
సల్మాన్ కేసులో ఈ నెల 20న తుది తీర్పు
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ వెంటాడుతున్న హిట్ అండ్ రన్ కేసులో సోమవారం ముంబై కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి సల్మాన్ ప్రయాణిస్తున్న కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్లగా ఈ కేసు కోర్టులో విచారణ జరగుతుంది. 27 మంది సాక్షులను కోర్టు ఈ సందర్భంగా విచారించింది.