
సల్మాన్ ఖాన్ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన చిత్రం ‘బజరంగీ భాయిజాన్’. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమా విడుదలై నేటికి ఏడేళ్లు(2015, జూలై 17న విడుదలైంది). ఈ సందర్భంగా సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
‘‘చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తితో ‘బజరంగీ భాయి జాన్’ కథ రాశాను. అయితే కథ రాస్తున్నప్పుడు ఎవరినీ మనసులో ఊహించుకోలేదు.ఆ తర్వాత సల్మాన్‌కి నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉంటుంది. తొలి భాగం ముగిసిన 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల తర్వాత రెండో భాగం కథ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య విద్వేషాలు తగ్గేలా స్టోరీ రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి ‘పవనపుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment