
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం.. ఆయనకు పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.
రిపేర్‌లో ఉన్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ఫ్రూప్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్.. మరో వాహనంలో వినుకొండ వెళ్తున్నారు.
మరోవైపు, వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ పర్యటనను కవర్‌చేస్తున్న జర్నలిస్టులకు కూడా పోలీసులు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాన్వాయ్‌లో జర్నలిస్టుల వాహనాలను నిలిపేశారు. పోలీసులు తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment