జైలుకా.. జనాల్లోకా.. సల్మాన్పై తీర్పు రేపే! | Verdict in Salman hit-and-run case to be pronounced tomorrow | Sakshi
Sakshi News home page

జైలుకా.. జనాల్లోకా.. సల్మాన్పై తీర్పు రేపే!

Published Tue, May 5 2015 10:36 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జైలుకా.. జనాల్లోకా.. సల్మాన్పై తీర్పు రేపే! - Sakshi

జైలుకా.. జనాల్లోకా.. సల్మాన్పై తీర్పు రేపే!

ముంబయి: ఇప్పుడు బాలీవుడ్ అంతా ఉత్కంఠ.. పైకి చెప్పకున్నా ఒకటే విషయం అందరి మధ్య చర్చ. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ జైలు గోడల మధ్యకు వెళతారా.. లేక ఉపశమనం పొంది తిరిగి జనాల్లోకి మాములు వ్యక్తిగా వస్తారా మీడియా కూడా తమ కెమెరా కన్నులతో ఎదురుచూస్తోంది. హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పును బుధవారం వెలువరించేందుకు సెషన్స్ కోర్టు సర్వం సిద్ధమైంది. ఇకపై ఈ కేసులో ఎలాంటి కొత్వ వాదనలు లేకపోవడంతో చివరి తీర్పును కోర్టు ఇవ్వనుంది.

ఈనేపథ్యంలో కోర్టు ప్రాంగణం వద్ద మంగళవారం నుంచే సెక్యూరిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల నిషేధాజ్ఞలు కూడా విధించనున్నారు. ఒక్క మీడియా ప్రతినిధులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వచ్చే అవకాశం ఇవ్వనున్నారు. న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్ పాండే మే 6న ఉదయం 11.15 నిమిషాలకు సల్మాన్ను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆయన తరుపు న్యాయవాదికి చెప్పారు. ఏప్రిల్ 21న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. 2002లో ముంబైలో ఆయన ప్రయాణిస్తున్న కారు పేవ్ మెంట్ పైకి దూసుకెళ్లడంతో దానిపై నిద్రపోతున్న ఒకరు చనిపోయారని, మరో నలుగురు గాయపడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement