2002 - డిసెంబర్ 2015 2002, సెప్టెంబర్ 28: సల్మాన్‌కు చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు బాంద్రా శివార్లలో ఉన్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ బయట పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెయిన్ బార్లో మద్యం సేవించి, వేగంతో సొంతంగా డ్రైవ్ చేస్తూ సల్మాన్ ఈ ప్రమాదం చేశారని కేసు నమోదైంది. సల్మాన్‌ను అరెస్ట్ చేసి, రక్త నమూనాలు తీసుకున్నారు. తర్వాత బెయిల్ ఇచ్చారు. ఐపీసీ, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాల క్రింద కేసు నమోదుచేశారు. 2002, అక్టోబర్: అక్టోబర్ 7న సల్మాన్ లొంగిపోయారు. 24న బెయిల్ మంజూరైంది. 2006: మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు 2007 మే: ఘటన సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లు కెమికల్ అనాలసిస్ పరీక్షలో నిర్ధారణ 2013 డిసెంబర్: కేసును ఉద్దేశపూర్వకం కానీ నేరపూరిత హత్య కేసుగా మార్చి సెషన్స్ కోర్టుకు బదిలీ చేసిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. 2015, మే 6: సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై సెషన్స్ కోర్టు, బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు 2015, మే 8: తీర్పుపై సల్మాన్ దాఖలు చేసిన అపీల్‌ను విచారణకు స్వీకరించిన బొంబాయి హైకోర్టు సెప్టెంబర్ 21: రోజువారి విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏఆర్ జోషి డిసెంబర్ 10: సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు -
సల్మాన్ కేసులో కాసేపట్లో తీర్పు
-
సల్మాన్‌ఖాన్ కేసులో కీలక పరిణామం!
-
సల్మాన్‌ఖాన్ కేసులో కీలక పరిణామం!
ముంబై: 2002నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ వాదనను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో రోడ్డుపక్కన పేవ్మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. నలుగురు గాయపడ్డారు. వైల్ పార్లేలోని 'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సస్ వాహనాన్ని నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఆ షాపు ఎదురుగా పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తున్నది. అయితే, ఈ ఘటనలో గాయపడ్డ రవీంద్ర పాటిల్ ప్రధాన సాక్ష్యంగా చెప్పిన వాదనలో పలు విరుద్ధ అంశాలు ఉన్నాయని, అంతేకాకుండా ఘటన సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడనే సాక్షి వాదనలో సత్యమెంతో రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది. 'సల్మాన్ తాగి ఉన్నాడని, సంఘటనాస్థలం నుంచి పారిపోయే సమయంలో ఆయన రెండుసార్లు తూలి పడిపోయాడని సాక్షి చెప్పాడు. దీనినిబట్టి ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ ఆయన తాగి ఉన్నట్టు చూసే అవకాశముండదు. 2012 అక్టోబర్ 1 తర్వాతే దర్యాప్తులో మద్యం అంశం వెలుగులోకి వచ్చింది' అని హైకోర్టు పేర్కొంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు ఈ ఏడాది మేలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
యాక్సిడెంట్ రోజు సల్మాన్ ఏం చేశారు?
ముంబై: రోడ్డు ప్రమాదం కేసులో ఐదేళ్లు జైలు శిక్ష పడిన బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆ రోజు, అంటే 2002, సెప్టెంబర్ 28వ తేదీన ఎక్కడికెళ్లారు, ఎవరెవరితో వెళ్లారు, ఎవరెవరితో గొడవ పడ్డారు, ఏమేం చేశారు. యాక్సిడెంట్‌కు దారితీసేంతగా ఎందుకు తప్పతాగారు ? అన్నవి ఆసక్తికరమైన ప్రశ్నలు. వీటిపై అప్పట్లో మీడియాలో అనేక కథనాలు ప్రచారమయ్యాయి. నాటి కథనాల ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ ఓ సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే బాలివుడ్ అందాల తార, అప్పటికి అప్ కమింగ్ హీరో వివేక్ ఓబరాయ్ కాస్త సన్నిహితంగా ఉండడం చూసి జెలసీ ఫీలయ్యారు. వారిద్దరితోనూ గొడవ పడ్డారు. అక్కడి నుంచి నేరుగా తన సోదరుడు సొహేల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొంత మంది మిత్రులతో కలసి బాంద్రా హిల్ రోడ్డులోని ‘జేడబ్లూ మారియట్ హోటల్’కు వెళ్లారు. ఆ హోటల్లోని రెయిన్ బార్లో కూర్చున్నారు. మిత్రులతో కలసి ఎక్కువ తాగారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో బార్ నుంచి బయటకొచ్చారు. తన డ్రైవర్ కోసం నిరీక్షించకుండానే తన తెల్లటి టొయోటా ల్యాండ్ క్రూయిజ్ కార్లో ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు ఆయనకు పోలీసు డిపార్ట్మెంట్ తరఫున బాడీగార్డ్‌గా ఉన్న రవీంద్ర పాటిల్... ‘వద్దు సార్ మీరు కారు నడపకండి, ఎక్కువ తాగారు!’ అంటూ వారించారు. అయినా సల్మాన్ ఖాన్ వినిపించుకోలేదు. తానే కారు నడుపుతానంటూ బయల్దేరారు. ఆయన కారులోనే సింగర్ కమాల్ ఖాన్ ఎక్కారు. కారును దాదాపు వంద కిలోమీటర్ల స్పీడ్‌తో పరుగెత్తించారు. మార్గమధ్యంలో కారు అదుపుతప్పి అదే బాంద్రా రోడ్డులోని ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ’ లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అదే బేకరి ముందు పడుకున్న బేకరీ ఉద్యోగుల్లో ఒకరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్‌తో కారులో ఉన్న సింగర్ కమాల్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయారు. సల్మాన్ ఖాన్ కారును అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం తెలిసిన బాంద్రా పోలీసు స్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు అదే రోజున సల్మాన్ ఖాన్‌ను అరెస్ట్‌చేసి, అతని నుంచి బ్లడ్ షాంపుల్స్ తీసుకున్నారు. మోటార్ వెహికిల్ చట్టం కింద, అప్పటికి అమల్లోవున్న మద్యపాన నిషేధ చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అక్టోబర్ ఒకటవ తేదీన సల్మాన్ ఖాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. 2002, అక్టోబర్ 24వ తేదీన బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలైంది. అక్కడి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. అప్పీళ్ల మీద అప్పీళ్ల విచారణ జరిగింది. ముందుగా సల్మాన్ ఖాన్ ప్రమాదానికి కారణమన్న ప్రత్యక్ష సాక్షులు, బార్ ఉద్యోగులు ఆ తర్వాత మాట మార్చారు. ఆఖరికి బాధితులూ మాట మార్చారు. ఏదేమైనా కేసు 13 ఏళ్లు ఓ ప్రహసనంలా నడిచి చివరకు నేడు తీర్పు వెలువడింది. -
కుప్పకూలిన ఏరోస్,మంధనా షేర్లు
ముంబైః బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు స్టాక్ మార్కెట్ లోని మీడియా షేర్లపై ప్రభావాన్ని చూపించింది. తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ ఖాన్ తో సంబంధం ఉన్న షేర్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్ నేషనల్ మీడియా, మంధనా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఈరెండు షేర్లు బిఎస్సీలో దాదాపు 5 శాతం నష్టాలను చవి చూశాయి. సల్లూ భాయ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ బీయింగ్ హ్యూమన్ కు మంథన్ ఇండస్ట్రీస్ మధ్య వాణిజ్య ఒప్పందం కూడా ఉంది. ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన వస్త్ర డిజైనింగ్, మార్కెటింగ్ మరియు పంపిణీ కి సంబంధించిన అంశాలలో వీరి మధ్య అవగాహన ఉన్నట్టు సమచారం. అలాగే సల్మాన్ అప్ కమింగ్ మూవీస్ భజరంగి భాయిజాన్, హీరో సినిమాలకు సంబంధించి గత డిసెంబర్లో ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒపందం కుదుర్చుకున్నాడు సల్మాన్. దీంతో తాజా తీర్పు నేపథ్యంలో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడినట్టు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కాగా హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అయిదేళ్ల జైలు శిక్షను విధిస్తే బుధవారం మధ్యాహ్నం ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు తీర్పును వెలువరించారు. సల్మాన్ కు జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధించారు. సల్మాన్ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. -
సల్మాన్ కు తక్కువ శిక్ష పడితే బాగుండు..
-
సల్మాన్ కు తక్కువ శిక్ష పడితే బాగుండు..
ముంబై: హిట్ రన్ అండ్ కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. సెలబ్రిటీల దగ్గరనుంచి, అభిమానులు, సామాన్యులు తమ కమెంట్స్ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. సల్మాన్ నిర్లక్ష్యానికి బలైన కార్మికుల ఆత్మకు శాంతి కలుగుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తే... సల్మాన్ లాంటి దయార్ద్ర హృదయుడికి శిక్ష పడటం అన్యాయమని, తన ఛారిటీ కార్యక్రమాల ద్వారా చాలామంది పేదవిద్యార్థులకు సహాయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ కు తక్కువ శిక్ష పడాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని తన సానుభూతిని ప్రకటించారు. మరో బాలీవుడ్ నటి బిపాసా బసు తీర్పుపై విచారం వ్యక్తం చేశారు. సల్మాన్ చాలా మంచి మనిషి. ఈ కష్ట సమయంలో అతనికి అందరం తోడుగా ఉండాలన్నారు. ఇది ఇలా ఉంటే యువ క్రికెటర్ రవీంద్ర జడేజా భారత న్యాయ వ్యవస్థను పొగుడుతూ ట్వీట్ చేశారు. కాగా 13 సంవత్సరాలుగా నడుస్తున్న హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తూ ముంబై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
మరికాసేపట్లో సల్మాన్ భవితవ్యం
-
'సల్మాన్ ను వెంటనే జైల్లో పెట్టకపోవచ్చు'
న్యూఢిల్లీ: అనేక మలుపులు తిరిగిన సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో బుధవారం తీర్పు వెలువడబోతోంది. ఒకవేళ సల్మాన్ కు జైలుశిక్ష పడితే అతడు నటిస్తున్న సినిమాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కండల వీరుడిని నమ్ముకుని నిర్మాతలు రూ.200 కోట్లుపైగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. సల్మాన్ కు శిక్ష ఖరారైతే నిర్మాతలు నష్టపోయే అవకాశముంది. అయితే దీని గురించి బాలీవుడ్ లో ఎవరూ భయపడడం లేదని ఫిలిమ్ ఇండస్ట్రీ ఎక్స్ ఫర్ట్ అమోద్ మెహ్రా అంటున్నారు. మనదేశంలో న్యాయప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ జైలుకెళ్లే పరిస్థితి ఉండబోదని ఆయన విశ్లేషించారు. జైలు నుంచి బయట పడేందుకు బెయిల్ లాంటి మార్గాలు ఉన్నందున నిర్మాతలు భయపడే ప్రశ్నే తలెత్తని వివరించారు. ఒకవేళ సల్మాన్ కు శిక్ష పడినా అతడిని వెంటనే జైళ్లో పెట్టకపోవచ్చని ట్రేడ్ ఎక్స్ ఫర్ట్ వినోద్ మిరానీ అభిప్రాయపడ్డారు. -
జైలుకా.. జనాల్లోకా.. సల్మాన్‌పై తీర్పు రేపే!
ముంబయి: ఇప్పుడు బాలీవుడ్ అంతా ఉత్కంఠ.. పైకి చెప్పకున్నా ఒకటే విషయం అందరి మధ్య చర్చ. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ జైలు గోడల మధ్యకు వెళతారా.. లేక ఉపశమనం పొంది తిరిగి జనాల్లోకి మాములు వ్యక్తిగా వస్తారా మీడియా కూడా తమ కెమెరా కన్నులతో ఎదురుచూస్తోంది. హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పును బుధవారం వెలువరించేందుకు సెషన్స్ కోర్టు సర్వం సిద్ధమైంది. ఇకపై ఈ కేసులో ఎలాంటి కొత్వ వాదనలు లేకపోవడంతో చివరి తీర్పును కోర్టు ఇవ్వనుంది. ఈనేపథ్యంలో కోర్టు ప్రాంగణం వద్ద మంగళవారం నుంచే సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల నిషేధాజ్ఞలు కూడా విధించనున్నారు. ఒక్క మీడియా ప్రతినిధులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఇవ్వనున్నారు. న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్ పాండే మే 6న ఉదయం 11.15 నిమిషాలకు సల్మాన్‌ను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆయన తరుపు న్యాయవాదికి చెప్పారు. ఏప్రిల్ 21న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. 2002లో ముంబైలో ఆయన ప్రయాణిస్తున్న కారు పేవ్ మెంట్ పైకి దూసుకెళ్లడంతో దానిపై నిద్రపోతున్న ఒకరు చనిపోయారని, మరో నలుగురు గాయపడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
అప్పుడు సల్మాన్ తాగి ఉన్నాడు!
-
సల్మాన్ కేసులో ఈ నెల 20న తుది తీర్పు
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ వెంటాడుతున్న హిట్ అండ్ రన్ కేసులో సోమవారం ముంబై కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి సల్మాన్ ప్రయాణిస్తున్న కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లగా ఈ కేసు కోర్టులో విచారణ జరగుతుంది. 27 మంది సాక్షులను కోర్టు ఈ సందర్భంగా విచారించింది. -
క్రేన్‌తో ఎత్తితే మీద పడింది!
సల్మాన్ లాయర్ల కొత్తవాదన ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిందితుడుగా ఉన్న హిట్ అండ్ రన్ కేసు చివరి దశకు చేరుతున్న సమయంలో ఆయన లాయర్లు రోజుకో కొత్త వాదన వినిపిస్తున్నారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులు కారు తమపైనుంచి దూసుకుపోయిందని ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని, ప్రమాదానికి గురైన కారును పోలీసులు తెచ్చిన క్రేన్‌తో పైకి లేపుతుండగా పట్టుతప్పి వారిపై పడిందని డిఫెన్స్ లాయర్ శ్రీకాంత్ షివేదీ కోర్టుకు తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను చదువుతూ బాధితుల దుప్పట్లపై, వారు నిద్రించిన బేకరీ మెట్లపై రక్తపు మరకలు, టైర్ల గుర్తులు లేవన్నారు. బాధితులు కారు తమను కొంతదూరం ఈడ్చుకుపోయిందన్నారని, కానీ చక్రాల మధ్య చిక్కుకున్న వారి స్థానంలో మార్పు లేదని అన్నారు. ప్రమాదం తర్వాత కారును పైకిలేపి బాధితులను బయటకి తీసినట్లు ప్రాసిక్యూషన్ వాదించగా డిఫెన్స్ లాయర్ మాత్రం కారు పైకి లేపుతుండగా బాధితులపై పడిందని వాదించారు. -
సల్మాన్ ఖాన్ కేసు 22కు వాయిదా
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు విచారణ జనవరి 22కు వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన విచారణకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది శ్రీకాంత్ శివాదె కూడా కోర్టుకు రాలేదు. అనారోగ్యం కారణంగా శ్రీకాంత్ రాలేకపోయారని డిపెన్స్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోర్టుకు మౌఖికంగా విజ్ఞప్తి చేశాడు. లిఖితపూర్వకంగా కోరితే అతడి విజ్ఞప్తిని పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు. -
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు ఊరట
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్టులో ఊరట లభించింది. 11 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు యాక్సిడెంట్ కేసు (హిట్ అండ్ రన్)ను మళ్లీ కొత్తగా విచారించాలన్న సల్మాన్ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. సెషన్స్ కోర్టు జడ్జి డీ డబ్ల్యూ దేశ్‌పాండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో సాక్షులందరినీ మళ్లీ విచారించాలని ఆదేశించారు. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు ఆరోపణలు వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే విమర్శలు వచ్చాయి. ముంబై పోలీసులు సల్మాన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మెజిస్టీరియల్ కోర్టులో విచారించారు. అతనికి వ్యతిరేకంగా సాక్షాలున్నాయని, నేరం రుజువైతే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసును మళ్లీ విచారించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. -
సల్మాన్ కేసులో ఉత్తర్వులు వాయిదా వేసిన కోర్టు
ముంబై: ఏకపక్ష వార్తలను నిలిపివేసి నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిందిగా మీడియాను ఆదేశించాలంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులను కోర్టు వాయిదా వేసింది. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో తన పాత్రపై మీడియా ఏక పక్ష వార్తలు రాస్తోందని ఆరోపించాడు. ఇదే కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కార్ మరో రెండు పిటిషన్లు కూడా కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు తనను అనుమతించాలని దౌండ్కర్ కోరాడు. తన ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టు బదిలీ చేయాలని, తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన పోలీసులు, సల్మాన్‌పై చర్య తీసుకోవాలని రెండో పిటిషన్లో కోరాడు. దౌండేకర్ ప్రాసిక్యూషన్‌కు సహాయపడతానంటే అభ్యం తరం లేదని సల్మాన్ న్యాయవాదులు స్పష్టం చేశారు. అందరి వాదనలను విన్న జడ్జి ఎస్డీ దేశ్‌పాండే ఉత్తర్వును సెప్టెంబర్ 24 వరకు వాయిదా వేశారు. -
సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు యూకే వీసా లభించడంతో కొంత ఊరట లభించింది. వీసా కోసం అవసరమయ్యే పత్రాలు సమర్పించని కారణంగా సల్లూభాయ్‌కి యూకే వీసాను ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన ‘కిక్’ రీమేక్ కోసం లండన్‌లో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు సల్మాన్ కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వీసాకు అవసరమయ్యే పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో యూకే కాన్సులేట్ వీసాను ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత వీసా మంజూరు కావాల్సిన పత్రాలను దాఖలు చేశామని, దాంతో వీసా మంజూరు చేశారని సల్మాన్ తం డ్రి సలీం ఖాన్ తెలిపారు. 1998లో ’హమ్ సాథ్ సాథ్ హై’ చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అనుమతి లేకుండా జింకలను వేటాడినట్టు, 2002 సంవత్సరంలో ’హిట్ అండ్ రన్’ కేసు సల్మాన్‌పై నమోదైంది. ఈ కేసులో నేరారోపణలు రుజువైతే సల్మాన్ ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది అని న్యాయనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.