సల్మాన్ లాయర్ల కొత్తవాదన
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిందితుడుగా ఉన్న హిట్ అండ్ రన్ కేసు చివరి దశకు చేరుతున్న సమయంలో ఆయన లాయర్లు రోజుకో కొత్త వాదన వినిపిస్తున్నారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులు కారు తమపైనుంచి దూసుకుపోయిందని ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని, ప్రమాదానికి గురైన కారును పోలీసులు తెచ్చిన క్రేన్‌తో పైకి లేపుతుండగా పట్టుతప్పి వారిపై పడిందని డిఫెన్స్ లాయర్ శ్రీకాంత్ షివేదీ కోర్టుకు తెలిపారు.
సాక్షుల వాంగ్మూలాలను చదువుతూ బాధితుల దుప్పట్లపై, వారు నిద్రించిన బేకరీ మెట్లపై రక్తపు మరకలు, టైర్ల గుర్తులు లేవన్నారు. బాధితులు కారు తమను కొంతదూరం ఈడ్చుకుపోయిందన్నారని, కానీ చక్రాల మధ్య చిక్కుకున్న వారి స్థానంలో మార్పు లేదని అన్నారు. ప్రమాదం తర్వాత కారును పైకిలేపి బాధితులను బయటకి తీసినట్లు ప్రాసిక్యూషన్ వాదించగా డిఫెన్స్ లాయర్ మాత్రం కారు పైకి లేపుతుండగా బాధితులపై పడిందని వాదించారు.
క్రేన్‌తో ఎత్తితే మీద పడింది!
Published Sat, Apr 18 2015 2:00 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement