పదేళ్ల తర్వాత సూపర్‌హిట్‌ మూవీకి సీక్వెల్‌.. ప్రకటించిన డైరెక్టర్‌! | Salman Khan Kick 2 announced after ten Years Of Kick Movie | Sakshi
Sakshi News home page

Salman Khan: పదేళ్ల తర్వాత సల్మాన్ ఖాన్‌ మూవీకి సీక్వెల్!

Published Fri, Oct 4 2024 1:24 PM | Last Updated on Fri, Oct 4 2024 3:14 PM

Salman Khan Kick 2 announced after ten Years Of Kick Movie

బాలీవుడ్ స్టార్  సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఓరియటండ్‌ చిత్రంలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయితే అంతలోనే మరో మూవీకి సిద్ధమయ్యారు సల్మాన్ ఖాన్. గతంలో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం కిక్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా కిక్‌ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్  సాజిద్‌ నదియావాలా తాజాగా ప్రకటించారు. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

(ఇది చదవండి: నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్‌ నన్ను రోడ్డున పడేశాడు)

కాగా.. 2009లో టాలీవుడ్ హీరో రవితేజ హీరోగా నటించిన ‘కిక్‌. ఈ మూవీ ఆధారంగానే బాలీవుడ్‌లో కిక్‌ తెరకెక్కించారు. సల్మాన్‌ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాడెంజ్‌ నటించిన ఈ సినిమాకు సాజిద్‌ నదియావాలా దర్శకత్వం వహించారు. యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా అందుకుంది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ అనౌన్స్ చేశారు మేకర్స్. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement