
'సల్మాన్ ను వెంటనే జైల్లో పెట్టకపోవచ్చు'
న్యూఢిల్లీ: అనేక మలుపులు తిరిగిన సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో బుధవారం తీర్పు వెలువడబోతోంది. ఒకవేళ సల్మాన్ కు జైలుశిక్ష పడితే అతడు నటిస్తున్న సినిమాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కండల వీరుడిని నమ్ముకుని నిర్మాతలు రూ.200 కోట్లుపైగా పెట్టి సినిమాలు తీస్తున్నారు. సల్మాన్ కు శిక్ష ఖరారైతే నిర్మాతలు నష్టపోయే అవకాశముంది.
అయితే దీని గురించి బాలీవుడ్ లో ఎవరూ భయపడడం లేదని ఫిలిమ్ ఇండస్ట్రీ ఎక్స్ ఫర్ట్ అమోద్ మెహ్రా అంటున్నారు. మనదేశంలో న్యాయప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ జైలుకెళ్లే పరిస్థితి ఉండబోదని ఆయన విశ్లేషించారు. జైలు నుంచి బయట పడేందుకు బెయిల్ లాంటి మార్గాలు ఉన్నందున నిర్మాతలు భయపడే ప్రశ్నే తలెత్తని వివరించారు. ఒకవేళ సల్మాన్ కు శిక్ష పడినా అతడిని వెంటనే జైళ్లో పెట్టకపోవచ్చని ట్రేడ్ ఎక్స్ ఫర్ట్ వినోద్ మిరానీ అభిప్రాయపడ్డారు.