సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో పోలీసుల వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్‌కి జెడ్‌ప్లస్ భద్రత ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.
చాపిరేవుల టోల్ గేట్ దగ్గర ఏకంగా వైఎస్ జగన్ కారుపైకెక్కి పడుకున్నాడు ఓ యువకుడు. మరో ఘటనలో అయిలూరు మెట్ట చందమామ ఫంక్షన్ హాలు దగ్గర వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం బుల్లెట్ ప్రూఫ్ కారుపైకి ఎక్కాడు మరో యువకుడు. సీతారామపురం వద్ద వైఎస్ జగన్ కారు దిగే సమయంలో కూడా తోపులాట జరిగింది.
వైఎస్ జగన్‌కు తగిన భదత్ర కల్పించాలని హైకోర్టు పేరొన్న సంగతి తెలిసిందే. కాగా, వైఎస్ జగన్‌కి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది.
ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలపగా.. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment