సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే! | Salman Khan gets UK visa | Sakshi
Sakshi News home page

సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!

Published Tue, Aug 6 2013 9:18 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!

సల్లూభాయ్‌కి యూకే వీసా ఓకే!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు యూకే వీసా లభించడంతో కొంత ఊరట లభించింది. వీసా కోసం అవసరమయ్యే పత్రాలు సమర్పించని కారణంగా సల్లూభాయ్‌కి యూకే వీసాను ఇటీవల నిరాకరించిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన ‘కిక్’ రీమేక్ కోసం లండన్‌లో జరిగే షూటింగ్‌లో పాల్గొనేందుకు సల్మాన్ కాన్సులేట్‌లో వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు.
 
పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వీసాకు అవసరమయ్యే పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో యూకే కాన్సులేట్ వీసాను ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత వీసా మంజూరు కావాల్సిన పత్రాలను దాఖలు చేశామని, దాంతో వీసా మంజూరు చేశారని సల్మాన్ తం డ్రి సలీం ఖాన్ తెలిపారు.  
 
1998లో ’హమ్ సాథ్ సాథ్ హై’ చిత్ర షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అనుమతి లేకుండా జింకలను వేటాడినట్టు, 2002 సంవత్సరంలో ’హిట్ అండ్ రన్’ కేసు సల్మాన్‌పై నమోదైంది. ఈ కేసులో నేరారోపణలు రుజువైతే సల్మాన్ ఖాన్‌కు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది అని న్యాయనిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement