నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్‌ నన్ను రోడ్డున పడేశాడు | Bigg Boss Telugu 8: Sonia Akula First Interview After Elimination | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ నన్ను తప్పుగా చూపించాడు, నాగార్జున కూడా.. : సోనియా

Published Thu, Oct 3 2024 5:48 PM | Last Updated on Thu, Oct 3 2024 6:48 PM

Bigg Boss Telugu 8: Sonia Akula First Interview After Elimination

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో గతవారం జరిగిన సోనియా ఆకుల ఎలిమినేషన్‌ అందరూ ఊహించింది మాత్రమే కాదు, ఎంతోమంది కోరుకుంది కూడా! ఒక అమ్మాయిపై ఈ రేంజ్‌లో నెగెటెవిటీ, ట్రోలింగ్‌ జరగడం ఇదే తొలిసారి! బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన సోనియా తొలిసారి తన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నన్ను టార్గెట్‌ చేసింది
రియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలను నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ బిగ్‌బాస్‌ నన్ను రోడ్డున పడేశాడు. నన్ను కావాలని బ్యాడ్‌ చేశాడు. నేను విష్ణుప్రియను టార్గెట్‌ చేశానంటున్నారు కానీ విష్ణుయే నన్ను టార్గెట్‌ చేసింది. నిఖిల్‌ విషయానికి వస్తే అతడు డిప్రెషన్‌లో ఉన్నాడు. నన్ను ఫ్యామిలీ అని భావించాడు. ఆల్‌రెడీ డిప్రెషన్‌లో ఉన్నాడు కదా అని సపోర్ట్‌ చేశాను. నా పెళ్లికి నిఖిల్‌కు చెయిన్‌, పృథ్వీకి ఇయర్‌ రింగ్స్‌ ఇస్తానని కూడా చెప్పాను. 

తప్పు చేయలేదు
నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్‌ చేసి చూపించడం తప్పు కదా.. నేను హౌస్‌లో ఏ తప్పూ చేయలేదు, బిగ్‌బాసే తప్పుగా చూపించాడు. సాధారణంగా బయట గైడెన్స్‌ ఎలా ఇస్తానో హౌస్‌లో కూడా అలాగే ఇచ్చాను. అందులో తప్పేముంది? నా సలహాలు తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్లిష్టం. బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను నాలాగే ఉన్నాను. ఎక్కడా యాక్టింగ్‌ చేయలేదు. 

నిజాయితీ ఏమైపోయింది?
ప్రతిచోటా గేమ్‌ గురించే మాట్లాడానే తప్ప ఎవరినీ పర్సనల్‌గా టార్గెట్‌ చేయలేదు. గేమ్‌లో నిఖిల్‌, పృథ్వీని మాత్రమే చూస్తే ఎలా? నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను. దీన్ని తప్పుగా చూపించారు. నాగార్జునగారు కూడా నావైపు నిలబడలేదు. ఇక్కడ నీ నిజాయితీ ఏమైపోయింది? అప్పుడు నాకు హౌస్‌లో ఉండాలనిపించలేదు.

అందులో నిజం లేదు
బిగ్‌బాస్‌ లైఫ్‌ షో అనుకున్నాను, కానీ అది తప్పని తెలుసుకున్నాను. ఆల్‌రెడీ పెళ్లయిన వ్యక్తితో నేను లవ్‌లో ఉన్నానని పుకారు లేపారు. అందులో నిజం లేదు. యష్‌ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆయన తండ్రి నాకోసం ఓటింగ్‌ క్యాంపెయిన్‌ కూడా చేశాడు అని సోనియా చెప్పుకొచ్చింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement