విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం | govt neglect the studies | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Published Wed, Sep 28 2016 11:51 PM | Last Updated on Fri, Nov 9 2018 4:53 PM

govt neglect the studies

నారాయణపేట రూరల్‌ : అవగాహన రాహిత్యం, అయిష్టతతో ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూయిస్తు విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్‌) రాష్ట్ర అధ్యక్షుడు టి.సాయిరెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట ఎమ్మార్సీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి నిర్వహించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్‌ సంఘం నాయకుడిని బరిలో ఉంచుతామని సాయిరెడ్డి తెలిపారు. మొదటి నుంచి సంఘంలో పనిచేసిన వ్యక్తులనే ఎంపికచేస్తామని, వలసలకు స్థానం ఉండబోదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్నారు.  సమావేశంలో జిల్లా నాయకులు హన్మంత్‌రావు, వెంకట్‌రెడ్డి, గుంపుబాలరాజు, రాంచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, మండల నాయకులు శేర్‌కృష్ణారెడ్డి, కిషోర్, లక్ష్మారెడ్డి, కుర్మయ్య, గోవింద్‌రెడ్డి, సీతారాములు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement