👉సీతారామపురంలో సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
👉టీడీపీ గూండాల దాడిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. హత్య జరిగిన తీరును వైఎస్ జగన్‌కు బాధిత కుటుంబం వివరించింది. హత్య జరిగిన సమయంలో పోలీసులు ఉన్నా కూడా టీడీపీ నేతలకు అడ్డు చెప్పలేదని సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ కామెంట్స్..
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.
మారణహోమం సృష్టిస్తున్న పాలన చేస్తున్నారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తున్నారు.
ఉళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు.
పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని చంపేశారు.
సుబ్బారాయుడును అన్యాయం హత్య చేశారు.
పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు?.
నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు.
ఎవరి ప్రోద్భలంతో పోలీసులు నిందితులకు సహకరించారు.
హత్య చేసిన వాళ్లు ఎవరు?. చేయించిన వాళ్లు ఎవరు?.
ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.
నిందితుల కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది.
హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి.
హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు పంపలేదు?.
హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు.
ఇంత జరుగుతున్నా అదనపు బలగాలు ఎందుకు రాలేదు?.
తుపాకులు, కత్తులు, రాడ్డు, కర్రలతో దాడులు చేస్తున్నారు.
చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతో ఎస్‌ఐ సమక్షంలో నరికేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చంపండి అంటూ చెబుతున్నారు.
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి.
రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు లేదు.
హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారు.
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు.
చంద్రబాబు అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు.
ప్రతీ పిల్లవాడికి రూ.15వేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశాడు.
డబ్బులు ఇస్తామన్నాడు ఏమైంది?.
ఎన్నికలు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలను మోసం చేశాడు.
తల్లివందనం అని చెప్పి చివరకు పంగనామం పెట్టాడు.
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడు.
మన ప్రభుత్వమే అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అందరికీ అమ్మఒడి, రైతుభరోసా అందేది.
రైతులకు రూ.20 వేస్తామని మోసం చేశాడు.
ఇక అంతకుముందు.. ఎస్‌ఐ ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదా? అంటూ ప్రత్యక్ష సాక్షిని వైఎస్ జగన్ అడిగారు. ఘటనా స్థలంలో సుబ్బారాయుడితో ఎవరెవరు ఉన్నారంటూ ఆయన ఆరా తీయగా, ముగ్గురు తప్పించుకున్నారని బాధితులు తెలిపారు. ‘‘సంక్షేమ పథకాల్లో కోత పెట్టడాన్ని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ఆ కక్షను మనసులో పెట్టుకుని సుబ్బారాయుడిని హత్య చేశారు. సుబ్బారాయుడిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడాలి’’ అని బాధితులు డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ రాకతో జనసంద్రమైన సీతారామాపురం
వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
కర్నూలు-నంద్యాల మార్గంలో హుసేనాపురం వద్ద వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు
Comments
Please login to add a commentAdd a comment