ఈ ‘హీరో’... మళ్లీ గొంతు సవరించాడు! | Like Shah Rukh Khan in 'Fan', Salman Khan to Play Double Role In 'Kick' Sequel | Sakshi
Sakshi News home page

ఈ ‘హీరో’... మళ్లీ గొంతు సవరించాడు!

Published Wed, Aug 5 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

ఈ ‘హీరో’... మళ్లీ గొంతు సవరించాడు!

ఈ ‘హీరో’... మళ్లీ గొంతు సవరించాడు!

 ‘‘హ్యాంగోవర్... తేరీ యాదోంకా... హ్యాంగోవర్...తేరీ బాతోంకా’’ అంటూ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తన  గానంతో  అభిమానులను హ్యాంగోవర్‌లో పడేశారు . ‘కిక్’ సినిమా కోసం ఈ పాట పాడి అలరించారాయన. ఈ పాట పెద్ద హిట్ అయి కూర్చోవడంతో  ‘అరె... మా సల్లూ భాయ్ మళ్లీ  ఎప్పుడు పాడతాడు..?’అని అభిమానులు  తెగ ఎదురు చూశారు. అందుకేనేమో  ఆయన మళ్లీ గొంతు సవరించారు. అయితే ఆ పాట పాడింది తన కోసం కాదు, సూరజ్ పంచోలి ‘హీరో’  సినిమా కోసం. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
 
 సూరజ్ పంచోలి, అథియా శెట్టి జంటగా నటి ంచిన ఈ సినిమా రషెస్ చూసి సల్మాన్ చాలా ఇంప్రెస్ అయ్యారట. ఇందులో టైటిల్ సాంగ్ ఉంటే బాగుంటుందని భావించారట సల్మాన్. అది మాత్రమే కాదు.. ఆ పాటను తానే పాడాలనుకున్నారు. అమాల్ మాలిక్ సంగీత సారథ్యంలో ‘‘మై హూ తేరా’...’ అంటూ సల్మాన్ ఖాన్  పాడిన ఈ పాట రికార్డింగ్ అయిదు గంటల్లో పూర్తయిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement